ధన్యవాదాలండీ, అసలు మీరు చెప్పేవరకూ ఈ విషయం తెలియదు. ఇప్పుడీ పదాలు అసలు ఎవరైనా వాడుతున్నారో లేదో కూడా. నిజానికి ఇప్పుడు ఇంటికి రాకుండానే వాట్సాప్ లో మెసేజ్ పంపించి ముష్టి ఇస్తారా లేదా అని అడుగుతారేమో. ఆ మధ్యన దేశం వెళ్లినప్పుడు ఒకాయన అన్నాడు – ఇప్పుడు రిక్షావాడిక్కూడా ఫోన్ ఉంది అని. అందుకే అన్నాను. నమస్కారములతో
అభినందనలు, కొత్త ప్రదేశం గురించి, వాతావరణం మరియు జీవజాలం గురించి వ్యాసంలో ఆసక్తి రేకెత్తించే విధంగా వివరించారు, శాస్త్రవేత్తలు మతాధికారుల మధ్య సంబంధాలు అలాగే కనుక్కున్న విషయాన్ని ధైర్యంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఉన్న మానసిక ఒత్తులు, డార్విన్ సిద్ధాంతం పై సూక్ష్మంగానే మంచి అవగాహన కలిగేటట్టుగా వివరించారు, వ్యాసం చదువుతూ ఉంటే అనిపించింది, “పాఠశాల విద్యలో భాగంగా సామాన్య అలాగే సాంఘిక శాస్త్ర పుస్తకాలలో, ఈ రచయిత వ్యక్తపరిచినట్లు ఇంత చక్కగా వివరిస్తే నేర్చుకున్న విషయాలపై పిల్లలకు చక్కటి అవగాహన, పరిశోధించాలి, వెళ్ళి మరింత లోతుల్లో తెలుసుకోవాలి అన్న ఆలోచన వచ్చి ఎంతోమంది కొత్త శాస్త్రవేత్తలు వచ్చే అవకాశం ఉంటుంది కదా” అనిపించింది. అందరూ సొంతగా వెళ్ళలేని అనుభవించలేని ప్రదేశాల్ని చాలా బాగా వివరించారు. లోన్‌సమ్ జార్జ్ అన్న ఒంటరి జీవి కథ బాధను కలిగించింది, తాబేళ్ళు అన్నీ సంవత్సరాలు బ్రతుకుతాయి అని తెలిసింది.
చిన్న సూచన: మొత్తం వ్యాసంలో ఒకే ఒక పదం పంటికింది రాయిలా అనిపించింది అదే “భిన్నాల వత్తిడి” ఒకటికి రెండు సార్లు చదివితే అర్థం అయింది, దాన్ని కాస్త విడ మరిచి చెబితే సులువుగా ఉంటుందేమో, ఏదేమైనా గోలాపగోస్ దీవులు జీవ పరిణామ వృద్ధికి సాక్షంగా నిలిచేయి, ధన్యవాదాలు.
చిన్న సైజు పక్షులని “పిట్టలు” అంటారనిన్నీ, పెద్ద సైజు పిట్టలని “పక్షులు” అంటారనిన్నీ నిన్ననే “కోరా” లో చదివేను. అసలు ఒక పిట్ట పేరే పిట్ట ట! నా రెండు దమ్మిడీలూ!!
“Siri–I wrote a story about you…did you like it?”
“No…it’s too late…You missed the Shuttle?”
“What…? Someone already…? Who…?”
“Yes. He has arrived…Google it!”
ఈ పక్షి ఒక నీటి పక్షిట. అంటే curlew, heron, crane, sandpiper అని అనువాదం చెయ్యచ్చని ఒక సమీక్షలో కనిపించింది. ఒక సముద్రపు పక్షి. దానికి తెలుగు పేరు లేదన్నమాట!
‘క్రుఞ్ క్రౌఞ్చః’ అని అమరకోశం క్రౌంచపక్షికి క్రుఙ్, క్రౌంచః అని రెండు పేర్లు చెపుతుంది. ఈరెండు పేర్లూ ‘క్రుఞ్చ గతి, కౌటిల్య, అల్పభావయోః’ అనే ధాతువునుండి ఏర్పడినాయని –అంటే పంక్తిరూపముగా బోవునది, లేక కుటిలమై (వంకరగా) నుండునది – అని గురుబాలప్రబోధిక. కొంగ అని దీనికి తెలుగులో అర్థము వ్రాసినారు అమరంలో. కొంగలు బారులు దీరి పోవుట, వాటి శరీరనిర్మాణము వంకరగా నుండుటచే ఈవ్యుత్పత్తులు సరిపోయినవి.
ఈక్రౌంచశబ్దంయొక్క వికృతులే కొంచ, క్రొంచ అను తెలుఁగుపదాలు. ‘పసిఁడికీల్బొమ్మ మీపజ్జ నేగదు గదా కొంచలార, కొలంకుటంచలార!’ అని అచ్చతెనుఁగు రామాయణంలో కొంచలార=కొంగలార అనే అర్థంలో వాడిన కొంచశబ్దం. ‘చలాచలక్రౌంచ కారండవ మండలీ పటపటత్కారపటహారవంబులతో’ అని వసుచరిత్రము. ఈవాక్యంలో గల క్రౌంచకారండవాలకు క్రౌంచ=కొంగలయొక్కయు, కారండవ=కన్నెఱేడు పక్షులయొక్కయు అని సోమకవి వ్యాఖ్యానం.
ఈవిధంగా క్రౌంచపక్షి అంటే కొంగ అనడానికి సాహిత్యంలో అనేకప్రయోగము లున్నవి.
ముష్టి పలురకములు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
07/02/2024 10:51 am
శ్యామలరావు గారు,
ధన్యవాదాలండీ, అసలు మీరు చెప్పేవరకూ ఈ విషయం తెలియదు. ఇప్పుడీ పదాలు అసలు ఎవరైనా వాడుతున్నారో లేదో కూడా. నిజానికి ఇప్పుడు ఇంటికి రాకుండానే వాట్సాప్ లో మెసేజ్ పంపించి ముష్టి ఇస్తారా లేదా అని అడుగుతారేమో. ఆ మధ్యన దేశం వెళ్లినప్పుడు ఒకాయన అన్నాడు – ఇప్పుడు రిక్షావాడిక్కూడా ఫోన్ ఉంది అని. అందుకే అన్నాను. నమస్కారములతో
మరల రామాయణంబదేల… గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
07/02/2024 10:47 am
దేశికాచారి గారి, వేమూరి గారి సమాధానాలతో “రామయణంలో పిట్టలవేట” సమాప్తమైనట్టే కాబట్టి వేలూరి గారు మిగతా రామాయణం చదవడానికి దారి తెరుచుకున్నట్టే!
అద్వైతం గురించి VSTSayee అభిప్రాయం:
07/02/2024 9:31 am
ఎంత “అద్వైతం” అయినా, “నేనూ”లోని అంత్యదీర్ఘం “ఆమె”కూ ఉండద్దా!
మరల రామాయణంబదేల… గురించి VSTSayee అభిప్రాయం:
07/02/2024 9:11 am
పఱిగపిట్ట
దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 5 గురించి Venu Vinjamoori అభిప్రాయం:
07/02/2024 12:01 am
అభినందనలు, కొత్త ప్రదేశం గురించి, వాతావరణం మరియు జీవజాలం గురించి వ్యాసంలో ఆసక్తి రేకెత్తించే విధంగా వివరించారు, శాస్త్రవేత్తలు మతాధికారుల మధ్య సంబంధాలు అలాగే కనుక్కున్న విషయాన్ని ధైర్యంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఉన్న మానసిక ఒత్తులు, డార్విన్ సిద్ధాంతం పై సూక్ష్మంగానే మంచి అవగాహన కలిగేటట్టుగా వివరించారు, వ్యాసం చదువుతూ ఉంటే అనిపించింది, “పాఠశాల విద్యలో భాగంగా సామాన్య అలాగే సాంఘిక శాస్త్ర పుస్తకాలలో, ఈ రచయిత వ్యక్తపరిచినట్లు ఇంత చక్కగా వివరిస్తే నేర్చుకున్న విషయాలపై పిల్లలకు చక్కటి అవగాహన, పరిశోధించాలి, వెళ్ళి మరింత లోతుల్లో తెలుసుకోవాలి అన్న ఆలోచన వచ్చి ఎంతోమంది కొత్త శాస్త్రవేత్తలు వచ్చే అవకాశం ఉంటుంది కదా” అనిపించింది. అందరూ సొంతగా వెళ్ళలేని అనుభవించలేని ప్రదేశాల్ని చాలా బాగా వివరించారు. లోన్‌సమ్ జార్జ్ అన్న ఒంటరి జీవి కథ బాధను కలిగించింది, తాబేళ్ళు అన్నీ సంవత్సరాలు బ్రతుకుతాయి అని తెలిసింది.
చిన్న సూచన: మొత్తం వ్యాసంలో ఒకే ఒక పదం పంటికింది రాయిలా అనిపించింది అదే “భిన్నాల వత్తిడి” ఒకటికి రెండు సార్లు చదివితే అర్థం అయింది, దాన్ని కాస్త విడ మరిచి చెబితే సులువుగా ఉంటుందేమో, ఏదేమైనా గోలాపగోస్ దీవులు జీవ పరిణామ వృద్ధికి సాక్షంగా నిలిచేయి, ధన్యవాదాలు.
మరల రామాయణంబదేల… గురించి Rao Vemuri అభిప్రాయం:
07/01/2024 11:45 pm
చిన్న సైజు పక్షులని “పిట్టలు” అంటారనిన్నీ, పెద్ద సైజు పిట్టలని “పక్షులు” అంటారనిన్నీ నిన్ననే “కోరా” లో చదివేను. అసలు ఒక పిట్ట పేరే పిట్ట ట! నా రెండు దమ్మిడీలూ!!
కేస్ నెంబర్ – 1235 గురించి Sreenivas Bandaa అభిప్రాయం:
07/01/2024 8:57 pm
ఇటువంటి భవిష్యత్తు ఉంటుందంటే ఇప్పుడే అవతారాన్ని చాలింమం మంచిది. కానీ ఇప్పటి వాస్తవం కూడా చాలావరకూ ఇదేనేమో?
కథలు-గాథలు 1 గురించి Sreenivas Bandaa అభిప్రాయం:
07/01/2024 8:44 pm
ఇంత passion ఉండబట్టే మీరు “అన్వర్” అయ్యారు అన్వర్ గారూ! మీ ఈ వ్యాసం చాలా engulfing గా ఉంది! అభినందనలు.
కేస్ నెంబర్ – 1235 గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:
07/01/2024 2:57 pm
“Siri–I wrote a story about you…did you like it?”
“No…it’s too late…You missed the Shuttle?”
“What…? Someone already…? Who…?”
“Yes. He has arrived…Google it!”
మరల రామాయణంబదేల… గురించి దేశికాచారి అభిప్రాయం:
07/01/2024 2:00 pm