పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. “అంటరాని వసంతం” నవల గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    09/19/2009 7:54 pm

    రవికుమార్ గారు,

    కొత్తపాళి గారు ఈ నవల పరిచయాన్ని ఆంగ్లంలో వ్రాసుంటే? తెలుగు పాఠకుల కోసం కాక ఆంగ్ల పాఠకుల కోసం వ్రాసుంటే? ఎవరికి తెలిసిన భాషలో వాళ్ళు వ్రాస్తారు అభిప్రాయాలు. పుట్టి పెరిగిన వాతావరణం బట్టీ. ఆర్ధిక, సామాజిక, ప్రాంతీయ నేపధ్యం భాషలో కూడా కనిపిస్తుంది. కొత్తపాళి గారు చెప్పినట్టు అది సహజం. నా అభిప్రాయంలో ఎబ్బెట్టుగా కూడా లేదు. సహజవైన వ్యక్తీకరణలో ఎబ్బెట్టు తనం ఎందుకుంటుంది?

    పురాణం అనే పదం ఎబ్బెట్టయితే, వసంతం కూడా ఎబ్బెట్టే రవి గారు.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  2. “అంటరాని వసంతం” నవల గురించి కొత్తపాళీ అభిప్రాయం:

    09/19/2009 6:29 pm

    బ్రాహ్మణ పుటక పుట్టినవాడూ, బ్రాహ్మణ ఇంటో పెరిగినవాడూ బమ్మన భాషకాక ఇంకో భాష ఎలా రాస్తాడు రవిగారూ? ఎబ్బెట్టు అయితే అయుండొచ్చు (పాఠకుల్ని బట్టి) కానీ అసహజం మటుకు కాదు.

  3. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rohiniprasad అభిప్రాయం:

    09/18/2009 2:42 pm

    సాంకేతికపదాలన్నిటికీ సంస్కృతంలో మాటలు సృష్టించడం పిల్లికి పర్యాయపదం మార్జాలం అన్నట్టే తయారవుతుంది. ఈ విషయంలో జపాన్‌వాళ్ళ పద్ధతి బావున్నట్టనిపిస్తుంది. వాళ్ళు ఇంగ్లీషు మాటలని యథాతథంగా వాడేస్తారట. కంప్యూటర్‌ని కంప్యుటా అనీ, క్రిస్‌మస్‌ని కిరుసుమసు అనీ రాసేసుకుంటారట. దాంతో అవి జపానీ పదాలవుతాయన్నమాట. ఆ లెక్కన రోడ్డు, టికెట్టు మొదలైనవన్నీ తెలుగు మాటలే. మనం కూడా ఆట్టే శ్రమపడకుండా న్యూట్రాను, ప్రోటాను, క్వార్కు అని రాసేస్తే సరిపోతుందేమో. ఏమంటారు వేమూరివారూ? (నెట్ దొరికినప్పుడే సమాధానమిద్దురుగాని)

  4. సంగీతరస పానశాల ఘంటసాల గురించి Rohiniprasad అభిప్రాయం:

    09/18/2009 1:32 pm

    [ఈ అభిప్రాయాన్ని “పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం” అన్న వ్యాసం నించి “సంగీతరస పానశాల ఘంటసాల” అన్న వ్యాసానికి తరలిస్తున్నాము. –సంపాదకులు]

    ఘంటసాలగారి గురించి ఆ రోజుల్లోనే అందరూ గొప్పగా చెప్పేవారు. పి.బి.శ్రీనివాస్ ‘ గురువుగారి దెబ్బే దెబ్బ” అనేవారట.

    వ్యక్తిగతంగా ఘంటసాల చాలా వినమ్రంగా ఉండేవారు. ఒకసారి మద్రాసులో ఉగాది కల్చరల్ అకాడమీ అనే తెలుగు సమితివారు ఏర్పాటుచేసిన ఏదో ప్రోగ్రాములో ఘంటసాల కూడా మాతోబాటు ప్రేక్షకుల్లో నేలమీదనే కూర్చుని ఉన్నారు. అప్పుడే ఆయనకు పద్మశ్రీ ప్రదానం చేసిన వార్త వచ్చింది. అక్కడే ఉన్న ముదిగొండ లింగమూర్తిగారు మధ్యలో లేచి నిలబడి ఆ వార్తను బిగ్గరగా అందరికీ వినిపించారు. అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే ఘంటసాల కూర్చున్నచోటి నుంచే అందరికీ నమస్కారం చేశారు. లింగమూర్తిగారు అందుకు అంగీకరించక ‘ఘంటసాలా నువ్వు లేచి నిలబడాలి’ అని గట్టిగా కోరాకగాని ఆయన లేవలేదు.

    ఎటువంటి సందర్భంలోనూ పెద్దగా స్పందించని ఘంటసాల ధోరణి (నిజం చెప్పాలంటే) కాస్త బోరుకొట్టేది కూడాను!

  5. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:

    09/18/2009 1:18 pm

    నేను కూడా పదవ తరగతి వరకు తెలుగు మీడియమ్ లోనే చదివి, పదకొండో తరగతినించి ఇంగ్లీషు మీడియంలో చదివేను. కళాశాలలోనూ, ఆ తర్వాత మదరాసులో ఉద్యోగంలోనూ భారతీయ భాషలతో అంత అవసరం లేకుండా ఆంగ్లంతోనే పనిజరిగిపొయ్యేది. ఐనా కూడా పదానికి పదం తెలుగు నుంచి ఆంగ్లానికి తర్జుమా చేసుకోకపోయినా, కాన్షియష్ ఆలోచనలు మాత్రం తెలుగులోనే వుండేవి ఈ అమెరికాకొచ్చిందాకా. బహుశా ఆ కారణం వలననే మాతృభాషలో విధ్యా భోదన అవసరవని నా అభిప్రాయం. తను చదివేది, తరగతిలో అయ్యవారి ముఖతా తనువినేది, ఆ రెండింటిని సమన్వయం చేస్తూ తను అర్థంచేసుకుని ఆలోచించేది ఒకే భాషలో జరిగితే విద్యార్థికి అవగాహన మరింత విశాలంగానూ, లోతుగానూ వుంటుందనేది వాస్తవం. ఆ దిశలో పాఠశాలల్లో తెలుగు భోధన అవసరం.

    ఐతే మన తెలుగు భాషాభివృద్దిలో ఒక భాగం కాని శాస్త్రాలెన్నో ఈరోజు పాఠశాల సిలబస్ లో భాగంగా వున్నాయి. ఆ కారణం వలన ఆ శాస్త్ర పఠనానికి సంబందించిన పదాలు తెలుగులో లేవు. వాటిని అచ్చతెలుగులో సృష్టించినందువలన అవి మన అవగాహనని సరళతరం చెయ్యవు. నలుగురూ వాడే సాధారణ తెలుగు నుంచి డిరైవ్ చేసిన పదవైతే ఖచ్చితంగా అవగాహనని సరళం చేస్తుంది. అలా కాకుండా ఎప్పుడో అదృశ్యవైపోయిన తెలుగు పదాలనించి ఉత్పత్తి చేసిన అధునిక శాస్త్ర పదకోశం ఆ దిశలో ఏవీ ఉపయోగ పడదని నా అభిప్రాయం.

    ఇప్పుడు మన తెలుగు అకాడమీ శాస్త్ర పదకోశం ప్రచురించినవి పోనీ తెలుగు పదాలు కావు (ఆ విధంగా తెలుగు చావనిజమ్ కూడా తమిళ మూర్ఖత్వంతో పోటీ పదడానికి), సంస్కృత పదాలు. నాకు తెలిసినంతవరకు (ఎక్కడన్నా, అక్కడక్కడా మార్పులుండొచ్చు) అవి తెలుగు పదకోశాలే కాదు, ఒరియా మొదలైన పదకోశాలు కూడా. నా అనుమానం (దీనిమీద ఎవరైనా ఒక వ్యాసం వ్రాస్తే బాగుండు) అవి భారతీయ భాషలన్నిటిలో అవే సంస్కృత పదాలు. అందువలన ఆ సంస్కృత పదాలని తెలుగులో తెలుగు అకాడమీ చేత బలవంతంగా చొప్పిచ్చినందువలన చదువుకునే పిలకాయల అవగాహనలేవీ ఆకాశంలోకి పోవు. వర్టీబ్రా, ఇన్ వర్టీబ్రా అని చదువుకుంటే ఆ పదాల రూట్ మరికొన్ని ఆంగ్ల పదాలని అర్థం చేసుకోడానికి వుంటుంది. కానీ సకసేరుకాలు, అకసేరుకాలు అనే తెలుగు కాదు సంస్కృత పదాలవలన జరిగే మంచి ఏవిటి? గిరీశం అన్నట్టు ఆంగ్లపదం ఎంత అర్థవవుతుందో, తెలుగు (సంస్కృత) పదం కూదా అంతే అర్థవవుతుంది అనాలుంది. కానీ నిజవేవిటంటే ఆంగ్ల పదం అర్థం తెలుసుకుంటే దాన్నుంచి మరిన్ని ఆంగ్ల పదాలు అర్థవవుతాయి సాధారణ సంభాషణలో ఉపయోగానికి, సంస్కృత పదం కనీసం ఆమాత్రం ఉపయోగాన్ని కూడా ఇవ్వదు. ఆంగ్లపదం ప్రపంచ వ్యాప్తంగా (కనీసం మెజారిటీ భాషల్లో) వుంది ఆయా శాస్త్రాల్లో, సంస్కృత పదం సకసేరుకాలకి మరో ఉపయోగవేవీ లేదు. తెలుగు టెక్స్టు బుక్కుని దాటి, మరో స్టాండర్డ్ ప్రచురణ ఏదన్నా చదవాలంటే తెలుగు మీడియం స్టూడెంటు నానా కష్టాలు పడాలి, ఆ శాస్త్ర పదకోశాన్ని నేర్చుకోవడానికి.

    ఏదో ఒకదగ్గరనుంచి, తెలుగు కాని మరో భాషనించి తెలుగులోకి పదాల్ని అరువు తీసుకునేప్పుడు, ఆంగ్లం అంత అంటరానిది, సంస్కృతం అంత అణకవైనది ఎలాగయ్యిందో. ఆంగ్లం కూడా వాటిని చాలావరకు లేటిన్ నుంచి అరువు తెచ్చుకున్నదే కదా. పోనీ సంస్కృతంలో ఆ శాస్త్రాలన్నీ ఇంతకుముందే అభివృద్ది చెందున్నాయా, ఆ శాస్త్ర పదకోశవంతా విరివిగా వినియోగంలో వుందా? లేదు కదా, అక్కడకూడా నానా రకాలుగా సంకరంచేస్తే తప్ప ఆ పద స్రృష్టి కాదు కదా. ఎందుకా ప్రయాస, దానివలన తెలుగు భాషకొచ్చిన ఉపయోగవేవీ పెద్ద లేదుకదా. తమిలమోళ్ళు మడి కట్టుకున్నారా, కట్టుకున్నారు కాబట్టే పదహారు అక్షరాల్తో ఆగిపొయ్యారు. కట్టుకున్నారు కాబట్టే బేంక్ ఆఫ్ బరోడాని, పేంగ్ ఆఫ్ పరోటా అనికూడా అనగలరు. ఆ ఖర్మ తెలుగుకి కూడా అవసరవా? అరవోళ్ళ ఆగాన్ని చూసి ముచ్చట పడే తెలుగు ప్రేమికులు, తెలుగుని కూడా ఆవిధంగా దిగజార్చదలుచుకున్నారా?

    నా మనసులో వున్నది, ఇప్పుడా, రేపా అనుకునే నా మెమొరి సెల్స్ లో మిగిలున్నదేదో పెట్టి ఒక్కలు ముక్కలుగా ఈ అభిప్రాయం వ్రాయడం జరిగింది. భాష మీదే కాక, భాషా శాస్త్రం మీద కూడా పట్టున్న కొలిచాల సురేశ్ లాంటివాళ్ళో, ముప్పై రెండు, అరవై నాలుగు రెఫెరెన్సులు చూసి, సరళవైన తెలుగులో చులాగ్గా వ్రాయగల్గిన బ్రహ్మానందం గోర్తి (త్యాగ రాజు మీద మీ వ్యాసాలు బ్రంహ్మాండం సార్ ) లాంటి వాళ్ళో, కాకపోతే ఆంధ్రాంగ్లాల్నే కాక భౌతిక శాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టిన వేలూరి లాంటి వాళ్ళో ఈ తెలుగు పదకోశం పుష్ చేసే సంస్కృత పదాల మీద ఒక పరిశోధక వ్యాసం వ్రాస్తే బాగుంటుంది కదా అని ఆశ.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  6. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rao Vemuri అభిప్రాయం:

    09/18/2009 7:27 am

    I read all the comments. Thanks for your interest. I am traveling in India (primarily to college campuses) and am not getting access to a reliable Internet connection
    to respond to each individual comment. (So much for India’s much touted leadership in IT). That is the reason I am writing this in English. Yesterday, one woman called and told me that I should use English names to all chemical elements (including the replacement of those well established names like baMgAraM, veMDi, etc.). This is a difficult thing to resolve. Insofar as using names proposed by Telugu Akademi, I wonder how those proposed names came into existence. Did the people who proposed those names really tried to use those words in a paragarph on a science subject? This is not a rhetorical question. I am simply curious.

  7. జమ్మిబంగారం చెట్టు గురించి శృతి అభిప్రాయం:

    09/18/2009 12:43 am

    మీరు వుదహరించిన
    …విభీషణుడు
    …దెలీలా
    అపూర్వ సూచించిన
    …ఇస్కరియోతు యూదా

    సమన్వయాన్ని కొచెం వివరిస్తారా??

    శృతి

  8. పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి రానారె అభిప్రాయం:

    09/17/2009 2:41 pm

    ఇలాంటి వ్యాసాలు మీరెన్ని రాసినా ఆనందంగా మళ్లీమళ్లీ వచ్చి చదువుకోవాలనిపిస్తూనే వుంటుంది. రాస్తూనే వుండండి రోహిణీప్రసాదుగారూ. కృతజ్ఞతలు.

  9. ఈ రాత్రి నేను వ్రాయగలను గురించి lyla yerneni అభిప్రాయం:

    09/17/2009 1:20 pm

    “ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను.”

    Who is this hot shot who says he can write the saddest lines?
    This man says such hot stuff as his opening line and already his second line does not adequately support it. The example he gives in the second line does not appear so potently sad or even related.
    Still,
    why should I care about that? All I am trying to do, is figure out what kind of lover this man is. I realise that intoxicating stage -the stage of first pangs of love- is so over for this guy. I mean, like the one depicted in the smashing song 🙂

    “ఎవరో! తానెవరో! ఆ నవమోహిని ఎవరో!”

    And, perhaps this passionate, openly jealous, lover phase, like in this Sahir’s Hindi lyric is also over for him.

    ” తుమ్ అగర్ ముఝ్ కో న చాహేతో కొయీ బాత్ నహీ
    తుమ్ కిసీ ఔర్ కో చాహేగీ, తొ ముష్కిల్ హొగీ…”

    Is this hero in Neruda’s poem kind of content to be discontent? Is this man a lukewarm lover?
    No, not really,
    There is no need for me to be finicky about this man or about this poem. The ‘on and off’ thoughts and silences, the riddance of poetic cadence gives credence to his soilitary agitation. There is a chill, a stillness, a heavy softness -in the air, in the night, and in the man’s heart.

    Poet! you translated the man in the poem well.

    లైలా

  10. జమ్మిబంగారం చెట్టు గురించి v v b rama rao అభిప్రాయం:

    09/16/2009 5:46 am

    మీ కవిత బాగుంది.
    ప్రాచీనభావం మంచిదైనప్పుడు ప్రాచీనమని వదులుకోనక్కర లేదు.
    వీ వీ బీ రామా రావు