పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. రెండు తీరాలు గురించి Sowmya అభిప్రాయం:

    11/03/2008 12:15 am

    చాలా బాగుంది!

  2. సువర్ణభూమిలో … గురించి Sowmya అభిప్రాయం:

    11/03/2008 12:11 am

    I liked the last one the most 🙂
    Others… నాకు సరిగా అర్థం అయ్యాయా లేదా అని సందేహం 🙂

  3. పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    11/02/2008 11:00 pm

    అబినందనలు

  4. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి B.Ajay Prasad అభిప్రాయం:

    11/02/2008 10:36 pm

    మీ వ్యాసం బావుంది. పథేర్ పాంచాలి నిజంగా ఒక కళాఖండం. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మరో సన్నివేశం, ముగింపులో హరిహర్ భార్యని చనిపోయిన దుర్గ గురించి అడుగుతున్నప్పుడు ఆమె కూర్చున్నచోటునే దుఃఖంతో కూలబడిపోతుంది. ఇక్కడ పండిట్ రవిశంకర్ తన అసమాన ప్రతిభని చూపించాడు. దృశ్యం, శబ్దం ఏకమై ప్రేక్షకుడు వాళ్ళ దుఃఖంతో మమేకమౌతాడు. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

    అలాగే భిభూతిభూషణ్ మరొక మంచి నవల “వనవాసి”.

  5. ఈమాట – నామాట గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/02/2008 8:11 pm

    ఈమాట సంపాదక, రచయిత, పాఠక వర్గానికి పదో జన్మదిన శుభాకాంక్షలు. నాలుగు కాలాల పాటు ఈ పత్రిక వెలగాలని కోరుకుంటున్నాను. ప్రతి సంచికకీ రాత్రింబవళ్ళూ శ్రమించే సంపాదకులకి, ముఖ్యంగా నాకెక్కువ సాయపడే సురేష్ కీ, పద్మ గారికీ, కృతజ్ఞతలు. ఎంత చిన్న విషయాన్నయినా తేలిగ్గా తీసుకోకుండా ఉన్నత స్థాయిలో ప్రచురించాలనే వారి దీక్ష మెచ్చుకోదగ్గది. వాళ్ళు మార్చినది బాలేదని నేను పేచీ పెడ్తే ఓపిగ్గా సమాధానం ఇచ్చి సామరస్యంగా పరిష్కరించడం సంతోషకరం. వారి ఉద్యోగ బాధ్యతలని నిర్వర్తిస్తూ, బహుశా కుటుంబ బాధ్యతలని కొంతవరకు నిర్లక్ష్యం చేస్తూ ఈమాట కోసం పాటుపడుతున్న సంపాదకుల అంకిత భావం స్ఫూర్తిదాయకం.

    Peer Review గురించి: సంపాదకులకి తలకి మించిన పనిభారం వలన గానీ, పరిమిత విషయ పరిజ్ఞానం వలన గానీ, కొన్నిటిని వేరే వాళ్ళని సమీక్షించమంటే సరే, కాని అది పత్రిక పద్ధతిగా పెట్టుకుంటే, నాదొక సందేహం. ఇది సాహితీ పత్రికలలో సాధారణంగా చేస్తారా? ఉన్నత ప్రమాణాలున్న, తెలుగులో లేకపోతే ఇంగ్లీషులోనే తీసుకోండి, ఇతర సాహితీ పత్రికలలో ఇదేనా ఆనవాయితీ? నాకు నిజంగానే తెలియకే అడుగుతున్నాను.

    ఈమాట సంపాదక వర్గం అంతా, రచయితల్లో చాలా మందీ, బహుశా పాఠకుల్లో కూడా చాలా వరకూ, విజ్ఞానశాస్త్రాల్లో విద్యాధికులూ, నిష్ణాతులూనూ. కాని సాహితీ పత్రిక అన్ని రంగాల వాళ్ళనీ ఆకర్షించేదిగా ఉండాలి. ఈమాటని Physical Review ప్రమాణాలతో నడుపుతాం అంటే శాస్త్రరంగాలలో లేనివాళ్ళకి కాస్త “భయం” కలగొచ్చు. The New Yorker పద్ధతిన నడుపుతాం అంటే బహుశా అందరికీ ఆమోదయోగ్యం కావొచ్చు.

    కొడవళ్ళ హనుమంతరావు

  6. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:

    11/02/2008 3:56 pm

    A comprehensive and interesting review. The book indeed shows her dedication, hard work and in depth analysis. It sure is “heart warming” introduction by Sarayu Rao as you rightly put it.

  7. ఈమాట – నామాట గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    11/02/2008 2:03 pm

    సమీక్షకులకి కృతజ్ఞతలు చెప్పకపోవడం నాతప్పు. క్షమార్హుణ్ణి. తలపండినా తప్పులు చెయ్యడం మాత్రం తగ్గ లేదు!

    మరో విశేషం. ఈ నామాట, ప్రచురణకి ముందు సమీక్షించబడింది. వాళ్ళ సలహాలననుసరించి మార్పులు, కూర్పులూ చెయ్యడం కూడా జరిగింది! అయితే, నేను సమీక్షకులసంగతి మరిచిపోయానన్న సంగతి మా సమీక్షకులుకూడా నాకు చెప్పలేదు. నన్ను హెచ్చరించలేదు. నన్ను మందలించినందుకు బ్రహ్మానందంగారికి కృతజ్ఞతలు.

    మోహన గారి సలహా పాటించడానికి ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నా.

    మళ్ళీ మరోసారి, నా క్షమాపణలు.
    విధేయుడు,
    వేలూరి వేంకటేశ్వర రావు.

  8. ఈమాట పదవ జన్మదిన ప్రత్యేక సంచికకు స్వాగతం! గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:

    11/02/2008 1:20 pm

    ఈమాట పదవ వార్షికోత్సవ సందర్భంగా సంపాదకులందరికీ మరొక్కసారి శుభాభినందనలు!!
    సాహిత్య పరంగానూ, సాంకేతికపరంగానూ అతిరధులు,మహారధులైన సంపాదకుల సారధ్యం వలన ప్రస్తుతం ఉన్న సాహితీ పత్రికలన్నింటిలో ఈమాట మొదటి స్థానం లో ఉండటం ఎంతమాత్రమూ ఆశ్చర్యం కాకపోయినా ఈ పత్రిక ను ఈ స్థాయిలో నడపటం వెనుక ఉన్న సంపాదకవర్గం కృషి, నిబద్ధత ,అంకితభావం ,passion, పత్రిక పై వారు వెచ్చిస్తున్న సమయం నిస్సందేహంగా అభినందనీయాలు.

  9. ఈమాట – నామాట గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    11/02/2008 12:37 pm

    మోహన గారు మంచి సలహా ఇచ్చారు.
    ప్రతీ కథనీ, కవితనీ, వ్యాసాన్నీ సమీక్ష చేసి వేస్తామని సంపాదకులు సెలవిచ్చారు. బాగుంది. సంపాదక వర్గాన్ని మెచ్చుకున్నారు. రచయితలకీ, పాఠకులకీ కృతజ్ఞతలు చెప్పిన చేత్తోనే సమీక్షకులకి ( పేర్లు చెప్పనవసరం లేదు )కూడా చెప్పుంటే బావుండేది. ఈ వ్యాసంలో ఆ లోపం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది.

  10. ఈమాట – నామాట గురించి mOhana అభిప్రాయం:

    11/02/2008 12:16 pm

    ఈమాటకు జన్మదిన శుభాకాంక్షలు. నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకొంటున్నాను. పీర్ రెవ్యూ గురించి ఒక రెండు మాటలు. నా తలలో ఏముందో ఎంత ఉందో తెలియదు, కాని నాకు తలేమో పండిందని ఒప్పుకోవాల్సిందే! సంపాదకుల, సమీక్షకుల సలహాలు రచన అందానికి మెరుగు తెస్తుంది కాని దానికి మసి పూయదు. రచయిత తన రచనను తన దృష్టినుండి మాత్రమే చూడడానికి అవకాశం ఉంది. కాని సంపాదకుల దృష్టి, సమీక్షకుల దృష్టి ఆ రచన పత్రికకు ఎలా సరిపోతుందో, పాఠకులను ఎలా ఆకర్షించ గలుగుతుందో అనే దానిపైన ఉంటుంది. ఈ రెంటికి మధ్య ఒక ఘర్షణ ఉందనుకోవడం పొరబాటు. “మంచి” సంపాదకత్వంవల్ల సామాన్యమైన రచన మంచి రచన అవడానికి, మంచి రచన ఇంకా మంచి రచన అవడానికి అవకాశం ఉంది. అన్ని రచనలను సంపాదకులు మాత్రమే సమీక్షించడానికి వీలుకాదు. వాళ్లకు పని ఉంది, కుటుంబం ఉంది, సరదాలు ఉన్నాయి. అది కాక బయస్ కూడా కలగడానికి అవకాశం ఉంది. కొన్ని రచనలలో వాళ్లు ఎంతో ఓపికతో తమ కాలాన్ని వినియోగిస్తారు. ఇది నాకు బాగా తెలుసు. కాని నాదొక కోరిక. ప్రతి ఏడాది చివర సమీక్షకుల పేరులు తెలియజేస్తే బాగుంటుంది. కొన్ని విజ్ఞాన శాస్త్ర పత్రికలకు ఈ వాడుక ఉన్నది. దీనివల్ల రచయితలకు, పాఠకులకు పత్రిక standard తెలుస్తుంది. పత్రిక ఔన్నత్యము పత్రిక రచనలపైన, రచయితలపైన, సంపాదకులపైన, సమీక్షకులపైన ఆధారపడి ఉంటుంది. వీటిలో మొదటి మూడు మనకు తెలుసు. నాలుగవది మాత్రం తెలియదు. అందుకే ఈ చిన్న సలహా.
    విధేయుడు – మోహన