పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16452

  1. మాండలిక వృత్తి పదకోశం గురించి రాఘవ అభిప్రాయం:

    06/20/2008 6:51 pm

    ఈ వ్యాసంలో చెప్పినది కాక వృత్తిపదకోశపు సంపుటాలింకా ప్రచురించారా అకాడమీవారు?
    అలాగే ఆరుద్ర గారి వ్యాసాలు మరిన్ని ప్రచురిస్తే చదవాలని అస్మదభిలాష. ఈ వ్యాసాన్ని ప్రచురించిన ఈమాట వారికి అభినందనలు, పునరభినందనలు.

  2. “సంగీత కళానిధి” శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారితో ముఖాముఖీ గురించి P.H. Thyagaraju అభిప్రాయం:

    06/20/2008 9:50 am

    It is very good interview. I want to mention here, a phenomenal contribution of Shri Nedunuri garu: He set an example to show that one can achieve commercial success in music even by adhering to the traditional values of ragas, maintaing their richness and without resorting to gimmickry. There are high levels of science and art blended and balanced in his music. More importantly his music style and content have come to be emulated by a large number of younger musicians.

  3. గ్రామ్యమా? వాడుకభాషా? గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    06/20/2008 7:16 am

    “గ్రామీణులైన జనులు వాడుకునేది గ్రామ్యము” అన్నారు విశ్వనాథ.

    ఎవరు ఊహించారు, ఎంత దూరదృష్టికలవారైనా కూడా, ప్రసార మాధ్యమాల పెను విప్లవాల ప్రభావంగా మొత్తం ప్రపంచమే ఒక గ్రామం, కాదు కుగ్రామంగా మారుపోతుందని! ఇంటర్నెట్, సెల్ఫోన్లు, కళ్ళు, వొళ్ళు ఖరాబు చేసేటన్ని టీవీ చానెళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఏది గ్రామం ఏది కాదు అని భాషాపరంగా, (వసతులు, సదుపాయాలు, జనాలు కట్టే పన్నులు వగైరా రీత్యా కాదు), చెప్పడం కష్టం అనిపిస్తుంది.

    “బరంపురం, హైదరాబాదు, చిత్తూరు ఇటువంటి భాషా సంపర్కం కలచోట్ల వాళ్ళకి గ్రాంధిక భాష నిలబెట్టుకోవటమే కష్టం. అందుచేత భాష పొందే మార్పులని కూడా యెక్కడ సంబాళించుకుంటారు? దాని మూలంగా వాళ్ళకు దీనియందు సానుభూతి తక్కువగా ఉంటుంది” అని అన్నారు విశ్వనాథ గారు.

    గ్రాంధికము, గ్రామ్యము అని కాదు, నెత్తి మీదున్న బతుకు బరువును మోయడానికి, నిత్యనూతన పోటీమయమైన ప్రపంచంలో నెగ్గుకురావడానికి, ఎన్నో కొత్త పోకడలు, ఆకర్షణల మధ్య తనది అనుకునే సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవడానికి, సరిపడని, సాయపడని దేనిని అయినా కూడా నిలబెట్తుకోవటం కష్టం, కష్టతరం అని కూడా అనిపిస్తుంది.

    ఇక, జనాలకు సానుభూతి ఉండేది వాళ్ళు ఏ ప్రాంతం, ఏ ఊళ్ళకు దగ్గరున్నారని కాదు, ఫలానా భాషా స్వరూపం వాళ్ళకు ఎంత దగ్గరగా ఉంది అన్నదాన్ని బట్టే ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఎప్పుడో రాసిన ఈ విశ్వనాథ వారి వ్యాసం, ఏ బరంపురం, హదరాబాదు, చిత్తూర్లనో కాదు, దేశాన్ని, ఖండాన్ని దాటి కూడా ఎక్కడో ‘ఈ మాట’ లో ప్రచురించి, చర్చించుకోవడం దీనికి ముంజేతి కంకణంలాగా మన ముందే ఉన్న చిన్న నిదర్శనం అని కూడా అనిపిస్తుంది.

    విధేయుడు
    Srinivas

  4. ప్రభావతీ ప్రద్యుమ్నం – 3 గురించి patnala venkateswararao అభిప్రాయం:

    06/19/2008 10:00 am

    సరళమైన స్రవంతి లా సాగింది మీ ఈ కథ పూరణం. ధన్యవాదాలు.

  5. గ్రామ్యమా? వాడుకభాషా? గురించి Nanduri Venkata Subbarao. అభిప్రాయం:

    06/19/2008 6:43 am

    హనుమంతరావు గారు చెప్పింది నిజమే, విశ్వనాధ గొప్పదనం చెప్పడానికి ఇంకొకరిని కించపరచాల్సిన పనిలేదు. ఎవరి గొప్ప వారిది. విశ్వనాధ గొప్పదనం చాలాతక్కువ మందికి తెలుసని బాధపదటం వేరే విషయం.

    నాకు తెలిసి విశ్వనాధ శ్రీశ్రీ ని గానీ, శ్రీశ్రీ విశ్వనాధను అగౌరవపరచుకొన్నది, ఖండించినదీ లేదు. ఒకరి మహాకవిత్వాన్ని, మరొకరు మౌనంగా అంగీకరించినట్లే కనబడ్డారు. వారి గురించి మనం తగూ పడటం సరికాదు.

  6. నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు గురించి venkat balusupati అభిప్రాయం:

    06/19/2008 5:10 am

    Dear kameswaRao G,

    Your essay is very anylytical and worthy. This is the most incisive criticism of Telugu cinema I have ever read.

    Cinema is not merely an entertainment. It has social role and responsibility. In countries like India, it can become a visual guide in educating people in certain areas. Unless and until the producers come forword to make movies with an understanding of its social impact, we may not have another golden era again. The present trend in film-making is alarming indeed.

    Thank you,
    Venkat

  7. కవిత్వ భాష తీరుతెన్నులు గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    06/18/2008 10:55 pm

    చక్కని వ్యాసం… ప్రాచీన, ఆధునిక కవిత్వాల్ని చక్కగా అనుసంధానిస్తూ రచన సాగింది. కవిత్వ మూలాలు భాషాతీతంగానే ఉన్నా, కవిత్వ భాష మీద ఇలాంటి పరిశోధనా వ్యాసాలు కవిత్వాన్ని మరింత లోతుగా అర్ధం చేసుకోడంలోనూ, రూప పరమైన క్లుప్తత సాధించడంలోనూ ఖచ్చితంగా ఉపయోగపడతాయి.

  8. గ్రామ్యమా? వాడుకభాషా? గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    06/18/2008 10:34 pm

    “కాని ఈయన కన్నా ఎంతో తక్కువ రాసి, తోటి మనుషులమీద సానుభూతి నాలుగు గేయాల్లొ కుమ్మరించేసి (అందులొ కొన్ని వేరే దేశపు కవుల పాటల అనువాదాలు) ప్రజాకవులై పోయారు కొందరు. తడి తక్కువ. బడాయి ఎక్కువ. 🙂 కవి ఒక్కటో రెండో చిన్న పాటల పుస్తకాలు రాస్తే, వాటినుండి రోజూ ఉదహరించటం తేలిక. మనకీ కంఠతా వస్తాయి. కంఠతా వచ్చాయి కాబట్టి, పద్యాలు గొప్పవీ, కవి గొప్పవాడు అని ఒక వాదం లేవదియ్యొచ్చు.”

    లైలా గారు శ్రీశ్రీ మీద వేసిన పై విసురులో వేడెక్కువ, వెలుగు మాత్రం శూన్యం! కంఠస్థం చెయ్యడం సులభం అని మహాప్రస్థానాన్ని కంఠస్థం చెయ్యరు; గొప్ప కవిత్వం అంతా కంఠస్థం చెయ్యదగ్గది కనుకే చేస్తారు. శ్రీశ్రీ బండెడు సాహిత్యం రాసినా రాయకపోయినా మహాప్రస్థానం ఒక్కటే చాలు తనని నిలపడానికి. అయినా ఈ పోలిక వలన ఒరిగేదేముంది – సాహితీ చర్చల స్థాయిని దిగజార్చడం మినహా!

    మన సాహిత్య చరిత్రలో విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ – ముగ్గురూ మూడు మార్గాలకు ప్రవర్తకులంటూ కాస్త వెలుగు ప్రసరించిన వడలి వ్యాసం [1] చదవదగ్గది.

    విశ్వనాథ వ్యాసం బావుంది. కాని, భాషా సంపర్కం కలచోట నివసించే వాళ్ళు మార్పుని సంబాళించుకోలేరు అని ఆయన అన్నదానికీ, భాషాశాస్త్రవేత్తలు చెప్పేదానికీ పొంతన లేదు.

    కొడవళ్ళ హనుమంతరావు

    నోట్స్:
    [1] “సాహిత్య ప్రస్థానం – కొన్ని మజిలీలు” లో వ్యాసం, “క్లాసిక్ – రొమాంటిక్.” వడలి మందేశ్వరరావు.

  9. కవిత్వ భాష తీరుతెన్నులు గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    06/18/2008 7:59 am

    నోరూరించే ఆహార పదార్థాల గురించి విశ్లేషించి వివరించే విధంగా, కవిత్వ భాష లక్షణ స్వరూపాలను చెప్పడం మాత్రమే కాక, samples గా రుచి చూపే విధంగా సోదాహరణంగా అందించడం చాలా బాగుంది. ఎంతో పరిశీలన, పరిశోధన, పరిశ్రమలతో పలు విషయాలను ఆసక్తికరంగా అందించినందుకు చాలా కృతజ్ఞతలు.

    ఇటువంటి కృషి, రచనలు కవిత్వాన్ని అర్థంచేసుకోవడానికీ, మరింతగా ఆనందించడానికీ సాయపడుతాయి నిస్సందేహంగా. అయితే మంచి కవిత్వాన్ని సృష్టించడానికి మాత్రం ఇవి ఎంతగా ఉపయోగపడుతాయో సరిగ్గా తెలియదు, నాకైతే. రసాత్మకమైనదే కవిత్వం, లేదా ‘కదిలించేదే’ మంచి కవిత్వం, అని అనుకుంటే దాని రూపాలు భాషలోనే ఉన్నా, మూలాలు మాత్రం భాషను దాటగలిగే భావగతమైన హృదయస్పందన పరిధిలోనే ఎక్కువుగా ఉంటాయేమోనని అనిపిస్తుంది.

    ఏదియేమైనా, ఆలోచింపజేసే పలువిషయాలను అందించిన వ్యాసమిది. ఇంకా ఇటువంటివి ఎన్నో కామేశ్వరరావుగారు మనకు అందించాలని ఆశిస్తూ,

    విధేయుడు
    Srinivas

  10. గ్రామ్యాదేశ నిరసన సభ – కందుకూరి వీరేశలింగం పంతులుగారి ప్రసంగము గురించి Indrajit అభిప్రాయం:

    06/18/2008 3:55 am

    వ్యాసంలో వాడపల్లి శేషతల్పశాయి గారి URL తప్పుగా ఉంది. మీరు ప్రచురించింది http://www.www.andhrabharati.org. కానీ అసలైనది http://www.andhrabharati.com/. ఈ మార్పు చేయగలరు.