పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16451

  1. చివరకు మిగిలేది గురించి Lyla yerneni అభిప్రాయం:

    05/09/2008 12:14 pm

    Kindred spirit!

    While I was getting into the pathos of the person in the poem and was ready to shed tears, and settle for – yeah! that’s it. there is nothing more left in life – the person turns tables on me and surprises me in the penultimate verse – Hey! I still feel young. My desire and lust had not died .
    And I perk up saying “what!” and read on.

    Then he really kicks butt in the final stanza making God wait around for him, while he makes no bones that he is surely never going to change.

    At that time, I just grin and grin thinking of అజామిళ the unreformed sinner, into whose hands some నార and అణా are pushed in, by people eager to send him to heaven, and try to make him utter నారాయణా!
    Good poem. Smart poem. I love this spunky poem.

    లైలా

  2. నన్నయ హంసగీతికలు గురించి Kameswara Rao అభిప్రాయం:

    05/09/2008 10:56 am

    మంచి పద్యాల గురించి మంచి వ్యాసం!
    ఈ పద్యాల కథ, ధర్మరాజు సారస్వత యాగం జరిగిన తీర్థంలో స్నానమాడి పొందిన మహానుభూతి దగ్గర మొదలౌతుందని “నన్నయ్యగారి అక్షర రమ్యత”లో వి.వి.ఎల్. నరసింహారావు గారి అభిప్రాయం. ఇక్కడ నన్నయ్యగారు పేర్కొన్న “ప్రసన్న సరస్వతీకము” రాబోయే కథలోని సరస్వతీ గీతకి (తార్క్ష్యునికి సరస్వతి చెప్పిన గీత) సూచన అని అతనుద్దేశం. అయతే ఆ భాగాన్ని ఎఱ్ఱన పూరించాడు.
    ఈ భాగం చదువుతూ ఉంటే నాకూ, అంతర్లీనంగా సాగే ఏదో అంతస్సూత్రం కనిపించీ కనిపించకుండా కనిపిస్తుంది.
    ఎఱ్ఱన చేసే సరస్వతీ నది వర్ణనకీ నన్నయ్య “భూసతికిన్…” పద్యానికీ చాలా సామ్యం కనిపిస్తుంది. ఈ పద్యంలో, భూమినీ ఆకాశాన్నీ హంసతో పోల్చినట్టుగా మీరన్నారు. కానీ ఇక్కడ శరత్కాలాన్ని సరస్వతీ బ్రహ్మల సమేతమైన “శారద”హంసతో పోల్చినట్టు నాకనిపిస్తోంది. శారద రాత్రులు, సరస్వతీ ఒకదానికొకటి విడదీయలేనంతగా అనిపిస్తాయి. ఇది ఎఱ్ఱన సరస్వతీ గీత తర్వాత చేసిన సరస్వతీ స్తుతి “అంబ! నవాంబుజోజ్వల కరాంబుజ! శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి!” అనడంతో పరిపూర్ణమైనట్టుగా తోస్తుంది.
    ఈ మొత్తం భాగంలో (నన్నయ్య శరత్కాల వర్ణన మొదలు ఎఱ్ఱన సరస్వతీ స్తుతి వరకూ), చాలా పద్యాల్లో తిరిగి తిరిగి కనిపించే పదాలూ పదబంధాలూ కూడా ఈ ఏక సూత్రతని స్ఫురింపజేస్తాయి.
    నన్నయకి హృదయఘాతం వంటిది సంభవించి ఉంటుందని కన్నా, శారద హంసనెక్కి బ్రహ్మలోకానికి ఎగిరిపోయి ఆ సరస్వతిలో కలసిపోయాడని ఊహిస్తే మనకి ఆత్మసంతృప్తి కలుగుతుంది కదా!
    మధునాపంతుల వారు ఇంచుమించు ఇలాగే ఊహించారు. ఊహించడమే కాక, దానికి ఈ వ్యాసంలో మీరిచ్చిన ఈ నన్నయ్య చివరి పద్యాలని ఆధారం చేసుకొని ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు, “నన్నయ్య భారతి” పుస్తకంలో “నన్నయగారి వెన్నెల రేయి” అన్న వ్యాసంలో.

  3. అటో యిటో గురించి CJ అభిప్రాయం:

    05/09/2008 9:26 am

    మంచిగుంది భాయి

  4. లింకన్ తో ఓ రాత్రి గురించి CJ అభిప్రాయం:

    05/09/2008 9:12 am

    ఎంటో ఒక్క ముక్క అర్ధమయితే ఒట్టు. లేదా నేను యిలాంటి ఆధునిక సాహిత్యమ్ కి దూరమేమో?

  5. లింకన్ తో ఓ రాత్రి గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:

    05/09/2008 7:29 am

    పూజారిగారు మంత్రం చెప్పి మమ అనుకోమన్నట్లు, కొడవళ్ళగారి అభిప్రాయం చదివి మమ అనుకున్నాను. ఈ కథ ముఖ్యోద్దేశం నాకు ఏ మాత్రం అర్థం కాలేదు. అమెరికాదేశ చరిత్రని మలుపు తిప్పిన లింకన్ అంతటివాడు కనబడితే సదరు ‘రాజా’ పాత్ర దుప్పటి ముసుగు తన్ని భయంతో నాస్తికత్వాన్ని వదిలిపెట్టి పొద్దున్న దేవుడికి హారతి ఇస్తాడు. పాత్రల మధ్య చక్కిలిగింతలు పెట్టుకున్నా నవ్వు రాని సంభాషణ అంతా ఈ విషయం మీదే, కాబట్టి, అసలే పసలేని కథ ఇంకా చప్పగా తయారయింది. పైగా ముగింపు కూడా రేపటినుంచి ఏ దేవుడికి పూజ చెయ్యాలన్న ఒక అర్థంలేని ప్రశ్నతో. కనీసం లింకన్ తో జరిగిన సంభాషణ వలన రాజాకి సంఘంలోని అసమానతల విషయంలో కనువిప్పు కలిగినట్లు కథ అల్లి ఉంటే ఆ మార్పు పాఠకులకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి ఉండేది.

    భవదీయుడు,
    రాజాశంకర్ కాశీనాథుని

  6. పేరు గలవాడేను మనిషోయ్ గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:

    05/09/2008 7:01 am

    ఇంత మంచి కథ వ్రాసిన రానారేగారికి అభినందనలు. ఇంకా మంచి కథలు అందిస్తారని ఆశిస్తూ
    రాజాశంకర్ కాశీనాథుని

  7. చివరకు మిగిలేది గురించి bollojubaba అభిప్రాయం:

    05/09/2008 12:31 am

    మనం నడచొచ్చేసిన మార్గాన్ని విశ్లేషించుకోవటంలో ఎంత ఆత్మానందం ఉంది. సముద్రాల గారు అన్నట్లు గతము తలచీ వగచేకన్నా సౌఖ్యమేముంది.
    కవిత చదువరి మనసుల్లో కవిఉద్దేశించిన భావాల్నె రేకెత్తించిందంటే, అంతకంటే ఆకవితకు సార్ధకత ఏముంటుంది. కవికి ధన్యతేముంటుంది?

    బావగారో మంచి బాలుడనుకునే మరదలు అన్న వాక్యంలో బాలుడు అనే మాట కంటే పురుషుడు/భర్త/మగడు/వ్యక్తి అంటే బాగుంటుందేమో. ఆ సంభోదన మరదలి తరపున అంత ఉచితంగా అనిపించటంలేదు. (బహుసా మీరు రాముడు మంచి బాలుడు అన్న రీతిలో చెప్పాలనుకుంటున్నారా)

    చాలా మంచి కవిత చదివించారు.

    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/

  8. పేరులేదు గురించి bollojubaba అభిప్రాయం:

    05/09/2008 12:20 am

    చాలా అద్బుతమైన కవిత
    పైకామెంటు చదివిన తరువాత కవితపై ఇంకా గౌరవం పెరిగింది. డా. స్మైల్ గారి కన్నా మించి నేనేమి చెప్పగలను. ఏకీభవించటం తప్ప.
    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/

  9. నీటి అద్దాలు గురించి bollojubaba అభిప్రాయం:

    05/09/2008 12:17 am

    ఫణి గారికి
    మీ కవిత మంచి ఆర్ధ్రతతో ఉంది. ఒక మంచి లైఫ్ సైజ్ స్కెచ్ ని అక్షరబద్దం చేసారు. చాలాబాగుంది.

    బొల్లోజు బాబా

    http://sahitheeyanam.blogspot.com/

  10. పేరు గలవాడేను మనిషోయ్ గురించి teresa అభిప్రాయం:

    05/08/2008 1:57 am

    రమ్య గారి కథ ఎవరి కాలిగోరుకో తూగదు అనే బదులు ఆవిడ కథ కాలి గోరు ఎందుకయ్యిందో, రానారే గారి కథ సూపర్ ఎందుకయ్యిందొ గుల్టి శర్మ గారు వివరింవచితే మా బోంట్లకు ఉపయోగపడేది.