వారి వ్యాఖ్య: ఈ మినీ కథ చెపుతున్నతనికి అన్నీ ఫ్రీగా రావాలి. రానందున కొంత మంట. ఆకాశం, వెన్నెల, ఎదురింటి అందమైన పాపాయి ఫ్రీగా వచ్చినందున అతని కిష్టం. వీటన్నిటిలో రచయిత ఉష్ కాకీ అని మాయం చెయ్యగలిగిందెవరు? …..
నా సమాధానం: ఇల్లు ఫ్రీగా రానందున మంట అని అసందర్భ ప్రేలాపన ఎందుకు? దిగువ మధ్య తరగతి ఉండే కొన్ని రెండు గదుల ఇళ్ళల్లో అద్దె కట్టినా గాలీ, వెలుతురూ చొరబడదు. ఆకాశమూ కనిపించదు. అందువల్ల అవి దొరకడం అదృష్టంగా బావిస్తాడు కథకుడు. మీరైతే వాటికి కూడా అద్దె వసూలు చేస్తారేమో?
వారి వ్యాఖ్య: పాప తలిదండ్రులకి కానీ, ఇరుగుపొరుగుల వారికి కానీ, ఫ్రీగా పైనెంతో ఎత్తు నుంచి పాపాయిని చూసి ఆనందించే కథకుడి మీద కాని, ఈ పాపాయిని రక్షించే బాధ్యత లేదు.
నా సమాధానం: తేలికపాటి వర్షం పడినపుడు పిల్లలు కాగితపు పడవలు వేసి ఆనందించడం, వాళ్ళని చూసి పెద్దవాళ్ళు ముచ్చటపడడం సహజం. ఈ కథలో జరిగింది అదే. భారీ వర్షం పడి నీరు పారకుండా stagnate అవడానికి ఆక్రమణలు, ప్రజల దురాశ కారణం. అదే కథలో చెప్పాను. పాపాయికి ప్రమాదం జరుగుతూ ఉన్నపుడు పైన పేర్కొన్న వ్యక్తులందరూ ఆ చోద్యం చూస్తూ ఆనందిస్తున్నారని నేనెక్కడా రాయలేదు.
ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరనే presumption చేసుకోలేరా? ప్రమాదం జరగడానికి నిమిషం కూడా అవసరం లేదు.
కథాశీర్షిక చూస్తూనే ఆవేశానికి లోనయ్యి కథ చదవడం మొదలుబెడితే ప్రతిస్పందన బదులు ఇలాంటి అతి స్పందనలే కలుగుతై.
హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు, కుంటలు కబ్జాకి గురయ్యాయో ఈ విమర్శకుడికి తెలుసా? ఇలాంటి ఘోరాలు జరగడానికి ప్రధాన కారణం పాలకుల, అధికారుల నిర్లక్ష్యం, అవినీతి, ప్రజల దురాశే. అది ఎత్తి చూపడం రచయిత dishonest sadistic writing for habituated masochistic babaes in woods అవుతుందా?
వారి వ్యాఖ్య: ఎప్పుడో పాత వార్ గురించి, కీబోర్డ్ మీద వీళ్ళేడిసే లోపల కొత్త వార్ రానే వచ్చె. ఈ రచయితల వ్యర్థపు వెనకబడిన ఏదుపులెందుకు? ఎందుకు వయెలెన్స్, ఏడుపుల మీదే దృష్టి?
నా సమాధానం: అంటే యుద్ధాల గురించి, సమాజంలో జరిగే అన్యాయాల గురించి, హింస గురించి….. మళ్ళీ మళ్ళీ అవి జరుగుతూనే ఉంటాయి కనుక ఎవరూ రాయకూడదన్న మాట. ఆ సంఘటనల గురించి ఎక్కడా మాట్లాడ కుండా సెన్సార్ చేసేస్తారేమో ఈ పాఠకుడు.
వారి వ్యాఖ్య: అసలు ఈ రచయితలు ఏ కార్యాలయం లోనూ బాధ్యతాయుతమైన పనులు చేస్తుండక పోవచ్చు.
నా సమాధానం: నేను నలభై సంవత్సరాలు ఎంత బాధ్యతాయుతంగా ఏ కార్యాలయంలో పని చేసానో నేను ఇక్కడ చెప్పను. కావాలంటే ఒక రెండు వందల మంది ఫోన్ నంబర్స్ ఇవ్వగలను ఎవరేనా చెక్ చెయ్యదలచుకుంటే. కానీ, ఇవ్వను. ఇలాంటి అసందర్భ ప్రేలాపనలు చేసేవాళ్ళకి నేనేంటో రుజువు చేసుకోవలసిన అవసరం లేదు కాబట్టి.
ఈ విమర్శకుడు నేను ఎలాంటి వాడినో చాలా ఊహించి చెప్పారు కదా. వీరి గురించి నా ఊహా ఏంటో చెబుతాను. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే మనం వెళ్ళి కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తాం. పాపం నా పాఠకులు (వీరి దృష్టిలో locusts) ఆ తరహా మనుషులు. బహుశా వీరు చచ్చిపోయినవాడిదే తప్పు అని వాళ్ళని దెప్పి పొడుస్తారేమో.
Web magazine లో ఇదే నా మొదటి రచన. అందువల్ల పాఠకుల అభినందల్ని రచయిత “పనిగట్టుకు వచ్చి” స్వీకరించకూడదనే etiquette ఏదైనా ఉందేమో నాకు తెలియదు. విజ్ఞులెవరేనా చెబితే నేర్చుకుంటాను.
రచయిత పాత్రల్ని చంపడం అటుంచి, ఇలాంటి విమర్శకులు రచయితల్ని చంపకుండా moderate చెయ్యాల్సిన బాధ్యత సంపాదకుల మీద ఉండాలి కదా.
చాలా ఆలస్యంగా చదవడం జరిగింది. వ్యాసం చాలా బాగుంది. అప్పట్లో వారు విజయచిత్ర పత్రికలో నిర్వహించిన ఒకానొక పోటీలో నాకు బహుమతిగా మీరు ప్రస్తావించిన “జనార్ధనాష్టకం” అనే ఒక గొప్ప పుస్తకం పంపించారు. ఇప్పటికీ అది నా దగ్గిర భద్రంగా ఉంది. (45+ క్రితం) వారు గుంటూరు కొన్నిసార్లు వచ్చారు గాని చూడడం కుదరలేదు. నా బోటివాళ్ళు వారిని కలవడం కష్టం. చుట్టూ ఉన్నవారు కలవనీయరు. అది సహజం.
ఎన్ని తాత్విక భౌతిక ప్రశ్నలు రేకెత్తించాయో కథలోని వివిధ సన్నివేశాలు! కథ వాడిదే అయినా చదివే ప్రతి వారినీ రకరకాలుగా నిలదీస్తాయి వాడు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్లు! సాహిత్యం, రచయితలు కేవలం సింబాలిక్ రెప్రెజెంటేషన్ మాత్రమే అనిపించాయి. ఈ సింబల్స్ దేనికైనా, ఎవరికైనా ఆపాదించుకోవచ్చు. మంచి కథ భాస్కర్ గారు.
ఎంత హాయిగా సాగిపోయాయీ ఈ స్వచ్ఛమైన తరగతి గది కథలు! ముచ్చటగా మూడిటితో ముగిసిపోయాయి అని బెంగగా ఉంది. ఇలాంటి కథలు మీ ఊహల ఊటలా నెలనెలా కొన్ని నెలలు రాయమని మనవి.
హైదరాబాద్‌లో జరిగిన ఒక వాస్తవ విషాద ఘటనకి కథారూపం ఇచ్చాను. పనికట్టుకుని పాఠకుల్ని మెప్పించడానికి పాత్రల్ని హత్య చేసే రచయితని కాను. నిలవ ఉన్న వర్షపు నీటిలో పాప కొట్టుకుపోతుండడాన్ని కథ చెబుతున్న పాత్ర లేదా మూగి ఉన్న జనం చోద్యం చూస్తున్నారని మీరు ఊహించితే అది నా తప్పు కాదు.
రచయిత పాఠకుల అభినందల్ని స్వీకరించడం… ఇదీ నేరమే?
మీ వ్యాఖ్య: రచనారంగంలో కొన్ని రచనలలో కేవలం రచయిత prompted death and disasters ఉంటయ్యి.
నా సమాధానం: అవును. లోకమంతా సజావుగానే సాగిపోతోంది. జరుగుతున్న ఘోరాలన్నీ పాఠకుల పొగడ్తల కోసం రచయితలు సృష్టించేవే.
I say to myself, what’s the big deal! ఇతర పాఠకుల్ని శలభాలుగా చూసే, రంధ్రాన్వేషణ చేసే విమర్శకులకి నేనూ దూరంగా ఉంటాను.
1.నేను నిజంగా రచయితనేనా? నిజం – ఎవరికైనా (రచయితకి, రచయిత కానివానికి, రచయితగా చెలామణీ అవుతున్నవానికీ) ఇప్పటి లైకులూ షేర్లూ ప్రపంచంలో – ఎలా తెలుస్తుంది?
1అ. ఇందులో పేరొందిన పత్రికల పేరొందిన సంపాదకుల పాత్ర?
2.పాఠకుడిని ఆపకుండా చదివించగలగాలి: ఎటువంటి పాఠకుడిని?
“Beauty is something wonderful and strange that the artist fashions out of the chaos of the world in the torment of his soul. And when he has made it, it is not given to all to know it. To recognize it you must repeat the adventure of the artist. It is a melody that he sings to you, and to hear it again in your own heart you want knowledge and sensitiveness and imagination.” ― W. Somerset Maugham.
మంచి రచయితలు లేకపోయి ఉండొచ్చు. ఐతే రచనలకు ఆదరణ తగ్గడానికి ముఖ్య కారణం జనాల అభిరుచిలో మార్పేనని నా అభిప్రాయం. మేటి రచయిత యండమూరిగారి కొత్త నవలలు మనకి మునుపటి స్థాయిలో వినబడుతున్నాయా? తెలుగు రచనలకి వచ్చే ముఖ్య పురస్కారాలేమిటి? పోయినేడు అకాడమీ పురస్కారం అందుకున్న రచన ఏది? నాణ్యమైన చలనచిత్రాలు తీయగలుగుతున్న సమాజంలో నిజంగా మంచి రచయితలు లేరు అంటారా? పోనీ నాటి మేటి రచనలను ఈతరంలో ఎవరూ చదువుతున్నట్లు కనబడదే? ఐతే పాఠకులను నిందించే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే వాళ్ళెవరికీ బాకీ పడలేదు. నచ్చితే చదువుతారు. లేదంటే లేదు. వారికి (అంటే నాలాంటి వారికి) ఎలా దగ్గరవ్వాలో రచయితలు ఆలోచించాలి. బహుశా ఎఫ్.ఎమ్. రేడియో తరహాలో కొత్తగా ఏమైనా చెయ్యాలేమో.
ఆధునిక యుగంలో హాస్యం గురించి అశోక్ రెడ్డి కందాడి అభిప్రాయం:
02/04/2023 2:33 am
చాలా ఆసక్తిగా మీ article ఆసాంతం చదివి, ఆనందించాను. ధన్యవాదాలు.
పరిచయం: డాక్టర్ కథ గురించి Supraja అభిప్రాయం:
02/03/2023 10:31 pm
just ordered..thank you so much for bringing this book in to light
పరిచయం: డాక్టర్ కథ గురించి Supraja అభిప్రాయం:
02/03/2023 10:29 pm
ఇప్పుడే ఆర్డర్ చేశాను… థేంక్ యు సో మచ్
విషాద నగరం గురించి అనిసెట్టి శ్రీధర్ అభిప్రాయం:
02/03/2023 4:59 pm
లైలా గారి విమర్శపై నా అభ్యంతరాలు మరికొన్ని:
వారి వ్యాఖ్య: ఈ మినీ కథ చెపుతున్నతనికి అన్నీ ఫ్రీగా రావాలి. రానందున కొంత మంట. ఆకాశం, వెన్నెల, ఎదురింటి అందమైన పాపాయి ఫ్రీగా వచ్చినందున అతని కిష్టం. వీటన్నిటిలో రచయిత ఉష్ కాకీ అని మాయం చెయ్యగలిగిందెవరు? …..
నా సమాధానం: ఇల్లు ఫ్రీగా రానందున మంట అని అసందర్భ ప్రేలాపన ఎందుకు? దిగువ మధ్య తరగతి ఉండే కొన్ని రెండు గదుల ఇళ్ళల్లో అద్దె కట్టినా గాలీ, వెలుతురూ చొరబడదు. ఆకాశమూ కనిపించదు. అందువల్ల అవి దొరకడం అదృష్టంగా బావిస్తాడు కథకుడు. మీరైతే వాటికి కూడా అద్దె వసూలు చేస్తారేమో?
వారి వ్యాఖ్య: పాప తలిదండ్రులకి కానీ, ఇరుగుపొరుగుల వారికి కానీ, ఫ్రీగా పైనెంతో ఎత్తు నుంచి పాపాయిని చూసి ఆనందించే కథకుడి మీద కాని, ఈ పాపాయిని రక్షించే బాధ్యత లేదు.
నా సమాధానం: తేలికపాటి వర్షం పడినపుడు పిల్లలు కాగితపు పడవలు వేసి ఆనందించడం, వాళ్ళని చూసి పెద్దవాళ్ళు ముచ్చటపడడం సహజం. ఈ కథలో జరిగింది అదే. భారీ వర్షం పడి నీరు పారకుండా stagnate అవడానికి ఆక్రమణలు, ప్రజల దురాశ కారణం. అదే కథలో చెప్పాను. పాపాయికి ప్రమాదం జరుగుతూ ఉన్నపుడు పైన పేర్కొన్న వ్యక్తులందరూ ఆ చోద్యం చూస్తూ ఆనందిస్తున్నారని నేనెక్కడా రాయలేదు.
ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరనే presumption చేసుకోలేరా? ప్రమాదం జరగడానికి నిమిషం కూడా అవసరం లేదు.
కథాశీర్షిక చూస్తూనే ఆవేశానికి లోనయ్యి కథ చదవడం మొదలుబెడితే ప్రతిస్పందన బదులు ఇలాంటి అతి స్పందనలే కలుగుతై.
హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు, కుంటలు కబ్జాకి గురయ్యాయో ఈ విమర్శకుడికి తెలుసా? ఇలాంటి ఘోరాలు జరగడానికి ప్రధాన కారణం పాలకుల, అధికారుల నిర్లక్ష్యం, అవినీతి, ప్రజల దురాశే. అది ఎత్తి చూపడం రచయిత dishonest sadistic writing for habituated masochistic babaes in woods అవుతుందా?
వారి వ్యాఖ్య: ఎప్పుడో పాత వార్ గురించి, కీబోర్డ్ మీద వీళ్ళేడిసే లోపల కొత్త వార్ రానే వచ్చె. ఈ రచయితల వ్యర్థపు వెనకబడిన ఏదుపులెందుకు? ఎందుకు వయెలెన్స్, ఏడుపుల మీదే దృష్టి?
నా సమాధానం: అంటే యుద్ధాల గురించి, సమాజంలో జరిగే అన్యాయాల గురించి, హింస గురించి….. మళ్ళీ మళ్ళీ అవి జరుగుతూనే ఉంటాయి కనుక ఎవరూ రాయకూడదన్న మాట. ఆ సంఘటనల గురించి ఎక్కడా మాట్లాడ కుండా సెన్సార్ చేసేస్తారేమో ఈ పాఠకుడు.
వారి వ్యాఖ్య: అసలు ఈ రచయితలు ఏ కార్యాలయం లోనూ బాధ్యతాయుతమైన పనులు చేస్తుండక పోవచ్చు.
నా సమాధానం: నేను నలభై సంవత్సరాలు ఎంత బాధ్యతాయుతంగా ఏ కార్యాలయంలో పని చేసానో నేను ఇక్కడ చెప్పను. కావాలంటే ఒక రెండు వందల మంది ఫోన్ నంబర్స్ ఇవ్వగలను ఎవరేనా చెక్ చెయ్యదలచుకుంటే. కానీ, ఇవ్వను. ఇలాంటి అసందర్భ ప్రేలాపనలు చేసేవాళ్ళకి నేనేంటో రుజువు చేసుకోవలసిన అవసరం లేదు కాబట్టి.
ఈ విమర్శకుడు నేను ఎలాంటి వాడినో చాలా ఊహించి చెప్పారు కదా. వీరి గురించి నా ఊహా ఏంటో చెబుతాను. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే మనం వెళ్ళి కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తాం. పాపం నా పాఠకులు (వీరి దృష్టిలో locusts) ఆ తరహా మనుషులు. బహుశా వీరు చచ్చిపోయినవాడిదే తప్పు అని వాళ్ళని దెప్పి పొడుస్తారేమో.
Web magazine లో ఇదే నా మొదటి రచన. అందువల్ల పాఠకుల అభినందల్ని రచయిత “పనిగట్టుకు వచ్చి” స్వీకరించకూడదనే etiquette ఏదైనా ఉందేమో నాకు తెలియదు. విజ్ఞులెవరేనా చెబితే నేర్చుకుంటాను.
రచయిత పాత్రల్ని చంపడం అటుంచి, ఇలాంటి విమర్శకులు రచయితల్ని చంపకుండా moderate చెయ్యాల్సిన బాధ్యత సంపాదకుల మీద ఉండాలి కదా.
– శ్రీధర్
వి. ఎ. కె. అంటే? గురించి Krishna Rao Jallipalli అభిప్రాయం:
02/03/2023 7:06 am
చాలా ఆలస్యంగా చదవడం జరిగింది. వ్యాసం చాలా బాగుంది. అప్పట్లో వారు విజయచిత్ర పత్రికలో నిర్వహించిన ఒకానొక పోటీలో నాకు బహుమతిగా మీరు ప్రస్తావించిన “జనార్ధనాష్టకం” అనే ఒక గొప్ప పుస్తకం పంపించారు. ఇప్పటికీ అది నా దగ్గిర భద్రంగా ఉంది. (45+ క్రితం) వారు గుంటూరు కొన్నిసార్లు వచ్చారు గాని చూడడం కుదరలేదు. నా బోటివాళ్ళు వారిని కలవడం కష్టం. చుట్టూ ఉన్నవారు కలవనీయరు. అది సహజం.
వాడి కథ గురించి అవినేని భాస్కర్ అభిప్రాయం:
02/03/2023 3:52 am
ఎన్ని తాత్విక భౌతిక ప్రశ్నలు రేకెత్తించాయో కథలోని వివిధ సన్నివేశాలు! కథ వాడిదే అయినా చదివే ప్రతి వారినీ రకరకాలుగా నిలదీస్తాయి వాడు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్లు! సాహిత్యం, రచయితలు కేవలం సింబాలిక్ రెప్రెజెంటేషన్ మాత్రమే అనిపించాయి. ఈ సింబల్స్ దేనికైనా, ఎవరికైనా ఆపాదించుకోవచ్చు. మంచి కథ భాస్కర్ గారు.
తరగతి గది కథలు గురించి అవినేని భాస్కర్ అభిప్రాయం:
02/02/2023 11:08 am
ఎంత హాయిగా సాగిపోయాయీ ఈ స్వచ్ఛమైన తరగతి గది కథలు! ముచ్చటగా మూడిటితో ముగిసిపోయాయి అని బెంగగా ఉంది. ఇలాంటి కథలు మీ ఊహల ఊటలా నెలనెలా కొన్ని నెలలు రాయమని మనవి.
విషాద నగరం గురించి అనిసెట్టి శ్రీధర్ అభిప్రాయం:
02/02/2023 4:34 am
లైలా గారి విమర్శకి నా స్పందన:
హైదరాబాద్‌లో జరిగిన ఒక వాస్తవ విషాద ఘటనకి కథారూపం ఇచ్చాను. పనికట్టుకుని పాఠకుల్ని మెప్పించడానికి పాత్రల్ని హత్య చేసే రచయితని కాను. నిలవ ఉన్న వర్షపు నీటిలో పాప కొట్టుకుపోతుండడాన్ని కథ చెబుతున్న పాత్ర లేదా మూగి ఉన్న జనం చోద్యం చూస్తున్నారని మీరు ఊహించితే అది నా తప్పు కాదు.
రచయిత పాఠకుల అభినందల్ని స్వీకరించడం… ఇదీ నేరమే?
మీ వ్యాఖ్య: రచనారంగంలో కొన్ని రచనలలో కేవలం రచయిత prompted death and disasters ఉంటయ్యి.
నా సమాధానం: అవును. లోకమంతా సజావుగానే సాగిపోతోంది. జరుగుతున్న ఘోరాలన్నీ పాఠకుల పొగడ్తల కోసం రచయితలు సృష్టించేవే.
I say to myself, what’s the big deal! ఇతర పాఠకుల్ని శలభాలుగా చూసే, రంధ్రాన్వేషణ చేసే విమర్శకులకి నేనూ దూరంగా ఉంటాను.
-Sridhar
ఫిబ్రవరి 2023 గురించి తః తః అభిప్రాయం:
02/01/2023 10:53 am
1.నేను నిజంగా రచయితనేనా? నిజం – ఎవరికైనా (రచయితకి, రచయిత కానివానికి, రచయితగా చెలామణీ అవుతున్నవానికీ) ఇప్పటి లైకులూ షేర్లూ ప్రపంచంలో – ఎలా తెలుస్తుంది?
1అ. ఇందులో పేరొందిన పత్రికల పేరొందిన సంపాదకుల పాత్ర?
2.పాఠకుడిని ఆపకుండా చదివించగలగాలి: ఎటువంటి పాఠకుడిని?
“Beauty is something wonderful and strange that the artist fashions out of the chaos of the world in the torment of his soul. And when he has made it, it is not given to all to know it. To recognize it you must repeat the adventure of the artist. It is a melody that he sings to you, and to hear it again in your own heart you want knowledge and sensitiveness and imagination.” ― W. Somerset Maugham.
నమస్కారాలతో -తః తః
ఫిబ్రవరి 2023 గురించి పవన్ కుమార్ అభిప్రాయం:
02/01/2023 10:35 am