పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rao Vemuri అభిప్రాయం:

    10/10/2009 5:14 am

    ఈ మధ్య నా బ్రతుకు “సత్రవ భోజనం, మఠం నిద్ర” లా తయారయింది. అందువల్ల నా వ్యాసం మీద వచ్చిన అభిప్రాయలనీ, విమర్శలనీ చదివినా సమయపాలనతో స్పందించలేకపోతున్నాను. తెలుగులో ఆధునిక అవసరాలకి సరిపోయే సమగ్రమైన పదసంపద లేదని నాకు తెలుసు. Coordinate అన్న మాటకి సరి అయిన మాట కోసం తడబడ్డాను, నిజమే. అది నా తప్పే. మరికొంచెం జాగ్రత్త తీసుకుని ఉండవలసింది. ఇలాంటి చిక్కులు వస్తాయనే ప్రత్యేకమైన మాటలన్నిటికీ పక్కన కుండలీకరణాలు వేసి ఇంగ్లీషులో వాటి సమానార్ధకాలు రాయటం జరిగింది. వ్రతం చెడ్డా ఫలం దక్కాలి కదా.

    తెలుగు అకాడమీ వారు ప్రచురించిన మాటలు వాడలేదని నన్ను నిందించవద్దు. తెలుగు అకాడెమీ వారు హుకుం జారీ చేసినట్లు సమానార్ధకాల పట్టికలు ఇచ్చేరేమో కాని వాటి వాడకం సోదాహరణంగా చూపించినట్లు లేదు. నేను నా రాతలలో ఏ కొత్త ప్రయోగం చేసినా అది సోదాహరణంగా వాడి చూపించేను.

    పోగా, ప్రోటాన్, నూట్రాన్ మొదలైన మాటలని అలా వదిలెస్తేనే బాగుంటుందని రోహిణీ ప్రసాదు సూచించేరు. నిజమే. ఆ మాటలు వాడవలసి వచ్చినప్పుడు మూడొంతులు ఇంగ్లీషు మాటలే వాడతానేమో. అనవసరంగా, సందర్భశుద్ధి లేకుండా పిల్లిని మార్జాలం అన్నా, కోతిని మర్కటం అన్నా బెడిసికొడుతుంది. కాదనను. కాని “”మేనిఫోల్డ్” ని మేనిఫోల్డు అంటే ఎంతమంది తెలుగువారికి అర్ధం అవుతుంది? బిందుసమూహం అంటే ఎంతమందికి్ అర్ధం అవుతుంది? ఆలోచించండి.

    “ఇంగ్లీషు ప్రపంచ భాషలన్నిటి నుండి మాటల్ని స్వీకరించి తనలో కలుపుకుంటోంది. అలాగే ఇంగ్లీషు వృద్ధి చెందుతోంది. మనం మాత్రం ఎందుకు అలా చెయ్యకూడదు?” అని అడిగేవారున్నారు. తప్పకుండా. ఇంగ్లీషులా మనం ప్రపంచ భాషలన్నిటినుండి స్వీకరించి, వాటికి తెలుగుతనం ఇచ్చి స్వీకరిస్తే నేను ఆక్షేపించను. అంతేకాని “హోలుమొత్తం” మీద ఇంగ్లీషుమాటలని దిగుమతి చేసేసి, ఇంగ్లీషు వ్యాకరణం రాక ఈ ఇంగ్లీషు మాటలకి తెలుగు విభక్తులని, క్రియలని చేర్చి సంకర భాష చేస్తే అటు ఇంగ్లీషూ రాక, ఇటు తెలుగూ రాక రెండింటికీ చెడ్డ రేవడులమవుతున్నామేమో అని నా బెంగ.

    రోహిణీప్రసాదు చెప్పిన మరొక అంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. జనరంజక శైలి (popular style) లో రాసేటప్పుడు పాఠ్యపుస్తకాలలా “జోకొట్టి నిద్రపుచ్చే” శైలిలో రాయక్కరలేదు. ఇక్కడ పాఠకుDiని ఆకట్టుకోవటం ముఖ్యం. ఈ విషయం కూడ ఆలోచించండి.

  2. మరోపువ్వు గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    10/09/2009 8:55 pm

    చక్కని భావం. రవీంద్రుని కవితలను గుర్తుకుతెచ్చింది.

    ఎత్తులో కదిలే మేఘాలు, కొంచెం క్రిందగా ఎగిరే చిన్ని పక్షులు, ఇంకా కిందగా మొక్కపై చిన్న పువ్వు- నడిపించిన క్రమం- పరిNaతితో పాదాలు చేరడం, కాదు, చేర్పించడం రమ్యంగా ఉంది.
    ____________
    విధేయుడు
    _Srinivas

  3. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    10/09/2009 7:39 pm

    ఎంతో క్లిష్టమైన విషయాన్ని, తెలిసిన ఉపమానాలతో తెలుగులో అందించినందుకు చాలా కృతజ్ఞతలు. నీడ నాటకం, నూనెలో పొంగిన పూరి, ఉల్లి మొదలయిన ఉపమానాలు, బ్రహ్మాండాన్ని ఉల్లిగుడ్డు (hypersphere)తో పోల్చడం, బాగా ఆకట్టుకున్నాయి.
    ‘ఉల్లిగుడ్డు’ అన పదబంధం చాలా సార్థకంగా ఉంది.

    ఈ వ్యాసం చదివాక string theory కి, “సర్వమిదం ప్రోక్తం సూత్రే మణి గనా ఇవ” అని గీతలోవాడిన “సూత్ర” (string) పదానికి సామ్యం గుర్తొచ్చింది. భూమిని గోళాకారంగా గుర్తించినా లేక
    పోయినా, స్పష్టంగా అర్థం కానప్పుడు మాత్రం గందర”గోళం” అని “గోళా”కారంతో పోల్చడం ఆశ్చర్యపరుస్తుంది.

    “వృత్తం ఏకమాత్రమైన పరిమితిలేని ఒంపు తిరిగిన గీత” అన్నది అర్థం కాలేదు. ఏ వృత్తానికయినా ఫలానా radius, దాన్నిబట్టి పరిమితమైన circumference ఉంటుంది కాబట్టి పరిమితిలేనిది అన్నది సరిగ్గా తెలియలేదు. దయచేసి చెప్ప మనవి.
    — —————-
    విధేయుడు
    _Srinivas

  4. హంస గీతం గురించి Tadanki Ramakrishna అభిప్రాయం:

    10/09/2009 7:14 pm

    “నిలువు మమ్మా జగజ్జననీ”—–> “నాకు బాసటగా” కవి లక్ష్యము బాగున్నది.

  5. వానా వానా… గురించి Tadanki Ramakrishna అభిప్రాయం:

    10/09/2009 7:01 pm

    [ఈ అభిప్రాయంలో వ్యాకరణదోషాలు వగైరా సరి చేసాము. –సంపాదకులు]

    Good, but the telugu typing keyboard is very hard. When I read this kavitha, I felt that something is lacking. I felt that is no target for this content, only the expression in the form of few words. I think the kavi has to think about the good language of expression. We can express vasntarutuvu excellently in our language. “తోకముడిచి చెట్టుక్రింద చేర చూసి” we can read this only.
    But, the bhavanm is not matured. So the language is not also matured.

  6. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rohiniprasad అభిప్రాయం:

    10/09/2009 12:50 pm

    నాకు తెలిసినంతవరకూ తెలుగులో పాప్యులర్‌ సైన్సు వ్యాసాల ఉద్దేశం చెపుతున్న విషయాన్ని సులువుగా వివరించి దానిమీద ఆసక్తి కలిగించడమే. పాఠ్యపుస్తకాల విషయంలోలాగా వీటిలో ప్రామాణిక భాష, తదితర అంశాల ప్రాముఖ్యత ప్రధానం కాదు. రచయిత చెప్పినది సహజపద్ధతిలో, అర్థమయే రీతిలో ఉన్నట్టయితే ఆ ఆశయం నెరవేరుతుంది. అందుచేత రచనను గురించి భాషాపరంగా జడ్జిమెంట్లు చెయ్యకుడా విషయపరంగా ఎంత విశదపరిచిందో చెప్పడమే ఉచితం.
    నా లెక్కన ఈ వ్యాసం క్లిష్టమైన విషయాన్ని తేలిక భాషలో బాగా వివరించగలిగింది. ఎటొచ్చీ చిన్న చిన్న బొమ్మలను జతపరిస్తే ఇంకా సులువుగా అర్థమవుతుంది.
    ఈ మాట స్పందనల్లో రచన ఎటువంటిదయినా చెప్పే విషయాన్ని గురించి కాకుండా (సంగీతం, సైన్సు వగైరా) భాష తదితర అంశాల గురించిన పండిత చర్చ ఎక్కువగా కనిపిస్తుంది.

  7. జవాబు ఫలితం గురించి pantula Jogarao అభిప్రాయం:

    10/08/2009 9:52 pm

    శ్రీనివాసరావు గారూ, నమస్కార౦. మీ చిన్న కవిత మరో సారి చదివాను. నన్ను కదిలి౦చి౦ది.క్లుప్తత ఆ కవిత కి గొప్ప అల౦కార౦గా విలసిల్లి౦ది. మరో సారి మనసారా అభిన౦దల౦దుకో౦డి.

  8. తెలుగు నిఘంటువు గురించి… గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    10/08/2009 12:58 pm

    ఇంటర్నెటులో నిఘంటువులుంటే నిజంగా ఎంతో మేలు. బ్రౌన్‌ నిఘంటువు (అసమగ్రమైనా) తెలిసిందే.

    అర్థాలు చెప్పి వాటికి పద్యాలనుదహరించే నిఘంటువులున్నాయి. కాని, పదాలు సరిగ్గా, అందంగా, స్పష్టంగా వచనంలో వాడడానికి సూచనలిచ్చే నిఘంటువులు లేవు, English లో usages చెప్పినట్లు. చిన్ని ఉదాహరణ: చెరువుకు “గండి” పడి వరదలు అని వార్త. “గండి” కి 1)బిలము 2) రంధ్రము 3) సందు 4)నీళ్ళు ఎక్కువైనప్పుడు కట్ట తెగుట అర్థాలు ఉన్నాయి(శబ్దరత్నాకరములో) . 4వ అర్థమే ఎక్కువగా వాడడం తెలుసు. ఒక గోడకో, బట్టకో రంధ్రం పడితే “గండి పడింది” అనడం వినలేదు_అనొచ్చో లేదోతెలియదు. Usages ఇస్తే ఇట్లాంటివి మెరుగ్గా తెలుసుకునే అవకాశం ఉందనిపిస్తుంది.

    తెలియని పదాల అర్థాలనే కాక, తెలిసినట్టు అనిపించే పదాలు సైతం సార్థకంగా వాడడానికి నిఘంటువులు ఉపయోగపడుతాయి కదా. ఆ దృష్టితో ఇంకొంత సాయం చేయడానికి, భాష వాడుకను మరింత పటిష్టపరుస్తూ చేయూత నివ్వడానికి మార్గదర్శకంగా కొత్త నిఘంటువులు ఉంటే లాభం అని కూడా అనిపిస్తుంది.
    _________
    విధేయుడు
    Srinivas

  9. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Jagannadham Alapati అభిప్రాయం:

    10/07/2009 6:14 pm

    వేమూరి వేంకటేశ్వర రావు గారి “శాస్త్రీయ” వ్యాసం తెలుగులో యెంతో హృద్యంగా వుంది. ఒకరిద్దరి భాషాపరమైన సలహాలు కూడా మెచ్చదగ్గవిగా వున్నాయి. మిగిలిన కువిమర్శకులు (ఎవరో నేను ప్రత్యేకంగా రాయక్కర లేదు), ఎలానూ రాయలేరు, కనీసం టీ.వీ సంకర భాష గురించి వారికి రాయగలరా? మరికొందరు ఆంగ్ల పదాల్నే రాయచ్చన్నారు. ఏకంగా దాన్నే రాజభాష చేసుకుంటే మాట్లాడుకోవచ్చు కూడా! అంచేత కనీసం కొంతమందినైనా రాసేవాళ్ళని రాయనియ్యండి. మరి మీరేమంటారు? ఒక మంచిని ఆహ్వానిద్దామంటారా? లేక రంధ్రాన్వేషణ చేస్తూ పోదామంటారా?

    జగన్నాథం ఆలపాటి

  10. మరోపువ్వు గురించి రాకేశ్వర రావు అభిప్రాయం:

    10/06/2009 1:21 pm

    ఆఖరి పద్యం చాలా బాగుంది.
    మీ కవితలతో నాకెప్పుడూ వుండే మొఱ ఒకటే. నిడివి.
    రుచి చూపించి వదిలేసినట్టుంటుంది.