పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ‘వికృతి’ ఉగాది గురించి Sarada Purna Sonty అభిప్రాయం:

    05/04/2010 11:33 am

    చాలా కాలం పట్టింది. ఇన్నాళ్ళకి కొద్ది కొద్దిగా ధైర్యం వస్తోంది పెద్దలకి కవితలు వినిపించాలంటే! రమ గారూ! అర్థం అయింది మీ మాట! వేలూరిగారూ! కృతజ్ఞతలు.
    శారదా పూర్ణ

  2. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    05/04/2010 11:26 am

    ఈమాట సంపాదకులకి:

    సరైన సమయంలో వచ్చిన సంపాదకీయం ఈమాట రచయిత(త్రు)లకి, పాఠకులకి, పీర్ సమీక్షకులకీ కూడా సంబంధించిన విషయం. ఈ సంపాదకీయంలో ప్రస్తావించబడ్డ అనేక విషయాలతో నేను ఏకీభవిస్తున్నాను. కొందరికి తెలిసినవే అయినా, అందరికీ తెలియాలనే ఆలోచనతో రెండు, మూడు విషయాలను చెప్ప ప్రయత్నిస్తాను.

    1. ఈ మధ్య కాలంలో (అంటే గత కొన్నేళ్ళుగా) గ్రంధాలయం శీర్షికలో కొత్తగా చేర్చబడ్డ (చెప్పుకోతగ్గ) రచనలు ఎక్కువగా లేవు.

    2. పీర్ సమీక్ష అన్నది ఆలోచనాపరంగా ఉత్తమమే కానీ, ఆచరణపరంగా చిక్కులతో కూడుకొన్నది. అందరి రచయిత(త్రు)ల సామర్ధ్యం ఒక్కలా ఎప్పుడూ ఉండదు. పేరున్న రచయిత(త్రు)లకి కూడా పీర్ సమీక్ష ఉంటుంది అని చెప్పటం వల్ల వరిగేది ఏమీ లేదు. ఒకవేళ మీరు అలా చెయ్యాలనుకొంటే, బహిరంగ ప్రకటనల ద్వారా రచయిత(త్రు)లని కించపరచకుండా, అదే పనిని నిశ్శబ్దంగా చేసుకొంటే సరి! నిజంగా పీర్ సమీక్షని అమలు పరచదలిస్తే, ప్రచురణకి పంపే ప్రతి రచనకీ, మూడు సమీక్షలు ఆ ఆ రచయిత (త్రు)లకి అందాలి. అది ఎంత అసాధ్యమో అందరికీ తెలుసు.

    3. ఈమాట సంపాదక వర్గంలో ఉన్న వేలూరి గారి రచనలు తప్ప మిగిలిన వారి రచనలు ఈమాటలో కనపడవేం? మేం రచనలు చెయ్యం కానీ, మిగిలినవారి రచనల్లో తప్పులు పడతాం అంటే ఎలా? తెనాలి రామకృష్ణ జీవితంలో జరిగిన సంఘటన గుర్తుకు వస్తోంది. సంపాదక వర్గంలో అందరూ అప్పుడప్పుడు చెయ్యి చేసుకొంటే, అది మిగిలిన రచయిత(త్రు)లకి స్పూర్తిగా ఉంటుంది కూడా!

    4. ఈమాట ప్రారంభించేనాటికి (1998) ఇప్పుడు బాగా నడపబడుతున్న తెలుగు వెబ్ పత్రికలు ఒక్కటి కూడా లేవు. ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్న మిగిలిన వెబ్ పత్రికలు ఎందుకు రాణిస్తున్నాయో తెలుసుకో తగ్గ ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? ఈ విషయంలో “ఈమాట” ఎందుకు, ఎక్కడ పప్పులో కాలేసింది?

    5.సాంకేతికంగా శబ్ద, చిత్రాలని సమర్ధంగా చూపగల అంతర్జాలాన్ని ఇంకా సమర్ధంగా ఉపయోగించ వచ్చుకదా! ఆ దిశగా పెద్ద ప్రయత్నం ఏమి జరిగింది?

    6. 90 శాతానికి పైగా ఇప్పుడు ప్రచురించబడే ఈమాట రచనలు, అమెరికా జీవితానుభవాలకి ఏ రకంగానూ సంబంధించినవి కావు. ఈమాట ఆశయాల్లో దెబ్బతిన్న ముఖ్యాంశం ఇది.

    ఇవన్నీ సాధించటం శ్రమతో కూడుకొన్నదని అందరికీ తెలుసు. కానీ, ఉత్తమ రచనలని ప్రొత్సహిస్తున్నామన్న పేరును ఆకాంక్షిస్తున్నప్పుడు, జరుగుతున్న తప్పులు ఎంచటం తప్పులేదు.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  3. గుప్పెడంత మనసు గురించి radhika అభిప్రాయం:

    05/04/2010 8:14 am

    It is so beautiful poem. I like it, Radhika.

  4. మళ్ళీ ఇన్నాళ్ళకి గురించి nagarajuavvari అభిప్రాయం:

    05/04/2010 7:55 am

    అయ్యా,
    అన్నింటికిమించి గ్రంథాలయం శీర్షికన మీరు పొందుపరచిన వివిధ కవుల సాహిత్యము నన్ను ఎంతగానో ఆకర్షించింది.ఇది కండ్లకు అద్దుకోదగిన ప్రయత్నం

  5. భవబంధాల సాక్షిగా… గురించి nagesh అభిప్రాయం:

    05/04/2010 7:05 am

    సౌమ్య,
    అచ్చంగా నా మనస్సుకు అద్దమ్ పట్టారు. అభినందనలు.

  6. భవబంధాల సాక్షిగా… గురించి seenu అభిప్రాయం:

    05/04/2010 2:09 am

    చాలా బాగ రాసారండీ!!!

    enjoyed a lot!!!

  7. పాడిందే పాట అను ఒక పునశ్చరణ గురించి rama bharadwaj అభిప్రాయం:

    05/03/2010 2:40 pm

    మీ అన్ని బాధలూ చదివిన తర్వాత కూడా “పీర్ రివ్యూ” అన్న పధ్ధతి ఒకటి మీరు అమలు చేస్తూ ముగ్గురు మహామహుల వడపోత తరవాత కూడా ఈమాటలో చెత్త కవితలూ నాసిరకం వ్యాసాలూ ..కధ అన్న పేరులోకి, ఆ పరిధి లోకి కూడా రాని “కధలు” మరి ఎందుకు వస్తున్నట్టూ?? ఎక్కడ లోపం?. మీ లక్ష్యం మంచి రచనలు కదా అచ్చువేయడం? కానీ మీ స్థాయి ప్రకారం పీర్ రివ్యూ లో అంతమంది పాల్గొని రచనలని సంస్కరించి వాటిని ప్రచురణార్హం చేసిన తరవాత కూడా ఇంకా మరి పస లేని రచనలే ఎక్కువగా ఉంటున్నాయీ అంటే ఆ రివ్యూ చేసే వాళ్ళకి ఆ కళ పట్టుబడనట్టా..లేక అసలా “పీర్ రివ్యూ” విధానం లోనే ఒక ఫైల్యూర్ ఏదో ఉన్నట్టా??

    ఇత్యాది ప్రశ్నలు మీరూ మీ ఇతర సంపాదక మిత్రులూ మరి ఆలోచించలేదా?? వెంకటేశ్వర రావు గారూ!! ఆశయం ఉన్నతమైనదిగా ఉండటం వేరు..దాన్ని అమలు చేయడంలో మీరు ఎక్కడ బోల్తాపడుతున్నారో తెలుసుకోవడం వేరు. ఆశయం మరీ బరువైనదైపోతే ఆచరణ సాధ్యం కాకపోతే అసలు లక్ష్యమే దెబ్బతినగలదు. ఈ కోణంలోకూడా చూడండి ఓ సారి మరి.

    చదివించే గుణం రచన అది ఏ ప్రక్రియ అయినా కూడా దానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. అది లేనప్పుడు మీరు ఎన్ని మార్పులు చేసినా ఫలితం ఏముంటుంది. మీరు రాయండర్రా అని అడిగి రాసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారా?? రచయితలని మీరు తయారు చేయగలం అనే నమ్మకంతో ఉన్నారా?? మీ పత్రిక మీ ఆశయాలనీ.. దానికి సరిపడిన పీర్ గ్రూప్ నీ అలాగే మంచి రచయితలనీ కవులనీ తయారు చేయగలిగిందా?? అది సాధ్యమో..అసాధ్యమో మీకు మీ ఇన్నాళ్ళ అనుభవం ఏమీ చెప్పనే లేదా?? ఇవి మీ మాటలు చదివాకా నాకొచ్చిన అనుమానాలు. చిత్తగించగలరు.

    రమ.

  8. భవబంధాల సాక్షిగా… గురించి BPhaniBabu అభిప్రాయం:

    05/03/2010 11:59 am

    కథ మరీ సీరియస్సుగా ఉన్నట్లనిపించింది.

  9. నాకు నచ్చిన పద్యం: విప్రనారాయణుని పతనం గురించి sridhar అభిప్రాయం:

    05/03/2010 10:03 am

    పద్యం, వివరణ చాలా బాగున్నది. ధన్యవాదములు

  10. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి Giri అభిప్రాయం:

    05/03/2010 7:29 am

    Very interesting and good article.