పాణినిగారూ, తెలిసిన పెద్దవాళ్ళు నాకీ ఫలానా పద్యం నచ్చింది అని ఒక వ్యాసం రాయడమూ, దాన్ని ఈమాట వంటి పత్రిక ప్రచురించడమూ జరిగిందంటే ఇది మీక్కూడా నచ్చవలసిన పద్యం నాయనా అని చెప్పక చెప్పినట్లే. అఫ్కోర్సు అన్ని పద్యాలూ అందరికీ నచ్చాలని లేదనుకోండీ.
ఏటి ఒడ్డున
గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:
09/11/2008
7:48 pm
అద్భుతంగా వ్రాశారు. ఒక impressionist painting ని చూసిన అనుభూతి. మీ కవిత చదివేక శారద గారి కథ చదివేను. మీ అద్భుతవైన పదచిత్రాలు పూరించలేని వెలితేదో శారద గారి కథలోని అతి సాదారణ పదాల్లో పూరించబడిందని నా అభిప్రాయం. నేనే తప్పేవో, మీ కవితలో వెలితి may be due over dose of romanticism in “ఈమాట” అని అనుకుంటున్నాను.
పిడికెడు మొర్మరాలు కూడా దొరకలేదు అనను గానీ, గుప్పెటినిండా దొరకలేదు. దవడలక్రింద గుప్పెడన్నా నలగకపోతే మొర్మరాల రుచి అంతగా తెలీదుకదా. నోట్లో పడిన ఆ కొద్ది మరమరాలు ఎక్కడో, ఎప్పుడో సరుకుల గదిలో మర్చిపోయిన డబ్బాలో చాలాకాలంగా నిలవుండిపొయ్యి, కొంచెం బూజెక్కి, కరుణెక్కిన మరమరాలని నాకనిపించింది. సాయంకాలం రావాలయందగ్గరకి హస్కేసుకోడానికిపోతే, తెలుగయ్యోరు వ్యాకరణం గురించి ఇచ్చిన ఉపన్యాసం ఇన్నట్టుంది ఈ వ్యాసం. చదివించగలిగిన శక్తుందా, బెమ్మాండంగావుంది గానీ చదివిందే భలే లేదనిపించింది. ఆ మాత్రం రాయగలిగుండి ఈపాటికో గుప్పెడు కథలో కాకరకాయలో రాసెయ్యకుండా, why the heck you are reintroducing us to something passé?
“ఈ పద్యం లో నన్ను ఆకట్టుకున్న విషయం పెద్దగా ఏమీ కనిపించడం లేదు.”
అన్నారు శ్రీనివాస్ నాగులపల్లిగారు.
అందుకే కాబోలు, ఈ వ్యాసపరంపరకు శీర్షిక “మీకు నచ్చవలసిన పద్యం: …” అని లేదు!
అన్యధా భావించకండి, మీ అభిప్రాయం చదివాక వచ్చిన చిన్ని ఆలోచన, అంతే.
—రామ (రమ) భరద్వాజ్ గారికి:
మీరు ఉదహరించిన రెండు సమీక్షలు/విమర్శలూ నాకు తెలుసు. వాటి ప్రతులు నా దగ్గిర లేకపోవటంతో, నేను వాటి ప్రస్తావన తేలేదు. నా సంపాదకీయం/వ్యాసం (?)(సరేనా విప్లవ్ గారూ! మీకు అభినందనలు) లో నేను ఉదహరించిన వాటన్నిటికీ నాదగ్గిర ప్రతులున్నాయి! మీరు ఆ రెండుసమీక్షలూ గుర్తుకితెచ్చి నన్ను మందలించినందుకు కృతజ్ఞుడిని.
—రోహిణీప్రసాద్ గారికి:
ఈ మాట గురించి మీరు చెప్పిన రెండు మంచి మాటలు మాకెంతో ఆనందం; గర్వకారణం. మీకు నా నమస్సులు.
—కొత్తపాళీ గారికి:
నిష్పాక్షికము అన్న మాట నేను without bias కి అనువాదంగా వాడాను. నా ఉద్దేశంలో విమర్శలలోసాధ్యమైనంతవరకూ ఏవిధమైన bias (పక్షపాతం అన్న మాట ఒప్పుకుంటారా?) ఉండకూడదు. అంటే విమర్శకుడి biases సమీక్షలోను, విమర్శలోనూ కనపడకూడదు, అని! తన భావస్పందన స్పష్టం గా ఉండకూడదనే అర్థం నావ్యాసం(?)/సంపాదకీయంలో వచ్చిఉంటే, రచయితగా అది నా చేతకానితనం. క్షమార్హుణ్ణి.
హనుమంతరావుగారికి:
కొ.కు. చెప్పినా, రా .రా. వ్రాసినా, తా.ధ. మందలించినా; — అసలు నిజం ఇది: కీట్స్ మరణానికి కారణం అతని క్షయ వ్యాధి. తన క్షయ వ్యాధి, దరిమిలా తన రాబోవు మరణం గురించి కీట్స్ చాలా మథన పడ్డాడు. కీట్స్ apothecary గా ( అంటే, మన భాషలో కాంపౌండర్ అనవచ్చనుకుంటా!) శిక్షణ పొందాడు!
1821 లో (కీట్స్ మరణానంతరం) ఈ కథ / రూమర్ మొదలయ్యింది. క్వార్టర్లీ రివ్యూ పత్రికలో ఒక “కర్కోటక” విమర్శకుడు(విమర్శకురాలు?) వ్రాసిన సమీక్ష కీట్స్ మరణానికి కారణం అని! ఈ రూమర్ కి ఆజ్యం పోసిన వాడు షెల్లీ. మీరు చదివే ఉంటారు; షెల్లీ వ్రాసిన Adonais. అది కీట్స్ పై elegy అని మీకు నేను చెప్పనక్కరలేదు. పోతే, బైరన్ వ్రాసిన Don Juan పద్యంలో, ఈ రూమర్ని కాస్త తక్కువ పాళ్ళల్లో పాడాడు:
‘Tis strange the mind, that very fiery particle,
Should let itself be snuffed out by an Article.”
Stanley Plumly ఈ మధ్యనే Posthumous Keats ( Norton, 2008) ప్రచురించాడు. అందులో ఈ కథ/రూమర్ ప్రస్తావన దొరుకుతుంది.
నమస్కారం.
నేను వ్రాసిందాంట్లో తప్పేమన్నా ఉంటే దయ చేసి క్షమించమని మొదటగా మనవి. మహా కవి తిక్కన కవిత్వాన్ని గాని, ప్రతిభను గాని విమర్శించే తాహతు కాదు కదా, పూర్తిగా గ్రహించి గుర్తించడం కూడా నాకు మించిన పనే. కేవలం ఈ పద్యం చదివిన తరువాత కలిగిన ఆలోచన మాత్రమే ఇది. తిక్కన రచనను బేరీజు వేసే దుస్సాహసం కాదు.
ఈ పద్యం లో నన్ను ఆకట్టుకున్న విషయం పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ద్రౌపది కోపంగా దుశ్శాసనుని వొళ్ళు ముక్కలైపోనీ, భీముని బలం, అర్జునిని గాండీవం తగలబడడానికా, దుర్యోధనుని పీనుగెల్లనీ, అని వొళ్ళు మండి చెప్పడాన్ని సీస పద్యంలో, సహజత్వానికి దగ్గరగా చెప్పినట్టున్నది. అంత మాత్రం చెప్పడం న్యాయమూ, అవసరమే కాని గొప్ప విషయంగా కనిపించడం లేదు. వీధిలో మంచినీళ్ళ కోసమో, ఇంకదేనికోసమో తెలుగులో కొట్టుకునేటప్పుడు తిట్టుకునేటప్పుడు ఉన్నట్టుగా అనిపించింది, కాకపోతే సీసం, ఆటలెదులలో. అట్లా కాదు, అసలు అదే ఆ పద్యం గొప్పతనం అంటే చెప్పేదేమీ లేదు, విని ఊరుకోవడం మాత్రమే, ఆ వీధిలోని తిట్లు విని ఊరుకున్నట్లుగా.
అదే తిక్కన గారిదే, “వరమున బుట్టితిన్ భరత వంశము జొచ్చితి” అన్న పద్యం ఎంతో రసవంతంగా, పదాల ప్రవాహ ధారతో, మనకు గుర్తుండే విధంగా, ఆకట్టుకునే పద్యం ఉంది కదా!
పోనీ, ఈ పద్యం కంటే సహజంగా, సరళంగా, రుసరుస సాగే ధారతో, “గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకంజెండుచున్నప్పుడొక్కండును నీ మొఱ నాలకింపడు” అని బెదిరించే తిరుపతి వేంకటకవుల పాండవోద్యోగ పద్యాలు కూడా ఉన్నవి కదా! తిట్లు, బెదిరింపులు, శపథాలు, ఆవేశపరమైన ఘట్టాలలో ఉన్న పద్యాలెన్నో ఉన్నాయి మనకు. వాటన్నింటి backdrop లో ఈ పద్యం గొప్పగా ఆకట్టుకుంటూ నిలబడుతుందని మాత్రం అనిపించడంలేదు.
***
విధేయుడు
Srinivas
నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి కొత్తపాళీ అభిప్రాయం:
09/12/2008 3:28 am
పాణినిగారూ, తెలిసిన పెద్దవాళ్ళు నాకీ ఫలానా పద్యం నచ్చింది అని ఒక వ్యాసం రాయడమూ, దాన్ని ఈమాట వంటి పత్రిక ప్రచురించడమూ జరిగిందంటే ఇది మీక్కూడా నచ్చవలసిన పద్యం నాయనా అని చెప్పక చెప్పినట్లే. అఫ్కోర్సు అన్ని పద్యాలూ అందరికీ నచ్చాలని లేదనుకోండీ.
ఏటి ఒడ్డున గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:
09/11/2008 7:48 pm
అద్భుతంగా వ్రాశారు. ఒక impressionist painting ని చూసిన అనుభూతి. మీ కవిత చదివేక శారద గారి కథ చదివేను. మీ అద్భుతవైన పదచిత్రాలు పూరించలేని వెలితేదో శారద గారి కథలోని అతి సాదారణ పదాల్లో పూరించబడిందని నా అభిప్రాయం. నేనే తప్పేవో, మీ కవితలో వెలితి may be due over dose of romanticism in “ఈమాట” అని అనుకుంటున్నాను.
ధార గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:
09/11/2008 7:15 pm
కథ నిర్వచించడానికి పూనుకోకపోతే, మొదలూ, తుదీ లేని, చిన్న సంఘటన (a snap shot of life) కూడా ఒక మంచి కథ అవుతుందని నిరూపించారు. అభినందనలు.
పడవ మునుగుతోంది గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:
09/11/2008 7:02 pm
పువ్వులూ, చెట్లూ, అకాశాలూ, సూర్యుళ్ళూ, చంద్రుళ్ళూ, మనసులో మాకుమేవే కల్పించుకునే అవాస్తవ సమస్యలు, నిన్న త్రాగిన నేతుల వాసన్లు, వీటినుంచి చిలికిన కథలో, కవితలో చదివి అలసిన మనసుకి, నేలని చూపించారు, బతుకుని కళ్ళ ముందర, ఏ మాత్రం భేషజాల్లేకుండా, నగ్నంగా కూర్చోబెట్టేరు.
మరో గుప్పెడు మొర్మొరాలు గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:
09/11/2008 6:31 pm
భాస్కర్,
పిడికెడు మొర్మరాలు కూడా దొరకలేదు అనను గానీ, గుప్పెటినిండా దొరకలేదు. దవడలక్రింద గుప్పెడన్నా నలగకపోతే మొర్మరాల రుచి అంతగా తెలీదుకదా. నోట్లో పడిన ఆ కొద్ది మరమరాలు ఎక్కడో, ఎప్పుడో సరుకుల గదిలో మర్చిపోయిన డబ్బాలో చాలాకాలంగా నిలవుండిపొయ్యి, కొంచెం బూజెక్కి, కరుణెక్కిన మరమరాలని నాకనిపించింది. సాయంకాలం రావాలయందగ్గరకి హస్కేసుకోడానికిపోతే, తెలుగయ్యోరు వ్యాకరణం గురించి ఇచ్చిన ఉపన్యాసం ఇన్నట్టుంది ఈ వ్యాసం. చదివించగలిగిన శక్తుందా, బెమ్మాండంగావుంది గానీ చదివిందే భలే లేదనిపించింది. ఆ మాత్రం రాయగలిగుండి ఈపాటికో గుప్పెడు కథలో కాకరకాయలో రాసెయ్యకుండా, why the heck you are reintroducing us to something passé?
నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి పాణిని శంఖవరం అభిప్రాయం:
09/11/2008 4:07 pm
“ఈ పద్యం లో నన్ను ఆకట్టుకున్న విషయం పెద్దగా ఏమీ కనిపించడం లేదు.”
అన్నారు శ్రీనివాస్ నాగులపల్లిగారు.
అందుకే కాబోలు, ఈ వ్యాసపరంపరకు శీర్షిక “మీకు నచ్చవలసిన పద్యం: …” అని లేదు!
అన్యధా భావించకండి, మీ అభిప్రాయం చదివాక వచ్చిన చిన్ని ఆలోచన, అంతే.
పుస్తక సమీక్షల గురించి… గురించి vElUri VEMkaTESvara raavu అభిప్రాయం:
09/11/2008 1:46 pm
—రామ (రమ) భరద్వాజ్ గారికి:
మీరు ఉదహరించిన రెండు సమీక్షలు/విమర్శలూ నాకు తెలుసు. వాటి ప్రతులు నా దగ్గిర లేకపోవటంతో, నేను వాటి ప్రస్తావన తేలేదు. నా సంపాదకీయం/వ్యాసం (?)(సరేనా విప్లవ్ గారూ! మీకు అభినందనలు) లో నేను ఉదహరించిన వాటన్నిటికీ నాదగ్గిర ప్రతులున్నాయి! మీరు ఆ రెండుసమీక్షలూ గుర్తుకితెచ్చి నన్ను మందలించినందుకు కృతజ్ఞుడిని.
—రోహిణీప్రసాద్ గారికి:
ఈ మాట గురించి మీరు చెప్పిన రెండు మంచి మాటలు మాకెంతో ఆనందం; గర్వకారణం. మీకు నా నమస్సులు.
—కొత్తపాళీ గారికి:
నిష్పాక్షికము అన్న మాట నేను without bias కి అనువాదంగా వాడాను. నా ఉద్దేశంలో విమర్శలలోసాధ్యమైనంతవరకూ ఏవిధమైన bias (పక్షపాతం అన్న మాట ఒప్పుకుంటారా?) ఉండకూడదు. అంటే విమర్శకుడి biases సమీక్షలోను, విమర్శలోనూ కనపడకూడదు, అని! తన భావస్పందన స్పష్టం గా ఉండకూడదనే అర్థం నావ్యాసం(?)/సంపాదకీయంలో వచ్చిఉంటే, రచయితగా అది నా చేతకానితనం. క్షమార్హుణ్ణి.
హనుమంతరావుగారికి:
కొ.కు. చెప్పినా, రా .రా. వ్రాసినా, తా.ధ. మందలించినా; — అసలు నిజం ఇది: కీట్స్ మరణానికి కారణం అతని క్షయ వ్యాధి. తన క్షయ వ్యాధి, దరిమిలా తన రాబోవు మరణం గురించి కీట్స్ చాలా మథన పడ్డాడు. కీట్స్ apothecary గా ( అంటే, మన భాషలో కాంపౌండర్ అనవచ్చనుకుంటా!) శిక్షణ పొందాడు!
1821 లో (కీట్స్ మరణానంతరం) ఈ కథ / రూమర్ మొదలయ్యింది. క్వార్టర్లీ రివ్యూ పత్రికలో ఒక “కర్కోటక” విమర్శకుడు(విమర్శకురాలు?) వ్రాసిన సమీక్ష కీట్స్ మరణానికి కారణం అని! ఈ రూమర్ కి ఆజ్యం పోసిన వాడు షెల్లీ. మీరు చదివే ఉంటారు; షెల్లీ వ్రాసిన Adonais. అది కీట్స్ పై elegy అని మీకు నేను చెప్పనక్కరలేదు. పోతే, బైరన్ వ్రాసిన Don Juan పద్యంలో, ఈ రూమర్ని కాస్త తక్కువ పాళ్ళల్లో పాడాడు:
‘Tis strange the mind, that very fiery particle,
Should let itself be snuffed out by an Article.”
Stanley Plumly ఈ మధ్యనే Posthumous Keats ( Norton, 2008) ప్రచురించాడు. అందులో ఈ కథ/రూమర్ ప్రస్తావన దొరుకుతుంది.
విధేయుడు, — వేలూరి వేంకటేశ్వర రావు.
మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి sasAmka అభిప్రాయం:
09/11/2008 12:27 pm
కర్ణాటక సంగీతం కాదు బాబోయ్..కర్నాటక సంగీతం
నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
09/11/2008 11:47 am
నమస్కారం.
నేను వ్రాసిందాంట్లో తప్పేమన్నా ఉంటే దయ చేసి క్షమించమని మొదటగా మనవి. మహా కవి తిక్కన కవిత్వాన్ని గాని, ప్రతిభను గాని విమర్శించే తాహతు కాదు కదా, పూర్తిగా గ్రహించి గుర్తించడం కూడా నాకు మించిన పనే. కేవలం ఈ పద్యం చదివిన తరువాత కలిగిన ఆలోచన మాత్రమే ఇది. తిక్కన రచనను బేరీజు వేసే దుస్సాహసం కాదు.
ఈ పద్యం లో నన్ను ఆకట్టుకున్న విషయం పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ద్రౌపది కోపంగా దుశ్శాసనుని వొళ్ళు ముక్కలైపోనీ, భీముని బలం, అర్జునిని గాండీవం తగలబడడానికా, దుర్యోధనుని పీనుగెల్లనీ, అని వొళ్ళు మండి చెప్పడాన్ని సీస పద్యంలో, సహజత్వానికి దగ్గరగా చెప్పినట్టున్నది. అంత మాత్రం చెప్పడం న్యాయమూ, అవసరమే కాని గొప్ప విషయంగా కనిపించడం లేదు. వీధిలో మంచినీళ్ళ కోసమో, ఇంకదేనికోసమో తెలుగులో కొట్టుకునేటప్పుడు తిట్టుకునేటప్పుడు ఉన్నట్టుగా అనిపించింది, కాకపోతే సీసం, ఆటలెదులలో. అట్లా కాదు, అసలు అదే ఆ పద్యం గొప్పతనం అంటే చెప్పేదేమీ లేదు, విని ఊరుకోవడం మాత్రమే, ఆ వీధిలోని తిట్లు విని ఊరుకున్నట్లుగా.
అదే తిక్కన గారిదే, “వరమున బుట్టితిన్ భరత వంశము జొచ్చితి” అన్న పద్యం ఎంతో రసవంతంగా, పదాల ప్రవాహ ధారతో, మనకు గుర్తుండే విధంగా, ఆకట్టుకునే పద్యం ఉంది కదా!
పోనీ, ఈ పద్యం కంటే సహజంగా, సరళంగా, రుసరుస సాగే ధారతో, “గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకంజెండుచున్నప్పుడొక్కండును నీ మొఱ నాలకింపడు” అని బెదిరించే తిరుపతి వేంకటకవుల పాండవోద్యోగ పద్యాలు కూడా ఉన్నవి కదా! తిట్లు, బెదిరింపులు, శపథాలు, ఆవేశపరమైన ఘట్టాలలో ఉన్న పద్యాలెన్నో ఉన్నాయి మనకు. వాటన్నింటి backdrop లో ఈ పద్యం గొప్పగా ఆకట్టుకుంటూ నిలబడుతుందని మాత్రం అనిపించడంలేదు.
***
విధేయుడు
Srinivas
ఏటి ఒడ్డున గురించి radhika అభిప్రాయం:
09/11/2008 10:31 am
కవిత్వమంటే ఇదీ అని ఎవరికన్నా చెప్పాల్సివస్తే ఈ కవిత ఒక్కటి చూపిస్తే చాలు. ఎన్ని పదచిత్రాలో, ఎన్ని మెరుపులో….
నా మనసు, నేనూ పూర్తిగా మునిగిపోయాము.