పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16450

  1. నా జ్ఞాపకం గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    01/03/2008 9:00 pm

    చాలా బావుందండీ.. మీ పాత కవితలు కూడా చదివాను.మంచి పదచిత్రాలు ఉన్నాయి. keep writing!

  2. నిన్నటి కల గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:

    01/03/2008 7:51 pm

    కధ ,ముఖ్యంగా కధనం బావుంది.
    నా అభిప్రాయం లో స్కాలర్షిప్/చెంప దెబ్బ ప్రహసనం తాలుకు ప్రధాన ఉద్దేశ్యం, లంచం ఇవ్వవలసిన అవసరాన్ని కలిగించిన ఆర్ధిక వత్తిళ్ళని ,ప్రధాన పాత్ర లోనైన సంఘర్షణని , ముఖ్యంగా కధ పూర్వార్ధం లో వీయస్సార్ నైతిక బలాన్ని establish చేయటం.అలా చేయటం జరిగింది కాబట్టే ముగింపు లోని కొసమెరుపు (పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయిన ఆశయాలు/ఆదర్శాల గురించి వీయస్సార్ honest confession ) కూడా effective గా ఉంది.

  3. తెరమరుగవుతున్న తెలుగు నాటకం గురించి tallapragada అభిప్రాయం:

    01/03/2008 4:32 pm

    తెలుగునాట నాటకాన్ని మళ్ళీ నాటటం అనేది ఒక అవసరమైన పోరాటమే కానీ, అది చేయి దాటిపోయిందేమో అని భయం వేస్తోంది. మీ వ్యాసం చాలా బాగుంది.

  4. రంగులు గురించి కృష్ణ అభిప్రాయం:

    01/03/2008 3:08 pm

    బాగుంది. ఇదీ కవిత్వమంటే. కొత్త ఆవకాయ ఘుమఘుమలు బాగున్నాయి. ఇంత తక్కువే పెట్టారే? నిజంగా కొత్తదనమున్న కవిత.

  5. సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్‌ఖాన్ గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/03/2008 2:27 pm

    మా గురువుగారు ఇమ్రత్ ఖాన్; ఆయన తన సోదరుడు విలాయత్ కు స్వయానా శిష్యుడు. వ్యక్తిగతంగా చెప్పాలంటే నావంటి అసంఖ్యాకులకు విలాయత్ ఖాన్ అక్షరాలా ఆరాధ్యుడే.

    ఇక రాక్షససాధన మాటకొస్తే పెద్ద విద్వాంసులందరూ ఒక్కొక్క వరసనీ 500 నుంచి 1000 సార్లు ఆపకుండా అభ్యాసం చెయ్యడం మామూలే. పర్ఫెక్ట్ గా వాయించడానికే కాక, తమకెవరూ సాటిరాకుండా, పోటీదారు కాకుండా ఉండేందుకు కూడా వారు శ్రమపడతారు. ఇటువంటి సాధన అంతా ఏ పదిహేనో ఏటనో పూర్తవుతుంది కనక ఆ తరవాత వారికి మిగిలేదల్లా సంగీతపు లోతులని తరచడమే. మామూలుగా సంగీతం మీద అభిమానం కొద్దీ వారానికి రెండు క్లాసులకు వెళ్ళే విద్యార్థులకూ, వీరికీ పోలికే ఉండదు.

    అయితే సంగీతంలో కేవలం నైపుణ్యం ఉండడం ఒక ఎత్తూ, సంగీతానికే కొత్త దిశానిర్దేశం చెయ్యడం మరొక ఎత్తు. అటువంటి అసామాన్యుల గురించే మనం చెప్పుకుంటాం.

  6. సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్‌ఖాన్ గురించి vishNubhoTla lakshmanna అభిప్రాయం:

    01/03/2008 1:24 pm

    రోహిణీప్రసాద్ గారి రచనలు చదివి చదివి, “ఆయన దగ్గర నుంచి ఇంత మంచి క్వాలిటీ వ్యాసాలు మామూలే కదా” అని కొంచెం చిన్న చూపు చూస్తామేమో కదా అన్న భయం వేస్తుంది అప్పుడప్పుడు.

    “నీ స్నేహితులెవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడవో చెపుతాను” అన్న ఆంగ్ల సామెత ప్రకారం, విలాయత్ ఖాన్ గారి ప్రభావం, రోహిణీప్రసాద్ గారి పై బాగా ఉన్నట్టు నా కనిపిస్తోంది.

    ఈ వ్యాసంలో చెప్పిన అనేక విషయాల్లో, ఖాన్ గారి “రాక్షస సాధన” నన్ను ఆశ్చర్య పడేట్టు చేసింది. అంత విద్వత్తు ఉన్న వ్యక్తికి, ఇంత సాధన అవసరమా అని అనిపించింది ముందు. అక్కడే సాధారణ వ్యక్తికి, అసాధారణ వ్యక్తికి మధ్య ఉండే చెరపలేని చిన్న గీత.

    రోహిణీ ప్రసాద్ గారికి కూడా, చాలా విషయాల్లో రాక్షస సాధనే!

    మరో మంచి వ్యాసానికి ధన్యవాదాలతో,

    లక్ష్మన్న

  7. నిన్నటి కల గురించి radhika అభిప్రాయం:

    01/03/2008 1:16 pm

    బావుంది.

  8. కోవెలలో పకపకలు గురించి radhika అభిప్రాయం:

    01/03/2008 1:04 pm

    బావుందండి.ఈ కధ లో చెప్పినవి అమెరికా వాసుల జీవితాల్లో సాధారణం గా జరిగే విషయాలే .

  9. నిన్నటి కల గురించి cj అభిప్రాయం:

    01/03/2008 12:28 pm

    వూహించగలిగే క్లైమాక్స్ అయినా కధనం బావుంది.

  10. కోవెలలో పకపకలు గురించి cj అభిప్రాయం:

    01/03/2008 12:19 pm

    పెద్దగా బుర్ర పెట్టకుండా చదివితే బానే వుంది. నిజ జీవితంలో గుడి లో జరిగే విషయాలు బావున్నయి.