పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16452

  1. 88 ఏళ్ళ యువకులు గురించి Dhavala అభిప్రాయం:

    07/06/2008 6:50 am

    మీరు చెప్పిన విషయాలు మా లాంటి సంగీత పామరులకి ఎంతో ఉపకరిస్తాయి. మీరు ఈ వ్యాఖ్యానాన్ని ముగించిన తీరు, మీ ఆవేదనని, ప్రస్తుత పరిస్థితిని ప్రస్ఫుతటంగా తెలియజేస్తున్నాయి

    –ధవళ సోమశేఖర్

  2. సీతా-రామా గురించి baabjeelu అభిప్రాయం:

    07/06/2008 4:50 am

    ఇది కథ కాదు. కవిత అంతకన్నా కాదు. కథని కానీ, కవితని గానీ అనుకుని ఏవరయినా చదివితే అది వారి తప్పు. కథ కుండవలసిన లక్షణాలు ఏవీ లేవు. అందుకే లలిత గారు చదవలేకపొయేరు.
    అయితే, కథ, కవిత రెండూ కలగలిపిన పధ్ధతి అద్భుతం. కథ తూనిక రాళ్ళతో దీన్ని తూచకూడదు.ఈ పధ్ధతిని మ్యూజింగ్స్ అనవచ్చా?
    కిరణ్, కవితలు కాదయ్యా నువ్వు రాయవలసినవి. ఇలాటివి రాయాలి.విమర్శకుల్ని పక్కన పెట్టు. కృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టు, ఇంకా రాయడవే విమర్శకులకి మందు.
    కంగారుగా, బధ్ధకంగా, “చాల్చాల్లెగెహె..” అనుకొని రాసినట్టుంది. తేట తెలుగులో రాసినట్టు రాయవయ్యా. శబ్దాడంబరం ఏందుకు? అనుభూతికి ఏలాటి ఆడంబరం వుండదే? శబ్దానికెందుకు? శ్రీశ్రీ చెప్పినట్టు “సింపుల్ గా చారు పెట్టినట్టు..” రాయలేవా?

  3. ఆరు చిత్తు రూపాలు గురించి baabjeelu అభిప్రాయం:

    07/06/2008 4:14 am

    కిరణ్ గారూ. ధన్యోస్మి. “ఏవిటిది” చాలాబావుంది. కదుపునిండిపోయింది.
    మొదటి సారిగా “ఈమాట” చూసేను. బాలాంత్రపు వారి వ్యాసం తరవాత మీవే చూసేను. మీ స్కెచెస్ చాలా బావున్నాయి. కథలు అనకూడదు వాటిని.
    ఇంకా బాగా రాయండి.

  4. బైపోలార్ భూతం గురించి baabjeelu అభిప్రాయం:

    07/06/2008 4:02 am

    అద్భుతవయిన భావవ్యక్తీకరణ ఉన్న కిరణూ, డైరెక్టుగా అనుభవించినదాన్ని చక్కగా పద్యంకట్టగలిగేవు. ఇంతకుముందు పద్యాల్లో అనుభూతి ఇలాటిది కాదని నా నమ్మకం. వాటిని కూడా ఇంత చక్కని పద్యాల్లా రాయాలంటే కష్టపడాలి. అలవోకగా మంచి పద్యాలు రాసెయ్యగలగడం అరుదు. ఘంటసాలయినా కొత్తపాటని “ఓక్క సుట్టుకే” ఘంటసాల లా పాడలేడు.

  5. అనుభవం- జ్ఞాపకం గురించి baabjeelu అభిప్రాయం:

    07/06/2008 3:50 am

    కిరణు గారికి ఏవరయినా కొంచెం సాయం చెయ్యండి. అదేం గొప్పది కాదు. పెయింటరు ఏవరయినా బొమ్మ ఏలా తయారు చేస్తాడో చూపించండి. పెన్సిలుతో నాలుగు గీతలు పెయింటు అవదు.

    కొడవళ్ళ గరికి గాని, స్మైలు గారికి గాని ఒక ప్రశ్న. ప్రతీ పద్యం “అల్పుడెపుడుబల్కు…” లాగా ఏందుకుండాలి? మీ లాంటి వాళ్ళు చర్చిస్తే కిరణ్ లాటి వాళ్ళ కి తెలుస్తుందని అనుకుంటున్నాను.

  6. కేయాటిక్ సమీకరణం గురించి baabjeelu అభిప్రాయం:

    07/06/2008 3:40 am

    అయ్యా కిరణూ, నే నింకా నువ్వు శ్రీశ్రీ కో, శాస్త్రి బాబు కో శిష్యుడవనుకున్నాను.
    “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు” లో మీ అమ్మాయి ఇబ్బంది తప్పుకాదు. తప్పు మనది. దానికోసం బాధపడ్డం తప్పు.

    కిరణూ, నువ్వు మీ అమ్మాయిని చూసి బాధపడ్డట్టు, మీ తాత గారు నిన్ను చూసి బాధపడివుంటారు. పరవాలేదులే.
    ఇంకా మంచి వస్తువు తీసుకుని ఇంకా బాగా రాయి.

  7. పేరులేదు గురించి baabjeelu అభిప్రాయం:

    07/06/2008 3:21 am

    కొడవళ్ళ వారి క్లుప్తత గురించి కిరN గారు ఖచ్చితంగా పట్టించుకొవాలి. స్మైలు గారి అభిప్రాయము గురించి కొడవళ్ల వారి వ్యాఖ్య అనవసర ప్రసంగము. ఇలాటివే మన కవిత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. స్మైలు గారు రాసింది ఒకటి, ఈయన చెప్పుకొచ్చింది ఇన్కొకటి. కిరణూ మంచి భావము ఉన్నప్పటికీ, మంచి భాష ఉన్నప్పటికీ పద్యము మంచి పద్యము అవదు, క్లుప్తత లేకపొతే.

  8. నేను – నువ్వు గురించి baabjeelu అభిప్రాయం:

    07/06/2008 2:42 am

    బహుశా ఈ కవి గారు ఆశువుగా చెప్పినదయుంటుంది ఈ కవిత. కవిత్వముంది ఇందులో. నిస్సందేహంగా. అయితే భావమొక్కటే రాసేస్తే కవిత అవదుకదా? ఆ కృషి చేస్తే ఇంకా మంచి కవివితం రావచ్చు కిరణ్ గారి దగ్గర్నుంచి.

  9. 88 ఏళ్ళ యువకులు గురించి Ramakrishna అభిప్రాయం:

    07/05/2008 11:27 pm

    మీ వ్యాసం చాలా బాగుంది.మాకు తెలియని కొత్త కొత్త విషయాలు చెప్పారు.రొహిణీప్రసాద్ గారికి ధన్యవాదాలు

  10. తడి గురించి reader అభిప్రాయం:

    07/05/2008 7:01 pm

    హరికి చదువు చెప్పించడానికి, సేటుకి పదివేలు ఎందుకివ్వాలి? ఆ సేటు హరిని కొనుక్కున్నాడా? అర్థం కాలేదు.
    ప్రభుత్వాలు చెయ్యాలిసిన పనులని మనుషులు సంస్కరణల పేరుతో అర కొరగా చేస్తే, అసలు పరిష్కారం ఇంకా చాలా ఆలస్యం అవుతుంది. దీనర్థం అవసరంలో వున్న వారిని ఆదుకోవద్దని కాదు. కానీ అదే పరిష్కారం అని అనుకోకూడదు. మంచి మనుషులు జాలీ, సానుభూతులతో చేసే సాయాలు పరిపూర్ణ పరిష్కారాలు అవవు ఎప్పుడూ.