పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. భవబంధాల సాక్షిగా… గురించి sireesha అభిప్రాయం:

    05/03/2010 4:50 am

    Dear Soumya,

    when i am reading this story i felt i am reading about my feelings. how exactly you have writen my feelings? some times may be every one like loneliness.

  2. త్రిల్‌ గురించి PVSMURTHY అభిప్రాయం:

    05/03/2010 3:32 am

    కథ బాగా ఉంది, కాని , ముగింపు సరిగా లేదండీ. శేఖర్ ఎవరితో తిరిగాడో రాధ తెలుసుకుంటీ త్రిల్ ఉండేది. ఇంకో మాట. రాథ ని చెడ్డదాన్ని చెయ్యడం అనవసరం. ఒకవేళ చెయ్య దల్చుకొంటే రాధను కూడా శేఖర్ని లాగా చంపాల్సింది.

  3. దారి కాదు గురించి సుబ్రహ్మణ్యం మూలా అభిప్రాయం:

    05/03/2010 2:52 am

    చాలా బావుంది. మీ “భ్రంశధార” కవితకి దగ్గరగా ఉంది.

    కవితలో ఒక మాండలికాన్ని వాడేటప్పుడు అన్ని వాడుకలూ అదే మాండలికంలో ఉంటే బావుంటుందేమో

    గుడి కూలిపోయింది — గుడు కూలిపోనాది
    తోవ లేదు — తోవ నేదు

  4. వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి rama bharadwaj అభిప్రాయం:

    05/03/2010 1:22 am

    ఉపేంద్ర గారూ!!

    మైథిలీ భాష అనే కాదు భారతీయ భాషలలోనే నాగార్జున చాలా గొప్పకవి. ఆయన కవితా ప్రపంచం గురించి తెలుగు వారికి తెలిసింది ఏమీలేదు. ఆ మాటకొస్తే చాలా మంది మంచి కవులని గురించి తెలుగు సాహిత్య ప్రియులకి నిజంగా తెలిసింది తక్కువ. అసలు తెలుగులో వచ్చిన మంచి కవిత్వం గురించి మాత్రం ఏమంత తెలుసు గనకా?? మీరు నాగార్జునని గురించి పరిచయం చేయడానికి పూనుకోడం సంతోషించవలసిన విషయం. ఐతే మీ కవితా భాష అనువాద శైలీ తెలుగు కవిత్వానికి అంతగా ఒదగలేదు. సాధన వల్ల మరింత సాధ్య పడొచ్చును.

    ఇంక బాలగోపాల్ ని గురించి మీరు రాసిన భాగం అస్సలు చదవనిచ్చేలా లేదే?? విసుగు కలిగించేలా ఉంది. ఇకపోతే బాలగోపాల్ ని గురించి తెలుగు కవులు పట్టించుకోలేదని మీరు అనడానికి ముందు తెలుగు కవులనీ తెలుగు కవిత్వాన్నీ బాలగోపాల్ ఏమాత్రం పట్టించుకున్నాడని మీరు ఆలోచించలేదే!? ఆశ్చర్యం!!

    వ్యాసం రాయడం ముఖ్యమే కానీ వాక్యాలలో స్పస్టతా.. ఎడిటింగూ.. కూడా అంతే ముఖ్యం కదా?? అది మీ ఈ వ్యాసమ్ లో స్పష్టంగా కన్పిస్తున్న లోపం. మీరు రాయబోయే ముందటి వ్యాసాలు ఈ లోపాలతో లేకుండా ఉండాలని కోరుకుంటాను.

    రమ.

  5. ‘వికృతి’ ఉగాది గురించి నాగమురళి అభిప్రాయం:

    05/03/2010 1:21 am

    వికర్షించడం అంటే మనందరికీ అర్థం తెలుసు. కానీ ‘విశేషంగా ఆకర్షించడం’ అన్న అర్థంలో ఈ పదాన్ని కిరాతార్జునీయంలో వాడడం చూసి ఆశ్చర్యం కలిగింది.

    కాబట్టి వికృతి అంటే విశిష్టమైన కృతి అని అర్థం చెప్పుకోవచ్చేమో! పండితులెవరైనా వివరిస్తే బాగుంటుంది..

  6. ‘వికృతి’ ఉగాది గురించి rama bharadwaj అభిప్రాయం:

    05/03/2010 1:05 am

    ” కవితలల్లుటన్న తీపి భేషజమా వాదరమా
    మాటల మూటలని విప్పి పేర్చుటలా వదరుటలా”

    ఈ మాటలు బాగున్నాయి. ఈ కవితకి చక్కగా సరిపోతున్నాయి.

    రమ.

  7. ‘వికృతి’ ఉగాది గురించి mOhana అభిప్రాయం:

    05/02/2010 7:48 pm

    బాగుంది కవిత! ఈ వి పదాలతో వచ్చిన గొడవే ఇది. మల అంటే కుళ్లు, కాని విమల, అమల రెంటికీ ఒకటే అర్థము. అదే విధంగా వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడు. కానీ కృతికి వి చేరిస్తే విశిష్టమైన కృతి కాక వికారమయింది. కానీ జ్ఞానికి వి చేరిస్తే వచ్చిన విజ్ఞానము విశేషమైన జ్ఞానమే. ఒహొరే ఒహొరే బ్రహ్మ దేవుడా, నీవెంత బుద్ధిశాలివయ్యా బ్రహ్మదేవుడా! విధేయుడు – మోహన

  8. శరణాగతి గురించి Dr. Gannavarapu Varaha Narasimha Murty అభిప్రాయం:

    05/02/2010 11:52 am

    సరసిజ నేత్రి శారదయు చారువు రూపిణి వీణ పాణియై
    విరళిత పత్ర రాశులను విశ్రుత మాధురి గంధ రాశులన్
    దరళిత తామరంబులను దాల్చుచుఁ సన్నిధిఁ జేరి నిల్వగాఁ
    దిరుమల కృష్ణ దేశికుఁడు దేటయి గ్రోలెనె దీపి తేనియల్ !

  9. మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి సౌమ్య అభిప్రాయం:

    05/02/2010 9:41 am

    “సత్యభామ సరసపు నగవు” -ఇవన్నీ సినిమాకోసం పాడినవా ఐతే! మా ఇంట్లో ఆ కేసెట్ ఉండేది. మా నాన్నగారు తరుచుగా వింటూ ఉండేవారు. అలా మాకు కూడా ఆ పాటలూ…ఆశాభోంస్లే తెలుగులో పాడ్డం తెలిసాయి…

    ‘కల్యాణి’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’ వంటి సినిమాల్లో ఈయన పాటలు విని, ఆ తర్వాత కొన్ని జంధ్యాల సినిమాల్లో విన్నాక, మిగితా ఏమేం సినిమాలకి చేశారో అనుకుని వెదుక్కుంటే – అప్పటి మా కాలేజీ LAN లో కనబడక వదిలేశాను.

    మీరు అందించిన వ్యాసానికి చాలా థాంక్స్ 🙂

  10. గుండుగొమ్ములనుమానం – 3 గురించి rama bharadwaj అభిప్రాయం:

    05/02/2010 1:24 am

    హమ్మయ్య!! మీ గుండుగొమ్ముల అనుమానమ్ ఇప్పటికైనా తీరీ తీరక తీరినందుకు ఆనందం కలిగింది. సృజనని గురించిన చర్చ సృజన కాదు గనక చర్చకి లోబడని సంగతులు సైతం ఉంటాయి… అని మీ గురువులు మీకు బోధించడం ముదావహం!! అంతర్లీనంగా ఉన్న దుఖం సహజమైనదీ..స్వచ్చమైనదీనూ!! ఎవరెంత చెప్పినా చెప్పకపోయినా సృజనకి ప్రేరణ అదే!! నామినికైనా ఇంకొకరికైనా కూడా!! ఇక మిగిలినవన్నీ రకరకాల ఆర్భాటాలే!! పిడికిలి విప్పితే ఏముంటుంది కనక ప్రసాద్ గారూ ?? ఆస్వాదనకి ప్రమాణమ్ ఆస్వాదన మాత్రమే!! మీరు ఆస్వాదించలేనిది మీకు కావలసిన అక్షరం కాదు. బహుశా అది మరొకరికి ఆనందాన్నివ్వవచ్చును. నారాయణరావు గారు చెప్పింది ఇదే!!

    రమ.