పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. కాలరేఖ గురించి Vasudeva Rao Yerikalapudy అభిప్రాయం:

    07/01/2022 7:29 am

    చాలా బాగుంది మూర్తీ, కథలో ఉన్న కొన్ని నిజాలు ఎంతో ఆనందాన్నీ, కొంత గర్వాన్ని, బాధనీ కూడా కలగజేసాయి. (హిగ్స్ బోసాన్‍కు ‘గాడ్ పార్టికల్’ అని వ్యవహారనామం.)

  2. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 9 గురించి srinivasarao v అభిప్రాయం:

    07/01/2022 6:08 am

    బావుంది, సాధువు చిత్రం విచిత్రం.

  3. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    06/27/2022 6:57 am

    వ్యాసం చాలా బాగున్నది. బహుశా జో అచ్చుతానంద అనే చోట వచ్చుతానందా అని ఉండాలి అనుకొంటాను. పోలికలు బాగా హైలైట్ చేసారు. పెద్ద పరిజ్ఞానం లేనివాడిగా చెప్పవలసివస్తోంది. భారతీయ సంగీతం కంటే వెస్టర్న్ సింఫోనీస్ వెంటనే చెవులను ఆకట్టుకుంటాయి. మన కర్ణాటక సంగీత గొప్పతనం సినిమా పాటలవల్లే తెలిసింది. సంగీతం అంటే చెవి కోసుకునేవారు తప్పక మొజార్ట్, బీతోవెన్ సింఫోనీస్ 7,9 వినండి. వీడియోస్ చూడండి. అద్భుతంగా ఉంటాయి.

  4. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి గంట గురించి వంశీ క్రిష్ణ అభిప్రాయం:

    06/23/2022 6:12 am

    అభినందనలండీ, బావుంది పరిచయం.

  5. నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి Harish mandapuram అభిప్రాయం:

    06/20/2022 3:31 am

    ఈ పాఠం పేరుగుర్తు తెచ్చుకోవడానికి హీనపక్షం 3 సంవత్సరాలనుంచీ ప్రయత్నిస్తున్నా. ఇక్కడ పదవ తరగతి పాఠం గురించిన ప్రస్తావన పాఠం పేరు, పద్యాలు అప్పటి స్మృతులు అన్నీ జ్ఞప్తికి తెచ్చింది.

  6. ప్రజాపతి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    06/17/2022 9:16 pm

    ధన్యవాదాలండి ఇది రాసి పదేళ్ళ పై మాటే. ఏదో తెలుసున్నంతలో జనవాక్యం విన్న ప్రకారం రాసాను. మరీ మీరు అన్నంత లోతుగా భగవద్గీత భాగవతం అవీ చదువుకున్నవాణ్ణి కాదు. మీకు నచ్చినందుకు సంతోషం. నమస్కారం.

  7. సత్య దర్శనం గురించి మరింగంటి సురేంద్ర ప్రసాద్ అభిప్రాయం:

    06/17/2022 4:31 am

    నాకు చాలా బాగా నచ్చిన, మనస్సుకు హత్తుకపోయిన కథల్లో ఇది ఒకటి. రచయితలు అభినందనందనీయులు. అభినందనలు తెలుపకుండా ఉండలేను. నమస్కారంతో

  8. నిత్యప్రళయము గురించి Lyla yerneni అభిప్రాయం:

    06/16/2022 3:24 pm

    Nice. And Noir. (I.e., ‘suffering with style’ as explained by TCM experts.)

    Below is an excerpt, from a book I often enjoy as a random reading, without bothering what page it opens to.

    “Agnes recalled that once as a child, she was dazzled by the thought that God sees her and that he was seeing her all the time. That was perhaps the first time that she experienced the pleasure, the strange delight that people feel when they are being watched, watched against their will, watched in intimate moments, violated by the looks to which they are exposed. Her mother, who was a believer, told her, “God sees you,” and this is how she wanted to teach her to stop lying, biting her nails, and picking her nose, but something else happened: precisely at those times when she was indulging in her bad habits, or during physically intimate moments, Agnes imagined God and performed for his benefit.”
    -Milan Kundera, chapter 7, Novel “Immortality”

  9. కేతన ఆంధ్రభాషాభూషణము: ఒక పర్యాలోకనం గురించి Murti Yerrapragada అభిప్రాయం:

    06/16/2022 12:08 pm

    1) అభినందనీయమైన వ్యాసం. సామాన్య పాఠకునికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మంచిది.
    2) మఱి పదాలను వర్గీకరించినపుడు నేటి లెక్కలో ఆ నాలుగు రకాలను దాటి విదేశీయాలను (పరభాషాపదాలను) కూడా శిష్టపదాలుగా స్వీకరిస్తున్నారా?
    3) నేటి వ్యవహారంలో ప్రథమావిభక్తి “డుమువులు” కేవలం వ్యాకరణానికే పరిమితమైనట్టులుంది. ఏకవచన సందర్భంలో తఱచుగా ‘డు’ బదులు ‘లు’ గాని ‘రు’ గాని వాడడం, ‘ఱ’ను అక్షరాల జాబితా నుండి తొలగించడం బహుబాధాకరం. ఇంకా:
    4) “వ్రాయడం” బదులు“రాయడం” వంటి దొసగులు భాషావేత్తల వ్రాతలలో కనబడడం చూస్తే “తెలుగు భాష లెస్స”యినదన్న కన్నడరాయడిచ్చిన కితాబు వృథాయేనా అనిపిస్తోంది.
    5) భాషాపరిరక్షణకు బాధ్యులు సినీ’కవులు’, పత్రికారచయితలు కాదు మీవంటి ఆచార్యవర్యులు.
    6) మన భాష అభివృద్ధికి వలసిన వెన్నో ఉన్నాయి.

  10. కళాపూర్ణోదయం -5: అలఘువ్రతుడు గురించి SURAM SAMBASIVA RAO అభిప్రాయం:

    06/14/2022 11:46 pm

    ప్రబంధ కథలు మాబోటి సామాన్యులు చదవగలిగేలా ఇలా అందించిన మీకు మా అందరి తరఫున మనఃపూర్వక ధన్యవాదములు. ఇంతకన్నా మేమేమి చెప్పగలము మా కృతజ్ఞతలు తెలుపుకోవటం తప్ప.