పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16452

  1. 3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    06/03/2008 1:56 pm

    వేమూరి గారూ,

    మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలు. మమ్మల్ని చూసాకా తెలుగు భాషకి ఢోకా లేదని మీకు అనిపిస్తే మా లాంటి చిన్న వాళ్ళందరికీ అవి ఉత్ప్రేరకాలు. కాకపోతే మొదట్లో మీరు చెప్పిన దానికి చిన్న వివరణ –
    సదస్సు కిటకిటలాడిపోయిందని ఎక్కడా రాయలేదు. ఆరోజు సభకైతే సుమారు 243 మంది వచ్చారు. అందరూ ఒకే సారి లేరు. వచ్చీ పోయే జనాభాతో కలుపుకొని అంతమంది లెక్కకొచ్చారు. ఇసకేస్తే రాలనంత జనం, హాలు కిటకిట లాడింది, నేల ఈనింది లాంటి ఉపమానాలు తెలుగు సాహితీ సదస్సుల్లో భూతద్దం పెట్టి వెదికినా దొరకవని నాకు గట్టి నమ్మకం.

    మరోసారి కృతజ్ఞతలతో

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  2. అంతర్మథనం గురించి AMMAVARU అభిప్రాయం:

    06/03/2008 2:42 am

    చాలా బాగున్నది.

  3. రచయితలకు సూచనలు గురించి శివకుమార్ దిన్నిపాటి అభిప్రాయం:

    06/03/2008 2:40 am

    అయ్యా ముందుగా నమస్కారములు,

    మీ యొక్క భాషాభిమానానికి, మన భాషకు మీరు చేస్తున్న కృషికి మీరు అభినందనీయులు. మీ ఈమాట మరిన్ని హంగులతో అందరిని అలరించాలని సహృదయంతో,

    శివకుమార్ దిన్నిపాటి.
    దుబాయ్ – యునైటెడ్ అరబ్ యెమిరేట్స్

  4. అటో యిటో గురించి ramya అభిప్రాయం:

    06/02/2008 9:13 am

    santhosh గారు థాంక్యు.
    murali lekkala గారు మీరు రాసిన విషయం చదివి నాకు చాలా బాధ కలిగింది. మీ అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  5. పాప గురించి శ్రావ్య అభిప్రాయం:

    06/01/2008 11:53 pm

    చాలా బాగుందండి. మా నాన్నగారు కూడా మొక్కల విషయము లో ఇలాగే అంటూ ఉంటారు.

  6. లింకన్ తో ఓ రాత్రి గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:

    06/01/2008 6:37 am

    సౌమ్య గారికి,

    ఎంత సెక్సిస్టు ఆలోచన సరళి నుంచి తప్పుకున్నావని అనుకున్నా, తెలీకుండానే ఏ హానీలేదనిపించే, అమాయకవైన పద ప్రయోగంతో బయటపడే మురికిని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. నేను కూడా మాలతి గారికి జవాబిస్తూ రచయిత్రి బదులు రచయిత పదం వాదటం జరిగింది. రచయిత(త్రి) అనే పద ప్రయోగం కాకుండా లింగబేధం సూచించని తెలుగు పదం ఎవరన్నా సూచిస్తే బాగుండు రచయిత(త్రి) బదులు.

    [ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఫెమినిస్టుల ఉద్యమాల కారణంగానే ఇంగ్లీషులో authoress, actress, waitress, stewardess వంటి పదాల వాడుక దాదాపు కనుమరుగైపోయింది. రచయిత అన్న పదాన్ని లింగరహిత (gender neutral) నామవాచకంగా ప్రయోగించడం తెలుగులో కొంత కాలం నుంచే ఉందన్న అభిప్రాయం తోనే, ఈమాటలో కూడ రచయిత్రికి బదులుగా రచయిత అన్న పదాన్ని ఈ మధ్య కాలంలో వాడుతూ వచ్చాము. – సంపాదకులు]

  7. ఈమాట మే 2008 సంచిక విడుదల గురించి ప్రవీణ్ గార్లపాటి అభిప్రాయం:

    05/31/2008 1:30 am

    ఈ మాట కొత్త లోగో బాగుంది.

    కానీ లోగో ఫ్లాష్‌లో అవసరం లేదనిపిస్తుంది. నెమ్మదిగా లోడవుతుంది. ఆనిమేషను లాంటివి లేనప్పుడు పీఎన్జీ లేదా జేపెగ్ ఫార్మాట్లలో ఉన్న బొమ్మని వాడితే సరిపోతుంది.

  8. అటో యిటో గురించి murali lekkala అభిప్రాయం:

    05/31/2008 12:31 am

    మీ కధ చాలా బావుంది; సగటు మనిషి ఆలోచనను తెలియజేసింది. ఇటువంటి సంఘటనలు నాకు ఎదురుకానప్పటికి, నా ఎదురుగా జరిగిన సంగతిని మీకు వివరిస్తాను.

    నా ఊరు విజయవాడ దగ్గర పల్లెటూరు. ఓ రోజు విజయవాడలో పని ముగించుకోని సరదాగా సినిమా చూసి వచ్చేసరికి మా ఊరి బస్సు వెళ్ళిపోయింది. సరే ఇప్పుడు ఏమి చేద్దాం అనుకుంటూ ఆటో కోసం నిలబడగా, నా పక్కన ముగ్గురు వ్యక్తులు కూడా ఆటో కోసం చూస్తున్నారని అర్ధమైంది. ఇంతలో సడన్ గా ఓ ఆటో వచ్చి ఆగటం అందరం దానిలో కూర్చోవటం జరగింది. ఆటో బయలుదేరటంతో వస్తున్న గాలికి నిద్ర ముంచుకురాగా తల పక్కకు వాల్చాను. మళ్ళీ జేబులో ఉన్న డబ్బులు గుర్తుకురాగా నిద్ర తూచ్ మన్నది. నా ఎదురుగా కూర్చున్న వ్యక్తులు మూడు ముక్కలాట మొదలుపెట్టారు. వాళ్ళ ఆటను చూస్తున్న నా పక్కన వ్యక్తి కూడ డబ్బులు పెట్టడం మొడలుపెట్టాడు. కొద్ది సేపటికే డబ్బు కోల్పోతున్న అతనిని వద్దు అని వారించకుండా నాకెందుకులే అని నిద్ర నటించా. నేను అతను కలిసి ఒకేచోట దిగాము.

    చివరిగా నాకు తెలిసింది ఏమిటంటే మిర్చి అమ్ముకువస్తున్న అతను మొత్తం సోమ్ము పోగొట్టుకున్నాడని . వాళ్ళ చెళ్ళి పెళ్లికి బంగారం కోసం ఆ డబ్బులు అంట. చివరిగా అతను “సార్ మీరు అన్నా వారించక పొతిరి . డబ్బులు పోయి, నేను ఇంటికి ఎలా వెళ్ళాలి?” అన్నాడు. నేను ఏదో సర్ది చెప్పి నా ఇంటికి వెళ్ళిపోయాను. తరువాత రోజు తెలిసింది అతను పురుగుల మందు తాగి చనిపోయాడని!

    నిజంగా ఆరోజు నేను వారించి ఉంటే ఏమి జరిగేదో…

  9. లింకన్ తో ఓ రాత్రి గురించి Sowmya అభిప్రాయం:

    05/30/2008 9:09 pm

    @praveen: నేను రచయిత్రిని. రచయితను కాను :).

    లింకన్ నే ఎందుకు పెట్టాను? ఇంకెవరినన్నా పెట్టుండొచ్చు. నిజమే. కానీ, ముందే చెప్పినట్లు, లింకన్ ఆత్మ గురించి ప్రచారంలో ఉన్న కథలే ఈ కథకి inspiration. కనుక నేను ఇంకోళ్ళని పెట్టుకోలేను. ఇది లింకన్ ని కించపరచడం కాదు అని మరోసారి మనవి చేసుకుంటున్నా.

  10. వ్యవహారిక భాషా ఉద్యమంపై ఈమాట ప్రత్యేక సంచిక గురించి Rao Vemuri అభిప్రాయం:

    05/30/2008 7:17 am

    రెండు వారాల వ్యవధి ఇచ్చి రాయమంటే ఎలాగండీ!