తెలుగు సాహిత్య చరిత్రలొ అంగాంగవర్ణన ఆనందించగలిగిన తరం నవలాసాహిత్యంలొ స్త్రీ అంతరంగ ప్రతిధ్వనిని విచ్చలవిడి తనంగా చలం రచించాడని వెలివేసినా నిలద్రొక్కుకోవడానికికారణం శ్రోత్రియజీవిత స్త్రీ వ్యవస్థకు హెచ్చరికగా పరిగణించి చాటుగా చదివినతరం క్రొత్త ఆలోచనలలో చలాన్ని సజీవంగా నిలుపుకోవడమువల్లనెఅన్నది వాస్తవము. అ సజీవ వాణిని భద్రపరిచి రజనిమాట ఆకాశఃవాణి ఈమాటగ అభినందనలకు అందనిది.
ఈ సంకలనాన్ని నేను ఇప్పట్లో చదివే అవకాశం లేదు. నేను ఈ క్రింద రాసినది కేవలం ఈ సమీక్షా వ్యాసానికి స్పందన మాత్రమే. అది కూడా, బ్లాక్ అట్లాంటిక్ , తెలుగు డయా స్పోరా, హెమింగ్వే మూడూ ఒకే వ్యాసంలో చోటుచేసుకోవటం ముచ్చటగా అనిపించినందు వల్లనే.
వెబ్ పత్రికల్లో స్థలాభావం అన్న సమస్య వుండదు కాబట్టి వెంకటేశ్వరరావు గారు కొంచెం వివరంగా చెప్పి వుండవలసిన ది . బ్లాక్ అట్లాంటిక్ పుస్తకం , ‘దేశము’ అనే భౌగోళిక ఎల్లలను దాటే జీవితానుభవాలలో ( బానిస వ్యాపారాల ద్వారా నయితేనేమి, బానిసత్వాన్నించి బయట పడటంలో నయితేనేమి), నల్లజాతీయులు పడిన ఘర్షణలో చైతన్యపు పొరలు ఎట్లా ఏర్పడ్డాయి అన్నది తవ్వి తీసే పుస్తకం. జాతి, దేశము ఈ రెండూ కూడా చరిత్ర గమనములో ఏర్పడిన శిలాజాలే తప్ప వాటికి కాలాతీతమైన వునికి ఏమీ వుండదు అన్న జ్ఞానం , బ్లాక్ అట్లాంటిక్ పుస్తకానికి వుపోద్ఘాతంగా చెప్పుకోవచ్చును. అక్కడినించి ఎత్తుకుని, పాల్ గిల్రాయ్ ఈ నల్లజాతి చైతన్యపు పార్శ్వాలను తడుముకుంటూ దాని రూపు రేఖాలను పునర్నిర్మిస్తాడు. ఇక్కడ ‘పునర్నిర్మిస్తాడు’ అన్న మాట కావాలని వాడుతున్నదే. సాంస్కృతిక విమర్శ అయినా సాహిత్య సృష్టి అయినా మనిషి చైతన్యాన్ని పునర్నిర్మించే ప్రయత్నాలే — ఒక్కొక్క సారి అవి విజయవంతంగా, అందరికీ పనికొచ్చేలా జరిగితే, ఒక్కొక్క సారి ప్రయత్నం కూడా చేయకుండా విఫలమైపోతాయి.
పాల్ గిల్రాయ్ రాసిన బ్లాక్ అట్లాంటిక్ పుస్తకాన్ని కానీ, హెమింగ్వే కధల్లోనూ, జర్నలిస్టుగా నూ ఆవిష్కరించిన సత్యాలను కానీ, మనకి పనికొచ్చేలా అన్వయించుకోవాలంటే, ప్రయత్న పూర్వకంగా మనం చేయాల్సిన పని చాలా వుంది. వేంకటేశ్వర రావు గారు, చూచాయగా చెప్పి వదిలేసిన విషయాన్నే తీసుకుందాము. తెలుగు వారు అమెరికాలో వుంటున్నా ఆంధ్రలో వుంటున్నట్టే ఎందుకు కనపడతారు ? ఇది తెలుగు వారో, వారి తరఫున , తెలుగు కథలూ కవిత్వమూ రాసే వారో తమ ధోరణి కొంచెం మార్చుకుంటే మారిపోతుందా ? తెలుగు లో అమెరికా లో వస్తున్న కథలూ, ఆంధ్ర ప్రదేశ్ లో వస్తున్న కథలూ ఒకేలా వుండటానికి కారణం కేవలం వూహా శక్తి లోపించటమే మరేమైనా వుందా ?
ఇలాటి ప్రశ్నలకు తెలుగు భాష మాట్లాడే వాళ్లంతా ఒక జాతికి చెందిన వారు అన్న అభిప్రాయం ఎప్పుడూ ఎలావచ్చిందో అన్న దగ్గర మొదలు పెట్టుకోవచ్చును. ఈ తెలుగు జాతి అన్న శిలాజంలో జిల్లాల వారీగా కులాల వారీగా, ప్రాంతాల వారీగా ఏ యే సంఘర్షణల చిహ్నాలు కనిపిస్తాయి అన్నది కూడా ఆలోచించ వలసిన విషయమే. వేంకటేశ్వర రావు గారు సూచించిన కాల పరిధి లో ఆంధ్ర ప్రదేశ్ లో సాంఘిక జీవనంలో చాలా పెద్ద ఎత్తున తుఫానులు వచ్చాయి. నాగార్జున సాగర్ కట్టడంతో – గుంటూరు జిల్లా గుర్తు పట్ట రానంతగా మారిపోయింది.
కొద్ది రోజుల్లోనే పశ్చిమ గోదావరి జిల్లా జంగా రెడ్డి గూడెం నించి, మద్రాసు పాండీ బజారు వరకూ, గుంటూరు జిల్లా పిడుగు రాళ్లనించి హైదరాబాదు శివార్లలో ఈ మేడ్చల్, హైదరాబాదులోనే ఏ యెస్ రావు నగర్ నించి యెల్బీ నగర్ వరకూ ఇటు తిరిగి ఇటు తిరిగీ అమీర్ పేట నించి డెట్రాయిట్ వరకూ ఈ మార్పుల తాలూకా ప్రభావం కనిపిస్తుంది.(ఇక్కడ శిలాజం అన్న మాట ఇంగ్లీషులో ఫాసిల్ అన్న మాటకి తత్సమంగా వాడుతున్నట్లు అనిపించొచ్చు. సామాజిక రూపాలు పూర్తిగా ఫాసిల్స్ గా ఎప్పుడూ వుండవు. పొలం గట్ల లాగా అవి నీరు పారటానికి మార్గాలు చూపించినా ఎప్పటికప్పుడు ప్రయత్న పూర్వకంగానో అప్రయత్నంగానో మారుతూనే వుంటాయి. )
అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సాంఘిక జీవన చరిత్ర వేంకటేశ్వర రావు గారు చెప్పినట్లు – అంతా కలిపి నలభై ఏళ్లు కూడా వుండదు. అమెరికాలో పంజాబీల చరిత్ర దాదాపు వంద సంవత్సరాలుంటుంది. అమెరికాలో గుజరాతీల రోజు వారీ జీవితం , వ్యాపార రంగం ద్వారా అమెరికన్ నాగరికుల రోజు వారీ జీవితంతో కలిసి వుంటుంది. బెంగాలీల సాంస్కృతిక జీవనం – అమెరికన్ యూనివర్సిటీల మేధోత్పాదనలో — ప్రత్యేకించి – లిటరేచర్ , హిస్టరీ , ఇలాటి డిపార్టుమెంట్లలో పెద్ద పాత్ర వహిస్తుంది. ఈ భాషలు మాట్లాడే వాళ్లంతా ఈయీ పనులే చేస్తుంటారని కాదు కానీ, వారి చైతన్యంలో ఈ అనుభవాల ప్రభావం చాలానే వుంటుంది. వేంకటేశ్వర రావు గారు సూచించినట్లు – అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సాంఘిక జీవనంలో ఆఫీసుల్లో , ప్రత్యేకించి ఐటి రంగంలో పనులు చేసుకోవటం, గ్రీన్ కార్డు సంపాదించుకోవటం, కట్నం మాట్లాడుకోవడం , పెళ్లిళ్లు చేసుకోవడం, హైదరాబాదులాంటి చోట ఇల్లో స్థలమో కొనుక్కోవడం, తెల్ల అమెరికన్ సబర్బన్ లైఫ్ లో ఒక చిన్న చోటు వెతుక్కోవటం, ఇలాటివి చాలా ముఖ్యమైన ఘట్టాలు. ఇక్కడా అక్కడా కూడా నగర జీవితంతో సంబంధం లేకుండా , పెళ్లిళ్లూ కట్నాల ద్వారానో , వ్యవసాయమూ – దాన్ని అంటుకునుని వుండే ఇతర రంగాలనుండి కుటుంబాలు మిగుల్చుకున్న డబ్బులతోనో – తల్లి తండ్రులు గుట్టు గా సర్కారీ వుద్యోగాలు చేసుకుని మిగుల్చుకున్న డబ్బులతోనో, అమెరికాకి పోవటం అన్నది సర్వత్రా జరిగింది.
హైదరాబాదు లో ఏదో కొన్నేళ్ళు వుండి , అక్కడ కొంత ఆధారం సంపాదించుకున్నాకూడా, ఇలాటి ప్రవాసులలో ఎవరూ కూడా – తమ చుట్టూ కమ్ముకు వస్తున్న పెను మార్పులని గమనించేటంత వోపిక వున్న వాళ్ళు కాదు. అమెరికా దాకా ఎందుకు – గ్రామం వదిలి, చిన్న పట్టణం, చిన్న పట్టణం వదిలి హైదరాబాదు నగరం , హైదరాబాదు నగరం నించి అమెరికాకో, యూరప్ కో ఎగిరి వెళ్ళటం — ఈ క్రమంలో కూడా ఎక్కడా కూడా కొంచెం వూపిరి పీల్చుకుని, తమ చుట్టూ ఏమీ జరుగుతోందో తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది వుంటారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ముందు పరిస్థితి ఇంత ఇరుకుగా వుండేది కాదనుకుంటాను. తెనాలి లో వున్నా, విజయవాడలో వున్నా, వరంగల్లు లోనో , హైదరాబాదులోనో వున్నా తమ చుట్టూతా ఏమి జరుగుతోందో తెలుసుకోక తప్పేది కాదు. బతుకు తెరువుకోసమే అయినా బొంబాయికో, మద్రాసుకో వెళ్ళే వాళ్ళు. ఆ వెళ్లిన అనుభవానికి కేవలం వ్యక్తిగత పరిధిలో కాకుండా పెద్ద కాన్వాసులో భాష్యం చెప్పుకునే వాళ్ళు.
ఎమెర్జెన్సీ తరవాత – ప్రత్యేకించి, ఈనాడు పత్రిక బలంగా ఎదిగిన తర్వాత, తెలుగు దేశం పార్టీ ఉవ్వెత్తున వచ్చిన తర్వాత దేశ రాజకీయాలలో తెలుగు సాంఘిక జీవనమూ, ఆంధ్ర ప్రదేశ్ లో కుటుంబ జీవనమూ పూర్తిగా అంతర్ముఖమైపోయినాయి. జీవితాన్ని , సాహిత్యాన్ని అనుభవించడం కాకుండా వినిమయం చేసుకోవటం పాతుకు పోయింది. సినిమాలు ఈ విషయంలో చాలా కృషి చేసాయనే చెప్పుకోవాలి. ( గుంటూరు జిల్లా వ్యవసాయపు మిగులు ధనం మద్రాసు వెళ్ళి పనికిమాలిన చెత్త ఎట్లా ప్రొడ్యూస్ చేస్తూ వచ్చిందో – బాలగోపాల్ ఎక్కడో చాలా చక్కగా చెప్పినట్టు గుర్తు). తెలుగు మాట్లాడే వాళ్ళ జ్ఞానేంద్రియాలకి ఆవకాయకీ, ఆత్మకధకీ తేడా తెలియకుండా అయిపోయింది. ఒకే తూనిక రాయి — ఎంత మంది కొన్నారు, ఎంత మంది ఆమోదించారు, ఏ సెలెబ్రిటీ ఎండోర్స్ చేశారు – ఇదీ లెక్క.
అది జరుగుతుండగానే విప్లవ రాజకీయాల పట్ల ఏదో ఒక రోమాంటిక్ వూహాలుండటమూ , అలా మాకు వున్నాయని – అది లేని వాళ్ళందరూ ఉదారవాద మూర్ఖులో, వర్గ శత్రువులో అయి వుంటారని బూకరించటం లోనే సాహిత్య విమర్శకులకు తీరిక లేకుండా పోయింది. మొదట్లో విమర్శకులు చేసిన ఈ పనిని, తరవాత తరవాత రచయితలూ, రచయిత్రులూ, కవులూ, కవయిత్రులూ వాళ్ళని సమర్ధించే వాళ్లూ కూడా అలవాటు చేసేసుకున్నారు. ఇటువంటి సంస్కృతిలో ఎవరికీ దేని పట్లా జవాబు దారీ తనం వుండదు. కష్ట పడి పని నేర్చుకోవలసిన అవసరమూ వుండదు. బుకాయించటం, బూకరించటం వస్తే చాలు. మహా అయితే, తమ కులానికో, తమ వీధికో, తమ జిల్లాకో సంబంధించిన కొంత పనికి మాలిన జ్ఞానం సంపాదించుకుంటే చాలు.
బతకడానికి సరిపోయే దినుసులే ఇట్లా వుంటే ఇందులోంచి సాహిత్యం పుట్టించాలంటే దానికి కావలసిన పనిముట్లు ప్రత్యేకంగా తయారు చేసుకోవాల్సిన అవసరం వుంది. విమర్శకులు చేయ వలసిన పని అది.
తెలుగులో మంచి కధ ఎట్లా వుండాలి అని చెప్పే కన్నా, మనకు కనపడుతున్న సాహిత్యంలో ఏవి మంచి ధోరణులు — అన్నది చెప్పుకోవలసిన అవసరం వున్నది అని మాలతి గారు అడగటం సబబే. కానీ , దానికి సమాధానం ఇప్పుడు వస్తున్న తెలుగు కధల్లోనించే వెతుక్కో నవసరం లేదు. తెలుగు సాహిత్యం మొత్తం నించే కాక ఇతర భారతీయ భాషలనించో ప్రపంచ సాహిత్యంలో ఎక్కడినించో నయినా చూపించుకోవచ్చును. అసలు కధల వూసే ఎత్తకుండా తెలుగు వారి సంస్కృతులని నిర్మొహమాటంగా విమర్శించి చెప్పుకున్నా చాలు.
రోజు వారీ జీవితంలో లేని లోతుని పాఠకులకి అందు బాటులోకి తేవటం రచయిత చేయవలసిన పని. దానికి కావలసిన నైపుణ్యం షెల్ఫ్ మీద దొరకదు. తయారు చేసుకోవాలి. తెలుగు డయాస్పోరా రూపు రేఖలూ, దాని చైతన్యానికి ఆయువు పట్లూ ఇలాటి వాటి గురించి మాట్లాడుకోవటం ఆ దిశగా ఒక మంచి అడుగే. ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి. సమస్యకి మూలం ఎక్కడో స్థూలంగానానయినా గుర్తించ గలిగితే, ఆ తరువాత దానికి పరిష్కారాలు అందులోంచే దొరుకుతాయి.
మీ విశ్లేషణ మాధవ్ వ్యాసం కంటే బాగుంది. పరిశీలనలో ఎంత తేడా. మాధవ్ గారు తన స్కూలు అనుభవాలనుచి, లెక్కలమాష్టారు, తను వగైర చెప్తూ తనలోంచి సీతారామారావుని చూసారు. ఆయన వ్యాసం అసమగ్రంగా అనిపించింది. ఇక పాత్రతో పొంతనలేని ఉన్మాదస్థితి ఏమీలేదు. పాత్రకు తగినట్లుగా అంటూ, వాస్తవ స్థితికి దర్పణం అంటూ పోతే రచయిత స్వేచ్చని హరించినట్లే అవుతుంది.
శ్రీనివాస్
బలే ఉంది. నాదమ్మొక్కటి పిక్కటిల్లె దిశలన్ నవ్యామృతావ్యాహతాస్వాదమై.. షట్పదీ నాదమో.. కలకంఠనాదమో… వివరింపగా రాదు.. పరమానందానుసంధానమై.. ( పెద్దన).. ఇంత హడావుడి లేకుండా ఓసారి పై పాటలు వింటే చాలు.. పై పద్యం లో చివరి రెండు ముక్కల తో సరిపెట్టుకోచ్చు.
బాలరాజు లో “వరుణా” అన్న పాట కూడా బలె ఉంటుంది ఎవరినే తో పాటు. వీలుంటే దయచేయించండి.
రమానాథ్
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి aksharamohanam అభిప్రాయం:
03/05/2010 8:36 am
అద్బుతం మీ ప్రయత్నం. నెనరులు మీకు..
చలంతో రజని ముఖాముఖి గురించి DR.Jonnalgadda Markandeyulu అభిప్రాయం:
03/05/2010 3:54 am
తెలుగు సాహిత్య చరిత్రలొ అంగాంగవర్ణన ఆనందించగలిగిన తరం నవలాసాహిత్యంలొ స్త్రీ అంతరంగ ప్రతిధ్వనిని విచ్చలవిడి తనంగా చలం రచించాడని వెలివేసినా నిలద్రొక్కుకోవడానికికారణం శ్రోత్రియజీవిత స్త్రీ వ్యవస్థకు హెచ్చరికగా పరిగణించి చాటుగా చదివినతరం క్రొత్త ఆలోచనలలో చలాన్ని సజీవంగా నిలుపుకోవడమువల్లనెఅన్నది వాస్తవము. అ సజీవ వాణిని భద్రపరిచి రజనిమాట ఆకాశఃవాణి ఈమాటగ అభినందనలకు అందనిది.
20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:
03/05/2010 2:26 am

అసమర్ధుని జీవయాత్రే! గురించి sarangadhara అభిప్రాయం:
03/05/2010 12:49 am
మీ విశ్లేషణ మాధవ్ వ్యాసం కంటే బాగుంది. పరిశీలనలో ఎంత తేడా. మాధవ్ గారు తన స్కూలు అనుభవాలనుచి, లెక్కలమాష్టారు, తను వగైర చెప్తూ తనలోంచి సీతారామారావుని చూసారు. ఆయన వ్యాసం అసమగ్రంగా అనిపించింది. ఇక పాత్రతో పొంతనలేని ఉన్మాదస్థితి ఏమీలేదు. పాత్రకు తగినట్లుగా అంటూ, వాస్తవ స్థితికి దర్పణం అంటూ పోతే రచయిత స్వేచ్చని హరించినట్లే అవుతుంది.
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి ramaanaath అభిప్రాయం:
03/04/2010 11:21 pm
శ్రీనివాస్
బలే ఉంది. నాదమ్మొక్కటి పిక్కటిల్లె దిశలన్ నవ్యామృతావ్యాహతాస్వాదమై.. షట్పదీ నాదమో.. కలకంఠనాదమో… వివరింపగా రాదు.. పరమానందానుసంధానమై.. ( పెద్దన).. ఇంత హడావుడి లేకుండా ఓసారి పై పాటలు వింటే చాలు.. పై పద్యం లో చివరి రెండు ముక్కల తో సరిపెట్టుకోచ్చు.
బాలరాజు లో “వరుణా” అన్న పాట కూడా బలె ఉంటుంది ఎవరినే తో పాటు. వీలుంటే దయచేయించండి.
రమానాథ్
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Ramesh Srirangam అభిప్రాయం:
03/04/2010 11:14 pm
యేదో ప్రత్యేకత ఉన్నది ఆమె గొంతులో.ఎంతో శ్రమతొ చక్కటి శ్రావ్యమైన గీతాలు అందించారు.ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.
సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి T K Venugopal అభిప్రాయం:
03/04/2010 2:10 pm
గణ గణ అనే పాట “అదిగదిగో గగనసీమ.. అందమైనా చందమామ అదేనోయీ” అనే పాట ను గుర్తుకు తెచ్చింది.
రెండు శ్రీల విరించి – ఈమాట జనవరి 2010 శ్రీశ్రీ ప్రత్యేక సంచికకు స్వాగతం గురించి Dr Ananda rao అభిప్రాయం:
03/04/2010 7:04 am
It will be very good to include as requested
ఈమాట మార్చి 2010 సంచికకు స్వాగతం గురించి lakshmi raghava అభిప్రాయం:
03/04/2010 6:53 am
మేము పంపిన రచనలు ప్రచురణార్హం కాకుంటే మీరు ఎలా తెలుపుతారు?ఈమైల్ చేస్తారా? ప్లీజ్ తెలపండి.
లక్ష్మి
[అవునండీ. మీకు ఈమెయిల్ ద్వారానే తెలుపుతాము – సం.]
సామాన్యుని స్వగతం: టెలిఫోనుతో నా అనుభవాలు గురించి Balivada అభిప్రాయం:
03/04/2010 4:22 am
అద్భుతమైన కధనము అని వేరె చెప్పాలా?