పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. కంచి పట్టు కచేరీ గురించి D.V.N.Sarma అభిప్రాయం:

    10/01/2009 4:55 am

    పట్టమ్మాళ్ కచేరీకి విచ్చేసిన పాపనాశనం శివన్ ఆమె ప్రతిభ చూసి సంగీతం నేర్పడానికి ముందుకొచ్చారు. ఆయన వద్దే ఎన్నో దీక్షితార్ కృతులూ, సుబ్రహ్మణ్య భారతి పాటలూ నేర్చుకున్నారు.

    పైది సరికాదు.
    డి.కె.పట్టమ్మాళ్ దీక్షితర్ కృతులు అంబిదీక్షితర్ వద్దనూ టి.ఎల్.వెంకట్రామయ్యర్ వద్దనూ నేర్చుకున్నారు.
    శర్మ.

  2. తరగని దూరం గురించి D.V.N.Sarma అభిప్రాయం:

    10/01/2009 4:35 am

    “ఇల్లు కదిలామని గానీ
    ఇంటివారినొదిలామని గానీ
    ఎడబాటే అనుభవంలోకి రాదు

    అందుకే … అందుకే…
    ఇంట్లో ఉన్నప్పటి లాగే
    ఎప్పటి ధోరణే కొనసాగిస్తారు”

    శరీరమైతే విదేశానికి వెల్లిందికాని
    లోపలఉన్న ఆసామీ కాదనుకుంటా.
    శర్మ.

  3. పెదవి దాటనివి గురించి Vijayalakshmi అభిప్రాయం:

    09/30/2009 10:16 pm

    చక్కని కథ. స్వగతమా? వికాస్ అంతా ముగించి మేకప్ చేసుకున్నట్లు ప్రవర్తిస్తే మేఘనకు సహజంగా తన మనసు విప్పడానికి మనసు రాదు. ‘పోనీలే. ఇట్స్ ఓకే!” అనే టిపికల్ భార్య మనస్తత్వమా?

  4. జమ్మిబంగారం చెట్టు గురించి abhisapthudu అభిప్రాయం:

    09/29/2009 9:05 am

    It is a very good poem. Using mythical allusions in modern context is a tough job. Yoyusuccessfully done it with your prowess and with your diction.
    You once again proved with your poem that mythology has been an inexhaustible source of artistic inspiration since the stories comprised therein were first told.
    so nicely extracted.

  5. కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి venkatesh bharatha అభిప్రాయం:

    09/29/2009 2:37 am

    రామారావు గారికి నమస్కారము.
    సమయము లేక కావ్యాలలోని పద్యాలను చదవలేని మాకు సులభవచనము లొ అందించిన మీకు ధన్యవాదములు.

  6. పురూరవ: శ్రవ్య నాటిక గురించి P.V.S.N.SARMA అభిప్రాయం:

    09/28/2009 1:09 am

    It is really a golden opportunity to listen to this SabdanaaTakam of my favourite radio artists komala swaravarshini Smt.Sarada Srinivasan garu. Her voice is so heart touching and melodious. To praise her and her voice is too little time now. Hats off to her.
    With Vijayadasami Subhakanshalu.

  7. అల్లసాని పెద్దనామాత్య ప్రణీత మనుచరిత్ర:ప్రథమాశ్వాసము గురించి Sridhar అభిప్రాయం:

    09/27/2009 5:19 pm

    [ఈ అభిప్రాయాన్ని “పాఠకులకు సూచనలు” నుండి “మనుచరిత్ర” కి తరలిస్తున్నాము. — సంపాదకులు]

    I am searching for మనుచరిత్ర వచన కావ్యo, but I could not locate. Can anybody help me with the name / address of the publisher who has published the వచన కావ్యo. As I am outside Andhra Pradesh, I could not find it from Libraries.
    Thank you
    sridhar

  8. About eemaata గురించి Dr. Bhoja Reddy Katipally అభిప్రాయం:

    09/26/2009 6:30 pm

    జాషువా గారి పద్యాలు ఫ్రచురించినందుకు ఈమాటకివే నా హృదయ పూర్వక ధన్యవాదములు…..!

    I am really delighted to see how much service you are doing to Telugu Language.
    I am a practicing physician in USA, die hard fan of Telugu Literature….

    Hats off to your team.

    Let me know if I can support your organization,please do send more details of your work…

    With best wishes,
    Dr. Bhoja Reddy Katipally. MD; MPH
    USA

  9. ఈ రాత్రి నేను వ్రాయగలను గురించి vaseera అభిప్రాయం:

    09/26/2009 2:45 am

    You have translated the mood too. That’s a great poem. Great translation.

  10. జమ్మిబంగారం చెట్టు గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    09/26/2009 1:53 am

    రామాయణంలోని పాత్రలు:
    విభీషణుడు రావణుని సహోదరుడు. రావణుని ప్రాణాధారము నాభిలో వుందన్న రహస్యాన్ని తెలిసిన వాడు. పరిస్థితులు, ధర్మాధర్మాలు ప్రక్కన పెట్టి “రావణునికి శత్రువైన రాముని శిబిరంలో విభీషణుడు చేరకుంటే” అని ఆలోచిస్తే రావణుడు ఓడిపోయే అవకాశాలు లేవు. రామాయణ కథ ముగింపు మరోలా వూహించలేము కదా!
    అలాగే మన జీవితాన్ని, జీవిత లక్ష్యాలను నిర్వీర్యం చేయడానికి సొంత రక్తసంబందీకులే శత్రుశిబిరంలోకి చేరి మన రహస్యాలను బయటపెట్టి మన బలహీనతలపై దెబ్బతీయవచ్చు.
    బైబిలులోని పాత్రలు :
    సంసోను దేవుని అనుగ్రహంతో బలవంతుడుగా పుడతాడు. అతని బలం అతనికి నిరంతరం వుండాలంటే తలవెంట్రుకలను కత్తిరించకూడదు, మరియు ఈ రహస్యాన్ని ఎవ్వరికి చెప్పకూడదు. సంసోను చేతిలో అనేక మార్లు అవమానం పొంది ఓడిపోయిన వారు ఎలాగైనా అతనిని హతమార్చాలని సమయంకోసం ఎదురుచూసారు. అందులో భాగంగా అతని బలహీనతలను కనిపెట్టి, అతనికున్న స్త్రీ వ్యామోహానికి ఎరగా “దెలీలా” అనే స్త్రీని నియమించారు. అతడు అమెను మోహించి ఆమె మత్తులో పడ్డాడు. ఆమె తొలిప్రయత్నంలోనే అతని రహస్యాన్ని తెలుసుకోలేకపోయినా, ప్రయత్నిస్తూ వచ్చి చివరకు తెలుకోగలిగింది.
    తన దేవరహస్యాన్ని పదే పదే అడుగుతున్నప్పుడు “ఇలా ఎందుకు అడుగుతుంది, ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకూడదు కదా” అని సంసోను అలోచించివుంటే ముగింపు వేరేలా వుండేది.
    అలాగే మన జీవితాన్ని, జీవిత లక్ష్యాలను నిర్వీర్యం చేయడానికి మన బలహీనతల ఆధారంగా శత్రుశిబిరంలోని వారు దగ్గరకుచేరి మన రహస్యాలను తెలిసికొని, మనబలహీనతలపై దెబ్బతీయడానికి నియమింపబడతారు.

    బైబిలులోని మరో పాత్ర:

    యేసుకువున్న పన్నెండుగురు శిష్యులలో ఇస్కరియోతు యూదా ఒకడు. యేసు తన బోధనలలో ఒక రాజ్యాన్ని స్థాపిస్థానని చెపుతూ వచ్చాడు. అలాంటి రాజ్యము వస్తే తనకు కలిగే హోదాగురించి ఎప్పుడు ఆలోచనతో వుండేవాడు యూదా.
    మత పెద్దలు యేసును బంధించాలని ఆలోచనలు చేస్తున్నప్పుడు, యేసు ఎక్కడవుంటాడో, చీకటిలో అతనిని గుర్తించగలిగే రహస్యం కాసులకొరకు ఆమ్మివేసాడు.
    నేను ఎవరినైతే ముద్దుపెట్టుకుంటానో అతడె యేసు అని వారికి ఒక సంకేతాన్ని ఇస్తాడు. బహుశ మనం ఇప్పటి కాలంలో మాట్లాడుకునే “కోవర్టు” పని చేసాడు.

    కాలం ఏదైనా ఇలాంటి వాళ్ళు ఎదురౌతారు.
    వారి పట్ల అప్రత్తమంగా వుండగలగటం, పాత ప్రతీకలనుండి కొత్తవిధానాలను నేర్చుకోవడం ఎంతైనా అవసరం.