పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16452

  1. పల్లకీ.. గురించి Seetha అభిప్రాయం:

    05/25/2008 8:59 pm

    కథ చాల బాగుందండీ…

  2. పేరు గలవాడేను మనిషోయ్ గురించి ప్రవీణ్ గార్లపాటి అభిప్రాయం:

    05/25/2008 3:28 am

    కథ చాలా బాగా కుదిరింది రానారె. చక్కగా నడిచింది.

    కొత్తపాళీ గారి ఇతివృత్తానికి సంబంధించినది అన్నావు కాబట్టి ఒక్క విషయం. కథలో కాగితానికన్నా రేడియోకి ఇచ్చిన ప్రాధాన్యం అధికమనిపించింది. అలా ఉండకూడదని కాదు.

    అలాగే ఒకే రకమయిన నేటివిటీకి అతుక్కుపోకుండా వేరేవి ప్రయత్నిస్తే కుడా బాగుంటుంది.

  3. లింకన్ తో ఓ రాత్రి గురించి ప్రవీణ్ గార్లపాటి అభిప్రాయం:

    05/25/2008 2:52 am

    పైన జరిగిన చర్చ చాలా రసవత్తరంగా బాగుంది.

    నా వరకూ కథ పెద్దగా నచ్చలేదు. ఇందులో హాస్యం పాళ్ళ కోసం రాసానని రచయిత చెప్పినా కథలో ఆ పాళ్ళు పెద్దగా లేవనే నాకనిపించింది. కథనం నడిపిన విధానం బాగానే ఉంది.

    అన్నిటికన్నా నాకు నచ్చనిది లింకన్ పాత్రనే దెయ్యం గా ఎంచుకోవడం ఎందుకు ? ఆ పాత్రకి సంబంధించిన సంభాషణ జరగలేదు. అంటే లింకన్ కి సంబంధించి జరిగిన చర్చ ఏదీ లేదు కథలో. ఆ పాత్రని దేనితో మార్చినా కథ అలాగే ఉంటుంది. అలాంటప్పుడు ఒక ప్రముఖ కారెక్టరుని ఉపయోగించడం అనవసరం.

    ఇక రచయితలు విమర్శలని స్వీకరించే విధానంలో మార్పు రావాలనే నా ఉద్దేశం కూడా. విమర్శ మంచిది అనిపిస్తే దానిని స్వీకరించి తమ రచనా విధానంలో మార్పులు చేసుకోవచ్చు. అలా కాక నే ఆలోచించిన విధానంలోనే పాఠకులు కూడా ఆలోచించాలి అనుకుంటే వారికే నష్టం. విమర్శలో పస లేకపోతే దానిని దాని మానాన వదిలెయ్యవచ్చు.

  4. పేరులేదు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/23/2008 9:29 pm

    “ప్రశ్నలే శాశ్వతం”

    శ్రీశ్రీ షష్టిపూర్తికి ఇస్మాయిల్ రాసిన “శ్రీశ్రీ జన్మ వృత్తాంతం,” అన్న వ్యాసంలో, “కవిత్వమైనా తత్త్వమైనా సందేహాల్లోంచి, ఆందోళన నించి, తిరుగుబాటు నించీ పుడుతుంది. ప్రశ్నలే శాశ్వతం. సమాధానాలు కావు. సమాధానాలతో సంతృప్తి పడితే వెంటనే చస్తుంది కవి ప్రతిభ,” అన్నారు.

    ప్రశ్నలతో కూర్చిన పదచిత్రాలతో నిండిన కవిత మనసుని పట్టేసింది. తూచేరాళ్ళని కాదు గాని, నేను స్థూలంగా కవితలని – అర్థంకాని, మామూలు, మంచి, గొప్ప అని – నాలుగు రకాలుగా చెప్పుకుంటాను. ఇది నిస్సందేహంగా మంచి కవిత. నా దృష్టిలో గొప్ప కవిత్వానికున్న ఒక గుణం – కంఠస్థనీయం కావడం. ఈ కవిత గొప్పది కాగలిగి ఉండీ కాలేదనిపించింది. అందుకు అక్కడక్కడా అనవసరంగా వాడిన మాటలే కారణం. క్లుప్తత ముఖ్యం అంటారు, ముఖ్యంగా కవిత్వానికి.

    తనకి పేరులేకపోయినా కవికి పేరుతెచ్చే కవిత.

    కొడవళ్ళ హనుమంతరావు

  5. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి నాగమురళి అభిప్రాయం:

    05/23/2008 8:47 am

    మోహన గారూ,
    జాతకాల్ని బట్టీ, గ్రహచారాన్ని బట్టీ ఏదైనా సరే తెలుసుకోవడం సాధ్యమే అని జ్యోతిషం అంటుంది. అయితే అది చెప్పే విషయాలు ఏవీ ఇంతవరకూ శాస్త్రీయమైన పరిశీలనకి నిలిచినవి కావు.

    నాకు తెలిసినంత వరకు భారతీయ జ్యోతిష గ్రంథాలు కొన్ని జాతకాన్ని బట్టి అది స్త్రీ జాతకమా, పురుష జాతకమా, లేకపోతే ఏ జంతువు జాతకం అన్నది చెప్పవచ్చును అంటాయి. అలాగే పాశ్చాత్య జ్యోతిషంలో ఆధాన చక్రం (జీవుడు గర్భస్తుడైన క్షణంలో గ్రహ స్థితిని తెలియజేసే చక్రం) ద్వారా లింగ నిర్ధారణ చెయ్యవచ్చు అని సిద్ధాంతాలు ఉన్నాయి.

    హస్త రేఖలు జాతకంలోని గ్రహస్థితుల్నే ప్రతిబింబిస్తాయి అని చాలామంది జ్యోతిష్కుల నమ్మకం. దీని మీద కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయి అనుకుంటాను.

    మీకేమైనా వీటి గురించి రెఫరెన్సులు కావాలంటే, మొదట గూగుల్ లో Pre-natal epoch లేదా Pre-natal horoscope అని వెతికి చూడండి. జాగ్రత్తగా చూస్తే చాలా సమాచారమే దొరుకుతుంది.

    ఇవి అన్నీ జ్యోతిషంలో పై తరగతి పాఠాలు (Advanced Topics). ఒకదశలో నేను చాలా ఆసక్తి చూపినా వీటి విశ్వసనీయత చాలా సందేహాస్పదమని క్రమేణా గ్రహించాను.

    భాస్కరాచార్యులే కాదు, జ్యోతిషంలో ఎంతటి పండితులైనా సరే నూటికి యాభైశాతాన్ని మించిన సందర్భాల్లో నిజంగా, ఖచ్చితంగా భవిష్యత్తు చెప్పగలరు అంటే నేను నమ్మను. అలా చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఈ కాలంలో ఉంటే, ఈ పాటికే మన సైన్సు వేరే విధంగా ఉండి ఉండేది. మనం అందరం జ్యోతిషాన్ని పాఠశాలలో చదువుకుని ఉండేవాళ్ళం.

  6. అటో యిటో గురించి santhosh అభిప్రాయం:

    05/23/2008 7:35 am

    hi ramya garu,
    Very well defined story to showcase the actual circumstances in present world.

  7. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి mOhana అభిప్రాయం:

    05/23/2008 6:19 am

    వ్యాసం ఆసక్తికరంగా ఉందన్న విషయంలో సందేహం లేదు.
    నాకు వచ్చిన సందేహాలు –
    (1) ఒక జాతకం ఆడదానిదో, లేక మగవాడిదో అని చెప్పడానికి
    వీలవుతుందా?
    (2) ఒక జాతకం మనిషిదో లేకపోతే పిల్లి, కుక్కలాటి జంతువుదో
    అని చెప్పడానికి సాధ్యమవుతుందా?
    ఇక పోతే, భాస్కరాచార్యునివంటి మహా మేధావి తన కూతురు
    లీలావతి విధవ అవుతుందని అవగాహన చేసికో లేక పోయారు.
    కవలలకు హస్త రేఖలు మున్నగునవి వేరుగా ఉంటాయి.
    హస్తరేఖలు వేరైతే భవిష్యత్తు కూడా వేరుగా ఉంటుంది గదా!

    విధేయుడు – మోహన

  8. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి నాగమురళి అభిప్రాయం:

    05/22/2008 1:09 pm

    లక్ష్మన్న గారూ,

    నిజమే, జ్యోతిషం చాలా ఆసక్తికరమైన విషయం. ఈ ఆసక్తికి ప్రధాన కారణం నా ఉద్దేశ్యం ప్రకారం ఇదీ – చాలామంది మనుషులకి తమకి తెలియకుండానే కొంత ‘అధి భౌతిక దృక్పథం’ (Mystical లేక Magical Thinking అనడం సరైనదేమో) ఉంటుంది. నా జీవితంలో పరిస్థితులు ఇలా ఉండడానికి ఏదో పైకి కనిపించని కారణం ఉండి ఉంటుంది (పూర్వ కర్మ లాంటివి). ‘నాకే ఇలా ఎందుకు జరుగుతోంది’ అని మనలో చాలామందిమి ఏదో ఒక సందర్బంలో ప్రశ్నించుకునే ఉంటాము. ఏదో ఒక కారణం వల్లనే మన గతమంతా అలా జరిగింది అనీ, ఏదో ఒక హేతువు ప్రకారమే భవిష్యత్తు కూడా జరుగుతుంది అనీ చాలా ఎక్కువ శాతం మందికి ఒక సహజమైన అభిప్రాయం ఉంటుంది. మన పరిధిలో లేకుండా జరిగే విషయాలని అర్థం చేసుకోడానికి, సర్దిచెప్పుకుని సమాధానపడడానికి ఈ విధమైన దృక్పథం ఒక సహజాతం (instinct) లా పనిచేస్తుంది (చాలా మందికి) అని నా అభిప్రాయం. దాన్ని నేను దుర్బలత్వంగా భావించను – ‘అతి’ లేనంతవరకూ.

    జ్యోతిషానికి పునాదులు ఇటువంటి సహజాతాల్లో ఉన్నాయి కాబట్టి అది ఇంకా అనేక సంవత్సరాలపాటు నిలబడి ఉంటుందనే నేను అనుకుంటున్నాను. జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళూ, అధ్యయనం చేసేవాళ్ళూ కూడా దాన్ని ఒక ఖచ్చితమైన శాస్త్రంగానే (Deterministic అనే) భావిస్తారు. అయితే అధ్యయనం చేసేవాళ్ళు అది ఖచ్చితంగా పని చెయ్యాలి అని పట్టుబట్టి, లోతుగా పరిశీలించదలచుకుంటే మాత్రం అంతిమంగా నిరాశ పడక తప్పదు. అది నా స్వంత అనుభవం. అయితే అది ఖచ్చితంగా పని చెయ్యకపోయినా, పని చేస్తున్నట్టు ఉభయులకీ అనిపిస్తుంది అనడంలో మాత్రం నాకు సందేహం లేదు. తమవద్దకు వచ్చినవాళ్ళనీ, వాళ్ళ సమస్యల్నీ లోతుగా అర్థం చేసుకుని, పరిష్కారాలు చూపించి, సంతృప్తిపరచగల వ్యక్తిత్వమూ, చాతుర్యమూ, వివేకమూ గలవాళ్ళకి జ్యోతిషం చాలా ఉపయోగకరమైన పనిముట్టు. అయితే వ్యక్తుల ప్రతిభతో ప్రమేయం లేకుండా ఒక పనిముట్టుగానే దాని సామర్థ్యాన్ని పరిశీలించదలచుకున్నవాళ్ళకి మాత్రం అది ప్రస్తుతానికి ఎండమావి లాంటిదే.

    ఇక కవలల సంగతి. ఏ జ్యోతిష గ్రంథంలోనైనా సరే దీని గురించి చర్చ జరగకుండా ఉండదు. భూమియొక్క దైనందిన చలనం (Diurnal Motion) ప్రకారం సుమారుగా ప్రతీ నాలుగు నిమిషాలకీ ఒక డిగ్రీ చొప్పున తూర్పున ఉదయించే బిందువు (లగ్నం), అలాగే మిగతా భావాలూ మారుతూ ఉంటాయి. చాలా మంది జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం ఈ బిందువుల్లో ఎంత సూక్ష్మమైన తేడా వచ్చినా సరే ఫలితాలు మారుతాయి. మరీ ముఖ్యంగా భారతీయ జ్యోతిషంలో రాశి చక్రాన్ని చాలా సూక్ష్మ భాగాలుగా చేసి ఫలితాలు చూసే సాంప్రదాయాలు (నవాంశ, దశాంశ, త్రింశాంశ మొదలైన విభాగాలు) ఉన్నాయి. వాటి ప్రకారం జన్మ సమయంలో ఒక్క నిమిషం తేడా వచ్చినా సరే ఫలితాలు మారిపోతాయిట. అయితే ఆచరణలో మాత్రం అత్యధికశాతం జ్యోతిష్కులు అంత దగ్గరి జాతకాలకి భిన్న ఫలితాలు చెప్పలేరు. అంతేకాదు, చాలా మంది జాతకుల జన్మ సమయాలు కూడా నిమిషంతో సహా ఖచ్చితంగా ఎవరికీ తెలియవు. అందుచేత ఎవరికైనా చెప్పిన ఫలితాలు తప్పిపోతే, ’జన్మ సమయం తప్పై ఉంటుందమ్మా, అది చాలా ఖచ్చితంగా తెలియాలి’ అని జ్యోతిష్కులు తప్పించుకుంటూ ఉంటారు.

    కొన్ని పుస్తకాల్లో ఒక్క నిమిషం ఎడంగా పుట్టిన కవలల జాతకాలని ఉదాహరణగా ఇచ్చి, ‘చూశారా ఒక్క నిమిషమే తేడా ఉన్నా, ఫలానా సూక్ష్మాంశం మారిపోవడం వల్ల అసలు ఇద్దరి జీవితాలకీ పొంతనే లేదు!’ అని రాస్తూ ఉంటారు. అయితే ఆ కవలల విషయంలో అన్వయించిన అదే సూక్ష్మాంశం మరొక మామూలు జాతకానికి ఎందుకు అన్వయించరో బోధ పడదు. అంతే కాకుండా అటువంటి సూక్ష్మాంశాలవల్ల నిజంగా మిగతా జాతకాల్లో కూడా ఫలితాలు ఎలా తేడాగా వస్తున్నాయో వివరణలు ఉండవు. వాటికి మాత్రం ఎక్కువ కాలావధిలో మారిపోని అంశాలనే పరిగణనలోకి తీసుకుని ఫలితాలు చెప్పేస్తూ ఉంటారు.

    పాశ్చాత్య జ్యోతిషంలో భూమి యొక్క దైనందిన చలనం (Diurnal Motion) ప్రకారం ప్రిడిక్షన్సు చెప్పే పద్ధతి ఒకటి బహుళ ప్రాచుర్యంలో ఉంది. దానిలో జన్మ సమయం ఒక నాలుగు నిమిషాలు తేడా వస్తే, ఫలితం జరగాల్సిన సమయం ఏడాది దాకా మారిపోతుంది. కాబట్టి ఈ పద్ధతిని రివర్సులో ఉపయోగించి జన్మ సమయాన్ని సరిచేస్తూ ఉంటారు. అంటే, మొదట ఒక జాతకాన్ని చూసి, పెళ్ళి జరిగే తేదీని లెక్క వేశాము అనుకోండి. జాతకుడికి పెళ్ళి ఎప్పుడైందో కనుక్కుంటే, మనం కట్టిన తేదీకి సరిగ్గా ఒక ఏడాది తరవాత పెళ్ళి అయిందనుకోండి. అంటే, మన లెక్కలో ఒక డిగ్రీ తేడా వచ్చింది అన్నమాట. భావ బిందువు ఒక డిగ్రీ జరగడానికి పట్టే కాలాన్ని (నాలుగు నిమిషాల్ని) జన్మ సమయానికి కలిపేస్తే, లెక్క సరిపోతుంది. కాబట్టి ఆ విధంగా జన్మ సమయాన్ని సరి చేస్తూ ఉంటారు.

    సరదాగా ఒకసారి పరిశీలించి చూసుకోండి – మీకూ, మీ అన్న గారికీ వివాహం, ఉద్యోగం, సంతానం ఇలాంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు ప్రతీవాటికీ సుమారు ఒక ఏడాది తేడా వస్తూ ఉంటే, ఈ పద్ధతి నిజమేనేమో అని మీరూ అనుమానించవచ్చు.

    కవలల జీవిత విశేషాలు తెలుసుకుని, వాళ్ళ జాతకాలని సరిపోల్చడమనేది అనేకమంది జ్యోతిష్కులకి చాలా ఆసక్తికరమైన, కూతూహలమైన పని. కాబట్టి మీ ఇద్దరి జన్మ వివరాలూ ఏ జ్యోతిష విద్యార్థికి ఇచ్చినా వాళ్ళు ఎగిరి గంతేస్తారని ఖచ్చితంగా చెప్పగలను.

    ఇక మీరు లేవనెత్తిన మరొక ప్రశ్న – విభిన్న ప్రాంతాల్లో పెరగడం వల్ల మా జీవిత విశేషాల్లో తేడాలు వస్తాయా? అని. ఈ ప్రశ్న కవలలకే కాదు, అందరికీ వర్తిస్తుంది. ఒక జ్యోతిషాంశం అన్ని దేశాల, సమాజాల వాళ్ళకీ ఒకే రకంగా పని చేస్తుందా ? దీని గురించి ’జ్యోతిషమూ – కొన్ని సూక్ష్మాంశాలూ’ అన్ని అధ్యాయంలో నేను కొద్దిగా చర్చించదలచుకున్నాను కాబట్టి ఇప్పటికి వదిలేస్తున్నా.

  9. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    05/22/2008 10:57 am

    నాగమురళి గారూ:

    చాలా సున్నితమైన విషయం పై చాలా చక్కటి వ్యాసాలను అందిస్తున్నారు.

    జాతకం, జోతీష్యం వంటివి చాలా మందికి ఇష్టమైన విషయాలు. వీటిలో భవిష్యత్తు నిర్ణయం ఎలా జరుగుతుంది అన్నది అనుమానాస్పదమైనా, చాలా మందికి తమ భవిష్యత్తు తెలుసుకోవాలనే కూతూహలమే, ఈ నాటికీ ప్రజాదరం పొందుతున్న ఈ విషయాలకు కారణం.

    హేతువాద బుద్ధితో ( జాతకం – జోతీష్యం వంటివి నిర్దిష్టమైన శాస్త్రాలు కావని తెలిసినా) ఆలోచించే వ్యక్తులకి కూడా వీటి పై కుతూహలం ఎక్కువే! ఇటువంటి విషయాలను తల్చుకున్నప్పుడల్లా, “మనిషి సహజంగా దుర్బలుడు” అని అనిపిస్తుంది. జీవితంలో వచ్చే కష్టాలు తట్టుకోలేక కొంతమంది భక్తులుగా ఎలా మారతారో, ముందు నమ్మకం లేకపోయినా పరిస్థితుల ప్రోద్బలం వల్ల జాతకం, జోతీష్యం పై నమ్మకం ఏర్పరచుకొన్న వ్యక్తులు నాకు తెలుసు.

    ఒక స్వవిషయం.

    కవలపిల్లలం అయిన రామన్నా, నేనూ జాతకం ప్రకారం ఇద్దరూ ఒకే రకమైన భవిష్యత్తు ఉన్న వాళ్ళమేనా! లేక, మా ఇద్దరి మధ్య ఉన్న ఐదు నిమషాల తేడా వల్ల (నా కన్నా ఐదు నిమషాలు వయస్సులో పెద్ద కాబట్టి తనను, నేను” అన్న” అని పిలవమంటాడు మా “రామన్న”. నేను రామన్నని అలా ఎప్పుడూ పిలవలా!) ఇద్దరి జాతకాలూ చాలా భిన్నంగా ఉంటాయా? పుట్టటం దాదాపు ఒకే కాలంలో జరిగినా, విభిన్న ప్రాంతాలలో పెరగటం వల్ల వచ్చిన అనుభవాల వల్ల – మా ఇద్దరి భవిష్యత్తులు తేడాగా ఉంటాయా? ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు మా ఇద్దరి జాతకాలను ఎలా పరిశీలిస్తాడు? ఫలితాలు ఎలా ఉంటాయి? తెలుసుకోవాలని ఉంటుంది.

    తేలిక తెలుగులో, చదవటానికి వీలుగా ఉన్న మీ వ్యాసాలకి ధన్యవాదాలు.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  10. పేరులేదు గురించి Sivasankar అభిప్రాయం:

    05/22/2008 4:08 am

    Its so nice, the way daily we see lives you expressed in a poetic style.. its really superb.. its touching hearts..