“పుస్తకం అందింది, వెల, పేజీలు, లభించే చోటు” అంటూ మాత్రమే సమీక్షలు వచ్చే ఈ రోజుల్లో ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివి, సహృదయతో తూకంవేసే ఇటువంటి సమీక్షలు/పరిచయాలు చదివి ఎన్నాళ్లయ్యింది.
గిరిధరరావు గారికి నమస్కారములు, కవయిత్రి అదృష్టవంతులు. (ఎంతమందికి ఇంతటి అపూర్వ అవకాశం దక్కుతుందన్న విషయంలో)
ఈ సమీక్ష ద్వారా ఈ పుస్తకం నా విష్ లిస్ట్ లో చేరింది.
thank you everyone
బొల్లోజు బాబా
హిందీ “ఆద్మీ” సినిమా తెలుగు “గుడిగంటలు” (తమిళంలో “ఆలయమణి”) కి అనుసరణ. “ఆద్మీ” లోని మరొక మంచి పాట “కల్ కే సప్నే ఆజ్” అనే లతాగారి పాట. దీని స్థానములోని తమిళము పాట సుశీలగారు పాడిన పాటలలోని అత్యుత్తమమైన వాటిలో ఒకటైన “ఆలయమణియిన్ ఓశైయై నాన్ కేట్పేన్ ” అన్నది.
విధేయుడు – మోహన
అంతర్జాలంలో అప్పనం (free) గా దొరుకుతూన్న సరుకులకి డబ్బిచ్చి కొనుక్కోవలసిన అవసరం ఏముంది? అన్నింటిని అప్పనంగా అనుభవించటానికి అలవాటు పడిపోయేం. ఆంధ్రాలో అయితే “విద్యుత్తుని అప్పనంగా అనుభవించటం మీ జన్మ హక్కు” అని ప్రభుత్వమే ప్రజలని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుంటోంది. ఈ దృక్పథం ఇండియా సొత్తేమీ కాదు. తొంభయి తొమ్మిదేళ్ళు నిండి, కాటికి కాళ్ళు జాపుకున్న వ్యక్తి కూడ భీమా కంపెనీ చెల్లిస్తున్నాది కదా అని తొమ్మిది మిలియన్లు ఖర్చు అయినా, వైద్యం చెయ్యమంటాడు. “గూగుల్”లా ఏదో కొత్త పంథా “బిజినెస్ మోడల్” కనిపెట్టే వరకూ అంతర్జాల పత్రికలకి, అచ్చు పత్రికలకి ఈ దుస్థితి తప్పేటట్లు లేదు.
ఈ సినిమాలో సుశీల పాడిన పిలువకురా బాగా పాప్యులర్ అయింది. జగదీశ్వరా పాటలు రెంటిలోనూ ఎక్కువగా వినబడేది సుశీలదే. నీ నీడలోన అనేది కూడా ఆమె చాలా బాగా పాడింది.
నాకు లీల పాడిన బంగారు వన్నెల అనే పాట ఇష్టం. ఆ తరవాత నౌషాద్ చేసిన కారీ బదరియాకీ దీనికీ పోలికలున్నాయి.
చాలామందికి కోపం వస్తుందేమోగాని హాయిహాయిగా పాటలో జిక్కీ పాడినది నాకు నచ్చదు. శాస్త్రీయసంగీతం నేర్చుకోనందువల్లనో ఏమో ఇందులో ఆమె శైలి నాకు నచ్చదు. ఘంటసాల ప్రతిభకూ, ఆదినారాయణరావు మేధస్సుకూ ఇది మంచి ఉదాహరణ.
మోహనరావుగారు చెప్పినట్టు ఫ్లాప్ అయిన ఫూలోంకీ సేజ్ లోని పాటలు చాలా బావుంటాయి. అడాణా రాగంతో మొదలయే రాగమాలిక ఆ భీజా రసియా మొదలైనవి మంచి ఉదాహరణలు.
వ్యాసం మాటకొస్తే రచయితకు ఈ పాట గురించి ఉన్న ఉత్సాహం ఇన్నేళ్ళుగా తరగనే లేదని తెలుస్తోంది. ఏ సినిమా పాటనైనా ఇదే పద్ధతిలో ‘కూలంకషంగా జర్చించి’ నేర్చుకోవచ్చు.
పితృదినోత్సవ సందర్భంగా కృష్ణమోహన్ గారు వెలువరించిన విచార ధార చాలా బాగుంది. నా 10వ ఏటనే కీర్తిశేషులైన మా తండ్రిగారి స్మృతులను, వారి మధురానురాగ వాత్సల్య భావాలను గుర్తుకు తెచ్చి హృదయాన్ని కదిలింప చేసింది. రచయిత గారికి అభివందనలు/ధన్యవాదాలు. మృదు మధు వాత్సల్యాదిక హృదయంగమ భావ భరితమై ఈ కృతి నన్ను చదివించి నిష్ఠతో మది కదిలించినదయ్య గళము గద్గదమవగా.
అనుపమ రాగ మాలికల హారము నేరిచి గూర్చి తెచ్చి మా
మనముల కింపు గూర్పగ సమంచిత రీతిని జూపినట్టి మీ
ఘన వ్యవసాయ తత్పరత గాంచి, గణించి, నమస్కరించి, యెం
తన పులకించి, మించిన ముదం బెద నెక్కొన ప్రస్తుతించెదన్
మీ ఈ వ్యాసం ద్వారా బ్రహ్మానందం కలిగించి అన్వర్ధ నామధేయులయ్యారు. అనేకానేక అభివందనలు ధన్యవాదాలు. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న పల్లవి తప్ప అంతా మరచిపోయిన “నిత్య కళ్యాణి నిగమాంత సంచారిణి” రాగమాలికను పూర్తి పాఠం ఇచ్చినందుకు చాల కృతజ్ఞతలు.
ఒక చిన్న సందేహం తీర్చగలరని ఆశిస్తున్నాను. కృష్ణా ముకుందా మురారి (పాండురంగ మహాత్మ్యం) రాగ మాలికలో లలిత లలిత మురళీ స్వరాళీ అనే చిరణం తరువాత పల్లవి శ్రుతి మారుతుంది (ఎక్కువ శ్రుతిలోకి సంధింప బడుతుంది) దీనికి కారణం ఏమిటి? సంగీత దర్శకుని ప్రతిభ/అసమర్ధతా? చరణాంతం తరువాత పల్లవి మొదలుపెట్టిన శ్రుతిలోకే అనుసంధింప బడాలి గదా.
వ్యాసం బాగుంది. తిరుపతి మహావీర్ టాకీస్‌లో నేను ఇంటర్మీడియేట్ (పీయూసీకి ముందటి కాలం) చదివే రోజుల్లో ఈ చిత్రాన్ని ఈ పాటకోసం నాలుగుమార్లు
చూచాను! ఈ పాట ఒక మధురాతిమధురమైన అనుభూతి. అప్పుడే సినీరంగంలో ప్రవేశించినారనో ఏమో ఈ పాటను సుశీలగారిచేత పాడించలేదు రావు గారు. ఇట్టి పాటలను జిక్కీగారు తరువాత తరువాత ఎందుకు పాడలేదో? హిందీ పాటను కింది లింకులో చూచి వినగలరు. http://www.youtube.com/watch?v=cQ6sTjW2-O8
రఫీగారి గొంతు ANRగారికి బాగా సరిపోయింది! దీని తరువాతి హిందీ చిత్రం ఫూలోంకీసేజ్‌లో కూడా మంచి పాటలు ఉన్నా, ఆ చిత్రం బాగా దెబ్బ తిన్నది. ఆ నష్టాల ఎర్ర సిరాను నల్ల సిరా చేయడానికి అంజలీదేవి దంపతులకు దశాబ్దాలు పట్టింది.
సంగీతంపై వ్యాసాల రాయటంలో ఉన్న చిక్కుల్లో ఇది ఒకటి.
ని, నీ స్వరాల్లో మొదటిది కోమలం, రెండోది తీవ్రం అని కాదు. పాటలోని తాళం కోసం ఒక స్వరాన్ని సాగతీయాల్సి రావటమే తప్ప మరేమీ కాదు. యమన్ (కల్యాణి) రాగంలో కోమల స్వరాలు లేవు.
చరణానికి, చరణానికి మధ్య ఉన్న స్వరాలను వ్యాసం మొదట్లో (నాల్గవ పేరా) లింక్‌లో ఇచ్చాను. అందులో యమన్ రాగంలో ఉన్న స్వరాలను చూడండి. అలాగే పాత సంచికల్లో కల్యాణి (యమన్ ) రాగంపై రెండు వ్యాసాలున్నాయి.
నేనూ సంగీతంలో ఒక పామరుడనే! ఈమాట పాఠకులకు రాగాలపై ఆసక్తి ఎక్కువగానే ఉన్నట్టు తోస్తోంది. వచ్చేసంచికల్లో మరికొన్ని రాగాలు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.
ప్రసాద్ గారూ:
ఉత్సాహం ఉన్న వారు తమంత తామే (కొంత శ్రమ పడక తప్పదు) ఈ రాగమాలికలో ఉన్న రాగాల్లో ఉన్న మరికొన్ని పాటలు తెలుసుకుంటారనే కావాలనే వాటి వివరాలు ఇవ్వలేదు. ఉదాహరణకి “సాగర సంగమం” సినిమాలో ఒక పాట హంసానంది (సోహిని) రాగంలో ఉంది. కనుక్కోండి.
నిద్రిత నగరం వైదేహి ప్రపంచం గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
07/06/2009 9:38 pm
“పుస్తకం అందింది, వెల, పేజీలు, లభించే చోటు” అంటూ మాత్రమే సమీక్షలు వచ్చే ఈ రోజుల్లో ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివి, సహృదయతో తూకంవేసే ఇటువంటి సమీక్షలు/పరిచయాలు చదివి ఎన్నాళ్లయ్యింది.
గిరిధరరావు గారికి నమస్కారములు, కవయిత్రి అదృష్టవంతులు. (ఎంతమందికి ఇంతటి అపూర్వ అవకాశం దక్కుతుందన్న విషయంలో)
ఈ సమీక్ష ద్వారా ఈ పుస్తకం నా విష్ లిస్ట్ లో చేరింది.
thank you everyone
బొల్లోజు బాబా
హాయిహాయిగా ఆమని సాగే గురించి mOhana అభిప్రాయం:
07/06/2009 4:22 pm
హిందీ “ఆద్మీ” సినిమా తెలుగు “గుడిగంటలు” (తమిళంలో “ఆలయమణి”) కి అనుసరణ. “ఆద్మీ” లోని మరొక మంచి పాట “కల్ కే సప్నే ఆజ్” అనే లతాగారి పాట. దీని స్థానములోని తమిళము పాట సుశీలగారు పాడిన పాటలలోని అత్యుత్తమమైన వాటిలో ఒకటైన “ఆలయమణియిన్ ఓశైయై నాన్ కేట్పేన్ ” అన్నది.
విధేయుడు – మోహన
అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి Rao Vemuri అభిప్రాయం:
07/06/2009 3:27 pm
అంతర్జాలంలో అప్పనం (free) గా దొరుకుతూన్న సరుకులకి డబ్బిచ్చి కొనుక్కోవలసిన అవసరం ఏముంది? అన్నింటిని అప్పనంగా అనుభవించటానికి అలవాటు పడిపోయేం. ఆంధ్రాలో అయితే “విద్యుత్తుని అప్పనంగా అనుభవించటం మీ జన్మ హక్కు” అని ప్రభుత్వమే ప్రజలని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుంటోంది. ఈ దృక్పథం ఇండియా సొత్తేమీ కాదు. తొంభయి తొమ్మిదేళ్ళు నిండి, కాటికి కాళ్ళు జాపుకున్న వ్యక్తి కూడ భీమా కంపెనీ చెల్లిస్తున్నాది కదా అని తొమ్మిది మిలియన్లు ఖర్చు అయినా, వైద్యం చెయ్యమంటాడు. “గూగుల్”లా ఏదో కొత్త పంథా “బిజినెస్ మోడల్” కనిపెట్టే వరకూ అంతర్జాల పత్రికలకి, అచ్చు పత్రికలకి ఈ దుస్థితి తప్పేటట్లు లేదు.
హాయిహాయిగా ఆమని సాగే గురించి Rohiniprasad అభిప్రాయం:
07/06/2009 2:13 pm
“ఆద్మీ” పాటలు.
హాయిహాయిగా ఆమని సాగే గురించి Rohiniprasad అభిప్రాయం:
07/06/2009 2:04 pm
సువర్ణసుందరి పాటలకు మరొక లింక్ కూడా ఉంది http://www.bollycircle.com/index.php/hindi-videos/suvarna-sundari-telugu-movie-mp3-songs-download/.
హాయిహాయిగా ఆమని సాగే గురించి Rohiniprasad అభిప్రాయం:
07/06/2009 11:13 am
ఈ సినిమాలో సుశీల పాడిన పిలువకురా బాగా పాప్యులర్ అయింది. జగదీశ్వరా పాటలు రెంటిలోనూ ఎక్కువగా వినబడేది సుశీలదే. నీ నీడలోన అనేది కూడా ఆమె చాలా బాగా పాడింది.
నాకు లీల పాడిన బంగారు వన్నెల అనే పాట ఇష్టం. ఆ తరవాత నౌషాద్ చేసిన కారీ బదరియాకీ దీనికీ పోలికలున్నాయి.
చాలామందికి కోపం వస్తుందేమోగాని హాయిహాయిగా పాటలో జిక్కీ పాడినది నాకు నచ్చదు. శాస్త్రీయసంగీతం నేర్చుకోనందువల్లనో ఏమో ఇందులో ఆమె శైలి నాకు నచ్చదు. ఘంటసాల ప్రతిభకూ, ఆదినారాయణరావు మేధస్సుకూ ఇది మంచి ఉదాహరణ.
మోహనరావుగారు చెప్పినట్టు ఫ్లాప్ అయిన ఫూలోంకీ సేజ్ లోని పాటలు చాలా బావుంటాయి. అడాణా రాగంతో మొదలయే రాగమాలిక ఆ భీజా రసియా మొదలైనవి మంచి ఉదాహరణలు.
వ్యాసం మాటకొస్తే రచయితకు ఈ పాట గురించి ఉన్న ఉత్సాహం ఇన్నేళ్ళుగా తరగనే లేదని తెలుస్తోంది. ఏ సినిమా పాటనైనా ఇదే పద్ధతిలో ‘కూలంకషంగా జర్చించి’ నేర్చుకోవచ్చు.
ఫాదర్స్ డే గురించి M.S.Prasad అభిప్రాయం:
07/06/2009 3:07 am
పితృదినోత్సవ సందర్భంగా కృష్ణమోహన్ గారు వెలువరించిన విచార ధార చాలా బాగుంది. నా 10వ ఏటనే కీర్తిశేషులైన మా తండ్రిగారి స్మృతులను, వారి మధురానురాగ వాత్సల్య భావాలను గుర్తుకు తెచ్చి హృదయాన్ని కదిలింప చేసింది. రచయిత గారికి అభివందనలు/ధన్యవాదాలు. మృదు మధు వాత్సల్యాదిక హృదయంగమ భావ భరితమై ఈ కృతి నన్ను చదివించి నిష్ఠతో మది కదిలించినదయ్య గళము గద్గదమవగా.
భవదీయుడు
రాగమాలిక గురించి M.S.Prasad అభిప్రాయం:
07/05/2009 8:50 pm
అనుపమ రాగ మాలికల హారము నేరిచి గూర్చి తెచ్చి మా
మనముల కింపు గూర్పగ సమంచిత రీతిని జూపినట్టి మీ
ఘన వ్యవసాయ తత్పరత గాంచి, గణించి, నమస్కరించి, యెం
తన పులకించి, మించిన ముదం బెద నెక్కొన ప్రస్తుతించెదన్
మీ ఈ వ్యాసం ద్వారా బ్రహ్మానందం కలిగించి అన్వర్ధ నామధేయులయ్యారు. అనేకానేక అభివందనలు ధన్యవాదాలు. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న పల్లవి తప్ప అంతా మరచిపోయిన “నిత్య కళ్యాణి నిగమాంత సంచారిణి” రాగమాలికను పూర్తి పాఠం ఇచ్చినందుకు చాల కృతజ్ఞతలు.
ఒక చిన్న సందేహం తీర్చగలరని ఆశిస్తున్నాను. కృష్ణా ముకుందా మురారి (పాండురంగ మహాత్మ్యం) రాగ మాలికలో లలిత లలిత మురళీ స్వరాళీ అనే చిరణం తరువాత పల్లవి శ్రుతి మారుతుంది (ఎక్కువ శ్రుతిలోకి సంధింప బడుతుంది) దీనికి కారణం ఏమిటి? సంగీత దర్శకుని ప్రతిభ/అసమర్ధతా? చరణాంతం తరువాత పల్లవి మొదలుపెట్టిన శ్రుతిలోకే అనుసంధింప బడాలి గదా.
భవదీయుడు
హాయిహాయిగా ఆమని సాగే గురించి mOhana అభిప్రాయం:
07/05/2009 1:51 pm
వ్యాసం బాగుంది. తిరుపతి మహావీర్ టాకీస్‌లో నేను ఇంటర్మీడియేట్ (పీయూసీకి ముందటి కాలం) చదివే రోజుల్లో ఈ చిత్రాన్ని ఈ పాటకోసం నాలుగుమార్లు
చూచాను! ఈ పాట ఒక మధురాతిమధురమైన అనుభూతి. అప్పుడే సినీరంగంలో ప్రవేశించినారనో ఏమో ఈ పాటను సుశీలగారిచేత పాడించలేదు రావు గారు. ఇట్టి పాటలను జిక్కీగారు తరువాత తరువాత ఎందుకు పాడలేదో? హిందీ పాటను కింది లింకులో చూచి వినగలరు.
http://www.youtube.com/watch?v=cQ6sTjW2-O8
రఫీగారి గొంతు ANRగారికి బాగా సరిపోయింది! దీని తరువాతి హిందీ చిత్రం ఫూలోంకీసేజ్‌లో కూడా మంచి పాటలు ఉన్నా, ఆ చిత్రం బాగా దెబ్బ తిన్నది. ఆ నష్టాల ఎర్ర సిరాను నల్ల సిరా చేయడానికి అంజలీదేవి దంపతులకు దశాబ్దాలు పట్టింది.
విధేయుడు – మోహన
హాయిహాయిగా ఆమని సాగే గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
07/05/2009 10:51 am
శ్రీకాంత్ గారూ:
సంగీతంపై వ్యాసాల రాయటంలో ఉన్న చిక్కుల్లో ఇది ఒకటి.
ని, నీ స్వరాల్లో మొదటిది కోమలం, రెండోది తీవ్రం అని కాదు. పాటలోని తాళం కోసం ఒక స్వరాన్ని సాగతీయాల్సి రావటమే తప్ప మరేమీ కాదు. యమన్ (కల్యాణి) రాగంలో కోమల స్వరాలు లేవు.
చరణానికి, చరణానికి మధ్య ఉన్న స్వరాలను వ్యాసం మొదట్లో (నాల్గవ పేరా) లింక్‌లో ఇచ్చాను. అందులో యమన్ రాగంలో ఉన్న స్వరాలను చూడండి. అలాగే పాత సంచికల్లో కల్యాణి (యమన్ ) రాగంపై రెండు వ్యాసాలున్నాయి.
నిరిగమ ధనిసా ధనిసా
సనిసగరిగ సరినిసధని
మధనిస నిరినిరి ధనిధని మధమధ గమగమ గమధనిసా గమధనిసా ధనిసా….
అన్నీ తీవ్ర స్వరాలే!
నేనూ సంగీతంలో ఒక పామరుడనే! ఈమాట పాఠకులకు రాగాలపై ఆసక్తి ఎక్కువగానే ఉన్నట్టు తోస్తోంది. వచ్చేసంచికల్లో మరికొన్ని రాగాలు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.
ప్రసాద్ గారూ:
ఉత్సాహం ఉన్న వారు తమంత తామే (కొంత శ్రమ పడక తప్పదు) ఈ రాగమాలికలో ఉన్న రాగాల్లో ఉన్న మరికొన్ని పాటలు తెలుసుకుంటారనే కావాలనే వాటి వివరాలు ఇవ్వలేదు. ఉదాహరణకి “సాగర సంగమం” సినిమాలో ఒక పాట హంసానంది (సోహిని) రాగంలో ఉంది. కనుక్కోండి.
విష్ణుభొట్ల లక్ష్మన్న