పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16439

  1. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    03/08/2007 10:59 am

    వ్యాస కర్త గారి వివరణ కాస్త దురుసుగా ఉన్నట్లుగా అనిపించిందని నా అభిప్రాయం. ఏ వ్యాసమైనా, కథ అయినా, కవిత అయినా విమర్శ ఉన్నప్పుడే దాని బాగోగులు తేలేది! రచయితలకి తమ తమ రచనలనీ, అభిప్రాయాలనీ, విశ్లేషణనీ, ప్రజల్లోకి తీసుకెళ్ళే స్వేచ్ఛ ఎలా ఉంటుందో, పాఠకులకీ విమర్శంచే స్వాతంత్ర్యం ఉంటుది కూడా! ఈ వ్యాసం బాగోలేదని ఎవరూ ఉటంకించ లేదు. అక్కడక్కడ కాస్త తప్పులు దొర్లాయంతే ! దానికే సవాళ్ళు చేస్తే ఎవరూ ఏమీ చేయలేరు.

  2. భయం! గురించి కొత్తపాళీ అభిప్రాయం:

    03/08/2007 9:15 am

    అద్భుతం!
    తెలుగులో ఇట్లాంటి ఇతివృత్తంతో కథ నేను చదవలేదు. ఏవో కొన్ని వేట, అడవి కథలు ఉన్నాయి గానీ ఈ కథలోని “వాతావరణమే” వేరు.
    మాస్టారూ, ఆ కాస్త ఓపికా చేసుకుని నవలే రాయండి.
    కొన్ని చోట్ల ఫుట్ నోట్సు కావాలి. ఉదా: చత్వారీ వాక్పధాలు
    చాలా వర్ణనలు బావున్నాయి, కళ్ళకి కట్టినట్టు. కానీ అక్కడక్కడా కొన్ని వాక్యాలు ముందు ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో తర్జుమా చేసినట్టు వంకరగా అనిపిస్తున్నాయి.
    ఎప్పుడో చాన్నాళ్ళక్రితం ఒక నవల చదివాను. HG Wells రాసింది, పేరు Marriage అనుకుంటా.
    అందులో ఒక యువ దంపతులు తమ వివాహాన్ని పటిష్ఠం చేసుకోవటానికి ఇలాగే గ్రీన్లాండ్ టండ్రాలో మూణ్ణేల్లో ఆర్నెల్లో ఉంటారు. విచిత్రమైన కథ.
    మీ అభయారణ్యం లింకు పనిచెయ్యడం లేదు. ఈ కథ ఎక్కడ దొరుకుతుంది?

  3. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    03/08/2007 9:03 am

    సర్వజ్ఞత ఎవరికుంటుంది? ఎవరికీ వుండదు. అందువలన తప్పులుండతం ఎంత సహజవో, తప్పులెన్నటం అంత సహజవే. మన ఆలోచనలు మనలో వున్నంతవరకూ మనవే, ఎవరికీ విమర్శంచే హక్కు లేదు, కానీ అవే బయటకొస్తే, విన్న వాళ్ళకీ చదివిన వాళ్ళకీ అందరికీ తప్పులెతికే హక్కుంది. అందువలన దాంట్లో బలాబలాలు తేల్చుకోవటం ఎందుకండీ? మీరు వ్రాశారు, నచ్చిన మాలాటి నలుగురం చదివి, ఆహా, వోహొ అనుకున్నాం. నచ్చని నలుగురు, ఏవి నచ్చలేదో చెప్పేరు, అంతే కదా, దానికే బాలా బలాలు తేల్చుకునే సవాళ్ళేందుకు సార్.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  4. పునశ్చరణం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    03/08/2007 8:44 am

    నిద్రపోతున్న నా కూతుర్ని చూస్తుంటే మళ్ళా, మళ్ళా చూడాలనిపిస్తుంది. నా చేతుల్లో వొదిగిపోయిన ఆ పిల్లేనా, ఈ రోజు నేనెత్తలేనంత ఎత్తుకి ఎదిగిపోయింది అనిపిస్తుంది. చెప్పలేని అధ్భుతవైన భావవొకటి మనసంతా విస్తరిస్తుంది. కాగితం మీద పరచుకున్న ఈ నల్లని నాలుగు మరకలు, మన మన్సులో పుట్టిన, మనలో భాగవే కదూ! మెదడులో వుక్కిరిబిక్కిరగా వున్న ఆ రసాయనిక సమీకరం విచ్చుకున్న రూపవేకదా మన కవితకానీ, కథ కానీ.

    చాలా అద్భుతంగా వుందండీ మీ కవిత వైదేహీ శశిధర్ గారు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  5. ఇద్దరు దుర్మార్గులు గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    03/08/2007 8:08 am

    కథ వ్రాసిన తీరు బాగుంది. కానీ కథలో వుండాల్సిన భావావేశం పూర్తిగా లుప్థమైపోయింది. గోపిక శరత్ గారి రాజ్యలక్శ్మినో, చంద్రముఖినో కొంచం అరువుతెచ్చుకున్నా, కనీసం వొక పాత్రగా, ఇష్టం, కష్టం, ప్రేమ మొదలైన వుద్వేగాలున్నటువంటి పాత్రగా, మనిషిగా కనిపిస్తుంది. కానీ మొహన్కవేవీ వున్నట్టు అనిపించదు. భార్యంటే గౌరవం, కించిత్ భయం, తప్ప ఎక్కడా ప్రేమ కనిపించదు. గోపిక పట్ల, ఆపుకోలేని నరాల వొత్తిడి తప్ప ఏ మాత్రం ప్రేమ కనిపించదు. గోపిక చెప్పిన నాలుగు మాటలతో మారిపోయిన మోహన్ పాత్ర, చాలా అసహజంగా, చాలా షాలో గా వుంది.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  6. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి ప్రసాద్ అభిప్రాయం:

    03/08/2007 7:52 am

    కనక దుర్గ వ్యాసాలు, ఇంకా నాలాంటి సాధారణ వ్యక్తి తర్కానికే నిలవని వ్యాసాలు ఎందుకు ప్రముఖ పత్రికలలో ప్రచురిస్తారో అర్థం కాదు.
    మొత్తానికి గడ్డి బాగా పెట్టారు. అలాంటి వాదన ఎక్కడ తలెత్తినా ఇదిగో అంటూ చూపించడానికి మంచి వ్యాసం రాశారు. ధన్య వాదాలు.
    వ్యాసానికి మరిన్ని హంగులు దిద్దిన, శోభ చేకూర్చిన ఈ అభిప్రాయమాలకు అభినందనలు.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  7. చాదస్తం గురించి JUBV PRASAD అభిప్రాయం:

    03/08/2007 7:35 am

    ఈ కధలోని పాత్రధారి ఆ పెళ్ళికి వెళ్ళకపోవడం, రాఘవ తన మాట వినలేదని కాదు. ఒకవేళ రాఘవ ఆవిడ మాటలు విని, సింపుల్ గా గుళ్ళో పెళ్ళి చేసుకున్నా, ఆవిడ వెళ్ళేది కాదు. ఎందుకంటే ఆవిడ నాస్త్రికురాలు. పైపెచ్చు సాంప్రదాయంగానూ, ఆడంబరంగానూ చేసుకునే పెళ్ళిళ్ళకి ఆవిడ వెళ్ళదు. ఆ విధంగా పెళ్ళి చేసుకునేది తన సొంత పిల్లలయినా సరే, ఆవిడ వెళ్ళదు. అదీ ఆవిడ సిద్ధాంతం. ఈ మాటలన్నిటికీ ఈ కధలోనే ఆధారాలున్నాయి. అయితే అటువంటి పెళ్ళిళ్ళు జరిగాక కూడా, ఆ మనుషులు మంచిగా వుంటే, ఆవిడ వారితో సత్సంబంధాలలోనే వుంటుంది. ఈ విషయాలన్నీ పాత్రధారి తన మాటల్లో అంటుంది కధలో.

    అప్పుచేసి పప్పు కూడు తినొద్దనడం, అనవసరంగా ఆడంబరానికి పోవద్దనడం సిద్ధాంతం కాదు, కామన్ సెన్సు. అయితే ఈ సమాజంలో వున్న “వ్యక్తిగత” స్వేచ్ఛ కొద్దీ, మనుషులు తమ కిష్టమైనట్టు చేస్తారు.

    పెళ్ళిలో భాగస్వామిని ఎన్నుకోవడం మాత్రమే పూర్తిగా “వ్యక్తిగతం”, మిగిలిన విషయాలన్నీ కాదు. పెళ్ళిలో చాలా విషయాలు, చాలా మంది మనుషులతో, అంటే, సమాజంతో, ముడి పడి వుంటాయి.

    ఆస్తికులు తమ సిద్ధాంతాల మీద ఎంత గట్టిగా వుంటారో, నాస్తికులు కూడా తమ సిద్ధాంతాల మీద అంత గట్టిగా వుంటారు (అర కొర నాస్తికులు కాదనుకోండీ).

    ఫ్రసాద్

  8. అంతరం గురించి Pardha అభిప్రాయం:

    03/08/2007 5:41 am

    Simply superb, touching the inner minds of people.
    As your previous stories this one also runs with humarous family atmosphere with reading of minds as under current.
    Ref: Black Cat

  9. రాఫెల్ గురించి chavakiran అభిప్రాయం:

    03/07/2007 10:11 pm

    చాలా బాగుంది

  10. సీతా-రామా గురించి lalitha అభిప్రాయం:

    03/07/2007 9:21 pm

    నాకెందుకో ఈ కథను ఇంతకంటే బాగా రాసే ప్రయత్నం చేసి ఉండాల్సింది అనిపించింది మీరు.
    వ్యాఖ్యలు చూసి కథ చదువుదామనిపించింది. తీరా మొదలు పెట్టాక ఎక్కువ చదవలేక పోయాను.
    అయినా వ్యాఖ్యలన్నీ బాగున్నాయి, మీరు ఇచ్చిన వివరణ కూడా చూసి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. మీరు చెప్పదల్చుకున్నది అర్థం అయ్యింది అనే అనుకుంటున్నాను. సున్నితమైన భావాల విలువ, అవి అనుభవించకుండా కాలం వృధా చేసుకున్నారన్న ఆవేదన అగుపించాయి కథలో. చివరిలో ఒక ఆశ కూడా తొంగి చూసినట్లనిపించింది.
    కానీ ఈ సున్నితమైన అంశాన్ని, జ్ఞాపకాల వల్ల కలిగిన ఉద్రేకాన్ని చిత్రీకరించిన తీరు కూడా సున్నితంగా ఉంటే బాగుండుననిపించింది.

    లలిత