పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16439

  1. సీతా-రామా గురించి Kishore అభిప్రాయం:

    03/05/2007 3:15 am

    సీతా రామా లో కామా(,)లెక్కువయ్యాయి. ఒక్కో వాక్యాన్ని అంత పెద్దదిగా వ్రాస్తే భావం పట్టు కోల్పోయినట్లుంది..

  2. ఇద్దరు దుర్మార్గులు గురించి Kishore అభిప్రాయం:

    03/05/2007 1:15 am

    భాగుంది. ఇంతకీ ఈ కథకి “ఇద్దరు దుర్మార్గులు” అనే పేరు ఎందుకు పెట్టారు?

  3. ఓ.పీ.నయ్యర్‌ గురించి cbrao అభిప్రాయం:

    03/04/2007 10:35 pm

    ‘జాయియే ఆప్ కహా జాయేంగే, యె నజర్ లౌట్ కె ఫిర్ ఆయేగీ ‘ – ఈ పాట కూడా మీరు ఉదహరించిన పాటలకు కలుపుకో తగ్గది. ఆలోచించిన కొద్దీ ఎన్నో మధుర గీతాలు మదిలో ప్రత్యక్షమవుతాయి. ఏక్‌ ముసాఫిర్‌ ఏక్‌ హసీనా చిత్రంలోని ‘ఆప్‌ యూఁహీ అగర్’ పాట పాడితే నిజంగానే మనకు నచ్చిన అమ్మాయి మనకు దగ్గరయ్యేంత మంత్రం ఉందా పాటలో. నయ్యర్ గురించి మీరు రాసినవి తెలిసినవే అయినా వ్యాసాన్ని ఎక బిగిని చదివించే శైలి ఆకట్టుకుంది. ఎక్కువమందికి తెలియని పలు విషయాలు చెప్పారు. తెలుగు వికి లో ఉంచటానికి కావలసిన అర్హతలున్న వ్యాసం ఇది. నయ్యర్ గురించి రాసి ఆప్ జీత్ లియా హమారా దిల్.

  4. “పల్లెలో మా పాత ఇల్లు”:ఇస్మాయిల్ గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    03/04/2007 9:18 pm

    భావ కవిత్వం రాసే ప్రతీ కవీ, రాద్దమనుకొనే వర్థమాన కవులు తప్పక చదవాల్సిన పుస్తకం. కేవలం వస్తు విమర్శ లేదా సమీక్ష తప్ప ఎక్కడా అతి స్తుతి లేని సమీక్ష ఇది. ఆకులు, పూలు, చెట్ల మీదే కవిత్వం రాసే కవులు
    చదవాల్సిన పుస్తకం. సమీక్ష చదివితే ఖచ్చితంగా పుస్తకం చదవాలి అన్నట్లుగా రాసారు.

  5. యథార్థ చక్రం -6 గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    03/04/2007 9:10 pm

    వేమూరి గారు,

    మీకు నచ్చినందుకు సంతోషం.
    బౌద్ధం ఎలా మారిందో రెండు వాక్యాలు చెప్పానంతే!
    సౌందరనందం రాసిన అశ్వఘోషుడు కాలానికే మహాయానం వచ్చేసింది.

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  6. సీతా-రామా గురించి Sowmya అభిప్రాయం:

    03/04/2007 9:08 pm

    ఈ కథ బాగుంది కానీ, ఇందులో English వాడుక కాస్త ఎక్కువైంది అనిపించింది. ఒక భాష నుంచి ఇంకో భాష లోకి ఒక చిన్న కథలో ఇన్ని సార్లు switch అవ్వాల్సి రావడం చాలా చిరాగ్గా అనిపించింది. అదే కనుక లేకుండా ఉండి ఉంటే ఈ కథ ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం.

  7. ది బీచ్ గురించి Sowmya అభిప్రాయం:

    03/04/2007 8:57 pm

    బస్సెడు అన్న పదం నేను సృష్టించలేదండి. చిన్నప్పుడు ఏదో కార్టూన్ పుస్తకం లో చూసాను. కథ కి పేరు పెడుతున్నప్పుడు ఆ విషయం నా దృష్టి లో లేదు అనుకోండి. అయినా మీ ఈ వ్యాఖ్య తో నేను clarify చేయడం అవసరం అనిపించి చెబుతున్నా.

  8. చాదస్తం గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:

    03/04/2007 6:30 pm

    ఆసక్తి కరమైన కధనం తో చక్కగా సాగిన కధ.
    ఆధునికమైన,విశాల భావాలు కలిగిన ప్రధాన పాత్ర చిత్రణ చాలా బావుంది.అయితే ఈ పాత్ర ఔచిత్యం చివరలో కొద్దిగా దెబ్బ తిన్నదేమో అనిపిస్తుంది. మొదట నుంచీ చాలా openminded గా అనిపించిన ఈ పాత్ర కేవలం తన వ్యక్తిగత అభిప్రాయాలకు విరుద్ధంగా(అవి ఉన్నతమైన అభిప్రాయాలైనప్పటికీ) రాఘవ వివాహం చేసుకొంటం అతని “వ్యక్తిగతం” అనే విషయాన్ని గమనించకపోవటం ఆశ్చర్యం గా ఉంది. అతని అభిప్రాయాల తో తను ఏకీభవించకపోయినా వారి స్నేహాన్ని పురస్కరించుకుని అతని వివాహానికి వెళ్ళక పోవటం కొద్దిగా “చాదస్తం” గానే కాక మొదట నుంచీ ఉన్న పాత్ర చిత్రణ కి contradictory గా ఉందేమోనని నా వినమ్ర అభిప్రాయం.

  9. యథార్థ చక్రం -6 గురించి Rao Vemuri అభిప్రాయం:

    03/04/2007 5:16 pm

    అంతా ఇంత బాగా తెలుగులో రాసి చిట్టచివర మళ్ళా హీనయాన బుద్ధిజం ఏమిటండీ! నా తెలుగు సోది నాది. మరోలా అనుకోకండి.

  10. భయం! గురించి Rohiniprasad అభిప్రాయం:

    03/04/2007 4:38 pm

    అమెరికా వంటి దేశాల్లో భౌగోళికంగా ఎంతో వైవిధ్యం ఉన్న ప్రాంతాలున్నాయి కనక వాటిని చూసినవారూ, అక్కడ కొంతకాలం ఉండి ఆ అనుభవాలని పంచుకోగలిగినవారూ తెలుగులో రాయగలిగితే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథలో “తరవా తేమవుతుంది?” అనే సస్పెన్స్ మాత్రమే కాక ఇటువంటి రచనల్లో వర్ణనలు కూడా ఆకర్షణీయం అవుతాయి. రచయితకు అభినందనలు.