పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ‘అపు సంసార్ ‘ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:

    04/11/2009 5:59 am

    వ్యాసం బాగుంది. కానీ మీరు కొత్తగా చెప్పిందేమీ లేదనిపించింది. కొంత నిరాశ కలిగింది. రే,బెనెగల్,మృణాల్ సేన్ ల గురించి ఎంతకాలమని చెప్పిందే చెప్పుకుంటాం? కొత్త దర్శకులు లేరా? మీ అభిరుచికి తగిన కళాఖండాలు కాకపోయినా, పనికొచ్చే సినిమాలు, ప్రజలను అబ్బురపరచిన చిత్రాలు లేవా?

  2. తెల్ల కాయితం గురించి రవిచంద్ర అభిప్రాయం:

    04/11/2009 3:34 am

    కథాంశం చాలా బాగుంది. నేను చదువుకునేటప్పుడు దీనికి పోలిన సంఘటనే ఒకటి జరిగింది. కాబట్టి సహజత్వానికి దగ్గరగా లేదంటే నేను అంగీకరించను.

  3. ఇద్దరు దుర్మార్గులు గురించి Mrithyunjayarao అభిప్రాయం:

    04/09/2009 11:55 pm

    కథ చాలా బాగుంది. కథలొ ఉన్న పాత్రల్ని విటుడు, వేశ్య, గృహిణి అని విభజించడం సరికాదనుకుంటాను. అన్వేషి, సహచరి, మార్గదర్శకురాలు అని చూడాలనుకుంటాను. ఆనందాన్ని వెదికేవాడు తాత్త్వికుడేకానీ విటుడు కాదు గదా! రచయిత మీద భారతీయ ఆలోచనా ప్రభావం ఉన్నట్టుగా అనిపిస్తోంది. మంచి రచన. కొనసాగించండి.
    మృత్యుంజయరావు పిన్నమనేని.

  4. అతడు, నేను, అతడి కథ గురించి Meher అభిప్రాయం:

    04/08/2009 5:50 am

    మంచి కథను పరిచయం చేసినందుకు మాధవ్‌గారికి నెనరులు. నేను యిటీవలే అరకు వెళ్ళాను. అంత విశృంఖలమైన ప్రకృతి ఎవరినైనా కదిలిస్తుంది. రచయితలకైతే సహజంగానే ఏదో ఒకటి రాయాలన్న ఉద్దీపన కలిగిస్తుంది. నేనూ ఏదో ఒకటి రాయాలనుకున్నాను. కానీ నేనేం రాసినా ఇందులో శతసహస్రాంసమైనా అయ్యుండేది కాదు. ఆ నేపథ్యాన్ని ఇంత అద్భుతమైన ఉద్దేశ్యానికి వాడుకోగలిగేవాణ్ణి కాదు. కథ అర్థం అవడమూ అర్థం కాకపోవడమూ తరువాతి సంగతి; ముందు చదువరి ఈ కథని పూర్తిగా ఆస్వాదించాలంటే, విశాఖపట్నం నుంచి అరకుకి రైలు మార్గంలో ఒక్కసారైనా ప్రయాణించి వుండడం అతని కనీస అర్హత. మాధవ్‌గారు చూడలేదు కాబట్టే కథని ఒక పార్శ్వం లోంచే ఆస్వాదించగలిగారు. నేనైతే ఆ టన్నెల్స్‌‌‌‌‍లోంచి కూడా నడిచాను. అదో వింత అనుభవం.

    “ఇదంతా నాన్సెన్స్ అంటే ఏం చెప్పను? అర్ధం కాని వన్నీ గొప్పవేనా అంటే ఏం చెప్పను? ‘పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ’ మనకు ఉంటుందని నేననుకుంటాను.”

    ఇది నిజం. కొన్ని కళరూపాలు అర్థం కాకపోతే అది వాటి తప్పే అనిపిస్తుంది. మరికొన్నింటి విషయంలో మాత్రం, మనం సరైన దృక్పథం లోంచి చూడలేదు కాబట్టి అర్థం కాలేదనిపిస్తుంది; మనదే లోపమనిపిస్తుంది. ఈ “పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ” మనకు సాధనతోనే సంక్రమిస్తుంది.

  5. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి రవిచంద్ర అభిప్రాయం:

    04/08/2009 3:02 am

    సాయి బ్రహ్మానందం గారికి!

    త్యాగరాజుపై సమగ్ర సమాచారం అందించినందుకు అందుకోండి నా మన:పూర్వక అభినందనలు. ఇదేలాగా కర్ణాటక సంగీతాన్ని గురించి, సమగ్ర వ్యాసాన్ని కూడా చూడాలని నా ఆశ. ఇది చిన్నపని కాదు అని తెలుసు. కానీ దీనివల్ల ప్రపంచంలో అతి ప్రాచీనమైన సంగీత సాంప్రదాయాన్ని, మాకందరికీ పరిచయం చేసినట్లవుతుంది.

    అభినందనలతో
    రవిచంద్ర

  6. వాడుక భాషలో పద్యాలు గురించి M.S.Prasad అభిప్రాయం:

    04/08/2009 2:33 am

    కవి గారూ,
    మీ ఈ వ్యాసాన్ని చాలా సార్లు చదివాను. క్షుద్బాధతో అన్నార్తుడైన వాడికి మిష్టాన్న భోజనం లాగా చాలా ఆనందం కలిగించింది.

    మళ్ళీ ఇన్నేళ్ళకి ఇ
    న్నాళ్ళకి పద్యాలు రాయు టది ఎట్లాంటే
    పళ్ళూడిన ముసలిది కు
    చ్చిళ్ళను సవరించినట్టు సిరి సిరి మువ్వా!

    అనే పద్యం 20-25 ఏళ్ళ క్రిందట చదివి ఇటువంటి పద్యం ఇంకొక్కటైనా ఉంటుందా అని ఎదురు చూసిన నాకు మీరు చాలా పద్యాలు (వ్రాసి) చూపించారు. మీ స్వంత పద్యాలు కాక ఉదాహృత పద్యాలలో చాలా వాటికి ఈషణ్మాత్రమైనా గ్రాంధిక శైలి పోకడలున్నాయి. ఇక అన్య భాషా పదాలనుపయోగించి హాస్యరస పోషణకై చేసిన పద్యాలు చాలానే చూస్తూంటాం. లక్ష్మీ నివాసం సినిమాలో

    కాలేజి జీతమ్ము కట్టమంటే మాని పెనుకళా సేవలో మునిగినాను
    తల్లిదండ్రులనుండి తస్కరించిన సొమ్ము దోసిళ్ళతో తెచ్చి పోసినాను
    ఆస్తి మూణ్ణాళ్ళలో నాస్తిగా గావించి చేబదుళ్ళెన్నియో చేసినాను
    ఎంత వడ్డీ కైన ఇసుమంత జంకక బరబరా ప్రోనోట్లు బరికినాను
    కటిక మార్వాడి కాబూలి కత్తులందు తుదకు గతిలేక నా తల దూర్చినాను
    —- కోలుకొంటిని గావున కొంత నయము

    అనే పద్యం హృద్యంగా ఉంటుంది. కానీ భక్తి రస ప్రధాన శతక సాహిత్యంలో వున్న ఈ క్రింది పద్యాన్ని చిత్తగించండి.

    సకలాసురాసువుల్ బెకలించు నీ డాబు నిఖిలాగమములెల్ల నీ కితాబు
    లలి జగత్రయములేలగ నెవ్వడు నవాబు తుద నెవ్వడిచ్చు నీతో జవాబు
    నీ మానసమున జనించె నీ మహతాబు వైనతేయుడె నీ సవారి యాబు
    కడముట్ట నిన్నెన్నగలదె నాకు హిబాబు పుడమి లేడిక నన్ను బోల్ గరీబు
    నీకు బ్రహ్మాండ భాండంబు నిండు గాబు ఎల్ల వేల్పుల పొల్పు నీకే హిసాబు
    నీ కటాక్షేక్షణ ప్రాప్తి నాకు జేబు కేశవస్వామి భాస్వత్ఖగేశ గామి
    (శతకం ఆద్యంతమూ అంత్యనుప్రాసలతో సాగిన దీనికర్త మరింగంటి రాఘవాచార్యులు గారు)

    ఇక మన ఛందో రీతులతో (దాక్షిణాత్యేతర) అన్య భాషా పద్యం వ్రాద్దామని నేను దాదాపు 1968-70 ప్రాంతంలో ప్రయత్నించాను. నేను వ్రాసినది నాకే నచ్చక అంతకు ముందు అలా వ్రాసిన పద్యాలేవీ లభ్యం కాక నా కోరిక అసంపూర్ణంగా మిగిలిపోయింది. అయ్యా! మీరు మరీ ఒకే ఒక పద్యం చూపించారు. ఒరవడి నేర్చుకోడానికి ఒకటి సరిపోదు. ఇంకొన్ని ఉదాహరణలు వేరు వేరు ఛందస్సులలో చూపగలందుకు ప్రార్ధన. నేను వ్రాసి నాకునచ్చని పద్యాలు ఇవి:

    ఆవో రే! ఇధరావొ! బైఠొ! సుఖు ఔర్ ఆరామ్ సే బాత్ కరో!
    పీవో! షర్బత్ ఉధర్ తుమార పరివార్ ప్రేమ్ ఔర్ ముహబ్బత్ భరీ
    భావోంసే భరపూరు జీవను ఖుదా పర్వర్దిగార్ కీ దువా
    సే వాఁకీ రహతే? ఫికర్ న కరొ! బాత్ చీత్ బంద్ క్యోం హో గయే?

    దౌ సీక్ ఫష్ట్ ది కింగ్డం ఆఫ్ హెవెను అండ్ దెన్ ఎవ్రి ధింగ్ విల్ బి యా
    Thou first seek the kingdom of Heaven and then everything will be a
    డెడ్ సర్టన్లి టు యూ ——————
    dded certainly to you
    చాలా వ్రాద్దామనుకొన్నా సమయాభావం వల్ల వ్రాయలేక పోతున్నాను. చాలా చాలా కృతజ్ఞుడను.

  7. ఈమాట గురించి గురించి సుధాకర బాబు అభిప్రాయం:

    04/07/2009 11:17 pm

    గమనిక:
    తెలుగు వికీపీడియాలో “ఈమాట” గురించి చిన్న పరిచయ వ్యాసం వ్రాశాను. విషయమంతా పత్రికనుండి కాపీ కొట్టిందే అనుకోండి. ఏవైనా పొరపాట్లు లేదా సూచనలు ఉన్నట్లయితే ఆ వ్యాసం చర్చాపేజీలో వ్రాయమని కోరుతున్నాను –

    http://te.wikipedia.org/wiki/ఈమాట

    http://te.wikipedia.org/wiki/చర్చ:ఈమాట

    చూడగలరు.

    – కాజ సుధాకర బాబు

  8. బోడి పద్యం గురించి విప్లవ్ అభిప్రాయం:

    04/07/2009 8:50 am

    బోడి కామెంట్

    “దిక్” తో వచ్చిన వాళ్ళ గురించి ఇస్మాయిల్ రాసింది: “The Digambara poets aim was to shock their readers into an awareness of their social apathy and personal degradation.”

    “shock their readers” అనేది కూడా ఒక టెక్స్ట్ కు ఉండాల్సిన లక్షణమే!? అయితే, ఈ కవిత/Text చిందించిన మిగతా Texts ఈ కవితకు అవసరమైన టీకా టిప్పణికి పనికొస్తయి. Writer is dead after he wrote this Text.

    A Disturbance must be understood by the graph it creates, like that quake that happened in Italy for example, can be read acorss the world if there is an instrument: it is least understood at the far end but will not be mistaken for something else that it is not. Every text written and followed up with by each subsequent commentor is another tick mark on the graph. I hope the data points here cross a century OR even a శత కోటి.

    అన్నట్టు, రాసిన వాళ్ళు ఏం చెప్పక పోయినా, చదివిన వాళ్ళు దాన్ని గురించి చించుకున్నా తప్పులేదు. సంపాదకులు మాత్రం “దీంట్లో ఏం చూసి ప్రచురించారో చెప్పాలి” అన్న డిమాండ్ పాఠకుల నుంచి వస్తే వాళ్ళ అభిప్రాయం లేక వాళ్ళ రివ్యూయర్ల (పేర్లు లేకుండా) అభిప్రాయాలు కొంతయినా చెప్పటం అవసరమేమో!? అప్పుడు మరింత “మేత” దొరుకుతుంది అని నా అభిప్రాయం.

    విప్లవ్
    సంపాదకుల వారికి: మీరు ఈ మాట అభిప్రాయాల పేజీని సంస్కరించాలని తలిస్తే మాత్రం, పేరు మాత్రం మార్చి వదిలేయండి. ఇది “ఈ మాట: పాఠకుల బ్లాగ్” అంటే సరిపోతుంది. ఎక్కువ కండీషన్లు పెడితే సగం ఖండితం, సర్వం పీడితం టైపు అయిపోతుందని నా భయం.

  9. బోడి పద్యం గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    04/07/2009 2:11 am

    అభిప్రాయం స్పష్టంగా లేదేమో అని ఇంకొక్క మాట. మసీదైనా, మందిరమైనా, Golden Temple గురుద్వారా అయినా, ప్రార్థించే ప్రదేశమేదైనా పవిత్రమే, ఎల్లప్పుడూ అందరికీ. మతమేదైనా పవిత్రత ఒక్కటే. కాని ఆ పవిత్రతకు కారణమైన ప్రార్థన, నమాజు అన్నవే లేనప్పుడు వాటిని పూర్వ గౌరవంతో ఆదరించడం ఎంత వరకు సబబు అన్నది కవులు, విజ్ఞులే కాదు మేధావులూ, పౌరులందరూ ఆలోచించి అభిప్రాయాలు పంచుకోవడం ఎంతో ఘర్షణను, రక్తపాతాన్ని నివారించడానికి సహాయం, కాదు- నేటి అవసరం అని కూడా అనుకుంటాను. హింసకు దారితీసిన, తీస్తున్న విషయాలు చర్చలకు దారితీసి వెలుగును వెత్తుక్కోవడం అన్నివిధాల మేలు చేస్తుందని కూడానమ్ముతాను.
    ________
    విధేయుడు
    -Srinivas

  10. బోడి పద్యం గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    04/07/2009 1:35 am

    అశ్లీలమా, సచ్చీలమా అని కాక కదిలించిన దేదైనా దానిపై రాసే అధికారం కవి/రచయితకే కాదు, అభిప్రాయాలు రాసేవారికీ ఉంది, ఎప్పుడూనూ. వల్గారిటీ ఉందా లేదా, ఇది పద్యమా కాదా, అని కాక కదిలించిందేమిటి అని మాత్రమే చూస్తే, బాబ్రీ మసీదు ప్రస్తావన మాత్రం తాకింది, నాకైతే. ఆవేశం, ఆక్రోశం అక్షరాలా ఉంది. ఆలోచన, అవగాహన తక్కువైనట్టు తోచింది. అయినా నిజాయితీగానే రాసినట్లనిపించింది.
    =========
    విధేయుడు
    -Srinivas