పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16452

  1. వంద కుర్చీలు 2 గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/22/2022 11:38 am

    ప్రియమైన శ్రీ తఃతః గారూ!

    నాలాంటి నేలక్లాసు పాఠకుడికి ఇది ప్రథానాంశం అనిపించటం లేదు సార్.

    “మా అమ్మను వదిలేయలేను. అది నా గురువుకిచ్చిన మాట. నువ్వు వెళ్ళిపోతే బాధపడతాను. ఆ బాధను భరించలేను. అయితే అమ్మకు తనకేది నచ్చుతుందో అలానే చేస్తుంది” అని ధర్మపాలన్ అంటే తను వణికిపోతూ ఏడ్చి ఎర్రబడి వాచిన కళ్ళతో, కందిపోయిన చెంపలతో కొన్ని క్షణాలు చూస్తూ నిల్చుని హఠాత్తుగా తన తలమీద బాదుకుంటూ నేల మీద కూలబడి గట్టిగా ఏడ్చిన శుభది మరో రకం వేదన. అది నాయాడుల పట్ల చూపిన చాలా చిన్న వివక్షత.

    “సొక్కాలు వద్దురా. దమ్మదొరల కుర్చీల్లో కూర్చోవద్దు బిడ్డా…” అంటూ ఆక్రోశించే కాప్పన్ తల్లి వ్యవస్థ మాయల్లో పడిపోని మృగంలా, వాస్తవాన్ని పసిగడుతోందా?

    మార్పు తేవాలనుకుని, విఫలమయిన నాయాడులకి ప్రతినిధి కాప్పన్, వ్యవస్థకున్న కట్టుదిట్టాలతో తనని సరిగ్గా ఇముడ్చుకున్నప్పుడు మాత్రమే తన అధికారాన్ని అంగీకరిస్తారని తెలుసుకున్న కలెక్టర్ ధర్మపాలన్, నిజాయతీతో, నిస్వార్ధ సేవలు చేస్తున్నా సస్పెండ్ కాబడ్డ డాక్టర్ మాణిక్యం పాత్రలు…

    “వ్యవస్థకున్న కట్టుదిట్టాలతో తనని సరిగ్గా ఇముడ్చుకున్నప్పుడు మాత్రమే ఒక్కో అధికారికీ తనదైన అధికారం తన చేతికి వస్తుంది – స్థాయితో నిమిత్తంలేదు. వ్యవస్థనుండి విడివడితే అధికారం అర్థంలేనిది అవుతుంది.” ఇదే “వంద కుర్చీలు” కధ ప్రథానాంశమేమో! తన తల్లి భిక్షగత్తె ముసలమ్మను మట్టిలో పూడ్చేసి, ఆమె హృదయం అన్ని పరితాపాలతోనూ మగ్గి మట్టి అయిపోవాలి అంటే తనకు ఇంకా వంద కుర్చీలు (అధికారాలు) కావాలి అని ఆక్రోశించిన కలెక్టర్ ధర్మపాలన్ ఆక్రోశమే “వంద కుర్చీలు” కధ ప్రథానాంశమేమో తఃతః గారూ!

    – నమస్కారాలతో, కె.కె. రామయ్య

  2. విశ్వమహిళానవల 20: కేట్ షొపేన్ గురించి Lyla yerneni అభిప్రాయం:

    12/20/2022 4:31 pm

    Introductions by C. Mrinalini in Telugu, and Marilynne Robinson in English, are very poor and so over wrought, to the extent that they do not even consider, the character ‘Edna Pontellier,’ may be safe and sound. They declare she committed suicide. How did they know? Kate Chopin the author did not write it. How did these two critics know?

    Put a bathing suit on, go to the beach, kick their shoe off, they perhaps would have read the book with a few smiles, and giggles. And they see young Edna at the end of the novel, who is swimming naked, is alive.

    But they read Madame Bovary and Anna Karenina, before. Therefore, they read a newly discovered book, the same way. Therefore, they don’t see the French Ness in a story, don’t see the all-around flirting, they don’t feel the salty air on their lips, they don’t take the time to sit on some cottage steps, sip some lemonade, enjoy a leisurely cigar on the porch in, a rocking chair.

    Marilynne Robinson in her intro, at least attempts to say, let us not read this book, under banner of feminism. But, towards closing paragraphs, can’t help preaching, let us read it as “meditation on the experiential basis of romantic consciousness…” mumbo jumbo. With Mrinalini Simply-Feminism flourishes, original author perishes.

    Ladies, Perhaps the publisher, who changed the heading of the book, to ‘The Awakening’ also yanked out a few paragraphs at the end. To let the present pathetic feminists, imagine their favorite fatal endings. Can that be a possibility?

    Try to do some psychological profiling, M&Ms, and you will understand Edna is not the sort of woman who will kill herself. Even Sophocles will not go that far with this woman. I mean, when he says:
    “To Never have been born may be the greatest boon of all”
    “Not to be born surpasses all reckoning. The next best thing by far, when one has been born is to go back as swiftly as possible whence one came.”
    – I get it, but it is not for Edna Pontellier.

    So, don’t be so jealous, if a very nice meal is being cooked by another adoring man for her, let Edna come out of sea waters, like she did before, let this young woman in ‘this beautiful little book.’ enjoy her life.
    Stop being so mirthless, so repetitiously boring critics, to procure funds and grants to keep you in Marxist/feminist webinars. Don’t kill off every woman character in the books, to keep yourselves alive.

    -Lyla

  3. వంద కుర్చీలు 2 గురించి తః తః అభిప్రాయం:

    12/20/2022 6:10 am

    కథలో – కొడుకు తన తండాని అవమానకరంగా చూసిన పెద్దింటి వాళ్ళ పిల్ల తన కొడుకుకు ప్రభుత్వోద్యోగం ద్వారా వచ్చిన సాంఘిక స్థాయిని, సంపాదననను అనుభవించటాన్ని తట్టుకోలేక న్యూసెన్స్‌గా తయారయిందని ఒక ఫ్రాయిడ్ అనవచ్చునేమో? ఇదే ప్రథానాంశమేమో!

    -తః తః

  4. విశ్వమహిళానవల 20: కేట్ షొపేన్ గురించి annapurna appadwedula అభిప్రాయం:

    12/16/2022 6:42 am

    మృణాళిని నవలాపరిచయం చాలా బాగుంది. ముందు నవలలకంటే ఈ నవల చాలా నచ్చింది. చాలామంది మహిళల స్వీయభావాలే ఎడ్నావి కూడా. ఐతే ఆత్మహత్య పరిష్కారంగా భావించడం అప్పుడూ ఇప్పుడూ చేస్తున్నదే కావడం విషాదం. నవల దొరికితే తప్పక చదువుతాను.

    థాంక్యూ మృణాళినీ!

  5. వంద కుర్చీలు 2 గురించి తఃతః అభిప్రాయం:

    12/16/2022 4:27 am

    “Social status.” (Plz Google: Animal Ethics)

    “…In social animals, social status is important because a higher rank may mean better access to mates and resources like food and territory. Chimpanzees have been witnessed killing members of their own groups over social status, mating rights, or in apparent political power struggles…”

    This shows up in some or other form in Humans. It can not be done away with . Some narrators for reasons beyond my comprehension present it -in all sincerity- in thick shades, they cannot help, like for instance some women- poets who paint (their?) men in black. Certainly the present story is a case in point with its excess, overdo.

    Best regards
    tah tah

    “Nothing succeeds like excess” Oscar Wild.

  6. సిలబస్: 6. బాపూ బొమ్మ గురించి జీ ఎన్ రావు అభిప్రాయం:

    12/15/2022 8:10 pm

    మీరు చేయితిరిగిన చిత్రకారులని మాత్రమే తెలుసు. మీరు అభిమానంతో నాకు పంచుతున్న ఇలాంటి వ్యాసాలవల్ల వాటిలోని భావప్రకటనా సామర్థ్యం వల్ల మీరు ఉట్టి చిత్రకారులే కాదు, కలం తిరిగిన రచయితలు కూడా అనిపించింది. ఫిక్షన్ వ్రాశారో లేదో నాకు తెలియదుగాని, మీ శైలి స్పీడ్‌గా చదివిస్తుంది.

  7. వంద కుర్చీలు 2 గురించి From: Sivakumar Tadikonda అభిప్రాయం:

    12/15/2022 7:30 pm

    ఇది కథ కాదు. కల్పన కాదు. చారిత్రికతని నింపుకుని, అద్భుతమైన అక్షరాల పేనికతో చేసిన సంఘర్షణభరిత నిజజీవిత చిత్రణ. భార్యాభర్తలు ఒకరినొకరు ఎంపిక చేసుకోవడంలో కూడా కాల్క్యులేషన్! కథగా మలచింది మాత్రం గుర్తుండిపోయే ముగింపునిచ్చి అనిపిస్తుంది. ఈ జీవితం తన కెలా తెలిసిందో రచయిత కథలోనే చెబుతాడు. “అతని ఇంటినుండి అతని శిష్యడైన ఒక యువరచయిత… ఉత్తర కేరళలో కాసర్కోడులో ఏదో ఉద్యోగం చేస్తుంటాడతను. ఇక్కడికి వచ్చినప్పుడు సుందర రామసామి ఇంటి మేడమీద ఉంటాడు. నేను సుందర రామసామితో మాట్లాడుతుంటే కొన్నిసార్లు అతనూ వచ్చి మా మాటల్లో కలిసేవాడు. అతని పేరు జెయమోహన్ అని గుర్తు.” ఈ కథని రాసినందుకు జయమోహన్ గారికీ, అనువాదం అనిపించకుండా తెనిగించిన భాస్కర్ గారికీ ధన్యవాదాలు!

    “ఎంగిలి” పదం వాడుక “ఎంగిలి ఆకులు,” “ఎంగిలి మెతుకులు” వాడకాల్లో సరయినదే గానీ, నోటిలోంచి కారేదాన్ని గుంటూరులో మాత్రం “చొంగ” అనేవారు. చివర్లో, “చొంగ కారిన ఆమె ముఖం దిండుమీద ఒక పక్కకు ఒరిగిపోయింది.” అని ఉండాలి కదా అనుకున్నాను. భాస్కర్ గారివైపు “ఎంగిలి కారడం” వాడుక సరయినదే నేమో ననిపించింది.

    గాడిదల సంత పక్కన ఉన్న ప్రభుత్వాసుపత్రి గూర్చి కాప్పా పంపిన రిపోర్ట్ తరువాత డాక్టర్ మాణిక్యం ఉద్యోగానికి ఎసరుపెట్టిన వైనం, 2007లో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల నుండీ వచ్చిన క్షతగాత్రులని సరిగ్గా చూడట్లేదని అమెరికాలోని వాల్టర్ రీడ్ ఆర్మీ మెడికల్ సెంటర్ కి సంబంధించిన ఇద్దరిని పదవులనించీ తొలగించడాన్ని గుర్తుకు తెచ్చింది. బుష్ ప్రభుత్వం, యుధ్ధానికి ఎంత ఖర్చవుతుంది అంటే నాకేం తెలుసు అని జవాబిచ్చింది. ఇంక యుధ్ధానికి పంపుతున్నవాళ్లల్లో ఎంతమందికి దెబ్బలు తగిలి హాస్పిటల్‌కి వస్తారో అని ఆలోచించే తీరిక ఎక్కడున్నది? వస్తున్నవాళ్లందరినీ చేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి అని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చెబితే, ఇటు కాంగ్రెసు, అటు అధ్యక్షుడు డబ్బుల్లేవు, సరిపుచ్చుకొమ్మని చేతులెత్తేశారు. హాస్పిటల్లో బెడ్లు లేక కారిడార్లల్లోనూ, నేలమీద యుధ్ధ వీరులు పడివున్నారు అని పేపర్లో వార్త రాగానే మాత్రం, ముందు ఒక ఇద్దర్ని పైపదవుల్లోనించీ పీకేశారు. ఇది కులంతో కాక వ్యవస్థకి సంబంధించిన విషయం.

  8. వంద కుర్చీలు 2 గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/15/2022 12:29 pm

    ప్రియమైన శ్రీ తఃతః గారూ!

    వివక్ష గూర్చి డా. త్రిపురనేని హనుమాన్ చౌదరిగారు ఏవన్నారో మీ కామెంట్లో రాసి ఉండాల్సింది. వివక్ష గూర్చి వారన్న మాటలను యూట్యూబ్‍లో ఎక్కడ వినవచ్చో లింక్ ఇచ్చినా బాగుండేది.

    “వివక్ష ఏ జంతు సమాజాన్నుంచీ పోదన్నది దుర్భరమైన నిజం” అన్న మీ మాటలను కూడా సరిగా అన్వయించుకో లేకపోతున్నా. మానవ సమాజం జంతు సమాజం కన్నా ఎంతో పరిణితిపొందిన సమాజం కదా… మరి యీ అవలక్షణాన్ని ఎందుకు తొలగించలేకపోయింది. (ఆఫ్రికా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ల ఉదాహరణలంటూ భయపెట్టకండి.)

    మానవ సమాజంలో వివక్ష ‘ఎదురు వివక్ష’కు కారణమౌతున్నది అని అన్నారు… అది ఎదురు వివక్షతా లేక హక్కుల పరిరక్షణ కోసం జరిగే తిరుగుబాటా?

    తన “నూఱు నాఱ్కాలికళ్” కధ ద్వారా ప్రముఖ తమిళ కధారచయిత జయమోహన్ గారు చూపించిన సమాజంలోని వికృతరూపాలు మనల్ని పురోగమనం వైపు నడిపించటానికి ప్రోత్సహిస్తుంది కదా. దిశానిర్దేశం చేస్తుంది కదా.

    నమస్కారాలతో,
    కె.కె. రామయ్య

  9. వంద కుర్చీలు 2 గురించి తః తః అభిప్రాయం:

    12/15/2022 4:20 am

    ప్రభాకర్ గారూ, మీరు జాలి పడినా పడకపోయినా వివక్ష ఏ జంతు సమాజాన్నుంచీ పోదన్నది దుర్భరమైన నిజం. మానవ సమాజంలో వివక్ష ‘ఎదురు వివక్ష’కు కారణమౌతున్నది కూడా అంతే నిజం. (వివక్ష గూర్చి శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి మాటలను యూట్యూబ్‍లో వినవచ్చు.)
    రచన సంగతి: చదువరిని ముక్కలు ముక్కలు చేసే రచనలను నేను మెచ్చుకోలేను. ‘లోక ధర్మమును తలపింప జేయుటయే కళాధర్మము కానీ లోకధర్మమే కళా ధర్మము కా(కూడ)ద’న్న పింగళి వారి మాటనూ ‘అగ్ని జల్లిన్నా అమృతం కురిసినా అందం ఆనందం ‘దాని’ పరమావధి’ అన్న తిలక్ కవితా వాక్యాన్నీ నేను ఇష్టపడతాను.

    నమస్కారాలతో –
    తః తః

  10. సిలబస్: 6. బాపూ బొమ్మ గురించి Anwar అభిప్రాయం:

    12/14/2022 10:06 pm

    అద్భుతః చదివిన తర్వాత ఇంకేమి మాట్లాడకుండా చేసేస్తారు మీరు. చాలా గొప్పగా ఉంది రైటప్ సర్.