పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3 గురించి Rao Vemuri అభిప్రాయం:

    01/17/2009 9:08 am

    త్ర్యంబకము అన్న ప్రయోగమే సరి అయినది. సంస్కృత పదాలని తెలుగులో రాసేటప్పుడు వికృతి రూపాలు రాయచ్చు కదా అనిన్నీ, మూడేసి అక్షరాల దొంతరలు రాయటం ఇష్టం లేకనున్నూ త్రయంబకుడు అని కావాలనే రాసేను. ఇతర భాషలలోని మాటలని రాసేటప్పుడు ఈ రకం స్వతంత్రం తీసుకోవటంలో తప్పులేదనే అనుకుంటున్నాను. రష్యన్ మాటలని, ఫ్రెంచి మాటల్ని ఇంగ్లీషులో రాసేటప్పుడు తప్పని సరిగా స్పెల్లింగు మార్పులు జరిగినట్లే, కష్టమైన సంస్కృతం మాటలని తెలుగులో రాసేటప్పుడు కొంచెం స్వతంత్రించేను. పద్ధతి పాటించాలంటే త్ర్యంబకము అనే రాయాలి.

  2. హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/17/2009 7:32 am

    ఈ ఉస్తాద్ ఎవరో తెలియదుగాని తమ ఘరానాల ‘రహస్యాలను’ సులువుగా ఇతరులతో పంచుకోని ధోరణి ఈ వార్తవల్ల మనకు తెలుస్తుంది.

  3. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి JSN అభిప్రాయం:

    01/16/2009 3:34 pm

    మీ వ్యాసం చాలా బాగుంది. త్యాగరాజు గురించి కొత్త విషయాలు తెలిసాయి.

    త్యాగరాజు శిష్యులు వారు స్వరపరిచిన కీర్తనల్ని గురువు గారి మరణాంతరం అయన పేరు మీదుగా ప్రచారం చేసారని అంటారు. నిజమేనా?

  4. నిరసన (గల్పిక) గురించి అళక్కి శ్రీనివాస్ అభిప్రాయం:

    01/16/2009 8:56 am

    రాసి పదేళ్లయినా ఎంత చెదరని “సత్యం”? చరిత్ర పునరావృతమవుతూనే వుంది. ప్రభువుల అండదండలు లేకుండా, మదుపుదారుల ఆశలు ఆవిరయ్యేనా? మీరు ప్రస్తావించింది బాధ్యతారహిత బహిరంగ విధ్వంసం అయితే, ఈరోజు పట్ట పగలే దోపిడీ జరిగింది.

  5. తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3 గురించి Pavan Kumar Hari అభిప్రాయం:

    01/16/2009 4:21 am

    వేంకటేశ్వరరావు గారి వ్యాసం చాలా బాగుంది.. చక్కటి వ్యాసాన్ని వ్రాసినందులకు కృతజ్ఞతలు.
    ఒక్క చిన్న మనవి.
    శివుణ్ణి “త్ర్యంబకుడు” అంటారు కదా… త్ర్యంబకము కలవాడు త్ర్యంబకుడు…
    త్ర్యంబకము = త్రి + అంబకము, అంబకము అంటే కన్ను అని అర్థము (బాణం అని కూడా అర్థం ఉంది)… “త్రయంబకుడు” అన్న ప్రయోగం సరియైనది కాదేమోనని నా ఉద్దేశ్యం…

  6. కావలెను గురించి అళక్కి శ్రీనివాస్ అభిప్రాయం:

    01/16/2009 1:20 am

    ఎంచుకున్న వ్యాస విషయం సార్వ జనీనమయింది. ఎదురు దెబ్బల బాధని వ్యంగం జోడించి వ్యక్తీకరించడం భేషైన ప్రక్రియే! కాని ఎక్కుపెట్టిన బాణాలే కొన్ని గురి తప్పినట్టనిపించింది. వ్యాసకర్త తనని తాను నిర్వాహకుని (ఉత్తమ పురుష లోనున్న వ్యాసంలో) గా పరిచయం చేసుకుని నిర్వాహకులమీదే వేసిన విసుర్లు నన్ను విస్మయానికి లోను చేసేయి. ఇంత సమస్యకి అద్దం పట్టిన వ్యాసకర్త “నివాసి” కాదు ప్రవాసి అని నా నమ్మకం. మరిన్ని జన రంజకమైన రచనలు చేస్తారని ఆశిస్తాను.

  7. మేడ్‌ ఇన్‌ అమెరికా గురించి అళక్కి శ్రీనివాస్ అభిప్రాయం:

    01/16/2009 12:45 am

    సమస్య ఒక పార్శ్వం కధ చక్కగా ఎత్తి చూపింది. దేశంలో పుట్టి పెరిగిన వారి కంటే, అమెరికాలో పుట్టి పెరిగిన యువకులు (యువతుల్ని కూడా కలుపుకుని) “నవీన” భావాలు కలిగి వుంటారని రచయిత చెప్పక చెప్పినట్టనిపించింది.

    మొదటిసారి చదువుతున్నప్పుడు, కధలో పాఠం చివరికొస్తున్నప్పటికీ, సమస్య సానుకూలమవక, మరింత జటిలమవుతూవుంటే, నేననుమానించిన ప్రకారంగానే కొసమెరుపుతో జిగేలుమంది. అభినందనలు.

    ముఖ్యోద్దేశ్యం. = ముఖ్యోద్దేశం కదా, సంపాదకులు గమనించ ప్రార్ధన.

    [తప్పు సరిదిద్దబడింది. ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు – సం. 1/16/2009]

  8. తరవాణి కేంద్రం గురించి నెటిజన్ అభిప్రాయం:

    01/15/2009 4:52 am

    “మనిషి అంటే అనుభవాల సంపుటి. మనిషి అంటే జ్ఞాపకాల సంపుటి. ఈ రెండింటి సారమే బతుకు. ” – రమ
    Quotable Quote!

  9. తరవాణి కేంద్రం గురించి rama అభిప్రాయం:

    01/14/2009 8:46 pm

    సావిత్రి గారూ !!

    ఉప్పల లక్ష్మణరావు గారి ఆత్మకథ “బతుకు పుస్తకం” లో ఆయన మాస్కో లో ఉన్న రోజుల్లో గోంగూర పచ్చడి తయారు చేసుకున్న పద్ధతిని ఆసక్తిగా వివరించింది గుర్తొచ్చింది మీ “తరవాణి” వ్యవహారం చదివాక.

    పాపం ఆయనకి అక్కడ గోంగూర దొరకదు. అక్కడ ఉన్న మిత్రులకి ఆయన ఈ తెలుగు వంటకం ఎలా చేసిచూపించేరన్నదే వివరిస్తారు. ఆ దేశంలో దొరికే ఒక రకమైన పుల్లటి ఆకుకూరతో ఆయన మన గోంగూర పచ్చడి అనుభవాన్ని సాధిస్తారు మొత్తానికి.

    దేశం మనలో ఉంటుంది. ప్రాంతం మనలో ఉంటుంది. ఎంతగా భాషలో ఒక ఒప్పుదలని మనం పాటించినా, యాస మన మాటలో ఎంతో కొంత కదలాడుతుంది. మనిషి అంటే అనుభవాల సంపుటి. మనిషి అంటే జ్ఞాపకాల సంపుటి. ఈ రెండింటి సారమే బతుకు. ఇవి చాలినంత లేనప్పుడు చీకటిలో తడుముకున్నట్టే ఉంటుంది. మీ “తరవాణి” కోసం ఆరాటం స్మృతుల కాంతితోవ కోసం ఆరాటమే !!

    రమ.

  10. బాలమురళీకృష్ణ సంగీతం గురించి taha taha అభిప్రాయం:

    01/14/2009 12:00 pm

    ౧. కర్ణాటక సంగీతం లో సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యత , భక్తి ని ప్రకటించే మార్గం దైన్యం ఒక్కటే కాదు అన్న విషయమూ ఈ రెండూ తెలియటం బాల మురళి సంగీతానికి ఆయువు .
    ౨. సుదీర్ఘ స్వర ప్రస్తారానతరం పల్లవి పాడి కీర్తన ముగించటం రికార్డుల్లో సైతం బాల మురళి తప్ప ఎవరైనా ఈ నలభై ఏళ్ళు గా చేసారా అన్నది ఎవరైనా చెప్పగలరా?
    మళ్ళీ కొంత రాస్తాను.

    రోహిణీ ప్రసాద్ గారి వ్యాసమూ దాని మీద చర్చ చాల బావున్నాయి నేను రోహిణి గారి సమకాలిన విద్యార్థిని ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో
    తహ తహ