పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి ellanki.bhaskaranaidu అభిప్రాయం:

    04/12/2010 10:19 pm

    చాల బాగున్నది. ధన్యవాదాలు.

  2. అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి chakirevu upendra అభిప్రాయం:

    04/11/2010 10:36 pm

    ఈ మాటనూ, ఇలాంటిదే మరొక వెబ్ పత్రిక ప్రాణహితనూ కొంత కాలంగా గమనిస్తుంటే ఈ విషయం తట్టింది. ఈ రెండు పత్రికలలోనూ పాఠకులు పాల్గొనడానికి రెండు మార్గాలు ఏర్పాటు అయినాయి. 1) ప్రచురణల క్రింద వ్యాఖ్యలద్వారా , 2) చర్చా వేదికల ద్వారా. సర్వ సాధారణంగా ప్రచురణ చదివిన తరువాత వెంటనే తట్టిన విషయాలని ఆ క్రింద వ్యాఖ్యల రూపంలో పాఠకులు వ్రాసేస్తారు. ఈ వ్యాఖ్యలే చర్చలకి దారి తీస్తుంటాయి. చర్చా వేదికలని వుపయోగించుకోవాలంటే ఫోరంలో సభ్యత్వం రిజిస్టర్ చేసుకోవాలి. ఫోరంలో సభ్యులు తమంత తాముగా పత్రిక సంచికల్లో ప్రచురితమైన రచనలతో సంబంధం లేకుండానే స్వతంత్రంగా చర్చ మొదలు పెట్టే అవకాశం ఉన్నా, సభ్యత్వం లాగిన్, రచననించి దూరంగా మరో పేజీ లోకి వెళ్ళటం అనే ఒక చిన్న చిన్న సాంకేతిక అడ్డంకులు వుండటం వల్లనో లేక పూర్తి స్థాయి చర్చ నడపడానికి కావలసిన చొరవా, ఆసక్తీ , సావకాశమూ లేక పోవటం చేతనో – పాఠకులు ఎవరూ పెద్దగా వీటిని ఉపయోగించుకుంటున్నట్టు కనపడదు. ఎవరూ ఉపయోగించుకోని చర్చా వేదికలు – ఇంట్లో పనికిరాని సామాన్ల గది లాగా, సింగపూర్ లో ‘స్పీకర్స్ కార్నర్’ లాగా కనపడతాయి. దీన్ని సవరించడానికి రెండు సలహాలు –

    1) పత్రిక లాండింగ్ పేజీ లోనే – ప్రశ్నలూ జవాబులూ లాంటి ఒక శీర్షికని ప్రారంభించవచ్చు. దాని క్రింద ఉప శీర్షికలు పెట్టుకునే అవకాశం కల్పిస్తే – ప్రచురితమైన రచనలతో నేరుగా సంబంధం లేని వ్యాఖ్యలన్నీ అందులోకి వెళ్లిపోతాయి. ఎవరో ఒకరో ఇద్దరో ఎక్స్పర్టులు మాత్రమే జవాబులు చెప్పాలన్న నియమమేమీ వుండకుండా అందరూ పాల్గొనే వీలుంటుంది కాబట్టి — ప్రశ్నలూ , జవాబులే ఒక చర్చా వేదికగా ఉపయోగ పడుతుంది.

    2) చర్చా వేదికలలో ‘ప్రచురితమైన రచనలపై చర్చలు’ అన్న పేరుతో ఒక వేదికని ఏర్పాటు చేసి – ప్రస్తుతం ప్రచురణల కింద వ్రాయబడుతున్న వ్యాఖ్యలని దానిలోకి నేరుగా ఇంపోర్ట్ చేసెయ్యవచ్చు.

    ఈ రెండు మార్గాలకీ వుద్దేశ్యం ఒకటే – వ్యాఖ్యలూ, చర్చలూ అన్న రెండు రెండు శీర్షికలనూ కలిపి వేయటం. సాధ్యా సాధ్యాలు మీరు ఉపయోగిస్తున్న కంటెంట్ మానేజ్మెంట్ సిస్టమ్ మీద ఆధార పడి వుంటాయనుకుంటాను. ఆలోచించ గలరు.

  3. రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా గురించి BSRAO అభిప్రాయం:

    04/11/2010 6:18 am

    I am not able to read since every thing is in english letters

  4. అంధకారం గురించి జి ఎన్ అభిప్రాయం:

    04/10/2010 7:58 pm

    రవి బాబు గారు,

    ధన్యవాదాలు.
    మీ ప్రోత్సాహం, నాకు తప్పకుండా కొత్త ఉత్సాహాన్నిస్తుంది.

  5. అంధకారం గురించి kothapalli ravi babu అభిప్రాయం:

    04/08/2010 8:25 pm

    గరిమెళ్ళ కు,
    కవితే ఇది. ఇంకా రాయండి.
    రవిబాబు

  6. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    04/08/2010 6:09 pm

    ఈ కథాసంకలనం ముందుమాట చదవాలంటే ఇక్కడ చూడచ్చు. 12వ పేజీలో వుంది.
    http://www.rachana.net/March_10_Web_Pages.pdf

    సాధారణంగా పుస్తకం అచ్చు వేసేటప్పుడు చిట్టచివర ముందుమాట రాస్తారు. ఈ పుస్తకంలో కథలన్నీ 2000 కి ముందు వచ్చిన కథలనే ప్రచురించామని చెప్పారు.
    కానీ ఈ పుస్తకానికి ముందుమాటే చాలా ముందుగా తయారయ్యిందన్న అనుమానం కలుగుతుంది.

    అమెరికా రచయితల మంచికథలూ అంటూ పధ్నాలుగో పేజీలో కొన్ని కధల పేర్లు ఉటంకించారు. ఆ కథలన్నీ 2000 తరువాత రాసినవే! ఉదాహరణకి విదేశ గమనే విద్యా పరాదేవతా కథ” అయిదేళ్ళక్రితమే అచ్చయ్యింది. ఈ కథ ఈ సంకలనంలో లేదు.
    పుస్తకంలో ప్రచురించిన కథల గురించి కాకుండా వారికి తెలుసున్న కథల పేర్లు నొక్కి వక్కాణించడం ఆశ్చర్యం కలిగించింది. కధలన్నీ చదివి ముందుమాట రాసినట్లుగా ఇది చదివితే అనిపించదు.

    ఆఖరి పేజీల్లో పాఠకుల సౌకర్యార్థం ఇండియా రచయితల మంచి కథల లిస్టు కూడా ఇచ్చారు. అవన్నీ మంచి కథలు కావన్నది నా వుద్దేశ్యం కాదు. కానీ రాస్తున్న సందర్భం అమెరికా కథ గురించి. అది తప్ప మొత్తం కథా ప్రపంచమంతా ఇరికించారు.

    పది తరాలకి పనికొచ్చే గ్రంధాలు చేస్తున్నామనుకునేటప్పుడు మొదటి పేజీల్లోనే ఇలాంటివి రాకుండా శ్రద్ధ చూపాల్సింది.

    నేను ఇంతకు ముందు రాసిన కామెంటు చూసి నన్ను హేళన చేస్తూ, ఓ పెద్దాయన ఈ-మెయిలు పంపారు. నేను వ్యక్తిగతంగా ఎవర్నీ దూషించలేదు. నిందించ లేదు. పుస్తకం బాగోగులు మాత్రమే చెప్పాను. గమనించగలరు.

  7. అంధకారం గురించి తిరునగరి సత్యనారాయణ అభిప్రాయం:

    04/08/2010 4:49 pm

    జి,యెన్ గారూ
    మీ సమాధానానికి నా కృతజ్ఞతలు. మీ నిజాయితీని అభినం‌దిస్తున్నాను.
    భవదీయుడు
    తిరునగరి సత్యనారాయణ

  8. తెలగాణెము గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    04/08/2010 11:45 am

    నమస్కారం
    మంచి ధారతో పద్యాలందించినందుకు కృతజ్ఞతలు.

    “కుక్కలు చింపిన విస్తరి,
    ముక్కలుగాఁ గొట్టఁబడిన ముకురమువోలెన్
    చక్కని రాష్ట్రముఁ జీల్తురె
    ఒక్కని స్వార్థముకొఱకయి యోరిమి కఱవై! ”

    కం. కుక్కలు తినగల విస్తరి
    మిక్కిలి యాకలి గొనినను మెతుకులు కరువై
    డొక్కలు మాడగ చచ్చిరి
    ఎక్కడ చక్కని దిరాష్ట్ర మెవరికి మేలో!

    ఆ. నదులు పారు తున్న నరకంబు స్థితులేల
    ఐకమత్యమున్న యాకలేల?
    నిధుల పంపకాలు నదుల వాటలయందు
    బాగ తెలియు భ్రాతృ భావమెంతొ!

    ఆ. భాష గొప్ప చూప పద్యాలు కట్టిరి
    గొప్ప గతము యనుచు చెప్పి నారు
    ఆకలెరుగనట్టి ఆత్మహత్యలులేని
    రాజ్యమొచ్చుటకును రాయునెవరు?

    ఆ. ఐకమత్యమంటె యేకరాష్ట్రము కాదు
    ఎక్కడున్న గాని వొక్కటిగను
    రాజకీయ స్థితులు రాష్ట్ర వ్యవస్థలు
    మారుచుండునెపుడు మారదెపుడు
    =========
    విధేయుడు
    _Srinivas

  9. ప్రేమ కవితలు గురించి కృష్ణ అభిప్రాయం:

    04/08/2010 8:44 am

    మంచిగానే వుంది అన్న

  10. ప్రేమ కవితలు గురించి b.laxman rao అభిప్రాయం:

    04/08/2010 7:30 am

    ఊహల ఒత్తిడి ఒలికితే కవిత్వం అనుకున్నాను ….కానీ మీరే కవిత్వం అనుకోలేదు
    మీ కవితా హృదయానికి నా జోహార్లు…
    బి.లక్ష్మణ్ రావ్,ఐఐఐటి
    బాసర్,అదిలాబాద్
    ఫోన్9603088598