పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. బోడి పద్యం గురించి Meher అభిప్రాయం:

    04/05/2009 11:57 pm

    ఇక్కడ కవితలో కన్నా వ్యాఖ్యానాలలో ఎక్కువ వల్గారిటీ కనిపిస్తోంది. కళాకారునికి వస్తువు ఎన్నుకోవడంలో అది అశ్లీలమా, సచ్ఛీలమా అన్నవి ప్రమాణాలు కావు. ఏది కదిలించినా దానిపై రాసే అధికారం అతనికి ఉంది.

    నిజానికి కవిత నాకూ అర్థం కాలేదు. కానీ నాకు ఈ సున్తీ సెరిమొనీ గురించి ఏమీ తెలియకపోవడం దానికి కారణమని సరిపెట్టుకున్నాను. లైలా గారి వ్యాఖ్యానం మరి కాస్త స్పష్టం చేసింది.

  2. బోడి పద్యం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    04/04/2009 9:03 am

    సమాజంలో బతకడం నేర్చుకోవాలట ఈ కవితనర్థం చేసుకోవడానికి. సమాజంలో బతకడవే సరిపోదట, వెనుకనున్న చారిత్రక సంఘటనల సారస్వం తెలిసుండాలట. కాకపోతే మరేదో వ్యాసం చదివి ఈ కవితని అర్థం చేసుకోవాలట. లేకపోతే, అర్థం లేకుండా గొప్పగా ధ్వనించే ఈ పదాల పజిల్ ని, ఒకదానికొకటి సంబంధంలేకుండా వున్న ఈ పదచిత్రాల ముక్కల్లో, నేలని విడిచి సాముచేసి, తెగిపడివున్న చర్మపు ముక్కనుంచి భూత, భవిష్యత్, వర్తమానాల్ని అన్వయించుకునే (పచ్చ, పచ్చటి డాలరు రంగులో, పడిపోతున్న అమెరికా హంగులో) ప్రత్యేకవైన రంగుల కళ్ళద్దాలన్నా కావాలట.

    ఎవరికోసం ఈ కవిత? ఎందు కోసం ఈ కవిత? కొద్దో, గొప్పో చదవనేర్చిన వాళ్లకి కూడా అర్థం కాని ఈ కవిత. పాఠకుల ప్రయత్నంలో మాత్రవే విచ్చీ విచ్చకుండా విచ్చుకునే ఈ కవిత. కవితని చదివి అర్థం చేసుకోడానికి ఒక ప్రత్యేకవైన స్థాయి కావాలని కవిగారనుకునుంటే ఇక పేచీనే లేదు. మా పత్రిక ఆ స్థాయిగల పాఠకుల కోసవే అని సంపాదకులనుకుంటే కూడా పేచీ లేదు. కానీ ఇది సర్వ తెలుగు జనుల కోసం అనే అభిప్రాయం వుంటే మాత్రం కవి(తన కవితకి తానే వివరణ ఇచ్చుకోవడం కష్టవే), వివరణ ఇవ్వడం అవసరవేవో.

    రవి

  3. అంకెలు, సంఖ్యలు: రెండు గురించి M.S.Prasad అభిప్రాయం:

    04/04/2009 1:01 am

    దుగ, తిగ అనే పదాలు కూడా ఉన్నాయి. ఇవి 2,3 సంఖ్యలను తెలియజేస్తాయి.
    ఇకపోతే పనీ పాటా ఏమీ లేకుండా గడపాల్సిన సమయం చాలా ఉన్నప్పుడు మీరు చూపిన పనికిమాలిన ఆట ఆడుతూ మన మేధస్సును బాధించవచ్చు.

  4. ‘అపు సంసార్ ‘ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి raman అభిప్రాయం:

    04/03/2009 6:09 pm

    ఈమధ్య ఇక్కడ university లొ ఈ cinema చూపించారు. చాలామంది Americans వచ్హారు, mostly middle aged and elderly people, a few arts students. I was the only Indian in the group. There was a discussion about the movie after the screening, though a 20 minute time was allocated for discussion, it lasted more than an hour. I was amazed and surprised at the keenness and critical way they watched the movie and participated in the discussion. I noticed:

    _ most of them have watched, if not all but most of the Ray’s movies.
    _ they tried to draw parallel not only with other Ray’s movies but with other Bengali and other Indian movies of that period.
    _ they had number of questions about the Bengali village life, local customs especially around the marriages. I tried to answer as much.
    _ “I didn’t see much British culture or influence in the movie” one Questioned. Another answered : “There are few British writer’s books in the shelf”

    of course there were some silly questions too. To make it short it this experience has changed my way of watching movies. I am sure this kind of discussions will go on for many more years.

  5. భ్రంశధార గురించి raman అభిప్రాయం:

    04/03/2009 4:40 pm

    ఎంత చ క్కగా వ్రాసారు సారు
    దీనికి ముందు కవిత దాని మీది అభిప్రాయాలు చదివి చాలా పిచ్చెక్కింది
    ఇప్పుదు మనసు చాలా తెలికయ్యింది
    మరీ మరీ చదవాలనిపించింది.
    థన్యవాదాలు.

  6. ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    04/03/2009 11:11 am

    సురేష్ :

    నేను ఎప్పటినుంచో రాద్దామనుకున్న విషయం మీద మీరు రాస్తున్నారు. చాలా మంచిది. నేను రాసి ఉంటే ఇంత బాగా ఉండేది కాదు. మరయితే, నిదానంగా మన పాత రోజులు, అంటే స్కిట్ ఏర్పడినప్పటి నుంచి అంతర్జాలంలో తెలుగు వాళ్ళు ఒకొళ్ళనొకళ్ళు తెలుగులో పలకరింపుల మొదలు, జరిగిన విషయాలు గుర్తుంచుకోవలసిన వివరాలను విపులంగా రాయండి. ఈ నాడు అంతర్జాలంలో తరచు తెలుగులో రాస్తున్నవారికి చాలా మందికి ఈ వివరాలు తెలియకపోవచ్చు. వారికోసమైనా విపులంగా రాయండి.

    మీ తరవాత వ్యాసం కోసం ఎదురు చూస్తూ,

    అభినందనలతో,

    లక్ష్మన్న

  7. జాషువా పిరదౌసి గురించి M.S.Prasad అభిప్రాయం:

    04/03/2009 3:52 am

    సంగీత, సాహిత్య, శిల్ప, చిత్రకళాది లలిత కళలు కెవల దైవ దత్త వరాలు. ఈశ్వరానుగ్రహం ఉన్న వారికే ఇవి లభ్యం అవుతాయి. జాతి కుల మతాలని ఈ దౌర్భాగ్య మానవులు చూపే వివక్ష పరమేశ్వరుడెన్నడూ అణుమాత్రం పాటించడని ఈ మహా కవి అనర్ఘ కవితా వైభవాన్ని చూస్తే అర్ధం అవుతుంది.

  8. బోడి పద్యం గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    04/02/2009 9:50 am

    రచన స్పృశించిన కొన్ని అంశాలు అర్థం చేసుకోవాలంటే సమాజంలో బతికితే సరిపోదనుకుంటాను. ప్రస్తుతానికి వెనకున్న విస్తారమైన విషాదమైన ఎన్నో చారిత్రిక సంఘటలు గుచ్చినట్టుగా ప్రశ్నిస్తాయి, లోతుగా.

    నిరుడు నిలిచిన బౌద్ధ ఆరామాలేవి, నాడు నడిచిన నలందా ఏది, మొన్నటిదాకా పాత బస్తీలో ప్రాణాలుపోయిన వారికుటుంబాలకిచ్చే జవాబేది. మతం పేరుతో పారిన, పారుతున్న రక్తంతోనైనా శాంతి వృక్షం పెరిగే రోజేది?
    ____
    విధేయుడు
    -Srinivas

  9. బోడి పద్యం గురించి ravinder posani అభిప్రాయం:

    04/01/2009 1:13 pm

    ఈ పద్యాన్ని నిజంగా అర్ధం చేసుకోవాల్నే అని వుంటే అన్ని ఆధారాలు, సమీక్షకుల సర్టీఫీకెట్లు అక్కర లేదు. లైలా గారి విశ్లేషణ చాలు…
    కాని, అర్ధం చేసుకోవాలన్న తపన కన్నా, తప్పులెన్నాలన్న తాపత్రయం ఎక్కువ కనిపిస్తోంది.

    ఈ పద్యాన్ని అర్ధం చేసుకోవడానికి ముందు మీరు ఈ సమాజంలో బతుకుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. అలా చూసుకోగలిగిన వాళ్లకి ఈ కవిత తేలికగానే అర్ధం అవ్వాలి.

    రవి

  10. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/31/2009 6:55 pm

    రవికిరణ్ ,

    మీరు చెప్పిన “కూనిరాగం”తీయగల్గటం రామ దాసు పాటలకి సాధ్యం.అవి”భజన సంప్రదాయానికి”చెందినవి గనక. కానీ త్యాగయ్య popular గేయకర్త కాడు. సంగీతాన్ని నేర్చుకున్న వాళ్ళో..లేదా..regular గా classical music ని వినే అలవాటున్న వాళ్ళో తప్ప..త్యాగరాజస్వామి వారి పాటల్ని కూనిరాగం తీయటం కుదిరే పని కాదు. మిమిక్రీ చెయ్యొచ్చు..మ హా అయితే!
    ఇంక అన్నమయ్య పదాల్ని అరవైల్లో ఆల్ ఇండియా రేడియో లో మొదటిగా గాయనీ గాయకుల చేత పాడీంచేదాకా కూడా..ఆయన పాటలు తెలుగుదేశంలో ప్రచారం కాలేదు. అందువల్ల ఆయగుపాట గురించి తెలుగువారికి తెలిసిందే ఈమధ్య. ఒకవేళ మీరు ఉదాహరించబోయే”జో అచ్యుతానంద జోజో ముకుందా”..అన్నమయ్య పదంగా చెలామణీ అయిందే గానీ..అది అన్నమయ్య పదం అవునో కాదో తెలియదు. ఇంక గద్దర్ పాటతో తెలుగుతల్లులు కూనిరాగాలు తీస్తూ పిల్లల్ని పెంచుతున్నారని నేను అనుకోవడం లేదు.

    ఇదివరకూ చెప్పిన ట్టే ఇప్పుడూ చెబుతున్నాను.” కవి” గా త్యాగయ్య గారు చాలరు. కాదూ మేము త్యాగరాజుని గొప్ప కవిగా అనుకుంటూ ఉన్నాము…అని ఎవరైనా అన దల్చుకుంటే..అలా వారు అనుకున్న కారణాల్ని
    వివరించిచెప్పొచ్చు…సోదాహరణంగా!!

    కవిత్వం భాషతో..పదచిత్రాల్తో..భావచిత్రాల్తో..ఊహల్తో విశిష్టంగా మన మనఃప్రవేశం చేయాలి.అలా చేసే అక్షరం కల్గించే స్పందనలు వేరు. అది వాదించే విషయం కాదు. అనుభవించగల విషయం.అదీ తేడా!!

    రమ.