పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. 88 ఏళ్ళ యువకులు గురించి Rohiniprasad అభిప్రాయం:

    03/22/2010 11:15 am

    రజనీకాంతరావుగారి గురించిన వార్తలో వచ్చిన ఈ వ్యాసం బావుంది.

  2. సామాన్యుని స్వగతం: టెలిఫోనుతో నా అనుభవాలు గురించి Dr Mula Ravi Kumar అభిప్రాయం:

    03/22/2010 7:51 am

    ఏదో వ్యాసం లో చదివాను. బొంబాయిలో ఫోన్ పరిచయమైన కొత్తలో ‘ఇంగ్లీషులో మాట్లాడితే గానీ ఫోన్ పలకదు అని నమ్మే వారుట. అమాయక చక్రవర్తులు కాదు, నిజంగా చక్రవర్తులే ఈరోజు ఫోన్ మేనర్సు అనే పదం ఉంటుందని తెలియకముందే మొబైల్ ఫోన్ వచ్చేస్తోంది చేతికి. వస్తువినియోగాన్ని, అవసరం కంటే, మార్కెట్ శక్తులే ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి.

  3. కలైన గోర్వెచ్చని పాట గురించి gnanaprasuna అభిప్రాయం:

    03/22/2010 12:47 am

    కవిత సహజంగా వుంది. ఉత్తరాదివాళ్ళు నులకమంచాలు ఇంకా వాడుతూనె వున్నారు. చలికడిములో వాళ్ళ్కి సగం రోజు ఆ నులకమంచాలమీదె. వాకిటిలొ గుడ్డి ఎండలొ కూర్చుని నులకమంచం మీదె చాయ తాగుతూ గడిపేస్తారు.

  4. అసమర్థుని జీవయాత్రేనా? గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/20/2010 1:29 am

    ఎవరన్నా ఉన్న విషయాన్ని, అసమర్ధుని జీవయాత్రలోని కొట్టొచ్చిన రచనా వైఫల్యాన్నీ, ఎప్పుడైనా విశదీకరిస్తారేమో అని ఎదురుచూసేదాన్ని! ఇన్నాళ్ళకి మాధవ్ ఆ పని స్పష్టంగా చెప్పడమ్ ముదావహం! గోపీచంద్ రచనలన్నీ గందరగోళమైన రచనలే!! ఆ విషయాన్ని ఒక్కరూ చెప్పకపోవడం మన సాహితీ విమర్శకుల అసమర్ధతకి పరమ తార్కాణం! అందువలన అతి సామాన్యమైన ఒక రచయతకి మహా వేదాంతిగానూ అతడి
    అసమర్ధుని జీవయాత్రకి ఒక ప్రత్యేకమైన నవలగా స్థాయికి మించిన పేరూ వచ్చి పడ్డాయి. సీతారామారావుకన్నా… రచయితగా గోపీచంద్ చాలా అసమర్ధుడు.. అన్నది ఈ నవల స్పష్టీకరిస్తుంది. సాహిత్యంలో చాలా రకాల భ్రమలూ..పొరపాటు అభిప్రాయాలు అలా ఏళ్ళతరబడి చెలామణీ అయిపోవడమ్ మనమ్ చూడొచ్చు! అలాంటి ఒక భ్రమని ఈ వ్యాసం ద్వారా మాధవ్ తొలగించారు.

    నేను ఒక పాతికేళ్ల కిందట ఈ నవల చదివినప్పుడు నాకు కలిగిన ఈ అభిప్రాయాన్ని ఇవాళ్టికీ మార్చుకోనక్కరలేదని మాధవ్ వ్యాసం మరోసారి చెప్పింది. మంచి విశ్లేషణ మాధవ్ గారూ! అభినందనలు మీకు.

    రమ.

  5. ఓ బుజ్జి కుక్క పిల్ల గురించి raghu అభిప్రాయం:

    03/19/2010 2:42 pm

    Poor Narration.

  6. ఓ బుజ్జి కుక్క పిల్ల గురించి భూషణ్‌ అభిప్రాయం:

    03/19/2010 12:27 pm

    సెకండు హాండు స్మోకింగు చాలా హానికరం అని చెప్పాలన్నది ఈ కధ ఉద్దేశ్యం అని నాకర్థమైంది. అది చాలా చక్కటి విషయం. దానితో విభేదించాల్సింది ఏమీ లేదు. అయితే, చెప్పిన విధానం మాత్రం చాలా కృతకంగా, వికృతంగా, కృత్రిమంగా, పరమ యాంత్రికంగా వచ్చింది. నాకు మాత్రం నచ్చలేదు.

    ఇట్లు,
    భూషణ్‌

  7. తోలుబొమ్మలాట – 12వ భాగం గురించి Ravi Kumar అభిప్రాయం:

    03/19/2010 2:00 am

    ఇదే రచయిత ఇతర కథలు / రచనల లింకులు తెలియజేయగలరు
    mula.ravi@gmail.com

  8. ఓ బుజ్జి కుక్క పిల్ల గురించి Shiva kumar అభిప్రాయం:

    03/18/2010 12:27 am

    ఇది నిజంగా చాలా బాగుంది. ఇటు వంటి వాటిని మీరు ఇంకా ఆదరించాలని కోరుతు..మీ అభిమాని.

  9. సామాన్యుని స్వగతం: టెలిఫోనుతో నా అనుభవాలు గురించి Rama Madarapu అభిప్రాయం:

    03/17/2010 12:08 pm

    చాలా బాగా వ్రాసారది… సున్నితమైన కధనము ….. మరిన్ని కధల కోసము ఎదురు చూస్తూ….

  10. *ద్రౌపది* నవలపై మరోకోణం నుంచి…. గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:

    03/15/2010 10:21 pm

    And of course, they are honorable people, అన్న ముక్తాయింపు చూశాక ఇక్కడ సీజర్ ఎవరు, బ్రూటస్ ఎవరు, మార్క్ ఆంటోనీ వుద్దేశ్యమేమిటి అన్న కుతూహలం కలిగి వెతికితే సాహిత్య అకాడెమీ ప్రెస్ రిలీజులో జూరీ సభ్యుల పేర్లు వి ఎస్ రమాదేవి, బేతవోలు రామబ్రహ్మం, కాళీపట్నం రామారావు అని వుంది. అక్కిరాజు రమాపతి రావు గారు సాహిత్య అకాడెమీ కి తెలుగు ఎద్వైజరీ బోర్డు కన్వీనర్ . అంటే జూరీ ఎంపిక ఆయన సలహా ప్రకారం జరిగి వుండవచ్చు. తెర వెనుక ఎంపికలో ఆయన పాత్ర వుండి వుండ వచ్చును.
    వేలూరు గారన్నట్లా జూరీ నిర్ణయాన్ని బాహాటంగా చర్చించటానికి వీలుగా ఒక ప్రకటన వచ్చేలా జాగ్రత పడవలసిన బాధ్యత ఆయనదే కానీ , నిర్ణయానికి బాధ్యత మాత్రం ఆయనది కాదనుకుంటాను.
    ద్రౌపది నవలనీ దాని మీద జరిగిన రభసనీ పెద్దగా పట్టించుకోక పోవడం వలన నా గమనింపులోకి రాని సమాచారం ఏమైనా వుంటే క్షంతవ్యుణ్ణి.