పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. గ్రామ్యాదేశ నిరసన సభ – కందుకూరి వీరేశలింగం పంతులుగారి ప్రసంగము గురించి Indrajit అభిప్రాయం:

    06/18/2008 3:55 am

    వ్యాసంలో వాడపల్లి శేషతల్పశాయి గారి URL తప్పుగా ఉంది. మీరు ప్రచురించింది http://www.www.andhrabharati.org. కానీ అసలైనది http://www.andhrabharati.com/. ఈ మార్పు చేయగలరు.

  2. ఈమాట జూన్ 2008 ప్రత్యేక సంచిక గురించి పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    06/17/2008 9:33 pm

    కామేశ్వరరావు గారు:

    ఇది మీరు 06/12/2008 నాడు రాసిన వ్యాఖ్యకు followup.

    పాఠ్యపుస్తకాలలో బోధనా భాష విషయమన్నది ఈ వాదులాటకి ఒక catalyst లాంటిది మాత్రమే. నా దృష్టిలో యీ ఉద్యమానికి మూలకారణాలు వేరే చోటున్నాయి (ఒక ముఖ్య కారణం అచ్చుయంత్ర ప్రవేశం). మీరు మొదటి పేరాలో చెప్పిన మిగిలిన విషయాలతో అందరూ (నేనైతే) ఏకీభవిస్తారు (ను). కాకుంటే ఈ కింది వాక్యమెందుకు ప్రస్తావించారో బోధపడలేదు. ఇదే సందని కావ్యాలోని శృంగారరసం ఉన్న భాగాలు పాఠ్యపుస్తకాలలో ఉండకూడదని సంబంధం లేని చర్చ ఇంకొకటి. ఈ రెండు చర్చలకు ఎలాంటి సంబంధం లేదు. వీటిలో పాల్గొన్న వ్యక్తులు/సంస్థలు (వావిళ్ళ వారినొక్కరిని మినహాయిస్తే!) కూడా వేర్వేరు అని మీకు నేను చెప్పనవసరం లేదు.

    కందుకూరి మధ్య మార్గం పాటించిన మనిషిగా ఎలా చెప్తున్నారో అర్థం కాలేదు. వివరించగలరు. గురజాడ “కొత్తపాతల మేలు కలయిక” అన్నప్పుడు ఆశు (/మౌఖిక), లిఖిత సంప్రదాయాల్ని కలుపుకుంటూ అన్న అర్థంలో వాడాడు. భావకవులకు ఆశుకవిత్వం పట్ల, “గ్రాంథికం” పట్ల వున్న అయిష్టత తెలిసినదే.

    అలాగే తి.వెం.కవులు గ్రాంథికవాదాన్ని తిరస్కరించారని ఏ ఆధారంతో చెప్తున్నారో కూడా నాకు బోధపడలేదు. తిరుపతిశాస్త్రి గారు జీవించి వున్న కాలంలో వారిద్దరూ “వ్యావహారిక వాదానికి” అనుకూలురు కాదు. నిజానికి చాలకాలం (అంటే జమీందారుల పోషణ పొందినంతకాలం), వారే చాలాచోట్ల చెప్పుకున్నట్లు, తెలుగంటే చిన్నచూపే (చూ: కథలు-గాథలు, మూడు భాగాలూ). వెంకటశాస్త్రి గారు చివరిరోజుల్లో కూడా “వ్యావహారికానికి” అనుకూలుణ్ణని చెప్పుకోలేదు. ఒక ఉదాహరణ:

    “నేనీ పొత్తమును సర్వసాధారణమయిన వ్యవహారిక భాషలోనే వ్రాస్తాను. 64 వత్సరములు నిండు వయస్సులో వ్రాస్తూ వున్న దీనిని చూచి, నన్ను “తుద కబ్బెరా తురక భాష” అని నా మిత్రులూ, శిష్యులూ లోనగువారు కొందరు నిందింతురని నక్కు తెలిసిన్నీ, నేనిట్టి భాషను సమర్థించు వారిలో చేరినవాడను కాక యుండిన్నీ, ఇందులో వ్రాయుటకు కారణము, నాకు ఈ భాష అంటే అంతగా యిష్టం లేకపోయినా, ద్వేషం కూడా అంతగా లేదని లోకులకు తెలియజేయటమే నా ముఖ్యోద్దేశ్యము.” (చూ: కాశీయాత్ర, 1942)

    ఏమయినా, వాళ్ళు, ముఖ్యంగా చెళ్ళపిళ్ళ, ఏ గాటానా కట్టడానికి లొంగని వ్యక్తులు :-). వాళ్ళ Cultural Biography ఎవరైనా రాయవలసిన అవసరం యెంతైనా వుంది.

    సంస్కృత ప్రభావంతో “తెలుగుకున్న వ్యాకరణదీపం చిన్నదనే” భావన పండితలోకంలో చాలాకాలం బలంగా వుంది. అది చెళ్ళపిళ్ళవారి అభిప్రాయం మాత్రమే కాదు.

    #[…] All Telugu courtly poets proudly proclaimed that they commanded scholarship in Sanskrit, Prakrits of different varieties, Puranas, Sastras and a host of related subjects like meter. While they composed poetry almost entirely in Telugu, they did not have to support their Telugu by texts of grammar or dictionaries: Telugu was a language of poetry, not of scholarship. When challenged, the court poet supported the Sanskrit words he had used in his poem by quoting the great Sanskrit lexicographers of the past, but for his Telugu words, he only needed the approval of past usage by an earlier court poet. There was also a long and sustained effort on the part of grammarians and lexicographers to produce a set of rules and dictionaries for the Telugu used in courtly poems. None of them however had the status of the famous Sanskrit grammarians and lexicographers.[…*] #

    నాకు తెలిసి మధ్యేమార్గస్తుడెవరైనా వుంటే అది గురజాడ మాత్రమే.

    చివరిగా మీరు ముగింపులో ప్రస్తావించిన రెండు విషయాలపై మాత్రం యెంతైనా చర్చ జరగవలసిన అవసరం వుంది.

    — శ్రీనివాస్

    * V. Narayanarao, Print and Prose: Pundits, Karanams and the East India Company in the Making of Modern Telugu. In _India’s Literary History: Essays on the Nineteenth Century_, S. Blackburn (Ed). Delhi: Permanent Black. 2004. pp. 146-66.

  3. అతిథి వ్యయో భవ గురించి v.s.chalam అభిప్రాయం:

    06/17/2008 5:29 am

    Very refreshing and realistic story. Thanks to the writer.

  4. గ్రామ్యమా? వాడుకభాషా? గురించి Kameswara Rao అభిప్రాయం:

    06/17/2008 5:24 am

    విప్లవ్ గారు “సనాతనం” అన్న పదాన్ని “సంప్రదాయం” అన్న అర్థంలో వాడినట్టున్నారు. నేనా అర్థంలో అనలేదు, నేను దాని అసలు అర్థంలోనే వాడాను.
    విప్లవ్ గారన్నట్టు నేనుదహరించిన భాగం ఏదైనా academic ప్రశ్నకి సమాధానమైతే, దానిగురించి భాషాశాస్త్రవేత్త లెవరైనా వివరిస్తే నాకు కాస్త అర్థమవుతుందేమో.

  5. గ్రామ్యమా? వాడుకభాషా? గురించి విప్లవ్ అభిప్రాయం:

    06/16/2008 10:28 am

    సనాతనవాదమంటే మార్పుకి వ్యతిరేకం అనుకోవడం తప్పు.

    I concur.

    కామేశ్వర రావు గారి “సనాతనవాదం” మీద ఉన్న అవగాహనతో నేనేకీభవిస్తాను కనుక, ఆయనకు “తర్కానికి అందినట్టుగా అనిపించని” వాక్యాలను అదే సనాతనవాదాన్ని ఉదాహరణగా చేసుకుని రాసుకుంటే, భాష గురించి విశ్వనాధ రాసిన మాటలు కొంత వరకూ అర్ధం చేసుకోవచ్చేమో!, అప్పుడవి (భాష గురించిన మాటలు) తర్కానికి అందుతాయనే అనుకుంటున్నాను.

    మీరొకసారి ఇది చదవండి:

    సజీవమైన సనాతనం పొందే మార్పులు ఆ సనాతన వ్యవహారం పాటించే నడిబొడ్డు అయిన ప్రదేశాల్లో సువ్యక్తంగా కనబడతవి. అక్కడ దానిగురించి సానుభూతి ఉంటుంది. అట్లాగే “సనాతనం” అది పాటించే వాడల్లో, ఇండ్లల్లో కనబడుతుంది. సనాతనం అనేది కొన్ని వాడకట్టుల్లో (ఇండ్లలో, దేశాల్లో) కనిపించే సంస్కృతి, ఒక అవగాహన, లేక ఆచారం. ఇతర ఆచారాలతో కలిసి ఉండే ప్రదేశాల్లో ఈ సనాతనం మార్పునందు అంత సానుభూతి ఉండదు. ఎందుకంటే అక్కడుండే సనాతనం వేరు కనుక. మిగతా చోట్ల (వాడల్లో, ఇండ్లలో, దేశాల్లో) కనపడే, అంటే ఆచార సంపర్కం కలచోట్ల వాళ్ళకి వాళ్ళ మూలాలు నిలబెట్టుకోవటమే కష్టం. అందుచేత సనాతనం పొందే మార్పులని కూడా యెక్కడ సంబాళించుకుంటారు? దాని మూలంగా వాళ్ళకు దీనియందు సానుభూతి తక్కువగా ఉంటుంది.

    ఆయన, భాష గురించి రాసిన ఈ పేరా చాలా సున్నితమైన, నిర్దుష్టమైన academic ప్రశ్నకు ఒక సమాధానం అనుకుంటాను. ఆయన ఈ వ్యాసంలో కొన్ని చోట్ల ‘అకడమిక్’ వ్యవహారాన్ని సామాన్య దృష్టితో చెప్పిన వాటితో సంపర్కించి రాయటం వల్ల వచ్చిన పేచీ ఇది, ఒక్కోదాన్ని అర్ధం చేసుకోవటానికి వాడాల్సిన అద్దాలు మార్చి చదువుకోవాలి. ఇది తనకు తాను “అసలు విషయం” అర్ధం చేసుకోవటానికి రాసుకున్న వ్యాసం అయిఉండొచ్చు.

    — ——————
    ఈ వ్యాసంతో “ఈమాట” ప్రాశస్త్యం పెరిగింది. ఈ మాటలు విశ్వనాధ 1920ల్లో రాసారంటే నమ్మడం కష్టం, అప్పట్లో ఎవరైనా
    ఈవ్యాసం మీద మరెవరైనా రాసారా, ఎవరి ఎరుకలోనైనా?

    విప్లవ్

  6. గ్రామ్యమా? వాడుకభాషా? గురించి Kameswara Rao అభిప్రాయం:

    06/16/2008 9:05 am

    ఇక్కడొక విశ్వనాథ అభిమాన సంఘం ఏర్పడేట్టుందే:)
    విశ్వనాథ కల్పవృక్షం కేవలం గ్రాంధికభాషకే కట్టుబడి రాసారన్న మాట నిజం కాదు. అందులో వ్యావహారిక భాష పుష్కలంగా కనిపిస్తుంది.

    విశ్వనాథ ఖచ్చితంగా సనాతనవాదే. మార్పుకి వ్యతిరేకి అన్నది మాత్రం సరికాదు. సనాతనవాదమంటే మార్పుకి వ్యతిరేకం అనుకోవడం తప్పు.

    విశ్వనాథవారిలో తర్కంపాలు ఎంతో ఆవేశంపాలూ అంతే ఉంటుంది.
    ఉదాహరణకి ఈ మాటలు తర్కానికి ఎంతవరకూ నిలుస్తాయి?

    సజీవమైన భాషా,ఆ భాష పొందే మార్పులు ఆ భాష మాట్లాడేందుకు నడిబొడ్డు అయిన ప్రదేశాల్లో సువ్యక్తంగా కనబడతవి. అక్కడ దానిగురించి సానుభూతి ఉంటుంది. అట్లాగే ఇంగ్లీషు భాష నేటికాలంలో అసలయిన వాడుక భాష కావాలి అంటే, లండన్ లో కనబడుతుంది. తెనుగు భాష కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలలో మాట్లాడేది అట్లాంటిది. ఇతర భాషలతో కలిసి ఉండే ప్రదేశాల్లో ఈ భాష మార్పునందు అంత సానుభూతి ఉండదు. బరంపురం, హైదరాబాదు, చిత్తూరు ఇటువంటి భాషా సంపర్కం కలచోట్ల వాళ్ళకి గ్రాంధిక భాష నిలబెట్టుకోవటమే కష్టం. అందుచేత భాష పొందే మార్పులని కూడా యెక్కడ సంబాళించుకుంటారు? దాని మూలంగా వాళ్ళకు దీనియందు సానుభూతి తక్కువగా ఉంటుంది.

  7. గ్రామ్యమా? వాడుకభాషా? గురించి lyla yerneni అభిప్రాయం:

    06/16/2008 7:51 am

    విశ్వనాథ రచనలు ఎన్నోచదివాను. ఇంకా చదువుతూనే ఉన్నాను. స్కూల్లో రోజూ పాఠాలు చెబుతూనే అన్ని గొప్ప రచనలు ఎలా చేశారా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజుల్లో తెలుగు వారు ఒక్క పద్యం రాసినా ఒక పేజీ వచనం రాసినా ఒక సంవత్సరం పాటు దాని గురించే మాట్లాడుతారు. అందులో ఏం ఉండదు కూడా. ఆ రాసిన ఒక్క పెజి చదవమని వంద లింకులు. హంగామా. 🙂

    విశ్వనాథ పాండిత్యం, కవితాశక్తి, తర్కం, తాత్విక భావాలు, ఆలోచనలో విశాలత్వం, పాతబడని ఆధునికత – అన్నీ నన్ను మెప్పిస్తాయి. విశ్వనాథకు ఆయన సమకాలంలోనూ, ఇప్పటివరకూ పోటీనే లేదు. కాని ఈయన కన్నా ఎంతో తక్కువ రాసి, తోటి మనుషులమీద సానుభూతి నాలుగు గేయాల్లొ కుమ్మరించేసి (అందులొ కొన్ని వేరే దేశపు కవుల పాటల అనువాదాలు) ప్రజాకవులై పోయారు కొందరు. తడి తక్కువ. బడాయి ఎక్కువ. 🙂 కవి ఒక్కటో రెండో చిన్న పాటల పుస్తకాలు రాస్తే, వాటినుండి రోజూ ఉదహరించటం తేలిక. మనకీ కంఠతా వస్తాయి. కంఠతా వచ్చాయి కాబట్టి, పద్యాలు గొప్పవీ, కవి గొప్పవాడు అని ఒక వాదం లేవదియ్యొచ్చు.

    విశ్వనాథ వ్యాసం నాకు నచ్చింది. ఈ ప్రత్యేక వ్యాసాలు అన్నీ చదివాను. మళ్ళీ చదవాలి. ఈమాట పత్రిక చాలా ఉల్లాసం కలిగిస్తున్నది.

    లైలా.

  8. గ్రామ్యమా? వాడుకభాషా? గురించి Sai Brahamanandam Gorti అభిప్రాయం:

    06/16/2008 6:56 am

    కేవలం గ్రాంధిక భాషకే కట్టుబడి “రామాయణ కల్పవృక్షం” లాంటివే కాదు, వ్యవహారికంలోనూ, ముఖ్యంగా పల్లెల్లో ఉండే వాడుక భాషతోనూ విశ్వనాధ వారు రాసారు. దానికి పెద్ద ఉదాహరణ వారి చెలియల కట్ట నవల. అందులో పల్లె భాషా, పల్లె జీవితం చక్కగా కనిపిస్తాయి.
    విశ్వనాధ వారు స్పృశించని సాహితీ ప్రక్రియ ( కావ్యం, కథ, కధానిక, నవల, నాటకం, వ్యాసం ) లేదు. కాకపోతే ఆయన రచనలన్నీ పాఠకులకి లభ్యం కావడం లేదు. కొనుక్కుందామన్నా దొరకని పరిస్థితి. ఇది తెలుగు వారికి సంతరించిన దౌర్భాగ్యం.

  9. లింకన్ తో ఓ రాత్రి గురించి Nanduri Venkata Subbarao అభిప్రాయం:

    06/16/2008 5:38 am

    సౌమ్య గారికి అభినందనలు. కథనం బాగుంది. కానీ చెప్పదల్చుకున్న అంశంలో స్పష్టత లేదు. ( ఏమీ చెప్పదల్చుకోలేదని మీరు అంటున్నారు కానీ ఇది స్వగతం కాదు కదా, పాఠకుల కోసం వ్రాసిన కథ. దయ్యాలకు భయపడి దేవుడున్నాడని ఒప్పుకోవడం వాస్తవానికి దగ్గరగా ఉండటం నిజమే. కానీ లింకన్ దయ్యమే ఎందుకు కనబడింది, కనబడినా ఎందుకు కోపగించుకుంది? వీటి వెనుక తర్కం లేదు. హాస్య కథ విజయవంతమ్ కావాలన్నా తర్కం ఉండాల్సిందే. మీకున్న లకథన శక్తికి మరింత కసరత్తు చేస్టే పది రోజులపాటు గుర్తుండే కథ వ్రాయగలిగేవారని నా విశ్వాసం.

  10. గ్రామ్యమా? వాడుకభాషా? గురించి Nanduri Venkata Subbarao అభిప్రాయం:

    06/16/2008 5:13 am

    శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు సనాతనవాది అనీ, మార్పుకి వ్యతిరేకి అనీ చాలామంది దుష్ప్రచారం చేసారు, చేస్తున్నారు. వారందరూ ఈ వ్యాసం చదివిన తర్వాత అయినా తమ దురభిప్రాయాలను మార్చుకుంటారని భావిస్తున్నాను. దీన్ని ప్రచురించినందుకు ఈ మాట వారికి అభినందనలు.