పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి rama bharadwaj అభిప్రాయం:

    12/18/2009 1:06 am

    పాఠకులు తీలివైనవాళ్ళు అని గనక గుర్తుంచుకుంటే అభిప్రాయాలురాసేవాళ్ళు పనిగట్టుకుని వక్రీకరించడం చేయరు. అర్ధం కాకపోయినా…సాహిత్య నేపధ్యం సరిగా తెలియకపోయినా తప్పులేదు. కానీ తెలుసుకునే ప్రయత్నం నిజాయితీగా చెయ్యకపోతే..ఏదో ఒకటి అనేద్దాం అనే ఉబలాటంలో వారే మరింత పొరబడే అవకాశం ఉంది. చంద్రశేఖర్ గారి అభిప్రాయం ఇందుకు ఒక ఉదాహరణ.

    “థియరీ” అని నేనన్నప్పుడూ..నేను పేర్కొన్న “కొకు” ఇంకా ఇతర కవి రచయితల సిధ్హాంతాలూ..గురజాడా ..గాంధీ ల సిధ్ధాంతాలూ..ఒకటి కావనీ..ఈ రెంటికీ మధ్య ఏమాత్రం సారూప్యం లేదనీ నెను ఎక్కడా నా అభిప్రాయంలో ఇటువంటి అర్ధాన్నిచ్చే మాట వాడలేదనీ నా మాటలని వివరంగా చదివిన వారికి
    వివరంగానే తెలిసే వీలుంది. ఇక్కడ సందర్భం కుటుంబరావు గారు. గురజాడ, గాంధీలు కారు. వీళ్ళందరినీ అర్ధం పర్ధం లేకుండా ఒకే గాట కట్టి మాట్లాడేయడం వల్ల చంద్రశేఖర్ గారికి ఈ బేధం తెలియలేదని తెలుస్తుందే తప్ప నా మాటల్లో ఎలాంటి అయోమయం లేదు.

    నా అభిప్రాయంలో నేను గురజాడని “ద్రష్ట” అని సంబోధించాను. ఆయన ద్రష్ట
    ఎందుకో కూడా వివరించాను. అలాంటి దూరదృష్టి “కొకు” అలాగే ఆ తరహా కమ్యూనిష్టు సిధ్ధాంతాలని నమ్మిన ఇతర రచయితలలో కొరవడిందని ఉదాహరణ పూర్వకంగా అన్నాను..గురజాడా వాక్యాన్ని ఉటంకిస్తూ!!గనక అభిప్రాయం నేను రాసినప్పుడు నాకు ఏమి చెబుతున్నానో..ఎందుకు చెబుతున్నానో స్పష్టత ఉన్నది. పాఠకునిగా చంద్రశేఖర్ లాంటి వాళ్ళకి అటువంటి స్పష్టత కలగాలని ఆశిస్తాను.
    రమ.

  2. కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి చంద్రశేఖర్ అభిప్రాయం:

    12/16/2009 12:49 am

    థియరీ మార్చుకుంటే మార్పులు కనపడతాయని చెప్పి రమా భరద్వాజ్ గారు మాకళ్ళు తెరిపించారు. ఈ విషయం గాంధీ లాంటి పిచ్చివాళ్ళకి, గురజాడలాంటి వెర్రివాళ్ళకి తెలిసుంటే, వాళ్ళ వాళ్ళ థియరీలు మార్చుకుని బ్రిటిషు వారివల్ల మాత్రమే మన అభివృద్ధి సాధ్యమనీ, కన్యాశుల్కం వల్ల ఆడపిల్లలకు, వారి తల్లితండ్రులకు లాభమని నమ్మి సుఖంగా జీవించేవారు. ఎంత దురదృష్టం?

  3. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి rama bharadwaj అభిప్రాయం:

    12/15/2009 2:58 am

    అయ్యా హరీష్ గారూ!!

    అభిమానానికీ..దురభిమానానికీ..అసలు సాహిత్యం అన్నది రేపటితరాలకి ఎక్కడ మిగలబోతోంది లెండి..మీరేం చింత పడకండి. అలాగే తెలుగు భాషా మిగలబోవడం లేదు. తెలుగు సాహిత్యాన్ని ఇతర విషయాల్ని సైతమ్ రేపటి తరాలకి బోధించే వాళ్ళూ మరి మిగలబోవడం లేదు. ప్రపంచంలో అన్ని భాషల్నీ తొందర తొందర గా అటకెక్కించి..సర్వే సర్వత్రా ఇంగ్లీషే రాజ్యమేలబోతూంది. దాన్ని రారమ్మని మీరంతా రెండు చేతులూ చాచి మరీ మరీ ..
    ఆహ్వానిస్తూండగా..తెలుగు ఎందుకు బతుకుతుందీ?? so dont worry…మీ పిల్లలూ..ఆ పిల్లల పిల్లలూ మరింక తెలుగు వారుగా ఉండనఖ్ఖరలేని తీర్మానాలన్నీ మీరంతా ఇలా ముందుకొచ్చి చేస్తూండగా ఇహ తెలుగుకి ఊపిరెక్కడా? సర్వం శ్రీ జగన్నాధంగా
    భూమ్మీద ఇటుపై అంతా ఇంగ్లీషే!! రేపు భ్రాహ్మణుడూ ఇంగ్లీషులోనే మంత్రాలు చదువుతాడు..బోయవాడూ ఇంగ్లీషులోనే వలవిసురుతాడు. కోటిపల్లి రేవు లోని సరంగు ఇంగ్లీషులోనే పడవ నడుపుతాడు. అమ్మమ్మలు అందరూ ఇంగ్లీషులోనే జోల పాటలు పాడతారు. చివరికి మీ తెలుగు పల్లెల్లోని పసుల కాపరీ ..కాటికాపరీ కూడా మీ మనసు శాంతించేలా సమస్త తెలుగు విజ్నాన పరిభాషకీ అరువు తెచ్చుకున్నఇంగ్లీషుచొక్కాలే తొడిగించి మరీ ఊరేగిస్తారు.

    రమ.

  4. డి. టి. ఏల్. సీ. – కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాల పై సమీక్ష గురించి Jagannadham Alapati అభిప్రాయం:

    12/12/2009 11:00 am

    ముగ్గురు ప్రముఖుల శతజయంతి సభల గురించి విపులంగా రాసిన మీ సమీక్ష, దాని మీద వచ్చిన కొందరి అభిప్రాయాలూ చదివిన తర్వాత, సామాజ స్పృహతో రాసిన ఆముగ్గురు ప్రముఖులపై మీఅందరికీగల ఆదరాభిమానాలూ, గౌరవం చూసి ఇది వ్రాస్తున్నాను. మీఅందరిలా అంతగా చదవడం, రాయడం వచ్చినవాణ్ణి కూడా కాదు. ఈ శతజయంతి సభలూ, సమారాధాలూ వారికి నివాళులు కావచ్చు కానీ, వారికి నిజమైన ఆత్మశాంతిని కూరుస్తుందని మాత్రం అనుకోవడంలేదు. వారు ఏ పవిత్రోద్దేశంతో ఆ రచనలు చేశారో, వాటిలో కొంతైనా కొంత సామాజిక స్పృహతో ఈతరంలోని మనం ఆచరణలో పెడితే, నిజమైన నివాళి ఔతుంది.
    మాకు ఇంకా ఏదో జరగలేదని అందరూ ఎవరికి వారే, కులం,మతం,లింగం, ప్రాంతం ఒకటేమిటి అన్నిబేధాలకీ రిజర్వేషన్లు కావాలని అన్నిరకాలుగానూ ఒకరిని ఒకరు ద్వేషించుకొంటున్నాం. మధ్యలో రాజకీయ నాయకులు పబ్బం గడుపుకొంటున్నారు. యన్నారైలు తమవంతు ధనాజ్యం పోస్తున్నారు. అలాకాకుండా, దానికి మనవంతు మేధో సంపత్తిని ఏదైనా అందించగలమా? ఆర్ధిక వికేంద్రీకరణ జరిగితే ఈ విభేధాలు సమసిపోవా? నిజాయితీగా ఒక్కసారి ఆలోచించండి. వీలైతే నడుం కట్టండి!

  5. ఒక్కతే… మృత్యువు గురించి rama bharadwaj అభిప్రాయం:

    12/11/2009 2:37 pm

    బొల్లోజు బాబా గారూ!!నెరూడా మృత్యువుకి శ్రీశ్రీ అనువాదం నీరసంగా ఉంది. అంతకన్నా మీది మెరుగు. మీ కన్నా కామేశ్వర్రావు గారిది ఎక్కువ నయం!
    రమ

  6. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి hareesh అభిప్రాయం:

    12/11/2009 1:04 pm

    రమ గారి, జగన్నాథం ఆలపాటి గారి వ్యాఖ్యానాలు చదివితే మనం తెలుగు భాషను అభిమానిస్తున్నామా లేక దురభిమానాన్ని పెంచుకుంటున్నామా అర్థం కావటం లేదు. సాహిత్య పరంగా మేటి ప్రపంప భాషల సరసన నిలువగలిగే సుసంపన్నమైన సాహిత్యం తెలుగు భాషలో ఉంది. ఆ సంపదను కాపాడుకోవడానికి ఈమాట తరహాలో తెలుగు వ్రాయడాన్ని, చదవడాన్ని, సాహిత్యాభిలాషులను ప్రోత్సహించాలే తప్ప శాస్త్ర, సాంకేతిక విద్యను కూడా తెలుగైజ్ చేయ్యలన్న వాదాన చాలా అసంబద్ధమే కాక, భావి తరాల వారికి తీరని అన్యాయం చేయడమే. ప్రపంచీకరణ నేపధ్యంలో ఇంగ్లీష్ భాష ఆధిపత్యాన్ని, అవసరాన్ని గుర్తెరిగి, శాస్త్ర, సాంకేతిక విషయాలను ఇంగ్లీష్ భాషకు వదిలేసి, మన భాష, సంస్కృతి, చరిత్రల గురించిన విషయాలను తెలుగులో రాస్తూ, తెలుగును మరింత సుసంపన్నం చేయడం ద్వారా తెలుగు భాష మనుగడకు తోడ్పడగలమని నా అభిప్రాయం.

  7. సువర్ణభూమిలో … గురించి lyla yerneni అభిప్రాయం:

    12/10/2009 5:20 pm

    “సువర్ణభూమిలో అని మొదలుపెట్టాడు కవి, థాయ్ భాష ఆరు గంటల్లొ నేర్చుకున్నానన్నాడు. ఈ కవిత థాయ్లాండ్ పర్యాటన గురించి అని అంతకంటే వివరంగా చెప్పనవసరం లేదు…. ”

    “ఇంత వరకూ కవిత చక్కగా ఉంది. కాని అనవసరంగా, ఆరుగంటల్లో థాయ్‌ అక్షరాలు నేర్చుకున్నాను గాని, ప్రియురాలి మనసును ఛాయా మాత్రంగా నైనా అర్థం చేసుకోలేను, అని ముగించాడు కవి. ప్రియురాలిని అర్థం చేసుకోవటంతో ఈ కవితకి ఎలాంటి సంబంధం లేదు. ఈ చివరి ఆరు పంక్తులూ లేకుండా ఉంటే కవితకెలాంటి లోపం ఉండేదికాదు.”
    ఆరి సీతారామయ్య అభిప్రాయం: December 2, 2008 3:11 pm

    ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ ఈ కవిత, ఈ అభిప్రాయాలు చదువుకుని, ఈ పై అభిప్రాయం వెలిబుచ్చినవారికి, ఈ నా ప్రశ్న.

    ఈ కవితలో, ఏ పంక్తుల్లో ఉన్న సమాచారాన్ని వాడి, పాఠకులు ఈ కవితను అర్థం చేసుకోవాలో మొదట్లో చెప్పి, చివరికి ఆ పంక్తులే ఈ కవితకు అనవసరమని చెప్పి ముగించారు.

    గమనిస్తారా?
    పొరపాటా? కాదా?
    సమాధానం చెబితే, అప్పుడు నా రెండో ప్రశ్న అవసరమైతే ఆడుగుతాను.

    లైలా.

  8. కెంధూళి గురించి Jagannadham Alapati అభిప్రాయం:

    12/10/2009 1:26 am

    సౌమ్య గారి అభిప్రాయానికి నా సమాధానం, నా అభిప్రాయంగా బాగా అతుకుతుందని యిలా రాస్తున్నాను.
    “రెండూను” !
    జగన్నాథం

  9. నాయినమ్మ యిల్లు గురించి rajeshwari అభిప్రాయం:

    12/09/2009 7:58 pm

    మీ కవిత బాగుంది.

  10. కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి rama bharadwaj అభిప్రాయం:

    12/09/2009 3:12 am

    ” కొకు” అన్నపేరు విరసం వారి పుణ్యం!! వారి భావనల్లో రసం ఉండదన్నది సాహిత్య విదితం!! ఇహ రేరాజు గారు చెప్పింది ముఖ్యమైన విషయం ఒకటుంది.అదేమిటంటే “థియరీని మార్చుకోవడం”. ఆ దృష్టితో చూసి ఉంటే..మోహనగారికి చాలా సామాజిక మార్పులు స్పస్టంగానే కన్పించేవి. అర్ధమూ అయ్యేవి కూడా!! కొడవటిగంటి కుటుంబరావు గారు కధలు రాసిన కాలం నాటి సమాజమూ..ఇవాల్టి సమాజమూ ఒక్కలా లేదు. ఈ మధ్య కాలంలో తెలుగు సమాజమూ బాగానే మారింది. తెలుగు సాహిత్య సమాజమూ ఆ అన్ని మార్పులనీ తనలో ప్రతిఫలించింది.అనేకానేక అస్థిత్వ ఉద్యమాలానేపద్యం కుటుంబరావుగారు ఎక్కడా ఊహించినట్టు కనబడదు.కానీ అదే గురజాడ చాలా స్పష్టంగా ఊహ చేయగలిగారు.”modern women will rewrite history” అని గురజాడ అన్నది ప్రపంచవ్యాప్తంగా నిజమైంది. ద్రష్ట అంటే ఆయన. కానీ కుటుంబరావు ఏకోశానా అలాంటి దృశ్యాన్ని ఆధునిక కాలానికి మరింత దగ్గరివాడై కూడా చూడలేకపోయాడు. శ్రీశ్రీ సైతం ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. రావిశాస్త్రీ..కాళీపట్నం కూడా కారు. ఇందుకు కారణం వాళ్ళ”థియరీ” లోపమే!!వాళ్ళ్ “ప్రాక్టీస్ ” లోపంకూడానూ!!

    ప్రపంచంలో వచ్చే మార్పులని కొలిచి చూసే సిధ్ధాంత పరికరాలు పాతబడిపోయే స్థితి ఒకటి వస్తుందని ఈ రచయితలు ఊహించలేదు. అది వీరి దృస్టి దోషమే!! ఆనాటి యువత ఇవాళ లేరు. ఆనాటి ఆర్ధిక పరిస్థితిలు అలాగే ఇవాళ లేవు. ప్రపంచీకరణ నేపధ్యంలో..కుటుంబరావు కధల్ని లక్ష్మన్న చూడలేదు.”ఎక్కడవేసిన గొంగళీ అక్కడే ఉన్నట్టు”గా ఇవాళ్టికీ సామాజిక పరిస్థితులు ఉన్నాయని మోహన గారు భావించడాన్ని కూడా చాదస్తపు..వెనుకబాటుమాటగానే చూడాల్సి ఉంటుంది. “మంచిగతమున కొంచమే” నని అప్పారావుగారన్నది ఈనాటికీ ఈ తరహా చదువుకున్నవారికి అర్ధంకాలేదని అన్పిస్తుంది ఇటువంటి ప్రకటనలు చూసినప్పుడు.పరిస్థితులు ఎక్కడా మారనే లేదనీ..బహుసా మరి మారవనీ మోహన గారు అనడం నిజంగా ఆశ్చర్యపడవలసిన విషయం!! మార్పుని వీళ్ళూ గమనించరనీ..గమనించినా కూడా దాన్ని ఏకోశానా ఒప్పుకోరనీ తెలియజెప్పేలా ఉంటాయి ఇటువంటి అభిప్రాయాలు. ప్రతి సమాజంలోనూ మంచి మార్పులూ ఉంటాయి..కానివీ ఉంటాయి. ఆ కాలానికి చెందిన సాహిత్యం వాటిని బొమ్మ కట్టి చూపే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది కూడా!! మనం చేయవలసిందల్లా ఉత్తుత్తి నిట్టూర్పులు విడవకుండా వాటిని గమనించటమూ..వాటిని విశ్లేషించటమూనూ!!
    రమ.