పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. అంతరిక్ష అన్వేషణ ఎందుకోసం? గురించి Bhaskar G అభిప్రాయం:

    11/18/2022 12:33 pm

    Amazing! Thanks for translating and sharing. I loved the letter, it really moved me

  2. స్థితప్రజ్ఞతా వాదం: వర్తమాన సమస్యలకి ప్రాచీన పరిష్కారం గురించి Bhaskar అభిప్రాయం:

    11/17/2022 11:54 am

    Excellent article. I did read Meditations by Marcus Aurelius and keep going back to it for inspiration from time to time, this essay superbly maps all of the stoic teachings to present day. Thanks for translating and sharing!

  3. ఎంగేజ్మెంట్ గురించి Prabha అభిప్రాయం:

    11/16/2022 9:10 pm

    వాళ్లు ఇద్దరూ విడిపోయారు. ఇద్దరూ ఈకాలం పిల్లలు. వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళకి తెలుసు, అంతకన్న ఎక్కువగా తెలియదు. ముఖ్యంగా అమ్మాయికి. కథ చాలా బాగుంది.
    ఆమ్మాయిలు వాస్తవానికి దూరంగా ఆలోచిస్తున్నారు.
    జీవితం అంతా తాము అనుకున్నట్లు ఉండాలని అనుకుంటున్నారు.

  4. Rhapsody in Woods గురించి వేలూరి వేంకటేశ్వర రావు. అభిప్రాయం:

    11/14/2022 3:24 pm

    In ‘One Word.’
    Simply Brilliant.

    — Veluri Venkateswara Rao.

  5. సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 1. గురించి Mantravadi Veera Venkata Satyanarayana అభిప్రాయం:

    11/12/2022 5:28 am

    గణపవరపు వారు 64 పద్యములను గర్భితము చేసి వ్రాసిన సీసపద్యమును గురించి వివరింపగలరు

  6. ఈ రచన నా సొంతం కాదు! గురించి వీరభద్రం అభిప్రాయం:

    11/12/2022 4:24 am

    క్షేమేంద్రుడు తన కవికణ్ఠాభరణంలో ఇలా అంటాడట.

    ఛాయోపజీవీ పదకోపజీవీ పాదోపజీవీ సకలోపజీవీ |
    భవేదథ ప్రాప్త కవిత్వజీవీ స్వోన్మేషతో వా భువనోపజీవ్యః ||

    ఛాయోపజీవి, పదకోపజీవి, పాదోపజీవి, సకలోపజీవి, అని కవులు నాలుగు విధములుగా ఉందురు. కొంతకాలము తరువాత లభించిన స్వీయ కవిత్వమునే ఆధారముగా గొనువాడుగా అయి, లేదా స్వీయ ప్రతిభావిశేషముచేత; భువనోపజీవ్యు డగును.

    వివరణ. పూర్వకవుల కవిత్వచ్ఛాయలను స్వీకరించి కవిత్వము చెప్పువాడు ఛాయోపజీవి. పూర్వకవుల శ్లోకములలోని కొన్ని పదములు గ్రహించి కవిత్వము చెప్పువాడు పదకోపజీవి. పాదములను గ్రహించువాడు పాదోపజీవి.పదాలను అర్థచ్ఛాయను కూడ ప్రాచీనకవులనుండి గ్రహించినవాడు సకలోపజీవి. ఇట్లు ప్రయత్నము చేయగా చేయగా కవితాశక్తి లభించినవాడు, లేదా ఛాయోపజీవిత్వాదులు లేకుండగనే స్వప్రతిభావిశేషముచే కవిత్వము చెప్ప గలిగినవాడు భువనోపజీవ్యు డగును. అనగా ప్రపంచములో కవిత్వము చెప్ప దలచినవా రందరును ఈతనిపై ఆధారపడి యుందురు. ఇతరులపై ఆధార పడి జీవించువాడు ఉపజీవి. ఇతరులు జీవించుటకు ఆధారమైనవాడు ఉప జీవ్యుడు.

    ఈ శ్లోక భావాన్నీ వివరణనీ సకలోపజీవిగా నేను యేరుకొచ్చింది పండితలోకచిరంజీవి మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెల స్రీరామచంద్రుడు గారి పుస్తకం నుంచీ.

  7. గ్రంథచౌర్యం గురించి … గురించి వీరభద్రం అభిప్రాయం:

    11/12/2022 4:01 am

    <<>>

    కందుకూరి వారు ఇలాగే చేసారని ఆదిభట్ల నారాయణదాసు గారు తన ఆత్మకథలో చెప్పుకున్నారు. ఈయన వ్రాసిన ఈసఫ్ కథలను అచ్చొత్తించటానికి కందుకూరి వారి ముద్రణాలయానికిస్తే దానిని చదివి కందుకూరి వారు ప్రేరణ పొంది పుస్తకాన్నిఇచ్చిన పుస్తకాన్ని అచ్చేయకుండా గడిపి, ఈలోగా ఆయనే తెలుగులో అనువదించి ముద్రించుకున్నారట.

    అయితే ఇది గ్రంథచౌర్యం కాదు చింతనాచౌర్యమేనేమో!

  8. ఊహల ఊట 18 గురించి సుమనస్పతి రెడ్డి అభిప్రాయం:

    11/10/2022 8:52 pm

    “తెలిసిన బుద్ధితో ఆలోచనలు సాగుతాయి. ఊహలో?” అనడంలో ఎంత చమత్కారం చూపించారో తులసి గారు.

    తెలిసిన బుద్ధితో ఆలోచనలు పెరుగుతాయి సరే, ఊహల విస్త్రృతి, ఎత్తూ , లోతులు కూడా పెరిగి తీరుతాయనే కదా!

    మేధస్సూ, పరిజ్ఞానమూ ఊహా శక్తిని దెబ్బతీస్తాయనే పొల్లు తర్కాన్ని పూర్వపక్షం చేస్తూ, ఊహ, తెలివిడి కలిస్తే కలిగే జీవనోత్సాహం ఏమిటో సమధికంగా నిరూపణ చేస్తూ సాగే ఈ “ఊహల ఊట” గల్పికల్లో అందుకే చలాకీ చమక్కులకూ చమత్కారాలకూ ఏవీ( కొదవ లేదు!

    చదివిస్తూ పోతూ ఉండడమంటే ఇది మరి!

  9. మత్స్యకారుల జీవన ప్రతిబింబం: మున్నీటి గీతలు గురించి శాంతిశ్రీ బెనర్జీ అభిప్రాయం:

    11/09/2022 7:35 am

    థాంక్యూ వంశీ. చిట్టిబాబు గారి నవల వివరాలు తెలిపినందుకు
    ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు.

  10. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Sai Brahmanandam అభిప్రాయం:

    11/08/2022 4:01 pm

    శాంతిశ్రీ గారూ:

    ఊతుక్కాడ్ వెంకటసుబ్బయ్యర్ కాలం 1700-1765; కనుక ఆయన త్యాగరాజు ముందు తరం వాడే.
    https://carnatic-circle.com/choral-singing-sampradaya-bhajanai/guru-dhyanam/mahakavi-oothukadu-venkatasubbiar/
    మీరు చెప్పే వెంకటసుబ్బయ్యర్ వేరెవరైనా అయ్యుండచ్చు. ఎందుకంటే సుబ్బయ్యర్ పేరు ఆ కాలంలో చాలా మందికి ఉండేది.