పరమ కల్యాణి, బ్రతుకు సం-పదగ రమ్ము,పరమ కల్యాణి, బ్రతుకు స-మ్పదగ రమ్ము
It sounds to me that the second one is a close approximation to the first ; like a trick taught by coaches in entrance tests.
ఈ కథలో ఈ మగవాడిలా ఉన్నాడు, అలా ఎందుకున్నాడు? అని చాలావరకూ ఆడా, మగా పాఠకులు చర్చించరు. “మగవాడు” చర్చనీయాంశం కాదు. అతడిదే సమాజం, అతడే సమాజం అని తప్పుడు అభిప్రాయం మనసులలో నాటుకుపోయి ఉన్నదో, ఏమో?
ఈ కథలోని -ఆమె మొగుడు అనే మగవాడు, ఒక బండాభాయి. అతడికి, ఆమెకున్న రసహృదయం లేదు. ఏబ్రాసి వెధవ, ఉత్త వెంగళాయ! అయ్యో! అంటూ, కథలోని మగవాడిని గురించిన ఆందోళన, జాలి, పాఠకులలో లేదు. మరెందుకు లేదు? Is that an elephant in the room that you can’t see?
అభిప్రాయాలు కథలోని మగవాడి గురించే ఎందుకు రావు? అంటే అతడు ఉదాత్తుడుగా చిత్రించబడినప్పుడు, అతని వైపునుండి అభిప్రాయాలు రాస్తారు. లేనప్పుడు మాఫు చేస్తారు. కాబోలు!
“ఆమె ఇల్లు” కథలోని స్త్రీ రసహృదయిని. పురుషుడు నీరసుడు. ఈ కథ లోని ఆమె లోనే మాకు నేర్చుకోవలసిన అంశాలు ఉన్నాయి. ఈమె ప్రపంచాన్ని మెరుగు చేస్తుంది అన్న ఆ విషయం పాఠక/ విమర్శకులు చెప్పరు. ఈ మగవాడి చెంప మాకు పగలగొట్టాలని ఉంది అని చెప్పరు. ఇతడు తింగిరి వెధవ అని చెప్పరు.
నిజానికి, ఈ కథ ఎప్పుడు రాసారో కాని, రచయితైతే ఏ విషయాలు దాయనే లేదు. రచయిత అన్నీ చక్కగానే చెప్పాడు. కథలో చెప్పబడిన దానిని ignore చేసి, మగవాడిని స్క్రుటినీ నుంచి తప్పించి, ఆడదానిని గురించే ఏదో ఒక ‘జాలి’ అభిప్రాయం రాసే లెక్కన కథ ఎందుకు చదువుకోవటం? “ఆమె ఇల్లు,” అని పేరు పెట్టకుండా ‘ఆమె మొగుడు’, అని పేరు పెడితే, అప్పుడు కథ లోని మగవాడిని స్టడీ చేసేవారా?
కవి శృంగారి, రసాత్మకుడైనచో ఆ ప్రపంచం రసాత్మకమౌతుంది. అతడే నీరసుడైనచో, అది నీరసంగా పరిణమిస్తుంది.’ – అని ఈ శ్లోకాని కర్థం.” (“వసుచరిత్రంలోని వర్ణనలలో సంఘస్థితి ప్రతిబింబాలు,” ఈమాట, అక్టోబర్ 2021.)
ఇంతకు ముందు వాసు, ఈ సంచికలో శివకుమార్ శర్మ, అనిల్, – కవిత్వం, పుస్తక ప్రచురణలు, పుస్తకావిష్కరణల గురించి చెప్పిన విషయాలు చదివాను. నేనిప్పుడు రాసేది ఒక సాహిత్య పాఠకురాలిగా. పుస్తకాలు కొన్నేళ్లుగా విరివిగా కొనుక్కుంటున్న వ్యక్తిగా.
కవికి తన కవిత్వం మాత్రమే పుస్తకంగా తనే ప్రచురించుకోటం, కవిని, ఎవరూ పరిచయం చెయ్యకపోటం, మంచి పనే. శ్రోతకు కవికి మధ్య ఎడం తగ్గుతుంది. పరిచయం చేసేవారి నీడలు, కవి మీద పడవు. అలాగే వారి ధగధగలు, నా దృష్టిని పరిచయం చేస్తున్నవారి వైపుకు మళ్లించవు. కొన్నిసార్లు పాఠకురాలిని నేను -మీ కవిత్వం చదవటం మానేసి, విమర్శకుడితో వెళ్లిపోయే అవకాశం కవులు మీరే కల్పించటం ఎందుకు?
ఇంకోటి; పరిచయాలు లేపోతే కవిత్వం పుస్తకాలు పలచగా ఉంటాయి. ఔట్ డోర్ బుక్ షాప్ లో అప్పటికప్పుడు, సెలెక్ట్ చేసుకుని కొనుక్కుని, గార్డెన్లో, ఉడ్స్ లో, కఫేలలో కవిత్వం చదువుకోటం ఎంతో బాగుంటుంది. అలా నేనెంతో కవిత్వం చదువుకున్నాను.
కవికి తన కవిత్వం ఇతరులు చదివితే, ఆత్మసంతృప్తి కలుగుతుందా? ఏమో! మీరు చెపుతున్నారు మీరు రాయటంలో అది ఒక పెద్ద ఫాక్టర్ అని. నేను ఆలోచిస్తున్నాను, కవిత్వం చదివే ఒక వ్యక్తిగా. నేను పొయట్రీ చదివేప్పుడు, అలాటి బరువు భారంతో నేనైతే చదవలేను. మీ ఆత్మ సంతృప్తితో నాకేం పని? కవిత్వం లోని విషయంతోనే గాని, కవిమీద రీడర్ కి ఏం ఆసక్తి? ఐతే, చదువరికి రచన తనంత తానే తెలుపుతుంటుంది రాసిందెవరో.
కవికి – చదువుతున్నారా లేదా, తన కవిత్వం వారికి నచ్చిందా, ఎందుకు నచ్చిందో, ఎందుకు నచ్చలేదో చెప్పమనటం, ఇతరుల అభిప్రాయాలకోసం దేవిళ్లాడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఏం చేసుకుంటారు ఆ అభిప్రాయాన్ని? రాసిన పుస్తకాలు మార్కెట్లో అమ్ముడు పోవటమే, పాఠకులు చెప్పే నిజమైన అభిప్రాయం. నేను కొనుక్కున్న పుస్తకానికి ధర, పుస్తకాల షాపులో నేను కట్టివేసాను. అది బతికున్న/ చచ్చిన రచయిత నిర్ణయించిన ధరే. ఇంక ఆ తర్వాత రచయిత నానుండి వేరే వేరే ఆశించటం సరా? నా అభిప్రాయానికి మూల్యం పాఠకురాలిని నేను నిర్ణయిస్తే, రచయితకు కట్టసాధ్యమా? నేను పుస్తకాలు కొనుక్కుని, కొన్ని దశాబ్దాలుగా సంతృప్తిగా చదువుకుంటూనే ఉన్నాను. ఫీడ్ బేక్ అడగనందువలనేమో, మరణించిన రచయితల రచనల మీద నాకు ఎక్కువ అభిమానం.
సమీక్షలు నేను చదవను. ఒకవేళ false pretenses/for their own reasons తో నాతో చదివిస్తే, ఇక ఆ అసలు పుస్తకం చదివే ఆసక్తి నాకుండదు. అలాగే ఘోస్ట్ రైటర్ల రైటింగ్స్ కూడా. తన అనుభవాలు వేరే వాడితో ఎవరైనా ఎలా చెప్పిస్తారు? అది ఉత్త బోగస్ రైటింగ్. అలా రాయల్టీ లాగా ఫీలయ్యే ఒబామాలూ, హేరీలూ రాసేవి, నేను చదవను. అలాగే, ఇతరులకు మౌత్పీస్ లాగా మార్ఫ్ చెందినవారి రచనలు, తెలిసాక నేను చదవను. ఇవన్నీ అసలు పంట కళ్లచూడకుండా పరిగె ఏరుకు తింటున్నట్టు అనిపిస్తుంది. I don’t want that fluff.
శ్రీ మోహన: నేను మీ వ్యాసం మీద అభిప్రాయవేదికను ‘యతి మైత్రి’ మీద నా అభిప్రాయాన్ని తెలియపరచాటానికి వచ్చిన అవకాశంగా చూశాను. నేను వెలిబుచ్చిన అభిప్రాయాలు ‘కొన్ని యతి నియమాల సడలింపుల మీదనే’ గానీ సూటిగా అక్షర సామ్యయతి అన్న అశం మీద కావు. చంపక ఉత్పలాల ప్రసక్తి తేవటం ఈ కారణం గానే. ఈవిషయాన్ని మీరు గమనించి ఉంటారని అనుకున్నాను గానీ అలా జరిగినట్టు లేదు.
రామయ్య గారూ, కవన శర్మ గారి కథ ప్రస్తావించారు, సంతోషం
శర్మ గారు తన కథలో సమస్యను వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థ స్థాయికి స్పష్టంగా సమర్ధవంతంగా తీసుకు వెళ్లి చర్చించారు..ramakrishnan గారి కథ స్కోప్ లో ‘వ్యవస్థస్థాయి’ లేదు..
“పాములు గాలిమేతలలవాటొనరించుట కీవు కారణం బేమొ…”( జాషువా) వంటివి శ్రవణసుభగంగా ఎంత స్వీకారయోగ్యమో, ‘మా-మ’లతో మొదలైన ఉత్పల, చంపకాలకు బిందుపూర్వకమైన బకారముల వంటివి ‘యతి మైత్రి’కి రావు కాబట్టి “గ’మ్మ’త్తు సగాలదేవర వి’ప’త్తరి నమ్మెదనిన్ను”*ల వంటివి గుడా ఔచిత్య రీత్యా స్వీకారయోగ్యములవవలెనని క్లుప్తంగా నా ప్రతిపాదన.
ఒక సంగీత సభ వార్షికోత్సవ సంచికలో ‘అందరూ అంటున్న సంప్రదాయాన్ని పట్టుకుని కూచుంటే భరతునితో మొదలై బాలమురళితో ఆగిపోతామ’న్నట్టుగా ఇంగ్లిష్లో బాలమురళి రాసిన వ్యాసానికి చివరి వాక్యంగా చదివిన గుర్తు.
ఇక్కడ నా ప్రతిపాదన ఏమనగా: యతి నిర్ణయము అక్షరముల ఉచ్చరణమునుబట్టి కూడ ఉండవలయునని. సంస్కృతపదములలో చకార, జకారములు తాలవ్యములు. అచ్చ తెలుగు పదములలో మాత్రమే కొన్ని అచ్చులతో [అ,ఆ, ఉ,ఊ, ఒ,ఓ, ఔ(అవు)] చకార జకారములను దంత్యములుగా ఉచ్చారణము చేస్తారు. (ఉర్దూలో జిందగీలాటి పదములు దంత్యములు, కాని తెలుగులో కాదు.) కేవలము వీటికి మాత్రమే తవర్గాక్షరములతో యతి ప్రతిపాదన. ఛందస్సులో అచ్చతెలుగు పదములకు కొన్ని చోటులలో ప్రత్యేకమైన నియమము గలదు, ఉదా. అద్రుచు, విద్రుచు లాటి పదములలో అ, వి అక్షరములు లఘువులు, గురువులు కావు. కాని ముద్ర, విద్రుమ వంటి సంస్కృత పదాలలో ము, వి అక్షరములు గురువులు, లఘువులు కావు. అదే విధముగా వైరి సమాసముల విషయములలో కూడ ముందున్న పదము తెలుగా లేక సంస్కృతమా అన్నది ముఖ్యము, ఇది అందరికి తెలిసిన విషయమే. నా ప్రశ్న: పలికేటప్పుడు తకార, దకారములతో వాడగా, అక్షరసామ్య యతి విషయములో ఎందుకిది నిషిద్ధము? నియమములు మనము ఏర్పరచినవే. కవిజనాశ్రయములో కొన్ని యతులు మాత్రమే ఉండగా, ఆ సంఖ్య ఇప్పుడు వాడుక రీత్యా, ఉచ్చరణము రీత్యా ఎక్కువైనది కదా? ఋకార యతికి బహుళత్వము, దంత్య చకార, జకారములకు తవర్గముతో యతి అంగీకరణము ఎందుకు చేయరాదు?
వీటితో మ,వ అక్షరములకు యతి అవసరమా అని ఆలోచించినాను. తమిళములో ఈ రెండక్షరములకు యతి అంగీకృతము. అట్టి పదములు తెలుగులో ఉండినను, దాని సంఖ్య చాల తక్కువ (మామిడి – మావిడి, మామ – మావ, ఇత్యాదులు) అందువలన దానిని పేర్కొనలేదు.
రెండు అక్షరసామ్య యతులు గురించి తః తః అభిప్రాయం:
02/14/2022 10:50 pm

ఆమె ఇల్లు గురించి Lyla yerneni అభిప్రాయం:
02/14/2022 1:08 pm

“శృఙ్గారీ చేత్కవిః కావ్యే జాతం రసమయం జగత్।
స ఏవ వీతరాగశ్చే న్నీరసం సర్వమేవ తత్॥ (ఆనందవర్ధనుడు-ధ్వన్యాలోకము)
కవి శృంగారి, రసాత్మకుడైనచో ఆ ప్రపంచం రసాత్మకమౌతుంది. అతడే నీరసుడైనచో, అది నీరసంగా పరిణమిస్తుంది.’ – అని ఈ శ్లోకాని కర్థం.” (“వసుచరిత్రంలోని వర్ణనలలో సంఘస్థితి ప్రతిబింబాలు,” ఈమాట, అక్టోబర్ 2021.)
-Lyla
తెలుగు వాళ్ళకిది వర్తించదు! గురించి Lyla yerneni అభిప్రాయం:
02/14/2022 11:31 am
ఇంతకు ముందు వాసు, ఈ సంచికలో శివకుమార్ శర్మ, అనిల్, – కవిత్వం, పుస్తక ప్రచురణలు, పుస్తకావిష్కరణల గురించి చెప్పిన విషయాలు చదివాను. నేనిప్పుడు రాసేది ఒక సాహిత్య పాఠకురాలిగా. పుస్తకాలు కొన్నేళ్లుగా విరివిగా కొనుక్కుంటున్న వ్యక్తిగా.
కవికి తన కవిత్వం మాత్రమే పుస్తకంగా తనే ప్రచురించుకోటం, కవిని, ఎవరూ పరిచయం చెయ్యకపోటం, మంచి పనే. శ్రోతకు కవికి మధ్య ఎడం తగ్గుతుంది. పరిచయం చేసేవారి నీడలు, కవి మీద పడవు. అలాగే వారి ధగధగలు, నా దృష్టిని పరిచయం చేస్తున్నవారి వైపుకు మళ్లించవు. కొన్నిసార్లు పాఠకురాలిని నేను -మీ కవిత్వం చదవటం మానేసి, విమర్శకుడితో వెళ్లిపోయే అవకాశం కవులు మీరే కల్పించటం ఎందుకు?
ఇంకోటి; పరిచయాలు లేపోతే కవిత్వం పుస్తకాలు పలచగా ఉంటాయి. ఔట్ డోర్ బుక్ షాప్ లో అప్పటికప్పుడు, సెలెక్ట్ చేసుకుని కొనుక్కుని, గార్డెన్లో, ఉడ్స్ లో, కఫేలలో కవిత్వం చదువుకోటం ఎంతో బాగుంటుంది. అలా నేనెంతో కవిత్వం చదువుకున్నాను.
కవికి తన కవిత్వం ఇతరులు చదివితే, ఆత్మసంతృప్తి కలుగుతుందా? ఏమో! మీరు చెపుతున్నారు మీరు రాయటంలో అది ఒక పెద్ద ఫాక్టర్ అని. నేను ఆలోచిస్తున్నాను, కవిత్వం చదివే ఒక వ్యక్తిగా. నేను పొయట్రీ చదివేప్పుడు, అలాటి బరువు భారంతో నేనైతే చదవలేను. మీ ఆత్మ సంతృప్తితో నాకేం పని? కవిత్వం లోని విషయంతోనే గాని, కవిమీద రీడర్ కి ఏం ఆసక్తి? ఐతే, చదువరికి రచన తనంత తానే తెలుపుతుంటుంది రాసిందెవరో.
కవికి – చదువుతున్నారా లేదా, తన కవిత్వం వారికి నచ్చిందా, ఎందుకు నచ్చిందో, ఎందుకు నచ్చలేదో చెప్పమనటం, ఇతరుల అభిప్రాయాలకోసం దేవిళ్లాడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఏం చేసుకుంటారు ఆ అభిప్రాయాన్ని? రాసిన పుస్తకాలు మార్కెట్లో అమ్ముడు పోవటమే, పాఠకులు చెప్పే నిజమైన అభిప్రాయం. నేను కొనుక్కున్న పుస్తకానికి ధర, పుస్తకాల షాపులో నేను కట్టివేసాను. అది బతికున్న/ చచ్చిన రచయిత నిర్ణయించిన ధరే. ఇంక ఆ తర్వాత రచయిత నానుండి వేరే వేరే ఆశించటం సరా? నా అభిప్రాయానికి మూల్యం పాఠకురాలిని నేను నిర్ణయిస్తే, రచయితకు కట్టసాధ్యమా? నేను పుస్తకాలు కొనుక్కుని, కొన్ని దశాబ్దాలుగా సంతృప్తిగా చదువుకుంటూనే ఉన్నాను. ఫీడ్ బేక్ అడగనందువలనేమో, మరణించిన రచయితల రచనల మీద నాకు ఎక్కువ అభిమానం.
సమీక్షలు నేను చదవను. ఒకవేళ false pretenses/for their own reasons తో నాతో చదివిస్తే, ఇక ఆ అసలు పుస్తకం చదివే ఆసక్తి నాకుండదు. అలాగే ఘోస్ట్ రైటర్ల రైటింగ్స్ కూడా. తన అనుభవాలు వేరే వాడితో ఎవరైనా ఎలా చెప్పిస్తారు? అది ఉత్త బోగస్ రైటింగ్. అలా రాయల్టీ లాగా ఫీలయ్యే ఒబామాలూ, హేరీలూ రాసేవి, నేను చదవను. అలాగే, ఇతరులకు మౌత్పీస్ లాగా మార్ఫ్ చెందినవారి రచనలు, తెలిసాక నేను చదవను. ఇవన్నీ అసలు పంట కళ్లచూడకుండా పరిగె ఏరుకు తింటున్నట్టు అనిపిస్తుంది. I don’t want that fluff.
-Lyla
రెండు అక్షరసామ్య యతులు గురించి తః తః అభిప్రాయం:
02/14/2022 4:33 am
శ్రీ మోహన: నేను మీ వ్యాసం మీద అభిప్రాయవేదికను ‘యతి మైత్రి’ మీద నా అభిప్రాయాన్ని తెలియపరచాటానికి వచ్చిన అవకాశంగా చూశాను. నేను వెలిబుచ్చిన అభిప్రాయాలు ‘కొన్ని యతి నియమాల సడలింపుల మీదనే’ గానీ సూటిగా అక్షర సామ్యయతి అన్న అశం మీద కావు. చంపక ఉత్పలాల ప్రసక్తి తేవటం ఈ కారణం గానే. ఈవిషయాన్ని మీరు గమనించి ఉంటారని అనుకున్నాను గానీ అలా జరిగినట్టు లేదు.
నమస్కారాలతో – తః తః
విశాఖ గురించి raghava ramireddy అభిప్రాయం:
02/13/2022 7:54 pm
చాలా ఆసక్తికరంగా ఉంది భాస్కర్. థాంక్యూ ఫర్ దిస్. ఇప్పటితో కనెక్ట్ చేసే పని పెట్టుకోకుండా అప్పటి కథనే సన్నివేశాలుగా రాస్తే ఇంకా బాగుండేదా అనిపించింది.
ఆమె ఇల్లు గురించి Amarendra Dasari అభిప్రాయం:
02/13/2022 8:35 am
రామయ్య గారూ, కవన శర్మ గారి కథ ప్రస్తావించారు, సంతోషం
శర్మ గారు తన కథలో సమస్యను వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థ స్థాయికి స్పష్టంగా సమర్ధవంతంగా తీసుకు వెళ్లి చర్చించారు..ramakrishnan గారి కథ స్కోప్ లో ‘వ్యవస్థస్థాయి’ లేదు..
ఉత్తర మొరాకో శోధనలు 3 గురించి Tulasi ambati అభిప్రాయం:
02/13/2022 2:04 am
పోస్ట్ షేర్ చేసినందుకు మా గోపీ మామకి థాంక్స్.
స్టోరీ చాలా బాగుంది, keep rocking.
👌👍
రెండు అక్షరసామ్య యతులు గురించి J K Mohana Rao అభిప్రాయం:
02/12/2022 3:24 pm
పరమ కల్యాణి, బ్రతుకు సం-పదగ రమ్ము
=
పరమ కల్యాణి, బ్రతుకు స-మ్పదగ రమ్ము
ఎందుకంటే అనుస్వారము ఒక #shorthand#.
కాని
గ / మ్మత్తు సగాలదేవర వి-పత్తరి నమ్మెదనిన్ను – ఇందులోని గమ్మత్తులో
అనుస్వారపు శబ్దము ఉండవచ్చును, గంమత్తు అని. కాని పకారము లేదు. మఱి అక్షరసామ్య యతి ఎలా కుదురుతుంది?
విధేయుడు – మోహన
రెండు అక్షరసామ్య యతులు గురించి తః తః అభిప్రాయం:
02/12/2022 12:58 am
“పాములు గాలిమేతలలవాటొనరించుట కీవు కారణం బేమొ…”( జాషువా) వంటివి శ్రవణసుభగంగా ఎంత స్వీకారయోగ్యమో, ‘మా-మ’లతో మొదలైన ఉత్పల, చంపకాలకు బిందుపూర్వకమైన బకారముల వంటివి ‘యతి మైత్రి’కి రావు కాబట్టి “గ’మ్మ’త్తు సగాలదేవర వి’ప’త్తరి నమ్మెదనిన్ను”*ల వంటివి గుడా ఔచిత్య రీత్యా స్వీకారయోగ్యములవవలెనని క్లుప్తంగా నా ప్రతిపాదన.
ఒక సంగీత సభ వార్షికోత్సవ సంచికలో ‘అందరూ అంటున్న సంప్రదాయాన్ని పట్టుకుని కూచుంటే భరతునితో మొదలై బాలమురళితో ఆగిపోతామ’న్నట్టుగా ఇంగ్లిష్లో బాలమురళి రాసిన వ్యాసానికి చివరి వాక్యంగా చదివిన గుర్తు.
*తః తః – శంభో తవారాధనం పంపినప్పుడు సమీక్షకులు యతిని సవరించమన్నారని సంపాదకులన్న సందర్భం నుంచి.
“అనిశౌచిత్య విచార సంజనిత శబ్దాకారయై, హర్ష వర్ధనయై హారిశరన్మహాకృతిగనిత్యంబున్ మదీయాంతరారణితాంఘ్రిద్వయనూపుర ప్రమదయై రాగిల్లి నాజన్మ చేతనగా జేసిన వాణికిచ్చెదను ప్రాతస్సూర్యదీపార్చనల్. నా పెద్దన్న కృతి “ధూర్జటీ!” నుండి.
దేశికాచార్యుల వారికి నమస్కారాలతో -తః తః
రెండు అక్షరసామ్య యతులు గురించి J K Mohana Rao అభిప్రాయం:
02/11/2022 8:19 pm