పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16450

  1. నేత్రోన్మీలనం గురించి జిలేబి అభిప్రాయం:

    11/14/2023 5:55 am

    తెలుగు కథాలోకంలో చిరస్థాయిగా నిలిచి పోవు కథనుకున్నానే! అంతలోనే జెండా పై కపిరాజు పాడేశారా! ప్చ్! ఏమి చేయుట!

  2. నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి Gopikrishna Sharma Rampalli అభిప్రాయం:

    11/13/2023 11:57 pm

    చాలాబాగుంది, మీ అనువాదం చదివాక ఇంకొన్ని అనువాదాలు దొరుకుతాయా అని వెతుకుతూనే ఉన్నాను. ఒక వ్యక్తిగతమైన సందేహం. స్వరాలను ఎలా టైపు చేశారు? నాకు కొద్దిగా పని ఉంది. స్వరాలు ఎలా టైపు చెయ్యాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాను.

  3. ఏనుగు డాక్టర్ గురించి Ramesh Reddy g అభిప్రాయం:

    11/13/2023 9:16 am

    ఏక బిగిన చదవాలనిపించే గొప్ప రచన… హాట్సాఫ్ టు ది రైటర్! 🙏

  4. తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి hari.S.babu అభిప్రాయం:

    11/13/2023 8:23 am

    నేత్రోన్మీలనం లాంటి బూతుకధని ప్రచురించిన నీచత్వాన్ని సమర్దించుకోవటానికి ఇంకొక నీచత్వం అవసరమా ఈమాట వారికి – యూదుల్లో బైట చేసిన పెద్ద పాపాన్ని కడుక్కోవటానికి గుడి దగ్గిర చిన్న పాపం చెయ్యాలి అన్న నియమం ఉంటుంది లెండి 😄!

  5. ఏనుగు డాక్టర్ గురించి వేణుమాదవ్ అభిప్రాయం:

    11/13/2023 8:21 am

    అద్భుతమైన అనువాదం మంచి కథకు. కథ చదువుతున్నంత సేపూ అడవిలో ఉన్నట్లే ఉంది. అద్భుతః.🙏

  6. నవంబర్ 2023 గురించి Lyla yerneni అభిప్రాయం:

    11/11/2023 11:33 am

    “శోభిల్లు సప్తస్వర!”

    అను సరిగమపదని!
    రామ నామమింత చెవుల పడినంత
    ఒడలంతా వింత పులకింత
    రామ రామ యని రవంత తలచినంత
    మనసుకు మోదము మరింత
    రామ రామ రామా! అని పలికినంత
    కలిగెడి హాయి కొండంత
    అట్టి రామ నామ స్మరణము
    నిరతము సలిపెడి వారి
    భాగ్యము వర్ణించగా మేమెంత!
    అను సనిదపమగరి! మరిమరి

    -Lyla
    All the best to All! A Happy Festive Season! Keep Well!
    ¡Feliz 25 Cumpleaños! ¡Revista Eemaata!

  7. అలా నచ్చుతుంది గురించి Mani vadlamani అభిప్రాయం:

    11/10/2023 10:40 pm

    చాలా బాగా వ్రాశారు. AI మన జీవితాలలో అలా కలిసిపోతుంది. Her movie గుర్తొచ్చింది of course కథ వేరేలా ఉన్నా గానీ.

  8. నేత్రోన్మీలనం గురించి jeevan babu అభిప్రాయం:

    11/10/2023 9:37 pm

    “and the ever-absorbing- capacity of imbibing the opposing rudiments into Sanatana Dharma. We inherit the magnanimity and the openness to stomach theism and atheism”

    – This is the essence. Some one was claiming that Sitha Ammavaru never even knew how Ravana Looks. They have to read Sarga 21. She confronted him and threatened him with dire consequences.

  9. నేత్రోన్మీలనం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    11/10/2023 6:29 pm

    పరమరామభక్తులమని భావించుకునేవారిలో రాముడి మీద, రామాయణం మీద ఎంత తక్కువ భావం ఉందో చూస్తే ఆశ్చర్యం కలక్కమానదు. కేవలం ఎవరో రాసిన ఒక కథ చదివినంత మాత్రాన భక్తులంతా చెంపలేసుకుని ఇంతకాలం తాము పవిత్రుడిగా కొలిచిన రాముడు ఇంత తక్కువవాడా అనుకుని మానేస్తారని వారి భయంలా కనిపిస్తుంది. రామాయణం వేల ఏళ్లుగా వుంది, ఎందరో ఎన్నో విధాలుగా రాముణ్ణి, సీతని, ఇతర పాత్రల్ని, వారి సంబంధ బాంధవ్యాల్ని భావించారు, వివరించారు, వ్యాఖ్యానించారు. అందుకే మనకు ఎన్నో రామాయణాలున్నాయి. కొందరికి రాముడు దైవస్వరూపుడు. కొందరికి అతను సీతను నానా తిప్పలు పెట్టిన కఠినాత్ముడు. మరికొందరికి వశిష్టాది స్వార్థబ్రాహ్మణుల చేతిలో కీలుబొమ్మ. (ఇలా ఎన్నో అభిప్రాయాలున్నాయి; అప్పుడెవరూ ఇలా ఆ రాసినవారిని వెంటపడి వేధించిన దాఖలాలు లేవు. పాపం భవభూతి చాలాకాలం ముందు పుట్టి బతికిపోయాడు. లేకుంటే రాముడు మున్యాశ్రమానికి వెళ్లినప్పుడు అక్కడ ఒక ‘వత్ససహితధేనువుని’ ‘మడమడాయించి’ చంపి వండిపెడితే హాయిగా భోంచేశాడని రాయగలిగేవాడు కాడు బహుశః. భవభూతి తెలుగువాడని చాలా మంది భావిస్తారని ఇక్కడి పాఠకులకు తెలిసేవుంటుంది.) ఇందులో ఎవరో ఒకరి అభిప్రాయమే ఖచ్చితమైందని, మిగిలిన వారిది కాదని వాదించటం ముల్లాల దారిలో నడవటం అని నా అభిప్రాయం. ఈ మధ్య చీటికీ మాటికీ మనోభావాలు దెబ్బతినే వ్యాధి తెలుగువారికి కూడ బాగా పాకినట్టుంది; ఇదివరకు ఇది ఉత్తరభారతంలోనే ఉండేది. మనం మరీ ఇంత భీరువులం దుర్బలులం కావటం తెలుగుజాతి భవిష్యత్తుకి మంచిది కాదు.

  10. నేత్రోన్మీలనం గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:

    11/10/2023 11:17 am

    ఈచర్చ ఇంకా కొనసాగుతున్నది. ఆశ్చర్యం!

    సెక్యులరిజం ముసుగులో సనాతనధర్మాన్ని అవహేళన చేయటానికి వస్తున్న సమర్ధింపులు ఆవేదన కలిగిస్తున్నాయి. చివరకు సెక్యులరిజం అంటే సనాతనధర్మాన్ని అవహేళన చేయటం అన్న దుస్థితి స్థాపించబడుతున్నది.

    ఈమాట వారు కాని మరొక సాహిత్యవేదిక వారు కాని ఇతరమతధర్మాలను కాని వారివారి చారిత్రక సాంస్కృతిక వారసర్వాలను కాని అవహేళన చేస్తూ వచ్చే ఏ రచననైనా ప్రచురించగలరా? వారి మనోభావాలు దెబ్బతింటె వీరి అస్తిత్వాలు దెబ్బతింటాయి. మనది సెక్యులర్ దేశం కాబట్టి ప్రచురించాం అని తప్పించుకోవటం అసాధ్యం. ఐతే సనాతనధర్మావలంబులు సాత్వికులు కాబట్టి సెక్యులరిజం పేరుతో వారిని ఎంతగా ఐనా గాయపరచి మేం చేస్తున్నది ఒప్పే మాధోరణి సరైనదే అని చెప్పుకోవచ్చును. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి.

    ఇకనైనా దయచేసి ఇటువంటి అవమానకరమైన రచనలను ప్రచురించవద్దని ఈమాట వారికి మనవి. 1994 తెలుసా రోజులనుంచీ ఉన్న పరిచయాన్ని నేను మరువలేదు. ఈమాటను అవమానించాలని నా ఉద్దేశం కాదు. నేను వ్యక్తిగతంగా స్పందిస్తున్నానన్న మాట సరికాదు.

    నేను ఒంటరిననీ నాకు భిన్నమైన అభిప్రాయమే బలంగా ఉన్నది ఈవిషయంలో అనుకోవటం లేదు. ఇరువైపులా బాగానే స్పందిస్తున్నారు. కాని సనాతనధర్మాన్ని చులకన చేసే రచనలను ప్రోత్సహించద్దని సాధ్యమైనంతా వేడుకుందుదే పునఃపునః చెప్పవలసి వస్తోంది.

    ఈకథ కారణంగా నేను మనశ్శాంతికి దూరమాయ్యాను. దానర్దం నేను మానసికంగా బలహీనుణ్ణని కాదు. ఇది అంతగా నామనస్సును గాయపరచింది అని. ఇంకా ఎంతోమంది సనాతనధర్మపథంలో ఉన్నవారిని గాయపరచే ఉంటుంది.

    జరిగింది చాలు. ఇకపైన మీరు రచనలను మరింత శ్రధ్ధగా పరిశీలించగలరని ఆశిస్తున్నాను.