‘నైఘంటికులు ‘పరగపిట్ట’ కాదు ‘పరిగపిట్ట’ అంటున్నారు,’ అని మీరు రాశారు. నేను ఆంధ్రభారతిలో చూశాను. నైఘంటికులకి సాధారణ ప్రజలు మాట్లాడుకునే భాష రాదని నా అభిప్రాయం. వాళ్ళందరూ వ్యుత్పత్తి ఆధారంగా నామకరణం చేస్తారనుకుంటాను.
అయినా, నేను మీకు చెప్పటం ఏమిటి!
అయితే, కొల్లేరు అంతర్వేదికి నిఘంటువులు తెలియవు. అతను మాకు చెప్పటం: పరగ పిట్టలు అని. పైగా ఈ కొల్లేరు పిట్టలు గడ్డి పరగలు ఏరుకోని తినటం మేము ఎప్పుడూ చూడలేదు. నీటి నాచు, పురుగులూ తినటం చూశాం.
ఇంతెందుకూ, మీరంటే నాకు గౌరవం; అంతర్వేదంటే ప్రేమా!
ఈ పిట్టలని చంపడం ఆంధ్ర ప్రభుత్వం ఏనాడో నిషేధించారు కాబట్టి, నేను మీజట్టులోకి వచ్చేస్తా. ఇక ముందు ఈ పిట్టల గొడవ రాస్తే నైఘంటికుల భాషలోనే రాస్తాను. బండి ర మాత్రం రాయను.
అయ్యా శర్మగారూ: మీరు చదువుకున్నప్పుడు చిన్ననాటి పాఠశాలల్లో జంతువులు, పక్షులు బొమ్మలున్న పోస్టర్లు వుండివుండాలి. మీరు భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎలిమెంటరీ బళ్ళకి వెళ్ళిన వాళ్ళు. మాకు ఆ అదృష్టం లేదు. అందుచేత, బకము అంటే బాతు అని బూతు రాశాను. అందుకుతోడు వార్థక్యం. క్షమార్హుణ్ణి.
మీరు ముమ్మాటికీ రైట్.
రుచులగురించి మీతో సంభాషణ కూడా తప్పే. నే రాసిన రుచి మీకు తెలిసే అవకాశం లేదు. ఒక్క విషయం మీతో మనవి చేసుకోవాలి: అన్ని పక్షి జాతులూ అంతరించటల్లేదు. Edible birds are in plenty. They are purposefully cultivated and grown in plenty.
అయితే కాకులు, రకరకాల కాకులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, అంతర్జాలంలో కూడా!
I just found out that there are two more biographies of Alice of Alice Munro.
1. Alice Munro: Writing Her Lives: A Biography ny Robert Thacker.
2. Lives of Mothers and Daughters: Growing up with Alice Munro by Sheila Munro.
తెలుగులో బకము అంటే బాతు అని చిన్నప్పుడు చదువుకున్నాం.
నేను మాత్రం కొంగ అని చదువుకున్నట్టే గుర్తు. అయినా వేలూరి గారు, ఒక పక్షిని చూడగానే దాన్ని ఎలా తినడం, రుచీ తప్ప మరోటి ఏదీ గుర్తు రాలేదా మీకు? అందులోనూ ఈ రోజుల్లో పక్షిజాతులు అంతరించిపోతున్నాయి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు కూడా! భూషణ్ గారిచ్చిన లింకులో పక్షి భలే అందంగా ఉంది అనుకున్నాను మీరు ‘రుచి’ గురించి ప్రస్తావించేదాకా! మొదటి సమాధానంలో జమిందారు గారు పెట్టిన పక్షి భోజనం, రెండో కామెంట్లోనూ మరోసారి రుచి! ఈ లెక్కన మీరు రామాయణం చదివినట్టే.
నా చిన్నతనంలో ఏదైనా అందమైన పక్షిబొమ్మ లేక క్యాలెండర్లో పాపాయి బొమ్మ లేక ఏదైనా సీనరీ చూస్తే విపరీతంగా ఏడ్చే వాణ్ని. చాలారోజులకుగాని అర్ధం కాలేదు అవి సంతోషంతోకూడిన మధురక్షణాలని. మరల గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.
హనుమంతరావు గారు ప్రస్తావించిన చివరకు మిగిలేది 40 సంవత్సరాల విరామం తర్వాత రెండవసారి చదివితే బోర్ కొట్టింది అన్న పాపిని నేనే! ఆకులు ఎక్కకువైతే కాయలను దాచేసినట్లే, మాటలు ఎక్కువైతే మనం చెప్పాలనుకున్నది మరుగున పడిపోతుంది అన్న సూత్రాన్ని నమ్మిన వాడిని. అందువల్లనే కథావస్తువుకు సంబంధం లేని అవసరపు వర్ణన పాఠకులకు వెగటు పుట్టిస్తుంది. ఉదా॥ సాయంత్రం అయ్యింది అనటానికి ‘ఊరు తగలబడుతున్నట్లు ఎర్రగా వున్న పడమటి ఖనుమల్లోకి సూర్యుడు మెల్లగా జారుకుంటాడు’ అని చెబుతాడు బుచ్చిబాబు. ఇటువంటి పదప్రయోగం వెగటు పుట్టించటకపోవటం ఆశ్చర్యం! ఈ సందర్విభంలో మా మాస్దారు పెద్దబొట్ల సుబ్బరామయ్య గారిని స్మరించుకోవాలి. ఆయన కథలు యేవీ15 పేజీలకు మించవు. 10, 12 పేజీల్లోనే పాఠకుడిని కథాసన్నివేశంలోకి పూర్తిగా దించుతాడు. That is the power of brevity. ‘Being long winded is not an unfailing symptom of insight’ అనేది బుచ్చి బాబు లాంటి రచయితలు గ్రహించితే బాగుండును కదా అనిపించక మానదు సుబ్బరామయ్య గారి కథలు చదువుతున్నప్పుడు. ఉదా॥ నీళ్లు. మన్రో గారి టూమచ్ హ్యాపీనెస్ హనుమంతరావు గారు పంపించారు. చదవాలి. చివరగా నాకూ ఓ అచ్చు తప్పు దొరికిందోచ్చ్! దేవుడు వున్నాడా అనే పేరాలో చర్చ్ లో అనే మాట తప్పుగా దొర్లింది. అది చర్చలో అన్నా అవ్వాలి లేక చర్చి లో అన్నా అవ్వాలి. A writer sees words as they ought to be whereas a reader sees words as they are. That’s why readers can detect errors spontaneously; writers cannot.
మరల రామాయణంబదేల… గురించి V R Veluri అభిప్రాయం:
07/12/2024 8:03 pm
శాయి గారూ:
‘నైఘంటికులు ‘పరగపిట్ట’ కాదు ‘పరిగపిట్ట’ అంటున్నారు,’ అని మీరు రాశారు. నేను ఆంధ్రభారతిలో చూశాను. నైఘంటికులకి సాధారణ ప్రజలు మాట్లాడుకునే భాష రాదని నా అభిప్రాయం. వాళ్ళందరూ వ్యుత్పత్తి ఆధారంగా నామకరణం చేస్తారనుకుంటాను.
అయినా, నేను మీకు చెప్పటం ఏమిటి!
అయితే, కొల్లేరు అంతర్వేదికి నిఘంటువులు తెలియవు. అతను మాకు చెప్పటం: పరగ పిట్టలు అని. పైగా ఈ కొల్లేరు పిట్టలు గడ్డి పరగలు ఏరుకోని తినటం మేము ఎప్పుడూ చూడలేదు. నీటి నాచు, పురుగులూ తినటం చూశాం.
ఇంతెందుకూ, మీరంటే నాకు గౌరవం; అంతర్వేదంటే ప్రేమా!
ఈ పిట్టలని చంపడం ఆంధ్ర ప్రభుత్వం ఏనాడో నిషేధించారు కాబట్టి, నేను మీజట్టులోకి వచ్చేస్తా. ఇక ముందు ఈ పిట్టల గొడవ రాస్తే నైఘంటికుల భాషలోనే రాస్తాను. బండి ర మాత్రం రాయను.
ధన్యవాదాలు.
వేలూరి వేంకటేశ్వర రావు.
మరల రామాయణంబదేల… గురించి V R Veluri అభిప్రాయం:
07/12/2024 7:33 pm
అయ్యా శర్మగారూ: మీరు చదువుకున్నప్పుడు చిన్ననాటి పాఠశాలల్లో జంతువులు, పక్షులు బొమ్మలున్న పోస్టర్లు వుండివుండాలి. మీరు భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎలిమెంటరీ బళ్ళకి వెళ్ళిన వాళ్ళు. మాకు ఆ అదృష్టం లేదు. అందుచేత, బకము అంటే బాతు అని బూతు రాశాను. అందుకుతోడు వార్థక్యం. క్షమార్హుణ్ణి.
మీరు ముమ్మాటికీ రైట్.
రుచులగురించి మీతో సంభాషణ కూడా తప్పే. నే రాసిన రుచి మీకు తెలిసే అవకాశం లేదు. ఒక్క విషయం మీతో మనవి చేసుకోవాలి: అన్ని పక్షి జాతులూ అంతరించటల్లేదు. Edible birds are in plenty. They are purposefully cultivated and grown in plenty.
అయితే కాకులు, రకరకాల కాకులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, అంతర్జాలంలో కూడా!
నమస్తే
వేలూరి వేంకటేశ్వర రావు
వ్యభిచారం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
07/12/2024 4:25 pm
ఇది 2017 లో ఈమాట లోనే నేను రాసినది నోట్ల రద్దుమీద
https://eemaata.com/em/issues/201701/9749.html.
ఆలిస్ మన్రో గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
07/11/2024 9:41 pm
వేలూరి గారు,
You must have also found that neither biography covered Munro’s daughter Andrea Skinner’s story.
KHR
ఆలిస్ మన్రో గురించి V R Veluri అభిప్రాయం:
07/11/2024 6:31 pm
Dear Sri Kodavalla Hanumantha Rao:
I just found out that there are two more biographies of Alice of Alice Munro.
1. Alice Munro: Writing Her Lives: A Biography ny Robert Thacker.
2. Lives of Mothers and Daughters: Growing up with Alice Munro by Sheila Munro.
I wish I had known about them earlier.
Best wishes,
V R Veluri
ఆలిస్ మన్రో గురించి V R Veluri అభిప్రాయం:
07/11/2024 6:15 pm
రంగరావు గారూ: I love your quote that I requoted below
‘A writer sees words as they ought to be whereas a reader sees words as they are. That’s why readers can detect errors spontaneously; writers cannot.’
At both places, it is church. At one place it is the church in English and at the other place it is the Telugu church. Am I vindicated?
Just kidding! You are right. I should have written at both the places the same spelling.
Best wishes.
V R Veluri
మరల రామాయణంబదేల… గురించి VSTSayee అభిప్రాయం:
07/08/2024 10:11 am
‘క్రావడి’కూడా మానేసినట్లున్నారు.
మరల యేలయన్న …
నైఘంటికులు ‘పరగపిట్ట’ కాదు ‘పరిగపిట్ట’ అంటున్నారు.
మరల రామాయణంబదేల… గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
07/08/2024 9:39 am
నేను మాత్రం కొంగ అని చదువుకున్నట్టే గుర్తు. అయినా వేలూరి గారు, ఒక పక్షిని చూడగానే దాన్ని ఎలా తినడం, రుచీ తప్ప మరోటి ఏదీ గుర్తు రాలేదా మీకు? అందులోనూ ఈ రోజుల్లో పక్షిజాతులు అంతరించిపోతున్నాయి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు కూడా! భూషణ్ గారిచ్చిన లింకులో పక్షి భలే అందంగా ఉంది అనుకున్నాను మీరు ‘రుచి’ గురించి ప్రస్తావించేదాకా! మొదటి సమాధానంలో జమిందారు గారు పెట్టిన పక్షి భోజనం, రెండో కామెంట్లోనూ మరోసారి రుచి! ఈ లెక్కన మీరు రామాయణం చదివినట్టే.
కథలు-గాథలు 1 గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:
07/08/2024 7:34 am
అవును అన్వరు గారు!
నా చిన్నతనంలో ఏదైనా అందమైన పక్షిబొమ్మ లేక క్యాలెండర్లో పాపాయి బొమ్మ లేక ఏదైనా సీనరీ చూస్తే విపరీతంగా ఏడ్చే వాణ్ని. చాలారోజులకుగాని అర్ధం కాలేదు అవి సంతోషంతోకూడిన మధురక్షణాలని. మరల గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.
ఆలిస్ మన్రో గురించి గుమ్మడిదల రంగారావు అభిప్రాయం:
07/08/2024 12:37 am