పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16450

  1. శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి N S YOGANANDA RAO అభిప్రాయం:

    12/01/2023 9:48 am

    మీ అనువాదంలో ప్రతి అక్షరం తెలుగు భాష లోని ఆకర్షణీయతను, మీకు తెలుగు భాష పట్ల ఉన్న అభిమానం తెటతెల్లం చేస్తోంది.

  2. ప్రతిబింబం గురించి Mythreyi అభిప్రాయం:

    12/01/2023 9:20 am

    Super Anuradha garu, chala baaga rasaaru

  3. నాకు నచ్చిన పద్యం: శబ్దాలంకారపు సంగీత మాధుర్యం గురించి వారణాసి పవన్ కుమార్ అభిప్రాయం:

    12/01/2023 12:12 am

    నేను వృత్తిపరంగా వ్యాఖ్యాతని ఇంకా గాయకుడిని. నాకు రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందులో ఒకటి దైవ స్తుతి దాని లింకు ఈ క్రింది విధంగా ఉంది…..https://youtube.com/@daivasthuthi108?si=CWWy87yE5pwQQ6BR

  4. నాకు నచ్చిన పద్యం: శబ్దాలంకారపు సంగీత మాధుర్యం గురించి వారణాసి పవన్ కుమార్ అభిప్రాయం:

    12/01/2023 12:09 am

    మీ విశ్లేషణ మీ వివరణ అద్భుతంగా ఉన్నాయి. 👌👌👌👌

  5. పులి – మేక గురించి బండ్ల మాధవరావు అభిప్రాయం:

    11/29/2023 11:37 pm

    చాలా బాగుంది. భిన్నమైన కథ. పెద్దవాళ్ళు వృద్ధాశ్రమాల కథలు చదివాము. పెద్దలున్న పిల్లల కథ ఇది. బాగుంది

  6. పులి – మేక గురించి uma nuthakki అభిప్రాయం:

    11/29/2023 8:04 pm

    చాలా నచ్చింది. ఎంతగా నచ్చిందంటే, ఇప్పటికిప్పుడు ఈ లింక్ మా మామయ్యకి పంపాలన్నంతగా. కానీ ఆ తర్వాత జరిగే చర్చలు పడలేక ఊరుకున్నా. అనీల్ గారూ! నేనూ అక్కా ఎన్నిసార్లు అనుకుంటామో, “ఇంతకన్నా మనం చేయలేము. Atleast మన పిల్లల పట్ల మనం ఇలా ఉండకూడదు. అది నేర్చుకుంటే చాలు” అని.

  7. నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి గన్నవరపు నరసింహమూర్తి అభిప్రాయం:

    11/28/2023 11:55 am

    చాలా బాగుంది సురేశ్ గారూ! శ్లోకాల పరిచ్ఛేదన, టీకాలు సమకూర్చారు. మీ అనువాదము అద్భుతము. ధన్యవాదములు.

  8. నేత్రోన్మీలనం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/28/2023 5:34 am

    ఒక మితృని వ్యాఖ్య – ఎక్కడా దొరక్కుండా కామెంటారే – విన్నాక మరి నాలుగు మాటలు.

    *విలక్షణమైన కథ. నాకు నచ్చింది. రచయితకు అభినందనలు.
    *చర్చించుకోవలసిన కథ: ఉదాహరణకు సీత-అడవులు విషయంలో మనం వినే పేలవమైన కారణం స్థానంలో మరో బలమైన కారణం ప్రవేశపెట్టిందీ కథ.
    *ధాష్టీకాలకు గురి అయింది: ఇది అందరూ పైన ఒప్పుకున్నదే. మరో టిప్పణి అవసరం లేదు.

    **

    ఎవరో అంటున్నారు..’వాళ్లు మా ఇంటి మనుషులు. ఏమన్నా అంటే సహించం.’
    ఆ మాటకొస్తే మరి మా ఇంటి మనుషులు కూడా… అనే బాధ్యత మాకూ ఉంది.

  9. నేత్రోన్మీలనం గురించి RAGHAVENDRA అభిప్రాయం:

    11/28/2023 1:18 am

    ఒకోసారి సమీక్ష చదివి, సినిమా చూడటం ఉందికదా. కానీ ఇక్కడ చట్నీ వడ్డించి, ఇడ్లీ తీసేసినట్లు ఉంది నా స్థితి.

  10. దృశ్య సంస్కృతి: సినిమా పోస్టర్లు గురించి కంభంపాటి సుశీల అభిప్రాయం:

    11/25/2023 8:34 pm

    ఏదేనా శంఖం లో పోస్తేగాని తీర్థమవదు. అన్ని పోస్టర్లు అనలేను కాని కొన్ని పోస్టర్లు కధ లోని ముఖ్య విషయాన్ని తెలియజేస్తూ చాలా బాగుండేవి. పది చూసేసరికి మాకు కధ తెలిసిపోయేది. నాకు వీటి గురించి అవగాహన లేదు గానీ అమెరికన్ స్నేహితుల్లో పాత యింగ్లీషు సినిమాల పోస్టర్లు వేలం పాటల్లో బోలెడు డబ్బు పెట్టి కొనడం చూశాక ఔరా అనుకున్నాను. రూడాల్ఫు వాలంటీనో నటించిన సినిమా తాలూకు కాగితం చాలా విలువైనదట. మాలపిల్ల, వరవిక్రయా లాటి పాత సినిమాల తాలూకువేమేనా దొరికితే వాటి విలువ యెలా వుంటుందో?