సాయి గారూ: నాకు తెలిసి ధైవతమునుండి ధ వచ్చింది.
కాబట్టి ధ సరియైనదే. నిజంగా ధ-కు బదులు ద అని
చెప్పినప్పుడల్లా నాకు ఒక విధంగా ఉంటుంది. హిందూస్తానీ
సంగీతకళాకారులు ధ అనే ఎప్పుడూ వాడుతారు.
కర్ణాటక సంగీతంలోనే ద అంటారు. ఇది నాకు తెలిసింది.
సంగీతం బాగా తెలిసినవాళ్లు ఇంకా చెబుతారు అని
ఆశిస్తున్నాను. – మోహన
కొత్తపాళీ గారు మీకు బహుమతి ఎందుకివ్వలేదో? ఎంత లేడీస్ అయితే మాత్రం
ప్రతీ కధకీ ‘ఈ సారి కూడా బహుమతి రమ్యగారికే’ అనేటట్టైతే అసలు ఈ పోటీలేల? మీ కథతో చూస్తే అసలు రమ్య గారి కధ కాలిగోరికి తూగదు. ఇది నా స్వంత అభీప్రాయం.
మీ స్టోరీ సింప్లీ ‘అదిరిపోయింది.’ సింప్లీ సుపర్బ్. అందుకోండి నా శుభాకాంక్షలు!!!
హిందోళ రాగం చాలా ఉల్లాస వంతమైన రాగం. మనకి తెలుసున్న హిందోళ రాగంలో పాటలన్నీ జనరంజకమైనవే ! ఈ గంభీరమైన రాగాన్ని విషాదం గా పాడిన ఓ పాట ఉంది. అది “బాల్య మిత్రుల కథ” సినిమాలో “గున్న మామిడీ కొమ్మ మీదా గూళ్ళు రెండున్నాయి” అనే పాట. ఈ పాట రెండు రకాలుగా ఉంటుంది. మొదటిదేమో హుషారుగా ఉంటుంది. రెందోది విషాద ఛాయలతో ఉంటుంది. ఛాలెంజింగ్ పాటల ప్రస్తావన వచ్చినప్పుడు, ఓ సందర్భంలో ఎస్. జానకి ఈ రెండో పాట గురించి చెబుతూ “హిందోళ రాగం విషాదం” గా పాడడం చాలా కష్టం అని చెప్పారు. ఇక్కడ ఈ రెండు పాటలూ వినచ్చు.
ఈ వ్యాసంలో హిందోళం రాగం స్వరాలు ఇలా రాసారు. (స గ1 మ1 ధ1 ని1 స – స ని1 ధ1 మ1 గ1 స) . ఇక్కడ “ధ” వత్తు ధ వాడారు. మామూలు “ద” వాడాలి. నాకు తెలిసి తమిళులే ఇలా పలుకుతారు. మనం తెలుగు వాళ్ళమయ్యిండీ “ధ” ప్రయోగం నాకు రుచించలేదు. “ద” అని రాస్తే బాగుండేది. అచ్చు తప్పో లేక వ్యాస కర్త గారే అలా రాసేరో తెలియదు. “ధ” అని కొంత మంది తమిళ సంగీత విద్వాంసులు పాడగా విన్నాను. అలా పాడినప్పుడు వినడానికి ఇబ్బంది కరంగా ఉంటుంది.
ఈ క్రింది వెబ్ సైట్ లో కర్ణాటక సంగీత కృతులున్నాయి. కానీ ఈ పాటలు పాడిన వ్యక్తి ( పాఠాలు నేర్పుతూ ) “ద” ని మాత్రం “ధ” గా పాడడం నాకు వినడానికి బాగుండదు.
ఇవాళ సాయంత్రం మా అమ్మాయిని పార్కుకి తీసుకెళ్ళి ఓ చేత్తో దానిని ఉయ్యాలూపుతూ ఇంకో చేత్తో ఓ తెలుగు పుస్తకం పట్టుకొని చదువుతున్నా. అంతలో ఓ పెద్ద కంపెనీలో IT విభాగంలో పనిచేసే తెలుగాయన ఒకాయన పలకరించాడు. ఈ upgrades, patches తో చచ్చిపోతున్నామన్నాడు. “మీ బాధలు, మీ గాథలు / అవగాహన నా కవుతాయి!” అనుకున్నాను. 🙂
IT వాళ్ళ గతే అలా ఉంటే మిగిలినవాళ్ళు కంప్యూటర్లతో పడే అగచాట్లని ఊహించుకోగలను. కాని అవే ఈ కథకి మూలమయితే అవి ముఖ్య పాత్ర జీవితాన్నెలా ప్రభావితం చేశాయో చూపాలి – చెప్పడం కాకుండా.
సంగాలు జీవితం గురించి తెలిసినంత మాత్రం పధానపాత్ర గురించి తెలియలేదు. ముప్ఫై ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నదనీ, కథలు రాస్తుందనీ, తెలియక ఓ డొక్కు ఉద్యోగంలో పడిందనీ తెలుసనుకోండి. కథ ఉత్తమ పురుష దృక్కోణంలో చెప్పడానికి ముఖ్యకారణం పాఠకులకి నమ్మకం పెంచడానికని విన్నాను. దీంట్లో “నేను” ఔట్సోర్సింగ్, ప్రపంచీకరణ, కంప్యూటర్ టెక్నాలజీ, తెలుగు భాషా దుస్థితి, శ్రీశ్రీ కవిత్వం, జీవిత పరమార్థం – ఇలా అనేక విషయాల మీద అభిప్రాయాలు చెప్పేటప్పటికి, మూడు పేజీల కథలో జీవితానికి చోటు తక్కువయి పాఠకుణ్ణి స్పందించే అవకాశం సన్నగిల్లింది.
వారసత్వపు హక్కుగా మిద్దె జీవితాన్ని అనుభవించలేకపోయానే అని వగచే విద్యావంతురాలి పట్ల సానుభూతి ఎలా పుడుతుంది? కూరలమ్ముకొని బ్రతికిన సంగాలుకి తన ‘డూటీ’ పట్ల నిర్లిప్తత లేదు. “నేను” కి తన ‘డూటీ’ ఒక శాపం. అలా ఎందుకు పరిణమించిందో చిత్రించక పోవడం, దాన్నుంచి విముక్తి లేనట్లు చిత్రించడం, ఈ కథలో లోపం.
నాకథ ఓపిగ్గా చదివినవారికీ, చదివి అభిప్రాయాలు వెలిబుచ్చినవారికీ ధన్యవాదాలు.
సాయిలక్ష్మిగారూ, మీ అభిమానానికీ అభిప్రాయాలకీ చాలా సంతోషం అండీ. నాసంకలనం చదివినట్టు నేను విన్న సందర్భాలు చాలా తక్కువ.
హనుమంతరావు గారూ, స్థూలంగా
కథ కానీ కవిత కానీ ఒక పాత్ర అనుభవించిన రసాన్ని, ఆనందం, దైన్యం, నిస్పృహ ఏదైనా కానీ – పాఠకుడిలో కలిగిస్తే ఆకథ రక్తికట్టేననుకుంటాను నేను.. (పెద్దవారు, మీకు తెలిసే వుంటుంది. తిరిగి చెప్తున్నందుకు క్షమించండి)
మీమాట నిజమే. ఆదిలో వున్న సముద్రపుహోరు చివరికి నీరు గారిపోయింది. కథలో ముఖ్యపాత్ర అనుభవం అదేనని చెప్పడమే ఈకథలో వావుద్దేశ్యం.
రవికిరణ్ గారూ, ఇది వ్యాసం అయితే పూర్వసిద్ధాంతాలూ, ఉపపత్తులూ, నిరూపణలూలాటి సరంజామా కావాలి. తదితర వచనరచనల్లో ఏది కథ, ఏది కాదు అన్నదానికి చాలా వాదాలూ, వివరణలూ వున్నాయి. అవన్నీ ఇక్కడ సాధ్యం కాదు.
చలనం చైతన్యానికి చిహ్నం. మొత్తం మానవాళి పురోభివృద్ధికి చలనం ముఖ్యం అన్నది నేను కూడా ఒప్పుకుంటాను.
అయితే ఒకమనిషి అనుభవం లెక్కలోకి రాదు అనడం న్యాయం కాదు. ఒక్కొక్క మనిషీ కూడితేనే మొత్తం మానవాళి అయింది.
మరొకవిషయం. ఈ కథలో ప్రధానపాత్ర యాంత్రికజగత్తులోని ఈతిబాధలకి వగచినా, వాటిని పూర్తిగా విసర్జించలేదు. ఈయాంత్రకజగత్తు సుడిగాలిలో సాంకేతిపరికజ్ఞానం అట్టే లేనివాళ్లూ, వారికి కలిగే అసౌర్యాలూ కూడా భాగమే. వీరిని కూడా లెక్కలోకి తీసుకున్నప్పుడే టెక్నాలజీ విలువ సంపూర్ణంగా కొలవడం సాధ్యం అని చెప్పడానికే ఈకథ. ఇది కేవలం ఒక కోణం అనుకోండి, మీ కవితలో వ్యక్తీకరించిన స్థితి లోకంలో ప్రతిఒక్కరిస్థితీ కానట్టే. ఇదొక్కటే కోణం కాదు కానీ ఇది కూడా ఒక కోణమే.
మరోసారి థాంక్స్.
బాగుంది 🙂
నాకైతే మంచిని ఫాలో అవటం లో తప్పులేదనిపిస్తుంది. ఇక్కడే కాదు ఇండియాలో కూడా మదర్స్ డే జరుపుకుంటున్నారంట. ముఖ్యం గా టీవీ లలో అమ్మ సంబంధించిన సినిమాలు ఓ తెగ వేస్తున్నారట.
ఇంతకు సుందరం గారు పిల్లల ద్వారా వరలక్ష్మి గారికి ఏమిప్పించారు?అలాగే, ఆరోజు తనే స్వయం గా వంట చేసి వరలక్ష్మి గారికి పెట్టారా? 🙂
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి SRSRV అభిప్రాయం:
05/06/2008 3:13 pm
it seems one fine day U may tell us that there isn’t any spernatural power (GOD)
హిందోళ రాగం – అనుబంధం గురించి mOhana అభిప్రాయం:
05/06/2008 11:31 am
సాయి గారూ: నాకు తెలిసి ధైవతమునుండి ధ వచ్చింది.
కాబట్టి ధ సరియైనదే. నిజంగా ధ-కు బదులు ద అని
చెప్పినప్పుడల్లా నాకు ఒక విధంగా ఉంటుంది. హిందూస్తానీ
సంగీతకళాకారులు ధ అనే ఎప్పుడూ వాడుతారు.
కర్ణాటక సంగీతంలోనే ద అంటారు. ఇది నాకు తెలిసింది.
సంగీతం బాగా తెలిసినవాళ్లు ఇంకా చెబుతారు అని
ఆశిస్తున్నాను. – మోహన
పేరు గలవాడేను మనిషోయ్ గురించి gulti reader అభిప్రాయం:
05/06/2008 10:53 am
కొత్తపాళీ గారు మీకు బహుమతి ఎందుకివ్వలేదో? ఎంత లేడీస్ అయితే మాత్రం
ప్రతీ కధకీ ‘ఈ సారి కూడా బహుమతి రమ్యగారికే’ అనేటట్టైతే అసలు ఈ పోటీలేల? మీ కథతో చూస్తే అసలు రమ్య గారి కధ కాలిగోరికి తూగదు. ఇది నా స్వంత అభీప్రాయం.
మీ స్టోరీ సింప్లీ ‘అదిరిపోయింది.’ సింప్లీ సుపర్బ్. అందుకోండి నా శుభాకాంక్షలు!!!
హిందోళ రాగం – అనుబంధం గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
05/06/2008 9:40 am
హిందోళ రాగం చాలా ఉల్లాస వంతమైన రాగం. మనకి తెలుసున్న హిందోళ రాగంలో పాటలన్నీ జనరంజకమైనవే ! ఈ గంభీరమైన రాగాన్ని విషాదం గా పాడిన ఓ పాట ఉంది. అది “బాల్య మిత్రుల కథ” సినిమాలో “గున్న మామిడీ కొమ్మ మీదా గూళ్ళు రెండున్నాయి” అనే పాట. ఈ పాట రెండు రకాలుగా ఉంటుంది. మొదటిదేమో హుషారుగా ఉంటుంది. రెందోది విషాద ఛాయలతో ఉంటుంది. ఛాలెంజింగ్ పాటల ప్రస్తావన వచ్చినప్పుడు, ఓ సందర్భంలో ఎస్. జానకి ఈ రెండో పాట గురించి చెబుతూ “హిందోళ రాగం విషాదం” గా పాడడం చాలా కష్టం అని చెప్పారు. ఇక్కడ ఈ రెండు పాటలూ వినచ్చు.
గున్నమామిడీ ( హుషారు )
http://www.chimatamusic.com/playcmd.php?plist=6523
గున్నమామిడీ ( విషాదం )
http://www.chimatamusic.com/playcmd.php?plist=6524
ఈ వ్యాసంలో హిందోళం రాగం స్వరాలు ఇలా రాసారు. (స గ1 మ1 ధ1 ని1 స – స ని1 ధ1 మ1 గ1 స) . ఇక్కడ “ధ” వత్తు ధ వాడారు. మామూలు “ద” వాడాలి. నాకు తెలిసి తమిళులే ఇలా పలుకుతారు. మనం తెలుగు వాళ్ళమయ్యిండీ “ధ” ప్రయోగం నాకు రుచించలేదు. “ద” అని రాస్తే బాగుండేది. అచ్చు తప్పో లేక వ్యాస కర్త గారే అలా రాసేరో తెలియదు. “ధ” అని కొంత మంది తమిళ సంగీత విద్వాంసులు పాడగా విన్నాను. అలా పాడినప్పుడు వినడానికి ఇబ్బంది కరంగా ఉంటుంది.
ఈ క్రింది వెబ్ సైట్ లో కర్ణాటక సంగీత కృతులున్నాయి. కానీ ఈ పాటలు పాడిన వ్యక్తి ( పాఠాలు నేర్పుతూ ) “ద” ని మాత్రం “ధ” గా పాడడం నాకు వినడానికి బాగుండదు.
http://www.ecse.rpi.edu/Homepages/shivkuma/
-సాయి బ్రహ్మానందం గొర్తి
లింకన్ తో ఓ రాత్రి గురించి K.Mahesh Kumar అభిప్రాయం:
05/06/2008 8:40 am
బాగుంది. “పాటల్లా నవ్వడం”, ఇంకా బాగుంది.
అక్షరం పరమం పదం గురించి malathi అభిప్రాయం:
05/06/2008 2:24 am
నిజమేనెమోలెండి. మీవివరణకి thanks.
అక్షరం పరమం పదం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/05/2008 9:57 pm
Life and IT
మాలతి గారూ,
ఇవాళ సాయంత్రం మా అమ్మాయిని పార్కుకి తీసుకెళ్ళి ఓ చేత్తో దానిని ఉయ్యాలూపుతూ ఇంకో చేత్తో ఓ తెలుగు పుస్తకం పట్టుకొని చదువుతున్నా. అంతలో ఓ పెద్ద కంపెనీలో IT విభాగంలో పనిచేసే తెలుగాయన ఒకాయన పలకరించాడు. ఈ upgrades, patches తో చచ్చిపోతున్నామన్నాడు. “మీ బాధలు, మీ గాథలు / అవగాహన నా కవుతాయి!” అనుకున్నాను. 🙂
IT వాళ్ళ గతే అలా ఉంటే మిగిలినవాళ్ళు కంప్యూటర్లతో పడే అగచాట్లని ఊహించుకోగలను. కాని అవే ఈ కథకి మూలమయితే అవి ముఖ్య పాత్ర జీవితాన్నెలా ప్రభావితం చేశాయో చూపాలి – చెప్పడం కాకుండా.
సంగాలు జీవితం గురించి తెలిసినంత మాత్రం పధానపాత్ర గురించి తెలియలేదు. ముప్ఫై ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నదనీ, కథలు రాస్తుందనీ, తెలియక ఓ డొక్కు ఉద్యోగంలో పడిందనీ తెలుసనుకోండి. కథ ఉత్తమ పురుష దృక్కోణంలో చెప్పడానికి ముఖ్యకారణం పాఠకులకి నమ్మకం పెంచడానికని విన్నాను. దీంట్లో “నేను” ఔట్సోర్సింగ్, ప్రపంచీకరణ, కంప్యూటర్ టెక్నాలజీ, తెలుగు భాషా దుస్థితి, శ్రీశ్రీ కవిత్వం, జీవిత పరమార్థం – ఇలా అనేక విషయాల మీద అభిప్రాయాలు చెప్పేటప్పటికి, మూడు పేజీల కథలో జీవితానికి చోటు తక్కువయి పాఠకుణ్ణి స్పందించే అవకాశం సన్నగిల్లింది.
వారసత్వపు హక్కుగా మిద్దె జీవితాన్ని అనుభవించలేకపోయానే అని వగచే విద్యావంతురాలి పట్ల సానుభూతి ఎలా పుడుతుంది? కూరలమ్ముకొని బ్రతికిన సంగాలుకి తన ‘డూటీ’ పట్ల నిర్లిప్తత లేదు. “నేను” కి తన ‘డూటీ’ ఒక శాపం. అలా ఎందుకు పరిణమించిందో చిత్రించక పోవడం, దాన్నుంచి విముక్తి లేనట్లు చిత్రించడం, ఈ కథలో లోపం.
కొడవళ్ళ హనుమంతరావు
అంతర్మథనం గురించి radhika అభిప్రాయం:
05/05/2008 2:46 pm
చాలా బాగా రాసారండి.కధ చదువుతున్నంత సేపూ హీరో పక్కనే నిల్చుని జరిగేదంతా చూస్తున్నట్టనిపించింది.
అక్షరం పరమం పదం గురించి malathi అభిప్రాయం:
05/05/2008 11:56 am
నాకథ ఓపిగ్గా చదివినవారికీ, చదివి అభిప్రాయాలు వెలిబుచ్చినవారికీ ధన్యవాదాలు.
సాయిలక్ష్మిగారూ, మీ అభిమానానికీ అభిప్రాయాలకీ చాలా సంతోషం అండీ. నాసంకలనం చదివినట్టు నేను విన్న సందర్భాలు చాలా తక్కువ.
హనుమంతరావు గారూ, స్థూలంగా
కథ కానీ కవిత కానీ ఒక పాత్ర అనుభవించిన రసాన్ని, ఆనందం, దైన్యం, నిస్పృహ ఏదైనా కానీ – పాఠకుడిలో కలిగిస్తే ఆకథ రక్తికట్టేననుకుంటాను నేను.. (పెద్దవారు, మీకు తెలిసే వుంటుంది. తిరిగి చెప్తున్నందుకు క్షమించండి)
మీమాట నిజమే. ఆదిలో వున్న సముద్రపుహోరు చివరికి నీరు గారిపోయింది. కథలో ముఖ్యపాత్ర అనుభవం అదేనని చెప్పడమే ఈకథలో వావుద్దేశ్యం.
రవికిరణ్ గారూ, ఇది వ్యాసం అయితే పూర్వసిద్ధాంతాలూ, ఉపపత్తులూ, నిరూపణలూలాటి సరంజామా కావాలి. తదితర వచనరచనల్లో ఏది కథ, ఏది కాదు అన్నదానికి చాలా వాదాలూ, వివరణలూ వున్నాయి. అవన్నీ ఇక్కడ సాధ్యం కాదు.
చలనం చైతన్యానికి చిహ్నం. మొత్తం మానవాళి పురోభివృద్ధికి చలనం ముఖ్యం అన్నది నేను కూడా ఒప్పుకుంటాను.
అయితే ఒకమనిషి అనుభవం లెక్కలోకి రాదు అనడం న్యాయం కాదు. ఒక్కొక్క మనిషీ కూడితేనే మొత్తం మానవాళి అయింది.
మరొకవిషయం. ఈ కథలో ప్రధానపాత్ర యాంత్రికజగత్తులోని ఈతిబాధలకి వగచినా, వాటిని పూర్తిగా విసర్జించలేదు. ఈయాంత్రకజగత్తు సుడిగాలిలో సాంకేతిపరికజ్ఞానం అట్టే లేనివాళ్లూ, వారికి కలిగే అసౌర్యాలూ కూడా భాగమే. వీరిని కూడా లెక్కలోకి తీసుకున్నప్పుడే టెక్నాలజీ విలువ సంపూర్ణంగా కొలవడం సాధ్యం అని చెప్పడానికే ఈకథ. ఇది కేవలం ఒక కోణం అనుకోండి, మీ కవితలో వ్యక్తీకరించిన స్థితి లోకంలో ప్రతిఒక్కరిస్థితీ కానట్టే. ఇదొక్కటే కోణం కాదు కానీ ఇది కూడా ఒక కోణమే.
మరోసారి థాంక్స్.
మదర్స్ డే గురించి srilu అభిప్రాయం:
05/05/2008 11:20 am