పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ఈ కానుకనివ్వలేను గురించి Mohan అభిప్రాయం:

    10/19/2009 10:40 am

    అరుణ గారి కథనం బాగుంది.
    ఈ కథలొ శాండిల్య ఎవరో నాకు తెలియదు కానీ, తానా ప్రవేశపెట్టిన TEAM Square ద్వారా కొన్ని సంఘటనల్లో నా అనుభవాన్ని ఈ కథలో చూడగలిగాను.
    మరిన్ని వివరాలకు ఈ Links :

    TEAM Square Activities
    TEAM Square Mission
    ఆరుణ గారికి అభినందనలు.

  2. కుతంత్రం గురించి Vasu అభిప్రాయం:

    10/18/2009 5:43 am

    బావుంది కథ. కాని ముగింపు నచ్చలేదు. ఇంకా ఎదో ఉందనుకుంటూంటే సడన్‌గా ఐపొయింది.

  3. పెదవి దాటనివి గురించి రామ అభిప్రాయం:

    10/17/2009 11:32 pm

    చాలా బాగుంది. ఐతే చక్కటి తెలుగు కథకి పొసగని ఇంగ్లీష్ కామెంట్స్ మాత్రం అస్సలు బాగోలేవు. కామెంట్స్ తెలుగు లో వ్రాయడానికి ప్రయత్నించండి.

  4. నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి సర్పవరపు రమణి. అభిప్రాయం:

    10/17/2009 12:30 pm

    ముక్కుకోయడమంటే లైలా గారు “ఊహించినట్టు” మొదలుకంటా నరికిపారేయడము కాదు.దానికి ఒక పద్ధతి పాడూ ఉన్నాయి.మనతెలుగులో సామెతకూడా ఉంది.ముక్కు కోసి సున్నం పెడతాను అని;మొదలు కంటా నరికితే ఇంక సున్నం ఎక్కడ పెడతారు?? అంతే గాక Rhinoplasty (తెగిన ముక్కునతికే శస్త్ర చికిత్స) ప్రాచీన భారతంలో ప్రచలితమైన శస్త్రచికిత్సల్లో ఒకటి.(శుశ్రుత సంహిత లో విపులంగా వర్ణించారు). రావణుడు కూడా శూర్పణఖకు అటువంటి ముక్కు పునర్నిర్మాణ శస్త్రచికిత్స చేయించాడు. ముక్కు పుటాలు లేకపోతే ఈ చికిత్స కుదరదు అన్న విషయం స్వయాన వైద్యులైన లైలా ఎర్నేని (ఈ పేరు చూసి గాభరా పడతాను. లైలా శుద్ధంగా హీబ్రూ పదము ,ఎర్నేని తెలుగు ఇంటిపేరు) గారికి తెలియని విషయం కాదు.

    “ఎందుకంటే, లక్ష్మణుడు ‘సురియ’ తో శూర్పణఖ ముక్కును, కోసి అవతల పారేస్తే ‘ముకుపుటములు’ ( the flaring walls of nostrils, the wings of nose, alae nasi ) ఇంకా ఆమె ముఖాన ఉండవు. అందువలన.లక్ష్మణుడు చేసేది అవమానం కాని, (ముక్కూ చెవులు కొయ్యటానికి తర్వాత ఆయన వేరే కారణం చెబుతాడనుకోండి) ప్లాస్టిక్ సర్జరీ కాదు కదా. (రాక్షస కాంతల ముక్కు నిర్మాణం మానవ స్త్రీ కన్నా వేరేగా ఉంటే, అది ఎక్కడైనా వర్ణించబడి ఉంటే సరే సరి.) “
    కావున ,లైలా గారి రాతల్లో పసలేదు. ఏదో “ఒక ఠస్సా వేసి రంజింపజేద్దామనుకొన్నారు” కానీ అది కుదరలేదు. కామేశ్వరుల వ్యాఖ్యల్లో పొసగనిది శూర్పణఖ నిర్వీర్యురాలు (వీర్యముండేది పురుషులకు; నిశ్చేష్టురాలు అంటే బాగుండేది) కావడం,ఒక డాక్టర్గా లైలా గారు దీన్ని ఎత్తిచూపవలసింది.కానీ వితండవాదంలో తర్కం వెనుకబడుతుంది.కావున వారి బుద్ధి అటు పారలేదు.

    సర్పవరపు రమణి.

  5. హంస గీతం గురించి krishna అభిప్రాయం:

    10/16/2009 2:27 pm

    జీవిత సత్యాన్ని చాల చక్కగా చెప్పారు. ధన్యవాదములు.

  6. నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి lyla yerneni అభిప్రాయం:

    10/15/2009 11:37 am

    విశ్వనాథ తరఫునో లేదా బృందావనరావుగారి తరఫునో వకాల్తా పుచ్చుకొని వాదించడానికి నేను రాలేదు. లైలాగారి అభిప్రాయాన్ని తప్పుపట్టాలన్న ఉద్దేశమూ లేదు. -Kameswara Rao

    ఈ పై వాక్యాల నిర్మాణం నాకు ఆసక్తిని కలిగించింది.
    విశ్వనాథ, బృందావనరావు, లైలా – వీరెవ్వరి తరుఫున నేను వాదించటానికి రాలేదు. ఎవరి అభిప్రాయాన్ని తప్పు పట్టాలని లేదు – అని వీరు వ్రాసి ఉండవచ్చును. కాని వారు అలా అనలేదు. ఎందువల్ల అలా అనలేదు. ఇలానే ఎందుకు అన్నారు? అన్న అనుమానం లీలగా కలుగుతుంది నాకు. 😉 కామేశ్వరరావు లాటి భాషాప్రవీణులు ఆషామాషీగా రాయరు. అంచేత నాకు అలాటి అనుమానం వస్తుంది.

    ఐతేయేం, పద్య సందర్భం విపులంగా వర్ణించారు. శూర్పణఖ, ఖరుని మనస్థితులను (పుస్తకంలో లేకున్నా) తెలియజెప్పారు. సంతోషంగా చదువుకున్నాను.
    కానీ, “శూర్పణఖని చూసిన ఖరుడు మొదటగా అనే పద్యం ఇది:” అంటూ ఇవ్వబడిన విశ్వనాధ ఈ క్రింది పద్యం కూడా నాకు నచ్చలేదు. 😉

    “ఇటులిది యేమమ్మా! ముకు
    పుటముల నెత్తురులు గారు? ముక్కుం జెవులుం..”

    ఎందుకంటే, లక్ష్మణుడు ‘సురియ’ తో శూర్పణఖ ముక్కును, కోసి అవతల పారేస్తే ‘ముకుపుటములు’ ( the flaring walls of nostrils, the wings of nose, alae nasi ) ఇంకా ఆమె ముఖాన ఉండవు. అందువలన.
    లక్ష్మణుడు చేసేది అవమానం కాని, (ముక్కూ చెవులు కొయ్యటానికి తర్వాత ఆయన వేరే కారణం చెబుతాడనుకోండి) ప్లాస్టిక్ సర్జరీ కాదు కదా. (రాక్షస కాంతల ముక్కు నిర్మాణం మానవ స్త్రీ కన్నా వేరేగా ఉంటే, అది ఎక్కడైనా వర్ణించబడి ఉంటే సరే సరి.)

    లైలా

  7. జనరంజని: మహానటి సావిత్రి గురించి Mahesh T అభిప్రాయం:

    10/14/2009 12:54 pm

    Thank you so much for giving us an oppurtunity to listen to Mahanati Savitri.

  8. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rohiniprasad అభిప్రాయం:

    10/14/2009 11:38 am

    ఖగోళ విశేషాలను గురించిన నా పుస్తకం ఈమధ్యనే విడుదల అయింది:
    http://rohiniprasadkscience.blogspot.com/2009/10/1.html

  9. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    10/13/2009 8:43 pm

    విశ్వం ఏ ఆకారంలో ఉంది? అన్న ప్రశ్న చాలా నిgUఢమైనది. అంత ఎత్తుకు ఎదిగే లోపల తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి.

    చంద్రుడు భూమికి ఉపగ్రహంగా ఎలా పుట్టాడు? భూమి నుంచా? చంద్రుడు ఒకప్పటి భూమిలోని భాగమా? భూమి ఎలా పుట్టింది? సౌరకుటుంబంలో మరే గ్రహానికీ లేని “నీరు” భూమికి మాత్రమే ఎలా సొంతమైంది? భూమిపై సృష్టి ఎలా సాధ్యమైనది?

    ఇలా అడుగుతూ పోతే ప్రశ్నల పరంపరలకు అడ్డు లేదు. ఇలాంటి విషయాలపై అతి క్లిష్టమైన సూత్రాలను అర్ధం చేసుకోటం కష్టమే! కానీ వాటిని తెలుగులో రాయవలసిన అవసరం మటుకు చాలా ఉంది. వేమూరి వారి వ్యాసం, విజ్ఞులైన తెలుగు రచయితలని కవ్వించి (మంచి మార్గంలోనే), వారిచే చక్కటి రచనలు చేయించగలdaనే ఆశతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  10. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rohiniprasad అభిప్రాయం:

    10/13/2009 7:40 pm

    వేమూరి వెంకటేశ్వరరావుగారు ఎన్నో ఏళ్ళుగా పాప్యులర్‌ సైన్స్‌ రచనలు చేస్తున్నారు. నేను అయిదేళ్ళనుంచీ ఏపీ వీక్లీ డాట్‌ కాం తదితర పత్రికల్లో ప్రతి వారం రాస్తున్నాను. ఎంతమంది ఈ రంగంలో కృషి చేసినా సరిపడేంత పని ఉంది.