Spot on. There is lack of grace and common courtesy when criticizing the works of other people. We can see this everywhere under the guise of anonymity and in Facebook posts where they have a coterie of cackling supporters celebrating supposedly clever vulgarity.
నిజమైన వి ఏ కె రంగారావు గారి శిష్యులు. ఆమె ఆమె మిత్రురాలు శశికళ ప్రచురించిన పుస్తకాలే నిదర్శనం. వ్యక్తిత్వం వివరించడమంటే ఇలా ఉండాలి అని నిర్వచనం చేశారు మీరు. భార్గవిగారు శశికళగారు గురువారెడ్డిగారు మిసిమి సంపాదకులు తలుచుకుంటే, తానా గానీ మనసు ఫౌండేషన్ గానీ చెయ్యి కలిపితే ఈ కార్యం సులభతరం అవుతుంది అందులో ఏమి ఆశ్చర్యం లేదు లేదు లేదు. నమోనమః సత్కరించిన మహానుభావులకు భార్గవి గారికి… ❤️
అన్నా, మీలో ఇంతగొప్ప రచయిత ఉన్నాడని ఇన్నాళ్లూ తెలియలేదు. మీ రచనా శైలి, భావుకత, విశ్లేషణ… ఓహ్! ఇలాంటి రచనలు మా చిన్నప్పుడు మాత్రమే చూశాను. ఇంట్లో ఉండే గుడిపాటి వెంకటాచలం గారి పుస్తకాలను (నవల్స్) తలపిస్తున్నాయి. కళ్లకు కట్టినట్లుగా, మీతో బాటు మమ్మల్నీ రెజిమెంట్ లో తిప్పుతూన్న అనుభూతి, ఇతరులకు తెలీని సంగతులు తెలుసుకుంటున్నాం అనే తలంపు కలుగజేస్తున్న మీ రచనకు అభినందనలు! మీ స్నేహితులు అదృష్టవంతులు అన్నా.
వర్ధమాన ప్రతిభావంత కవయిత్రి రేఖాజ్యోతి తల్లికి ఓ చిరు కానుక…
ముళ్లపూడి వెంకటరమణ (1931–2011) ‘కానుక’ కథకు సంక్షిప్త రూపం.
గోపన్న ఎన్ని యుగాలుగా అక్కడ చెట్ల మాటున కూర్చున్నాడో అతనికే తెలియదు. ఆకులలో ఆకై పువ్వులో పువ్వయి, ఇసుకలో రేణువై యమునలో బిందువై కృష్ణ వంశీనాదాన్ని హృదయంలో పోసుకున్నాడు. యమున ఒడ్డున పొదల మాటున దాగి కృష్ణుడి మురళి విన్నప్పుడు వూపిరి బిగబట్టుకునే కాలం గడిపేవాడు. అక్కడ పొదుపు చేసిన దానిని కొత్త వేణువును పూరించడానికి ఉపయోగించేవాడు. తీరా అది శ్రుతి శుద్ధంగా వినబడేది కాదు.
ఇంత మోహనమైన సంగీతాన్ని కృష్ణుడు ఒక వెదురు ముక్కలో ఎలా ఇమిడ్చాడా అని గోపన్న ఆలోచించాడు. ఒకసారి ఇంటికి వెళ్లి ఆ మురళిని ఎత్తుకు వచ్చాడు. యమున ఒడ్డుకు వచ్చి, చెంగుచాటు నుంచి మురళి తీసి వాయించాలనుకునేసరికి అది కనబడలేదు.
గజదొంగ దగ్గర నేను దొంగతనమేమిటి అనుకున్నాడు గోపన్న. కాని ఆ గజదొంగ సాయంత్రం కనబడి “గోపన్నా నా మురళిని తీసుకుపోయావు కదూ… పోనీ ఇంకొకటి చేసిపెట్టు” అన్నాడు నవ్వి. గోపన్న తెల్లబోయాడు. మర్నాటి నుంచి వేణు నిర్మాణం ఆరంభించాడు. అతనిలో కొత్త శక్తి, కొత్త చైతన్యం మేల్కొన్నాయి. తన చేతులతో రూపు దిద్దుకుంటున్న మురళి రేపు కృష్ణుడి హస్తాలను అలంకరిస్తుందని ఆశపడుతూ మురళిని రూపొందించాడు.
మురళి సిద్ధం కాగానే శ్రుతి చూశాడు. గుండె బద్దలయినంత పనయింది. జీర. రెండు మూడు వేణువులు పలికినట్టుంది. కృష్ణుడు వూదుతాడన్న ఆనందంలో దానికి ఒళ్లు పులకరించిందా? అది పడేసి మరోటి చేశాడు. అదీ అంతే.
కృష్ణుడి పుట్టినరోజు వచ్చేస్తుంది. పాతిక పండగలనాడు గోపన్న ఆరంభించిన వేణు నిర్మాణం ఇంకా తెమలలేదు. రేపటికైనా సాధించి, తన వేణువును ఆయనకు సమర్పించాలి. రేపివ్వలేకపోతే ఇంక ఈ జన్మకివ్వలేడు… వేళయిపోయింది.
కొత్త వెదురు కోసి స్వరద్వారాలు వేసి, మనసులో స్వరాన్ని ఇందులో పలికించబోయాడు. ఆ స్వరం తన ఈ వేణువులో పలికితే ఇది కృష్ణయ్యకు కానుక ఇవ్వాలి. కాని అది పలకదు. ఎన్ని వేల వేణువులో చేశాడు. ప్రతి అణువునా భగవంతుడున్నాడు. ప్రతి శబ్దంలోనూ సంగీతం ఉంది, అన్న వాక్యాల తాత్పర్యం గోపన్న అర్భక దేహానికి దుర్భరమైపోయింది.
అతను ఊహించిన సంగీతాన్ని అనుభవించడానికి శక్తి చాలలేదు.
ఇన్ని వేణువుల గుట్టలో ఎక్కడో సత్యమైన కొత్త వేణువు దాగివుంది. అది సత్యమైనదేనా? ఒకప్పుడు పనికిరాదని తాను పడవేసిందేమో. చివరి మురళిని పరీక్షించడానికి ధైర్యం చాలలేదు. సత్యం తెలుసుకొని చనిపోగల శక్తి లేదు.
“ఇదే” అన్నాడు ధీమాగా.
“చూడవా” అన్నాడు కుర్రాడు.
“ఒద్దు. లగెత్తు. కిష్టయ్య చేతికియ్యి ఆయనే చూస్తాడు.”
పాతిక సంవత్సరాల గాలివాన వెలిసింది. గోపన్న మేను వాల్చాడు. తాను పని ముగించాడా. భగవంతుడికి శ్రుతి శుద్ధమైన వేణువును పంపాడా. శ్రుతి శుద్ధంగా ఉందో లేదో నిర్ణయించే జ్ఞానం తనకు ఉందా? సరిచేసే శక్తి ఆయనకు లేదని తను అనుకొన్నాడా? గోపన్నకు నవ్వు వచ్చింది.
తన పక్కనున్న వేణువులోంచి సన్నటి స్వరం నెమ్మదిగా ఇవతలికి రావడం, వచ్చి తన చెంప నిమరడం గమనించాడు గోపన్న. ఇంకో క్షణానికి ఆ పక్క మురళి, ఉత్తర క్షణార్థానికి ఇటుపక్క మురళి మేలుకున్నాయి. మరికొద్ది క్షణాలలో కుటీరంలోని సహస్ర వేణువులూ భువన మోహనంగా గానం చేయసాగాయి.
“ఎవరొచ్చినా ఎదురుచూస్తున్న ఆ ఒక్కరూ రారు! అనకు
అలసిపోకు, విశ్రాంతిగా ఉండు, ఆలోచనలు ఎంత ముంచుతాయో అంత మునుగు.
తోట బాగు చేసుకో, కవిత్వం రాసుకో, మట్టి పిసికి బొమ్మలు చేసుకో.
కిటికీ ఆవల పొర్ణమి, కళ్ళలో యమున, వెన్నెల ప్రతిఫలిస్తోంది.
అదిగో నెమ్మదిగా ఒక నవ్వు ముఖం స్పష్టమవుతోంది”
అబ్బా! పిల్లలకు అందుబాటులో వుండే సౌందర్యం అంతా ఒలకబోశారు గదా!చిన్నతనంలో చందమామలో కూడా ఇంత మరపురాని కథ చదివినట్లు గురుతులేదు. మూలకథకులకు, మీకు ఎంతెంతో జంగిడీలు.
సోల్జర్ చెప్పిన కథలు: మొదటి నెల గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:
09/28/2022 1:24 am
శ్రీనివాస్ గారూ, ప్రఫుల్ గారూ, Thank you!
జూన్ 2022 గురించి Naamaata అభిప్రాయం:
09/27/2022 6:17 pm
Spot on. There is lack of grace and common courtesy when criticizing the works of other people. We can see this everywhere under the guise of anonymity and in Facebook posts where they have a coterie of cackling supporters celebrating supposedly clever vulgarity.
వి. ఎ. కె. అంటే? గురించి సేతుపతి అభిప్రాయం:
09/26/2022 12:37 am
నిజమైన వి ఏ కె రంగారావు గారి శిష్యులు. ఆమె ఆమె మిత్రురాలు శశికళ ప్రచురించిన పుస్తకాలే నిదర్శనం. వ్యక్తిత్వం వివరించడమంటే ఇలా ఉండాలి అని నిర్వచనం చేశారు మీరు. భార్గవిగారు శశికళగారు గురువారెడ్డిగారు మిసిమి సంపాదకులు తలుచుకుంటే, తానా గానీ మనసు ఫౌండేషన్ గానీ చెయ్యి కలిపితే ఈ కార్యం సులభతరం అవుతుంది అందులో ఏమి ఆశ్చర్యం లేదు లేదు లేదు. నమోనమః సత్కరించిన మహానుభావులకు భార్గవి గారికి… ❤️
సోల్జర్ చెప్పిన కథలు: మొదటి నెల గురించి ప్రఫుల్ అభిప్రాయం:
09/25/2022 3:52 am
అన్నా, మీలో ఇంతగొప్ప రచయిత ఉన్నాడని ఇన్నాళ్లూ తెలియలేదు. మీ రచనా శైలి, భావుకత, విశ్లేషణ… ఓహ్! ఇలాంటి రచనలు మా చిన్నప్పుడు మాత్రమే చూశాను. ఇంట్లో ఉండే గుడిపాటి వెంకటాచలం గారి పుస్తకాలను (నవల్స్) తలపిస్తున్నాయి. కళ్లకు కట్టినట్లుగా, మీతో బాటు మమ్మల్నీ రెజిమెంట్ లో తిప్పుతూన్న అనుభూతి, ఇతరులకు తెలీని సంగతులు తెలుసుకుంటున్నాం అనే తలంపు కలుగజేస్తున్న మీ రచనకు అభినందనలు! మీ స్నేహితులు అదృష్టవంతులు అన్నా.
నేనే! గురించి కిషోర్ అభిప్రాయం:
09/24/2022 5:23 pm
చాలా బాగుంది భారతి గారు.
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి V N Reddy అభిప్రాయం:
09/22/2022 1:14 am
ఘంటసాల, బాలసుబ్రమణ్యం కలసి పాడిన మరో రెండు పాటలు:
“భలే మజాలే భలే ఖుషిలే”, నీతి నీజాయితి (1967)
“దేవుడు చేసిన మనుషుల్లారా”, దేవుడు చేసిన మనుషులు (1973)
శెలవు రోజున గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
09/19/2022 1:26 pm
వర్ధమాన ప్రతిభావంత కవయిత్రి రేఖాజ్యోతి తల్లికి ఓ చిరు కానుక…
ముళ్లపూడి వెంకటరమణ (1931–2011) ‘కానుక’ కథకు సంక్షిప్త రూపం.
గోపన్న ఎన్ని యుగాలుగా అక్కడ చెట్ల మాటున కూర్చున్నాడో అతనికే తెలియదు. ఆకులలో ఆకై పువ్వులో పువ్వయి, ఇసుకలో రేణువై యమునలో బిందువై కృష్ణ వంశీనాదాన్ని హృదయంలో పోసుకున్నాడు. యమున ఒడ్డున పొదల మాటున దాగి కృష్ణుడి మురళి విన్నప్పుడు వూపిరి బిగబట్టుకునే కాలం గడిపేవాడు. అక్కడ పొదుపు చేసిన దానిని కొత్త వేణువును పూరించడానికి ఉపయోగించేవాడు. తీరా అది శ్రుతి శుద్ధంగా వినబడేది కాదు.
ఇంత మోహనమైన సంగీతాన్ని కృష్ణుడు ఒక వెదురు ముక్కలో ఎలా ఇమిడ్చాడా అని గోపన్న ఆలోచించాడు. ఒకసారి ఇంటికి వెళ్లి ఆ మురళిని ఎత్తుకు వచ్చాడు. యమున ఒడ్డుకు వచ్చి, చెంగుచాటు నుంచి మురళి తీసి వాయించాలనుకునేసరికి అది కనబడలేదు.
గజదొంగ దగ్గర నేను దొంగతనమేమిటి అనుకున్నాడు గోపన్న. కాని ఆ గజదొంగ సాయంత్రం కనబడి “గోపన్నా నా మురళిని తీసుకుపోయావు కదూ… పోనీ ఇంకొకటి చేసిపెట్టు” అన్నాడు నవ్వి. గోపన్న తెల్లబోయాడు. మర్నాటి నుంచి వేణు నిర్మాణం ఆరంభించాడు. అతనిలో కొత్త శక్తి, కొత్త చైతన్యం మేల్కొన్నాయి. తన చేతులతో రూపు దిద్దుకుంటున్న మురళి రేపు కృష్ణుడి హస్తాలను అలంకరిస్తుందని ఆశపడుతూ మురళిని రూపొందించాడు.
మురళి సిద్ధం కాగానే శ్రుతి చూశాడు. గుండె బద్దలయినంత పనయింది. జీర. రెండు మూడు వేణువులు పలికినట్టుంది. కృష్ణుడు వూదుతాడన్న ఆనందంలో దానికి ఒళ్లు పులకరించిందా? అది పడేసి మరోటి చేశాడు. అదీ అంతే.
కృష్ణుడి పుట్టినరోజు వచ్చేస్తుంది. పాతిక పండగలనాడు గోపన్న ఆరంభించిన వేణు నిర్మాణం ఇంకా తెమలలేదు. రేపటికైనా సాధించి, తన వేణువును ఆయనకు సమర్పించాలి. రేపివ్వలేకపోతే ఇంక ఈ జన్మకివ్వలేడు… వేళయిపోయింది.
కొత్త వెదురు కోసి స్వరద్వారాలు వేసి, మనసులో స్వరాన్ని ఇందులో పలికించబోయాడు. ఆ స్వరం తన ఈ వేణువులో పలికితే ఇది కృష్ణయ్యకు కానుక ఇవ్వాలి. కాని అది పలకదు. ఎన్ని వేల వేణువులో చేశాడు. ప్రతి అణువునా భగవంతుడున్నాడు. ప్రతి శబ్దంలోనూ సంగీతం ఉంది, అన్న వాక్యాల తాత్పర్యం గోపన్న అర్భక దేహానికి దుర్భరమైపోయింది.
అతను ఊహించిన సంగీతాన్ని అనుభవించడానికి శక్తి చాలలేదు.
ఇన్ని వేణువుల గుట్టలో ఎక్కడో సత్యమైన కొత్త వేణువు దాగివుంది. అది సత్యమైనదేనా? ఒకప్పుడు పనికిరాదని తాను పడవేసిందేమో. చివరి మురళిని పరీక్షించడానికి ధైర్యం చాలలేదు. సత్యం తెలుసుకొని చనిపోగల శక్తి లేదు.
“ఇదే” అన్నాడు ధీమాగా.
“చూడవా” అన్నాడు కుర్రాడు.
“ఒద్దు. లగెత్తు. కిష్టయ్య చేతికియ్యి ఆయనే చూస్తాడు.”
పాతిక సంవత్సరాల గాలివాన వెలిసింది. గోపన్న మేను వాల్చాడు. తాను పని ముగించాడా. భగవంతుడికి శ్రుతి శుద్ధమైన వేణువును పంపాడా. శ్రుతి శుద్ధంగా ఉందో లేదో నిర్ణయించే జ్ఞానం తనకు ఉందా? సరిచేసే శక్తి ఆయనకు లేదని తను అనుకొన్నాడా? గోపన్నకు నవ్వు వచ్చింది.
తన పక్కనున్న వేణువులోంచి సన్నటి స్వరం నెమ్మదిగా ఇవతలికి రావడం, వచ్చి తన చెంప నిమరడం గమనించాడు గోపన్న. ఇంకో క్షణానికి ఆ పక్క మురళి, ఉత్తర క్షణార్థానికి ఇటుపక్క మురళి మేలుకున్నాయి. మరికొద్ది క్షణాలలో కుటీరంలోని సహస్ర వేణువులూ భువన మోహనంగా గానం చేయసాగాయి.
అన్నిటిలోనూ కృష్ణుడి మోహన గానమే. అసత్యమైన వేణువు లేనేలేదు. భగవంతుడికి ఉపయోగపడని వేణువే లేదు. గోపన్న సహస్ర వేణునాద స్వరార్ణవంలో–సాక్షాన్మహావిష్ణువై తేలుతున్నాడు.
శెలవు రోజున గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
09/19/2022 1:24 pm
అనంత నీరవ నిరీక్షణలకు నిర్మల మందాకినీ వీచికలతో సాంత్వన నిస్తాయి అంబుజోదర దివ్య పాదారవిందాలు.
చందమామ ఎంత దూరం గురించి T.subrahmanyam అభిప్రాయం:
09/18/2022 6:11 am
అబ్బా! పిల్లలకు అందుబాటులో వుండే సౌందర్యం అంతా ఒలకబోశారు గదా!చిన్నతనంలో చందమామలో కూడా ఇంత మరపురాని కథ చదివినట్లు గురుతులేదు. మూలకథకులకు, మీకు ఎంతెంతో జంగిడీలు.
రామతత్వం గురించి Veena అభిప్రాయం:
09/16/2022 3:32 pm
పైన ఆర్టికల్ కనబడటం లేదు.
[సాంకేతిక లోపం వల్ల కొన్ని పిడిఎఫ్ ఫైల్స్ కొన్ని కనిపించటం లేదు. లోపం సరిదిద్దే ప్రయత్నాల్లో ఉన్నాం – సం]