పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16450

  1. ఓ చందమామ గురించి mOhana అభిప్రాయం:

    03/01/2008 1:48 pm

    ఆకాశంలో ఒకే చందమామ, కాని మంచు బిందువులు ఎన్ని
    చందమామలను ప్రతిఫలనము చేస్తుందో! అలాగే జీవితంలో
    ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క చందమామ!

    చక్కని హృదయంగమమైన కవిత – మోహన

  2. ఆహా గురించి mOhana అభిప్రాయం:

    03/01/2008 1:35 pm

    అద్భుతం! – మోహన

  3. ఓ చందమామ గురించి teresa అభిప్రాయం:

    03/01/2008 10:48 am

    చాలా బాగుంది!

  4. అబద్ధంలో నిజం గురించి kosyasura అభిప్రాయం:

    03/01/2008 7:59 am

    ఏంటో … ఏదో ఆదరాబాదరాగా రాసినట్టుగా వుంది.

    మంచి కధ,వస్తువు. కాస్త నింపాదిగా రాసివుంటే చాలాబాగా వుండేది.

    సంభాషణలు బావున్నాయి.

    కొస్యాసురా

  5. కొన్ని మినీ కవితలు గురించి varma అభిప్రాయం:

    02/29/2008 12:08 pm

    సుబ్రహ్మణ్యం గారూ,

    “బాల్యం” కవిత అద్భుతంగా ఉంది. నే ఇన్నాళ్ళనుంచి వెతుకుతున్న బంతి ఎక్కడికి పోయిందో ఇప్పుడర్థమైంది.

    ధన్యవాదాలు,
    వర్మ

  6. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి Raveendra Kumar అభిప్రాయం:

    02/28/2008 10:55 am

    Wonderful article on P/NP problem. While I was doing M.Tech course in IITM, in the very second session of AI course we have a surprising test and the question was “What is AI..”. Later, during the answer session, one of the wonderful answers I got was “trying to solve NP problems in P way”!

    Among the other wonderful books on What computers can’t do, particularly critising AI, is one from Roger penrose “Emporer’s new mind”.

    Good to see this kind of article in telugu. I would love to read rest of the articles in this series.

    Raveendra

  7. కోవెలలో పకపకలు గురించి Phani DokkA అభిప్రాయం:

    02/28/2008 10:08 am

    రాజేంద్ర కుమార్ దేవరపల్లి, సూర్య, కొత్తపాళీ, తెరెస, సీ.జే,
    రాధిక, లహరి, సౌమ్య, కొస్యసుర, సుజాత గార్లకు..

    కథ నచ్చిందనీ, హాయిగా నవ్వుకున్నామనీ రాసిన అందరికీ
    కృతజ్ఞతలు.

    కొస్యసుర గారు,

    పోతనగారి ఆర్టికల్ మీద అభిప్రాయం తెలియజేసినందుకు
    ధన్యవాదాలు.

    కృతజ్ఞతలతో
    ఫణి డొక్కా

  8. అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి Raveendra Kumar అభిప్రాయం:

    02/28/2008 9:05 am

    I use Jim Gray’s material in my trainings and papers. I am a great follower of his papers. I was not checking his website in recent past. I was shoked to know that he is no more. Though I know his work in Transaction processing and tera project, your article gave good overview of his work. thank you ..

    regards
    Raveendra

  9. కోవెలలో పకపకలు గురించి Sujatha అభిప్రాయం:

    02/27/2008 10:29 pm

    ఫణి గారూ, మీ కధ చాలా బాగుంది. నిజంగానే మన తెలుగు వాళ్ళకి హాస్య ప్రియత్వం లేదండీ! చక్కగా సరదాగా చదువుకుని నవ్వుకోవాల్సిన కధని ఎంత రాజకీయం చేస్తున్నారండీ! దీన్నేరంధ్రాన్వేషణ లేదా బొక్కలు వెతుకుట్ అంటారనుకుంటా. గుడికెళ్ళిన ప్రతి వారికీ ఎదురయ్యే అనుభవమే ఇది. నేనయితే అచ్చం నారాయణ లాగా బోలెడన్ని సార్లు ఫీలయ్యాను. ముఖ్యంగా అవతలి వాళ్ళ భావాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా, పూజారితో పాటుగా, మంత్రాలు, సహస్రాలు, అదీ తారాస్ఠాయిలో.. చదివేవాళ్ళ విషయంలో!దీన్ని ఒప్పుకోకుండా , విమర్శిస్తున్నారంటే, భుజాలు తడిమేసుకుని, దేవుడిని తల్చుకుని ‘ఇంకా నయం. దేవుడికి ఇదంతా తెలిసిపోతేనో’ అనేసుకుంటున్నారనమాట. పైగా ప్రాంతీయవాదాలు కూడా లేవనెత్తడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు ఎవర్నీ పట్టించుకోకుండా ఇలాంటి మంచి హాస్య కధలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నా! ఎందుకంటే, హాస్యం రాయడం చాలా కష్టం.

  10. చెప్పులు గురించి Lyla Yerneni అభిప్రాయం:

    02/27/2008 8:09 pm

    అబ్బ! ఏం కథ. కథని మించిన కామెంట్లు. ఎవరండీ ఈ కథారత్నాన్ని ఇన్నేళ్ళ తర్వాత పనికట్టుకుని తవ్వితీసిందీ?

    హీరో! అచ్చంగా ఏడుపు తెలుగు సినిమాలో నాగేశ్వర రావండి. క్లాసు మొరేల్ అంతా కిందికి లాగేశాడండి. రోజూ ఎవరో ఒకరు కన్నీళ్ళు పెట్టుకుంటే తప్ప తృప్తి లేదు. ఎంత సొల్యూషన్ లేని ప్రాబ్లెం? హీరోకి పజ్జెనిమిదేళ్ళ పసిప్రాయం. కెమిస్ట్రీ పాఠాలు వచ్చే బుర్రుంటే , రెండు తోలు ముక్కలు, కాస్త దారం, ఒక దబ్బనం తెచ్చి రెండు చెప్పులు కుట్టుకోలేడండీ? విచిత్రం కాపోతే. ఆడవాళ్ళ రెక్కల కష్టం మీద బతకటం చిన్నప్పుడే అలవాటయిపోయినట్లుంది. కాలేజీకి అన్ని మైళ్ళు నడిసేస్తుంటే, దారిలో ఎన్ని గుళ్ళొస్తాయి. ఒక్క సారి ఏ గుడి దగ్గిర ఆగినా చెప్పులు దొరుకుతాయి. కాలేజీలో జనం అంతా దండాలు పెట్టుకునేవారు, హీరో కి చెప్పులు దొరికినందుకు.

    పాఠకురాలు గాని ఈ కథ చదివితే జె.యు.బి.వి. ప్రసాదుని ఇలాటి కథ రాసినందుకు మూడు పేజీలు ఆపకుండా నిందించేవారు. ఐనా పాఠకురాలు తెలివైనది. ఇలాటి కథ ఆమె చదవదు. మంచి సబ్జెక్టూ, సబ్స్టెన్సూ ఉండాలని వారి అభిలాష. ఈ మధ్యేగా వారి అభిప్రాయాలని పరిశీలించాను. ఒక్క అసలు పేరు చెప్పనన్న మొరాయింపు తప్పిస్తే, ప్రతి అభిప్రాయమూ కొత్త కలమ్ పేరుతో రాయాలన్న వారి ఉత్సాహం ఎవరికి నచ్చదు?

    పేరులో ఏముంది -A rose is a rose is a rose is a rose. కాదా?

    లైలా
    [This comment has been edited – Editors]