పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 4: బూల్ ఆలోచనా సూత్రాలు గురించి నాగమురళి అభిప్రాయం:

    07/13/2008 8:44 am

    ఎప్పటిలాగే ఈ వ్యాసం కూడా చాలా బాగుంది. బూలియన్ ఆల్జీబ్రా చదువుకున్న రోజుల్లో జార్జ్ బూల్ గురించి తెలుసుకోనేలేదు. మంచి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

  2. ఘంటసాల ప్రతిభకు మచ్చుతునక “కుంతీకుమారి” గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/12/2008 9:59 pm

    ఘంటసాలగారి కుంతీకుమారి పద్యాలను surasa.net లో వినచ్చు.

  3. తెలుగు వ్యాసం గురించి baabjeelu అభిప్రాయం:

    07/12/2008 7:29 pm

    తెలుగు వ్యాసానికి సాష్టాంగ పడుతున్నాను.
    సమయం, స్థలం రెండూ పరిమితమే. విషయాన్ని మాత్రం వివరించి, విశ్లేషించాలి.
    కత్తి మీది సామన్నమాట. ఆంజనేయుడు మాటాడినట్టన్నమాట.
    హాలుని “గాథాసప్తశతి” రామచంద్ర గారు “ఆంధ్రభూమి” లో తెనిగించేరు. పుస్తకం దొరికితే బాగుణ్ణు.

  4. ఘంటసాల ప్రతిభకు మచ్చుతునక “కుంతీకుమారి” గురించి baabjeelu అభిప్రాయం:

    07/12/2008 7:08 pm

    రోహిణీప్రసాదు గారూ,
    ఇంత సులువుగా, సాఫీగా, అపస్వరాలు లేకుండా, అప్రస్తుతాలు లేకుండా, అనవసర ప్రసంగం లేకుండా, ఎదురుగుండా వ్యాసకర్త కూచుని చెబుతున్నట్టు, వ్యాసం రాయడం చాలా కొద్దిమందికే వచ్చు. అందులో మీరొకరు. దానికి తోడు, ముక్తాయింపు అంత పోజిటివ్ గా ఇవ్వడం అద్భుతం. కుంతీకుమారి సృష్టి అంతా ఘంటసాలదని తెలిసేక, ఇంకా హాయిగా వుంది. కుంతీకుమారి లో ఘంటసాల, కరుణశ్రీ పద్యంగా, కుంతిగా, “మనం”గా త్రిపాత్రాభినయనం చెయ్యడం వల్లనే ఆ “థర్డ్ డైమన్షన్” వచ్చింది. కరుణశ్రీ గారి అద్భుతవయిన పద్యాలు, అద్భుతంగా “ఘంటసాల” లాగే పాడినా ఇలా వుండదు. కవి రాయని వచనాలూ, కవి రాసిన సున్నితవయిన పద్యాల బదులు అంతకన్నా సుతారవయిన పదాలు సరి అయిన పాళ్ళలో కలపడం వల్ల “ఎమోషనల్ డ్రామా” “ఎలివేట్” అయింది ఎవరికీ అందనంత ఎత్తుకి.

    మీ వ్యాసరచ్నా నైపుణ్యం గురించి, “ఆవల మింద, పతివ్రత ల మింద..” కూడా మీరు అద్భుతంగా “వాయించేగలరని” నా నమ్మకం. చిన్న సందేహం. సంగీతం వచ్చిన వాళ్ళకి లెక్కలూ, భాషా రెండూ బాగా వస్తాయంటారు, నిజవేనా?

  5. సామాజిక నవలల్లో కథనా శిల్పం గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    07/12/2008 5:31 pm

    హనుమంత రావు గారూ,

    మీకు ఈ ఉపన్యాసం నచ్చినందుకు సంతోషించాను.
    మృణాలిని గారి రాక నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఈ సారి నుండి తప్పని సరిగా రికార్డు చేసి ఉంచాలనే కోరిక. ఇటుపైన ఎవరైనా సాహితీవేత్తలు వస్తే తప్పక తెలియజేస్తాను. నవలకి తెలుగులో ఓ రకమైన చిన్న చూపే ఉంది. నవల అనేది పోయింది. సీరియల్ నవల అనేదే తెలుగులో ఉంది. మృణాలిని గారి ప్రసంగం ధారాళంగా సాగింది. వచ్చిన ఓ పాతిక మందీ గంటన్నర సేపు కదల్లేదు.

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  6. సామాజిక నవలల్లో కథనా శిల్పం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/12/2008 2:47 pm

    తెలుగు నవల బాగోగులు

    మృణాళిని గారి విలువైన ఉపన్యాసాన్ని సేకరించినందుకు బ్రహ్మానందం గారికి చాలా కృతజ్ఞతలు. ఒక మనవి. సాహితీవేత్తలైన వక్తలు అమెరికా వచ్చినప్పుడు, వారికి అభ్యంతరం లేకపోతే ఈమాటలోనో రచ్చబండలోనో ఓ చిన్న ప్రకటన వెయ్యండి. వీలయితే వాళ్ళని సాహితీప్రియులు తమ తమ ఊళ్ళకి పిలిపించుకోవచ్చు.

    మృణాళిని ఉపన్యాసం కేవలం డాక్టరేటు కోసం చేసిన పరిశోధన నుండి వచ్చినట్లు లేదు. లోతైన పరిశీలనతోబాటు తాదాత్మ్యంతో కూడిన విస్తృత పఠనంతో చేకూరిన అనుభూతితో సాధికారంగా మన నవలా చరిత్రని చెప్పి రక్తి కట్టించారు. ఎటు చూసినా కవితలూ, కథలూ, వాటి మీద చర్చావేదికలే కాని నవల గురించి మాట్లాడే వాళ్ళే తక్కువ. గత పాతికేళ్ళుగా స్తబ్ధుగా ఉండిపోయిన తెలుగు నవలా రంగానికి విశిష్ట చరిత్ర ఉందనీ, పాఠకుల సంస్కారానికి కథా కవితలకన్నా నవలలే ఎక్కువ దోహదిస్తాయనీ, ఆవేదనతో కూడిన ఉత్సాహంతో గంటన్నర పైగా అనర్గళంగా ఉపన్యసించి ఆకట్టుకున్నారు. గురజాడా, శ్రీశ్రీ రచనలకి సముచిత ఆదరణ వచ్చినా వారికే మాత్రమూ తీసిపోని నవలా రచయితల పేర్లన్నా ఇప్పటి వాళ్ళకి తెలియదే, కనీసం వారి రచనల ప్రస్తావన గూడా సాహితీ చర్చల్లో లేశమైనా కనబడదే అని గట్టిగా విమర్శించారు – ఎందువల్ల ఈ చిన్న చూపు?

    ఇలా పారంభమైన ఉపన్యాసం వినడంతోటే నాకు ప్రముఖ కవి Auden రాసిన “Letter to Lord Byron” అన్న కవిత గుర్తొచ్చింది:

    I don’t know whether
    You will agree, but novel writing is
    A higher art than poetry altogether
    In my opinion, and success implies
    Both finer character and faculties
    Perhaps that’s why real novels are as rare
    As winter thunder or a polar bear.

    The average poet by comparison
    Is unobservant, immature, and lazy.
    You must admit, when all is said and done,
    His sense of other people’s very hazy,
    His moral judgements are too often crazy,
    A slick and easy generalization
    Appeal too well to his imagination.

    కందుకూరి తో మొదలైన మన నవలలు సంఘ సంస్కరణకీ, భావ విప్లవానికీ, మానసిక వికాసానికీ బాట వేశాయనీ, దాదాపు వందేళ్ళ క్రితమే ఉన్నవ రాసిన మాలపల్లి ని ఆకాశానికెత్తేశారు. అసలాకాలానికి మన దేశభాషలు వేటిలోనూ అంతటి గొప్ప నవల రాలేదని ఇతర రాష్ట్రీయులు మెచ్చుకున్నా, తెలుగువాళ్లలో చాలా మందికి ఉన్నవ పేరు కూడ తెలియదని బాధపడ్డారు. చలం నవలలు చదిలోతే చెడిపోతారన్నవాళ్ళు ఆయనని సరిగా అర్థం చేసుకోలేదనీ, ఆయన రాసిన స్త్రీ, బిడ్డల శిక్షణ చదివితే గాని చలం భావ విప్లవం అర్థం కాదన్నారు. మైదానం కి వ్యతిరేకంగా విశ్వనాథ రాసిన చెలియలికట్ట ని ప్రస్తావిస్తూ, వీరిద్దరూ గొప్ప ప్రతిభావంతులనీ, వాళ్ళ మధ్య పోటీ సాహిత్యానికి మేలుచేసిందే కాని కీడు చెయ్యలేదన్నారు.

    పల్లెటూరి జీవితాన్ని మరీ ఆదర్శప్రాయంగా కాక రాజకీయాలతో ఎలాముడిపడి ఉందో చిత్రీకరించిన జి.వి.కృష్ణారావు కీలుబొమ్మలు, మొట్ట మొదటిగా విశాలమైన ఉన్నతభావాలతో స్త్రీ పాత్రని ప్రవేశపెట్టిన ఉప్పల లక్శ్మణరావు అతడు-ఆమె, ఒక్క వ్యర్థ పదం కూడా లేకుండా గోపీచంద్ రాసిన గొప్ప మనోవైజ్ఞానిక నవల అసమర్థుని జీవయాత్ర, మనిషి జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనా సంస్కార పరిణామానికి ఎలా దారితీస్తుందో చిత్రీకరించిన బుచ్చిబాబు చివరకు మిగిలేది, ఇలా అనేక పేరున్న తెలుగు నవలల గురింఛి, క్లుప్తంగా నయినా మనసుకి హత్తుకు పొయ్యేట్లు చెప్పి, అవి చదివిన వాళ్ళకి మరోసారి ఉద్విగ్నత కలిగించారు.

    ఇంతటి ప్రాభవం ఉన్న నవలా ప్రక్రియ ఎనభయ్యో శతాబ్దం నాటికి వ్యాపార నవలలు విజృంబించడంతో ఓ ఊపు ఊగి, ఆ తర్వాత వచ్చిన ఉద్యమాల వరవడిలో చదివే పాఠకులు లేకా, పాఠకులేరని రాసే వాళ్ళు లేకా కుంటుబడిందన్నారు. ఉద్యమాల ప్రభావం గురించి మృణాళిని చేసిన వ్యాఖ్య చాలా ఆలోచించదగ్గది: ఉద్యమాల మూలంగా వచ్చే రచనల్లో ఆవేశం పాలెక్కువ. అందుకు కవిత్వానికి మించిన సాహితీ ప్రక్రియ లేదు. అయితే నవలకి కావలసింది స్పష్టతతో కూడిన ఆలోచన, మానవజీవితం గురించి సమగ్రమైన పరిశీలన – వీటితో రసవంతంగా ఏవో నాలుగు పాదాలు కాక కట్టదిట్టంగా నాలుగయిదొందల పేజీల సాహిత్యం సృష్టించాలంటే మాటలు కాదు. మరలా Auden రాసిన “The Novelist” అన్న కవితొకటి గుర్తొస్తుంది:
    Encased in talent like a uniform,
    The rank of every poet is well known;
    They can amaze us like a thunderstorm,
    Or die so young, or live for years alone.
    They can dash forward like hussars: but he
    Must struggle out of his boyish gift and learn
    How to be plain and awkward, how to be
    One after whom none think it worth to turn.

    For, to achieve his lightest wish, he must
    Become the whole of boredom, subject to
    Vulgar complaints like love, among the Just

    Be just, among the Filthy filthy too,
    And in his own weak person, if he can,
    Must suffer dully all the wrongs of Man.

    ఉపన్యాసం అయింతర్వాత చాలా మంది మంచి ప్రశ్నలే వేశారు. మన సాహిత్యం ఉద్యమాలకే ఎందుకు పరిమితమైందని ఒకరడిగారు. మృణాళిని ఉద్యమాల వలన కలిగిన మంచిని గుర్తిస్తూనే, ప్రస్తుత సాహితీ వాతావరణంలో ఏదో ఒక గ్రూపుకి చెందకుండా మనడం కష్టమయిందన్నారు. చంద్రలత రాసిన రేగడివిత్తులు మంచి నవలే అయినా అది రచయిత కోస్తా ప్రాంత దృష్టితో రాసిందని విమర్శించి, సాహితీపరమైన విలువలకి విమర్శకులే తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇలాంటి వాతావరణం నెలకొని ఉండటం చాలా విచారకరమన్నారు.

    ఇది సాహితీ అభిమానులందరూ తప్పక వినవలసిన ఉపన్యాసం. ఇచ్చిన మృణాళిని గారికీ, సేకరించిన బ్రహ్మానందం గారికి మరోసారి కృతజ్ఞ్తలతో,

    కొడవళ్ళ హనుమంతరావు

  7. ఘంటసాల ప్రతిభకు మచ్చుతునక “కుంతీకుమారి” గురించి Venu Aasuri అభిప్రాయం:

    07/12/2008 2:31 pm

    రోహిణీ ప్రసాద్ గారు,
    ఎంతో మంచి వ్యాసం. కుంతీకుమారిలో నాకు నచ్చిన, నన్ను కదిలించే పద్యాలెన్నో ఉన్నా, ముఖ్యంగా నాకు గుర్తుండి పోయేది ‘మరులు రేపెట్ట’ అనే పద్యం. ప్రతి పద్యాన్ని విశ్లేషిస్తూ మీరు వ్రాసిన వ్యాసానికి నా అభినందనలు, వందనాలు.
    వేణు ఆసూరి

  8. ఈమాట గురించి గురించి baabjeelu అభిప్రాయం:

    07/12/2008 10:19 am

    సంపాదకులకి,
    మీ పత్రిక “నిజ్జెంగా” చాలాబావుంది.
    నా చిన్నప్పటి, పురాణం వారి “ఆంధ్రజ్యోతి” కన్నా.
    రోహిణీప్రసాదు గారి లాటి వ్యాసకర్తలు, కృష్ణమోహన్ గారిలాటి సాహిత్యాభిలాషులు, రవికిరణ్ లాటి వర్ధమాన కవులూ, వీళ్ళందర్నీ చదివి తరించే నాలాటి పాఠకులూ మీకున్నారు. ఇంకా చాలా మంది వున్నారు, వాళ్ళని పేర్కొనలేదని అనవసర చర్చలోకి దిగొద్దని మన పాఠకులికి మనవి.
    అయితే మీకున్న వనరులతో మీరు చేయగలిగిన గొప్ప పనులు ఇంకా వున్నాయి. అవి:
    రోహిణీప్రసాదు గార్ని బాలమురళీ జీవితచరిత్ర రాయడానికి “కమిషన్ ” చెయ్యొచ్చు.
    ఆయనయితే బాలమురళీ జీవిత చరిత్ర తో, డెభ్భయ్యేళ్ళ లేక ఎనభయ్యేళ్ళ తెలుగు సంగీత చరిత్ర రాయగలరు. నిస్సందేహంగా. మిగిలిన వాళ్ళు భజన మండలి సభ్యులు.
    బాబ్బాబు, మీ పత్రిక “రన్ ఆఫ్ ది మిల్” పత్రిక కాదు కదా?
    అలాగే, బాపురమణల జీవిత చరిత్ర కూడా?
    రోహిణీప్రసాదు గారే రాసెయ్యగలిగితే అదృష్టం. లేకపోతే వెదుకుదాం.
    కానీ, మీ పత్రిక మొదట్లో “ప్రవాసాంధ్రులకే” అయుండొచ్చు, కానీ ఇప్పుడు ఆంధ్రులందరికీ అయిందనుకుంటున్నాను.
    “సరస్పతి తోడు” మీ పత్రిక చక్కగా వుంటోంది.
    ఇలా నడిపితే చాల్చాలు.
    ఇంతకన్నా బాగ నడిపితే మా అదృష్టం.

  9. వాడుక భాషలో తెలుగు కవితావికాసము గురించి baabjeelu అభిప్రాయం:

    07/12/2008 9:40 am

    kRష్ణమోహన్ గారూ,
    మరొక సంగతి. శనగన నరసింహస్వామి, ఈయన వివరాలు నాకు తెలీవు, కానీ ఈయన ప్రతీ పండక్కి అయిదో ఆరో పద్యాలు రాసి ఆంధ్రపత్రిక్కి, ఆంధ్రప్రభకీ పంపీవారు. వాళ్ళు వేసీవారు. అంతే వాటిగురించి ఎవరూ మాటాడీ వారు కాదు. మీరెవరూ ఆయన ఛందోబధ్ధవయిన పద్యాల్ని ఉదహరించరు. ఆ పద్యాల్లో భక్తి తప్ప కవిత్వం వుండీదికాదు.
    శనగన నరసింహస్వామి గారికి క్షమాపణలు.

    కరటకశాస్త్రి చేత గురజాడ చెప్పించినట్టు చదువు పొట్టపోషించుకోడానికే..సంస్కృతం నుంచి తెలుగు నుంచి ఇంగ్లీషు కి పొట్ట నింపీ భాష మారిపోడంవల్ల, ఇంగ్లీషు లోని పద్యరీతులు తెలియడంవల్ల, అవి తేలికగా వుండడంవల్ల, వాటిని ఛందోబధ్ధవయిన కవిత్వం రాసీ ఛాందసులు ఏవీ చేయలొకపోవడంవల్ల, తెలుగు కవిత్వం ఇటు మళ్ళింది. ఇండియా ట్రాఫిక్, ఇండియన్ పోలిటిక్స్ ప్రవాసాంధ్రులికి, ఎంత అసహ్యం కలిగిస్తాయో, బహుశా గురజాడకి, ఛాందసుల స్టాండర్డ్ ప్రకారం కవి, పండితుడు, కానివాడికి, అప్పటి అన్ని విషయాలూ అసహ్యం కలిగించేయి. అందుకే ముత్యాల సరాలు సృష్టించబడ్డాయి, పాత వాసన వదల్లేక. లేక పాతకొత్తల మేలుకలయిక కోసం. పాత వదులుకోలేక. పాత వదులుకోడం, మూలాల్ని తెగ్గొట్టుకోడవేకదా?

    కవిత్వాన్నికానీ, సంగీతాన్నికానీ, మిగిలిన కళారూపల్ని కానీ అప్పటి కాలపరిస్తుతులు నిర్ణయిస్తాయి తప్ప ఇంకేవీ ఏవీ చెయ్యలేవు. ఈ కాల పరిస్థితులే విశ్వనాధ వార్ని కూడా మార్పు వేపు ఈడ్చుకొచ్చేయి. కాదని పురాణం సుబ్రహ్మణ్యం గారన్నా, పురాణం సీతన్నా, పి.ఎస్ అన్నా,”చేరా” అన్నా, వేగుంట మోహన్ ప్రసాద్, “మో” అన్నా, భగవంతుడే అన్నా అది ఒప్పుకోకూడదు..

  10. తడి గురించి Murali అభిప్రాయం:

    07/12/2008 9:01 am

    చిన్నమయ్యగారికి నమస్కారాలు.

    మీ కథ చాలా బాగుంది. అందరూ మీలా ఆలోచిస్తే ఈ ప్రపంచంలొ నిరక్షరాస్యతని నిర్మూలించవచ్చేమో! ఇలాంటి పధకాలకు ప్రభుత్వ సహకారమ్ కూడా ఉంటే భేషుగ్గా ఉంటుంది.
    భవదీయుడు
    మురళి