పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. పదేళ్ళ “ఈమాట” మాట గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    11/01/2008 11:31 pm

    వెబ్ పత్రికల్లో ఈమాట అగ్రగణ్య. సందేహం లేదు. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి రచనలతో పాఠకుల దాహాన్ని తీరుస్తుందని ఆశిస్తూ…

  2. సువర్ణభూమిలో … గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    11/01/2008 11:19 pm

    ఆఖరి ఖండిక బావుంది.

  3. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    11/01/2008 11:16 pm

    మంచి వాతావరణ కల్పన ఉంది. పడికట్టు పదాలు లేకపోవడం మీ కవిత్వ బలం. keep writing!

  4. తరువాతేమిటి? గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    11/01/2008 11:12 pm

    కొన్ని వ్యక్తీకరణలు బలంగా ఉన్నాయి.

  5. సార్ గారండీ… సార్ గారండీ… గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    11/01/2008 11:09 pm

    చాలా బావుందండీ!

  6. వాడుక భాషలో పద్యాలు గురించి Kameswara Rao అభిప్రాయం:

    11/01/2008 5:33 am

    ఈ మధ్య ఇంటర్నెట్టు సౌలభ్యానికి కాస్తంత అభ్యంతరం ఏర్పడి ఈ చర్చని ఇంతవరకూ చూడలేదు. దీని గురించి తాపీగా మళ్ళీ ఆలోచించి రాయాలి. ప్రస్తుతానికి రెండు మూడు విషయాలు.
    మోహనగారు వాడుకభాషలో పద్యాలకి ఆదరణ లభించాలని కోరుకున్నారు. సమంజసమే. వాడుక భాషలో పదునైన, అందమైన పద్యకవిత్వం వస్తే (రా గలిగితే) దానికి ఆదరణ తప్పకుండా లభిస్తుందని నా నమ్మకం.
    తెలుగులో పాదాంత విరామం గురించి. అది సంస్కృతంలో నియమం. తెలుగులో లేదు. కాబట్టి, కావాల్సిన చోటల్లా ఆ విరామాన్ని పాటించడానికీ అవకాశం ఉంది, అక్కరలేదనుకున్నప్పుడు పాటించకపోడానికీ అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తెలుగు ఛందస్సులో ఎక్కువ వెసులుబాటు ఉందన్నమాట!
    బాబ్జీలుగారు తమ వ్యాఖ్యల్లోకి రెండు మూడు సార్లు నన్ను లాక్కొచ్చారు 🙂 వారికోసం నేను వాడుకభాషలో రాసిన పద్యాలు: “నాన్నా తెలుసా“.

  7. వాడుక భాషలో పద్యాలు గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    11/01/2008 5:24 am

    బాబ్జీలు గారు,
    మస్తు ఉపకారం చేసారు గా ప్రశ్న అడిగి. నా పాయింటుకు సూ…….టితనం తెచ్చారు.

    వాడుక భాషలో పద్యాల గురించే మన ముచ్చట. మస్తుగా సదివినోళ్ళు, సూసినోళ్ళు, వాడుక భాషలోని పదానికే అర్థం తెలియక తటపటాయిస్తే, ఇక అందులో పద్యాలు రాయడం, చదవడం, అవి సులభంగా, సవ్యంగా పాఠకునికి అర్థమవడం- అంతా అయ్యే పనేనా అని పెద్ద, చెడ్డ అనుమానం. కారణం? మన సక్కని భాషకు సక్కని dictionaries సామాన్యులకు అందుబాటులో లేకపోవడం.

    అదృష్టం బాగుండి Brown Telugu-English dictionary లో “మస్తు” అంటే “సమృద్ధి, plenty, abundance” అని ఒక అర్థం ఉంది. మనకున్న ఎన్నో dictionaries లో అది ఉంటుందని ఆశైతే లేదు. మనకాడ పుట్టిన bazaar పదానికి అర్థం వ్యుత్పత్తులు మన కాడ కన్నా English dictionaries లోనే మంచిగా దొరుకతయి. మనదైపోయిన పదానికి అర్థం, మరో భాషలోని పాటను చెప్పుకొని వివరించుకుంటేనేగాని అర్థం కాని దుస్థితిలో ఉన్నాం. వాడుక భాష వాడితేనే సదువుకున్నోళ్ళు పరేషానైపోతే, వేరేవాళ్ళ పరిస్థితి దేవుడెరుగు.
    ==============
    విధేయుడు
    -Srinivas

  8. వాడుక భాషలో పద్యాలు గురించి baabjeelu అభిప్రాయం:

    10/31/2008 9:52 am

    కృష్ణమోహన్ గారూ,మీకు చేత కాదని నేననుకోవడంలేదు. మీరు రాసిన పద్యాలు నేను చూళ్ళేదు. క్షమించండి. మీరు గానీ, కామేశ్వర రావు గారు గానీ, మరెవరైనా గానీయండి; ఛందోబధ్దమైన పద్యాలు నా “హ్రస్వదృష్టి”కి (దానికి తోడు చెత్వారం)కనబడలేదు. అది నా తప్పే. కానీ ఒక విషయం చెప్పండి, మీ వ్యాసంలో వుదాహరణలు ఇప్పటివాళ్ళవి ఎంత %? అది చా………లా తక్కువనిపించింది నాకు. అందుకని అడిగేను. వాడుక భాషలోనైనా, మరేభాషలోనైనా ఛందొబధ్ధమైన పద్యాల విషయం ఎలాటిదంటే: ఒకప్పటి మన గొప్ప ఆట “హాకీ” ఇప్పటికీ గొప్పదనడంలాటిది. ప్రస్తుతం “హాకీ” గొప్పగా ఆడీవాళ్ళు లేకపోయినా.

    ఇంతకీ శ్రీనివాస్ నాగులపల్లి గారుదహరించిన తేటగీతి చివరి పాదంలోని “మస్తు”
    “తూ చీజ్ బడీ హై “”మస్త్ మస్త్”” లోని మస్తేనా? ఇంకో మస్తా?
    ఇందులో ఇకటాలేటీలేవు. తెలకడగడం అంతే. దయుంచాల.

    లైలాగారు చెప్పిన “ఈమాట” యొక్క “ఎడ్వాంటెజి” వొప్పుడో వొప్పీసుకున్నాను. మౌనంగా అలోచించడవొక్కటే నేర్సుకోవాల. “సబ్మిట్” మీద “క్లిక్” కొట్టినకాణ్ణించీ అదీ మొదలెడతాను.    

  9. వాడుక భాషలో పద్యాలు గురించి Lyla yerneni అభిప్రాయం:

    10/30/2008 6:05 pm

    శభాష్ S.N. బాగుంది సీసం. Yummy.
    Easy does it బాబ్జీలూ! విశాలాంధ్రలో, మరింత విశాల ప్రపంచంలో, అంతా పద్యాలు రాసే పని మీద ఉండరు కదా! ఎవరికి ఉషారు వచ్చినపుడు వాళ్ళు ఇష్టమైన విషయాల మీద, ఇష్టమైన పద్ధతిలో -వచనమో, పద్యమో, పాటో- రాస్తారు. ఎవరికి సమయం ఉన్నప్పుడు వాళ్ళు చదువుతారు. ‘ఈ మాట’ మేగజీన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చయ్యే. రచనలు ప్రచురించిన వరసలోనే చదవక్కర్లేదు కూడా. వెనక వెనక్కూ, మళ్లీ ముందుకీ, వెళ్ళొచ్చు. “పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి” -అనే అంత హడావిడేం లేదు. మనకు కావాల్సిన విషయాలు మనిష్టమైనప్పుడు చదవొచ్చు. నేనైతే లైబ్రరీలో లాగా నిశ్శబ్దంగా చదువుకుని ఆనందిస్తుంటాను అప్పుడప్పుడూ. ఈ వ్యాసం అలాగే చదివేసి వెళ్ళిపోయాను. చదివినప్ప్పుడల్లా మాట్లాడం కదా. కొన్నిసార్లు మౌనంగా ఆలొచించటం కూడ అవసరమే. ఈ చదవటం, రాయటం అనే కార్యక్రమం అలా సాగుతూనే ఉంటుంది. మరమరాలు తింటూ చదువుకుంటూ ఉంటమే. Relax. Where is the anxiety? Easy does it మై డియర్ బాబ్జీలూ!

    లైలా

  10. వాడుక భాషలో పద్యాలు గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    10/30/2008 8:23 am

    బాబ్జీలు గారికి నమస్కారం.
    మోహనగారు వాడుక భాషలోనే కాదు, కొత్త ఛందాలలో కూడా పద్యాలు వ్రాస్తూనే ఉన్నారు. అంతకంటే ముఖ్యంగా, ఎవరైనా ప్రయత్నిస్తే
    సాయం కూడా చేస్తున్నారు. మనమే చదవట్లేదు!

    సీ. పద్యమా! యెందుకు పాతి పెట్టెదనని
    ప్రతినబూనిరిమన రచయితెపుడొ
    పద్యమా! కాదది పామని కొట్టెద
    కర్రతో యనెమన కవియె నొకరు
    పద్యమా! నీయొక్క పాడు శృంఖలములు
    పగులగొ ట్టెదనని పల్కె నొకరు
    పద్యమా! నీవొట్టి పాతకా లపురోత
    క్రొత్త కావాలనె క్రొత్త కవులు

    తే. కాని భాష నిలబడి పకపక నవ్వె
    సొంత రూపాల పైచిచ్చు వింత గొలుప
    తనదు బిడ్డల మేలునె తలచి పలికె
    మస్తు శుభమస్తు యారోగ్య మస్తు యనుచు!
    ========
    విధేయుడు
    -Srinivas