పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16452

  1. మనోధర్మపరాగం: ఒక మంచి నవల గురించి Lyla yerneni అభిప్రాయం:

    03/16/2023 3:04 pm

    చాలా గుంభనగా ఉంది సమీక్ష. వెనకటికి బెజవాడలో కమ్యూనిస్టుల మీటింగ్ లా.
    సంగీతం పుస్తకమేమో అని చదివాను. కాదనుకుంటా. ఐడెంటిటీ, జెండర్, రేస్ పాలిటిక్స్ పీకి పాకం పెట్టే పిచ్చ బోర్ చరిత్ర ఐ ఉండాలి. ‘దేవదాసీలు’ ఇక లేరు కదా. లేని వాళ్లకు ఇప్పుడు ఈ మగ రచయిత ‘వాయిస్’ ఇచ్చేదేముంది!

    అసలుకు జర్నలిస్టు రచయితలకు, ఘోస్ట్ ఆటోబయోగ్రఫర్లకు తమ జీవితంలోని నిజవిషయాలు స్త్రీలు చెప్పరు. మగవాళ్లూ చెప్పరు. ఇప్పటికీ మనుషులు వాళ్లంతట వాళ్లే నిజం చెప్పుకుని ఏడ్చేది -డాక్టర్లకీ, ప్రీస్ట్ లకీ, మంగలాళ్లకీ, బార్టెండర్లకీ. ఈ ప్రొఫెషనల్స్ వీరెవరికీ ‘స్పేర్’ లాటి చెత్త పుస్తకం కొనుక్కుని కుళ్లుమోతు ‘హేరీ’ టోజర్ లెంగ్త్, హెల్త్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఉండదు.

    ఇంతకీ, నవలలో మనోధర్మ సంగీతం, కర్ణాటక సంగీత ప్రస్తావనలు, సంగీత చర్చలు గల పేజీలు ఏమైనా ఉన్నవా? ఉంటే గాని తెలుపగలరా? సమీక్షకులకు తెలియకపోతే మరెవరైనా చెప్పినా సరే. నవల వెనుకఅట్ట మీద ప్రశంసలు రాసినవారైనా దయతో చెప్పినా సరే.

    సంగీతం మీద నేను ఎంచుకుని కొనుక్కుని చదువుతున్నవి Debussy by Stephen Walsh, Wagnerism by Alex Ross. జీవిత చరిత్ర రాస్తున్నట్లే ఉంటారు కాని, వీళ్లు రాసేది మ్యూజిక్, మ్యూజిక్ చరిత్ర గురించే. ఇవి కాక Fundamentals of Musical composition by Schoenberg, Guide to the practical study of harmony by Tchaikovsky కొనుక్కున్నాను. ‘ఈమాట’ పత్రికలో ప్రచురించే జె. కె. మోహనరావు ఛందస్సుపై వ్యాసాలు కొంత ఇలాటివే. ఇవి చదవటం అవ్వదు.

    -Lyla

  2. లీడర్ గురించి Ramg అభిప్రాయం:

    03/15/2023 11:58 pm

    మాస్టారు సంగతి కాదు కానీ చిన్నప్పుడు మూడో తరగతి చదువుతున్నపుడు నాకు ప్రతిమ టీచర్ ఉండేవారు. ప్రతిమ టీచర్ మా స్కూల్ లోనే సొంటిపిక్కలు తీయడం లో మంచి ఎక్స్పర్ట్. మేడం సొంటిపిక్కలు తీశారంటే ఎవరి నిక్కరైనా తడవాల్సిందే. నా నిక్కర్ ప్రతిమ మేడం చేతిలో ఎన్నో సార్లు తడిసింది. ప్రతి రోజు టేబుల్స్ అడిగేవారు. నేను ప్రతి రోజు తప్పులు చెప్పేవాణ్ణి. మేడం తన ఎడమ చేయి ఎక్కువగా వాడేవారు. నా నిక్కర్ పట్టుకుని దగ్గరకు లాగి తొడ మీద సొంటిపిక్క తీస్తే నేను ఎగిరి ఒంటి కాలు డాన్స్ వేయడం ఆ తర్వాత నిక్కర్ తడవడం ప్రతిరోజూ అలవాటు అయ్ పోయింది నాకు, నేను ఏడవకుండా నిక్కర్ తడవకుండా ప్రతిమ మేడం సొంటిపిక్క వదిలేవారు కాదు. ఇలా జరిగేది నా స్కూల్ లైఫ్

  3. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి posam ramakrishna అభిప్రాయం:

    03/13/2023 8:46 pm

    అమోఘం

  4. స్థితప్రజ్ఞతా వాదం: వర్తమాన సమస్యలకి ప్రాచీన పరిష్కారం గురించి Sivaramkrishna, chillara అభిప్రాయం:

    03/07/2023 4:42 am

    Nice article. Recently I have gone through some Meditations by Marcus Aurelius, easily understood and inspired.

    Thanks

    SRK. Chillara

  5. వంశానికి ఒక్కడు గురించి కల్యాణి నీలారంభం అభిప్రాయం:

    03/04/2023 9:25 pm

    కథ ఇప్పుడే చదివాను సుజాతా. అనువాదిత కథ అనువాదం లాగానే వుండాలి, అలాగే వుంది. మూల రచయిత సంబంధాలలో వచ్చే ఘర్షణ ఎలా ఒక మనిషి రూపురేఖలు మార్చేస్తుందో చాలా బాగా చూపారు. నాకు తనదాకా వస్తే … … సామెత గుర్తొచ్చింది. గుడ్ జాబ్ 👍

  6. ఊహల ఊట 22 గురించి Aruna అభిప్రాయం:

    03/04/2023 3:04 am

    చిన్నప్పుడు మా నాన్నగారు చేసినవి, దీపావళి గుర్తుకొచ్చింది.

  7. బదిలీ గురించి S A RAHMAN అభిప్రాయం:

    03/04/2023 2:52 am

    బదిలీ చాలా బాగుంది. మంచి రచన అందించినందుకు రచయిత్రిగారికి ధన్యవాదములు.
    ఎస్.ఎ.రహమాన్.

  8. ఆర్. కె. లక్ష్మణ్ కథ – నా స్వస్తివాక్యం గురించి Aruna అభిప్రాయం:

    03/04/2023 2:13 am

    హమ్మయ్య బుక్ వస్తోంది అన్నారు. వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటాను. Can you plz tell me where I can get them? any online? Or when I come to India I will try to get a copy.
    Thank you Anwar garu.

  9. వంశానికి ఒక్కడు గురించి సత్యవతి అభిప్రాయం:

    03/03/2023 12:13 pm

    అనువాదం చాలా బాగుంది. మంచి తెలుగు.

  10. వంశానికి ఒక్కడు గురించి j Surya Prakash అభిప్రాయం:

    03/03/2023 9:23 am

    అద్బుతమైన కథ. చాలా బాగా ట్రాన్సలేట్ చేసారు. ఇంగ్లీష్ పేర్లు, ప్రదేశాలు తప్పిస్తే తెలుగు కథ చదువుతున్నట్లే అనిపించింది. నాకు మా నాన్నగారు గుర్తు వచ్చారు.