పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. తెలగాణెము గురించి raja sankar kasinadhuni అభిప్రాయం:

    03/10/2010 11:31 am

    రాజశేఖర్ గారు, మీకు కింది పద్యం ఉపయోగపడుతుందేమో చూడండి.

    పాల కొమ్మీగడల్ పచ్చి వెన్నయి విచ్చి తీయని నునుపూసలాయెనేమొ?
    కమని మకరంద కణములు స్నేహించి చిన్నారి పలుకులై చిక్కెనేమొ?
    పూల లావణ్యంబు పొంగి చక్కదనాల పిందెలై రుచులెక్కి పెరిగెనేమొ?
    సెలయేటి యుయ్యాల కులుకుటొయ్యారముల్ ముద్దు ముచ్చటలయి ముదిరెనేమొ?

    పాటకు పద్యమునకు నబ్రముగ నొదిగి
    చవికి చాతుర్యమునకు సాజముగ సాగి
    పోరునకు పొత్తునకు చాలి పొంది పొసగు
    మా తెనుగుతల్లి మెడ కిదే మల్లెదండ

    శంకరంబాడి వారి “మా తెలుగు తల్లికీ మల్లెపూదండ” గేయానికి స్ఫూర్తి ఈ పద్యం నుంచి వచ్చిందని కొందరి పెద్దల అభిప్రాయం.

    కారాశం

  2. అమ్మ గురించి jaideep అభిప్రాయం:

    03/10/2010 11:24 am

    మంజు గారు – నిజంగా ఈ కవిత చాలా బాగుంది.

  3. తడిస్తే కదా తెలిసేది! గురించి SADASIVARAO అభిప్రాయం:

    03/10/2010 11:03 am

    వాస్తవమ్ చెప్పారు. కవిత చాలా బాగు.

  4. వానా వానా… గురించి telugu4kids అభిప్రాయం:

    03/10/2010 9:34 am

    Thanks.
    పేరు చెప్పి లంకె ఇచ్చి ప్రచురిస్తాను.

  5. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి jagadeeshwar reddy అభిప్రాయం:

    03/10/2010 3:42 am

    శ్రీనివాస్‌గార్కి నమస్కారాలు.
    చానాళ్లయింది … మిమ్మల్ని చూసి, పలకరించి కూడా. ఎస్‌.వరలక్ష్మిగారిపై మీ మనసులోని మాట చదివి చాలా సంతోషం కల్గింది. ముఖ్యంగా (ఈ మాటలో) ఆమె ఫోటో అపురూపమైంది. చివరి దశలో ఆమెను ఎవరూ చూడలేదు. దాదాపు ఇలాగే ఉంటారనిపించింది. అందుకుగాను ఆ ఫోటోని సంపాదించినవారిని ముందుగా అభినందించాలి.
    ఇప్పటికీ రాత్రుళ్లు పడుకోబోయేముందు హెచ్‌.ఎం.వి. వాళ్లేసిన వరలక్ష్మిగారి ‘గోల్డెన్‌ హవర్‌’ కేసెట్‌ పెట్టుకుని వింటూ అలౌకిక ఆనందాన్ని స్వంతం చేసుకుంటాను. ఆ పాటల్ని మధుసూధన శర్మగారు (హెచ్‌.ఎం.వి. వారికి) అందించడం … మనం శర్మగార్కి ఋణపడివున్నాం అనిపించింది. (అన్నట్లు ఆ మధ్య శర్మగారి జ్ఞాపకాలు ఆంధ్రజ్యోతి ఆదివారంలో వచ్చాయి. వీలుంటే సంగీతాభిమానులకోసం ఈమాటలో ఆ జ్ఞాపకాల లింకు ఇవ్వగలరా…)
    ఆ కేసెట్లోంచి ఒక్క పాట తీసేయలేం. ఏ పాటవిన్నా… మల్లీశ్వరిలో చేదబావి దగ్గర మల్లితో కమలాబాయి అంటుందే ‘కయ్యిమని పచ్చిరాగంలా పాడేయడమే’ అని… అలా ఉంటాయన్నీ. నాకు తెలిసి ఆమెలా పాడేవారు లేరు … ఆమె పాటల్ని ఇమిటేట్‌ చేయడం సాహసం కూడా. ‘చందమామా … ఓ చందమామా జాలిలేదా నీకు నాపైనా… ‘పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు నాకు.
    అభినందనలతో …
    మీ గొరుసు

  6. తెలగాణెము గురించి rajashekhar అభిప్రాయం:

    03/10/2010 3:29 am

    అందరికి నమస్కారములు
    నాకు తెలుగు గొప్పతనం గురించి తెలిపే ఒక పద్యం కావాలి
    ఎవరైనా help చేయండి please…………..

  7. ఓ బుజ్జి కుక్క పిల్ల గురించి chinna అభిప్రాయం:

    03/09/2010 12:01 pm

    నాకు నచ్చిన ఓ బుజ్జి కుక్క పిల్ల ఇదీ ఒకటీ.

  8. వానా వానా… గురించి telugu4kids అభిప్రాయం:

    03/09/2010 10:36 am

    చాలా బావుంది. ఇలా రాయాలి కదా పిల్లల కోసం!
    ఈ కవితను telugu4kids లో పరిచయం చెయ్య వచ్చా?
    http://telugu4kids.com/TeluguPaatalu.aspx లో “పాప”, “పువ్వులు”, “హరివిల్లు” పరిచయం చేసినట్లు?

    [ఈమాట నుంచి తీసుకోబడింది అని లింకు ద్వారా ప్రస్తావించి మీరు మీ వెబ్‌సైట్లో ఈ కవితను పరిచయం చేసుకోవచ్చును – సం.]

  9. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    03/08/2010 5:03 pm

    ఈ కథానిక పూర్తిగా చదవలేదు. కాబట్టి కథల గురించి రాయడం లేదు. చదివినంత మేరా నిబద్ధత లోపించిన సంకలనంలా అనిపించింది. ముఖ్యంగా ఈ కథానికకి రాసిన ముందుమాట చదివాక ఇది మరీ బలంగా స్థిరపడింది. ఇటువంటి సంకలనాలు ప్రచురించేటప్పుడు ముందుమాట ఎలా రాయకూడదో ఈ కథానిక ముందుమాట చదివితే తెలుస్తుంది. అంతా సోత్కర్షే! అంతా అస్మదీయుల ప్రశంసే!

    అమెరికా కథకి అమెరికా జీవితాన్ని అనుభవించిన వారు కాక, అమెరికన్ ఫ్రెండ్సున్న ఇండియా వాస్తవ్యుల చేత ముందుమాట రాయిస్తే ఎలావుంటుందో ఇది చదివితే స్పష్టంగా తెలుస్తుంది. ముందుమాట రాసిన వారు ఇందులో వచ్చిన కథలన్నీ చదివినట్లుగా అనిపించదు. “ముందుమాట రాయమన్నారు – ఏదో ఒహటి రాయాలి కదా?” అన్నంత తేలిగ్గా రాసిపడేసినట్లనిపించింది. కథల గురించీ, సమస్యల గురించీ, లేదా అమెరికన్ జీవితం గురించీ ఒక్క వాక్యం లేదు.

    తెలుగు సాహిత్యాన్ని అనువాదాల పేరుతో ప్రపంచానికందించిన వెల్చేరు గారి పేరు ఎక్కడా ప్రస్తావించినట్లు లేదు. ఎంతసేపూ ఇండియా రచయితల గోలే!

    బృహత్తరాశయంగా అమెరికా రచయితల కథలు ప్రచురిస్తూ, కనీసం అమెరికాలో చాలా కాలంగా రచనా వ్యాసంగం చేస్తున్న ఒకరిద్దరి చేతయినా ముందు మాట రాయించాలన్న అతి చిన్న ఆలోచన కూడా వంగూరి ఫౌండేషన్ వారికి తట్టలేదంటే ఆశ్చర్యంగా వుంది. వందేళ్ళ కథ సందర్భంగా పుస్తకం అచ్చేసేయాలన్న హడావిడి ప్రతీ పేజీలోనూ కనిపించింది.

    -సాయి బ్రహ్మానందం

  10. అనువాద కళ నా అనుభవాలు గురించి సౌమ్య అభిప్రాయం:

    03/08/2010 5:35 am

    విలువైన వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు!!