“Ode to the Medieval Poets”
ఎక్కడో ఇస్మాయిల్ గారనుకుంటా, మన పాత కవిత్వమంతా ఆర్భాటమయం, మామూలు మనుషులు అసలు కనిపించరు అన్నారు . కాని, ఈ పద్యం విని, మీ విశ్లేషణ చదివితే, మన భాష మీద గర్వంతో ఉప్పొంగి పోకుండా ఉండలేము.
నాకీ మధ్యనే Garrison Keillor పుణ్యమా అని తెలుసుకున్న Auden పద్యం గుర్తుకొచ్చింది:
“Chaucer, Langland, Douglas, Dunbar, with all your
brother Anons, how on earth did you ever manage,
without anaesthetics or plumbing,
in daily peril from witches, warlocks,
lepers, The Holy Office, foreign mercenaries
burning as they came, to write so cheerfully,
with no grimaces of self-pathos?”
…
“I would gladly just now be
turning out verses to applaud a thundery
jovial June when the judas-tree is in blossom,
but am forbidden by the knowledge
that you would have wrought them so much better.”
“కవిత్వపు తామరాకు మీద నీటిబొట్టు లాగా నిల్చిన కవి,” అన్నారు మీరు. “తిక్కన ప్రతిభ” అన్న ప్రసంగంలో, కృష్ణశాస్త్రి, “ఇది కవి కెంత కష్టమైన పనో తెలుసునా? తన్ను తాను పూర్తిగా లేకుండా తుడిచేసుకోవడమన్న మాట. లోకంలో వాడై కూడా దానిలో లేనట్లు తటస్థుడుగా, ఒడ్డున సాక్షిగా కూర్చోవడన్న మాట!” [1]. ఆ ప్రసంగాలు పుస్తకరూపంలో వచ్చినట్లే, మీ ఈ వ్యాఖ్యానాలు కూడా ఓ పుస్తకంగా వస్తే మరింక ఎక్కువ మంది తెలుగు వాళ్ళకి మన పాతకవుల గొప్పదనం చాటినట్లవుతుంది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] కృష్ణశాస్త్రి వ్యాసావళి-1, కవి పరంపర. రాజహంస ప్రచురణలు, 1982.
మొదటిసారిగా ఈ సైట్ చూసి సంభ్రమాశ్చర్యానికి గురయ్యాను. కొడవళ్ళ హనుమంతరావు గారి వ్యాసానికి, ఆయనకి శతకోటి వందనాలు.
ప్రస్తుత్తమో అప్రస్తుతమో తెలీదు కాని, ఒక విన్నపం. వ్యక్తుల పేర్లలో surnames ని తగ్గిద్దాం, వీలయితే వదిలేద్దాం. ఏమంటారు ?
మంచి ప్రయత్నం. కాని పేరు నిరపేక్షంగా (impersonal గా) ఉంది. “నాకు నచ్చిన కథ” అంటే క్లుప్తంగా బాగుంటుంది. పాత కథలయినంత మాత్రాన అందరూ పదే పదే చెప్పే గొప్ప పేరున్న కథకులవే అయి ఉండాలని లేదు. పూసపాటి గారి గురించి ఎంతమందికి తెలుసు?
నచ్చిన కారణంతో కేవలం పరిచయం చేసేదిగా కాక, వ్యాసం కథకి వన్నె తెచ్చేదిగా ఉంటుందని ఆశిద్దాం. నేను కొన్నేళ్ళ క్రితం షాపులో చూసి వెంటనే కొన్న పుస్తకం, Touchstones [1] గుర్తొచ్చింది. ఈ కాలపు కవులు, బాగా పేరున్న వాళ్ళూ, అంతగా లేని వాళ్ళూ, ఒక్కొక్కరు తమకి నచ్చిన ఓ కవిత, వేరే వాళ్ళు రాసినది, పాతదైనా కొత్తదైనా, ఎందుకు నచ్చిందో రాశారు. కవితలే కాక వ్యాసాలు కూడా గుర్తుంచుకోదగ్గవి. పుస్తకం అంతా ఒక్క పట్టున చదవనవసరం లేదు.
ఇవాళ దాంట్లో Maxine Kumin వ్యాసం చదివాను. తన భుజాల్లో, వెన్నుపూసలో బాధ ఎందుకో కనుక్కోడానికి ఆవిడని డాక్టర్లు MRI scan కి పంపించారు. ఆ పరీక్ష చావుకి దరిదాపుల్లో ఉంటుంది. దాన్ని భరించడానికి తను కంఠస్థం చేసిన కవితలని గుర్తు తెచ్చుకున్నాననీ, వాటన్నిటిలోకీ బాగా పనికొచ్చినది AE Housman కవిత “XXVII,” అన్నది. “We are all mortal, but it is the poet who shivers most articulately under the thin blanket of mortality,” అని ముగించిన వ్యాసం, “Trochee, Trimeter, and the MRI,” నన్నాకట్టుకుంది. నేనూ ఒకసారి MRI తతంగం పాలయ్యాను, అప్పటికిది చదివుంటే బాగుండేది.
తెలుగులో Touchstones లాంటి పుస్తకాలేమన్నా ఉన్నాయేమో తెలియదు.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Touchstones: American Poets on a Favorite Poem,” edited by Robert Pack and Jay Parini. Middlebury College Press, 1996.
మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు రామారావు గారికి కృతజ్ఞతలు. పండితులూ (అరవై పేజీల glossary ఉంది) పామరులూ కూడా చదివి ఆనందించవచ్చు. ముందుగా తెలుగు కవులని ప్రస్తావించి, వారి స్థాయి అధోలోకానికి చేరిందని వాపోయారు. ఎలాంటి ఆధారాలూ, ఉదాహరణలూ చూపకుండా చేసే ప్రకటనల వలన ఏమిటి ఉపయోగం? సౌభాగ్య, “ఈ కాలం కవులు,” [1] చూస్తే, మన కవుల స్థితి రామారావు గారన్నంత దౌర్భాగ్యంగా అనిపించలేదు. అయితే, కవితా సంపుటాలకి సంబంధించి నేను అల్ప సంతోషిని – గుర్తుంచుకోదగ్గ కవితలు రెండు మూడున్నా చాలు నాకు.
అసలు విషయానికొస్తే, Hirsch కవితలని వివరించే తీరూ, సందర్భోచితంగా చెప్పే ఇతర విషయాలూ నాకు నచ్చాయి. Elizabeth Bishop, “One Art,” ని విశ్లేషిస్తూ, అదొక villanelle అని దాని లక్షణాలు వివరించాడు: పందొమ్మిది పాదాలతో ఆరు భాగాలుగా, అయిదు భాగాలు మూడు పాదాలతో, మిగిలినది నాలుగు పాదాలతో … అవన్నీ ఆరితేరిన పాఠకులకే గాని, నాకు ఒంటబట్టవు. ఆధునిక vilanelles అంటూ మరికొన్ని చదవదగ్గవి ఇచ్చాడు.
కవితలో Bishop తాళం చెవి మొదలు ఖండాల దాకా వెళ్ళి, చివరకి ప్రేమతో ముగించే తీరు చాలా బాగా విశ్లేషించాడు. ఈ కవితలో ఉన్న ఆశ్చర్యార్థకాన్ని పట్టుకొని, William Maxwell, రచయిత ఆ సూచికని రెండు సార్లు మాత్రమే వాడవచ్చు – తన జీవిత కాలంలో, అని చెప్పాడన్నాడు. ఈ Maxwel ఎవరో మరీ నిరంకుశుడు అనుకున్నాను.
మార్చి “The New Yorker” లో Patricia Marx, “Four Eyes,” అని కళ్ళజోళ్ళ మీద సరదా కాలమ్ రాసింది. అయుదు పేజీల చక్కని రచనలో ఒక్కసారి కూడా ఆశ్చర్యార్థకాన్ని వాడినట్లు గుర్తు లేదు. ఈవిడ ఎవరో Maxwell సూత్రాన్ని ఒంటబట్టించుకున్నదే అనుకొని, అసలీ Maxwell ఎవరా అని వెతికితే తెలిసింది: నలభై ఏళ్ళ పాటు ఆ పత్రికకి సంపాదకుడుగా పనిచేశాడని. ఇప్పుడు నేనా సూచికని వాడాలంటే భయం. Maxwell ని గుర్తుచేసుకుంటూ [2] Updike కవిత, “Stolen”:
“The boat tilts frozen on the storm’s wild wave.
The concert has halted between two notes.
An interregnum, sufficiently extended,
becomes an absence. When wise
and kindly men die, who will restore
disappeared excellence to its throne?”
కొడవళ్ళ హనుమంతరావు
[1] “ఈ కాలం కవులు,” సౌభాగ్య, 2006.
[2] “A William Maxwell Portrait: Memories and Appreciations,” Edited by Baxter, Collier and Hirsch. WW Norton & Company, 2004.
నచ్చిన దాని గురించి కాక నచ్చని వాటి గురించి మాత్రమే మాట్లాడటం భావ్యం కాదని మరో నాలుగు మాటలు. నాకు నచ్చిన కవిత సరిగంగ స్నానం. అసలా మాట విని శతాబ్దాలయింది; పల్లెటూరి జీవితం గుర్తుకి తెప్పించింది: “తానే మనసారా వొక ఏరయి పోయి
చిన్న చిన్న వూళ్ల
పక్కటెముకల్నించి ప్రవహిస్తున్నాడు ఈ కవి హఫీజ్.”
పర్షియన్ మహాకవి హఫీజ్ కవితకి అనువాదం అని ఉన్నది కాని మూలం లేదు. “ఉప్పొంగి వస్తోంది గంగానమ్మ తల్లిలా,” అన్నది చూసి, మూలంలో ఏముందో తెలుసుకోవలని కుతూహలం కలిగింది.
అదీగాక, నేనింతకు ముందు హఫీజ్ కవిత్వమేమీ చదవకపోయినా, గతనెలలో ఓ సగం ధర పుస్తకాల షాపులో తచ్చట్లాడుతూ, అందంగా ఉన్న అట్ట బొమ్మని చూసి,
“The stuff produced in the factories of space and time
Is not all that great. Bring some wine, because
The sweet things of this world are not all that great.”
అన్నది చదివి, హఫీజ్ కవితల పుస్తకం [1] కారుచవగ్గా వస్తుంటే కొన్నాను. దాంట్లో సరిగంగ స్నానం ప్రస్తావన లేదు కాని డెక్కన్ సుల్తాన్ ఆహ్వానం మీద హఫీజ్ మన దేశం రావాలని బయల్దేరి, దారిలో తుఫాను రావడంతో మానుకున్నాడట:
“Hidden inside the crown of a king there’s always
A fear of assassination; a crown is a stylish hat,
But a head is too much to pay for it.
It seemed quite easy to put up with the ocean
And its torments to receive a proft, but I was wrong;
A hurricane is too much to pay for a hundred pearls.”
— Deciding Not To Go To India.
వేరే అనువాదాలేవైనా ఉన్నాయా అని నిన్న వెతికితే, ఓ షాపులో Daniel Ladinsky అనువాదం “Like the Ganges” [2] కనబడింది. దానికి సరిగంగ స్నానం చాలా దగ్గరగా ఉంది. Ladinsky మన దేశంలో మెహర్ బాబా ఆశ్రమంలో గడిపినప్పుడు హఫీజ్ ప్రభావంలో పడ్డాడట. ఓహో అనుకొని ఈ విషయాన్ని పక్కన పెట్టబోతుంటే ఓ చిక్కు వచ్చి పడింది. Ladinsky చేసినవి అనువాదాలు కాదు, ఆయన సొంత కల్పనలు అన్న వివాదం ఉందట!
కొడవళ్ళ హనుమంతరావు
[1] “The angels knocking on the tavern door : thirty poems of Hafez,” translated by Robert Bly and Leonard Lewisohn. HarperCollins, 2008.
[2] “The Subject Tonight Is Love, 60 Wild and Sweet Poems of Hafiz,” Daniel Ladinsky (Translator). Penguin Group, 2003.
సంస్కృతం దీవించడానికీ; ఇంగ్లీషు తిట్టడానికీ తెలుగు కూరగాయలు బేరం చేయడానికీ పనికొస్తాయని ఐశ్వర్యం నవలలో ఒక పాత్ర నోట విని ఇంతా సినిసిజం ఎక్కడినించి వచ్చిందబ్బా అనుకోవడం జ్ఞాపకం వస్తోంది. ఇన్నాళ్ళకి ఇంగ్లీషు స్థానాన్ని తెలుగు ఆక్రమించుకుంది కాబట్టి సంతొషించ వచ్చునేమో అన్న మాట మనసులో మెదిలి నన్ను చూసి నేనే భయ పడుతున్నాను.
మాటని మళ్ళీ పట్టాలెక్కించినందుకు రామారావు గారికీ హనుమంతరావు గారికీ ధన్యవాదాలు.
నాకు అర్ధమవుతున్న కొన్ని విషయాలు – రచన స్వరూపంలో వస్తున్నా మార్పులని అర్ధం చేసుకోవటానికి సందర్భం గురించి తెలిసి ఉండటం ఉపయోగ పడుతుంది. ఒక్కొక్క సారి అలాంటి అవగాహన సాహిత్యానుభావాన్ని deepen చేస్తుంది కూడాను. (అలాంటి అవగాహన లేకుండా సాహిత్యాన్ని చదివి -వినీ ఆనందించలేమని కాదు )
ఆ సందర్భంలో టెక్నాలజీ ఒక అంశం మాత్రమె. టెక్నాలజీ అనగానే టెక్నలాజికల్ determinismగా అన్వయించుకోవలసిన పని లేదు. “ప్రింటింగు ప్రెస్సు కీలకమైన మార్పులకి నాంది పలికింది” అన్న మాటకీ “వచ్చిన మార్పులన్నిటినీ ప్రింటింగ్ ప్రెస్సుకే ఆపాదించగల” మని అన్న మాటకీ భేదం లేదా?
ప్రింటింగు ప్రెస్సు వచ్చింది కాబట్టి కొత్త సాహిత్యం వచ్చింది. అప్పుడు అట్లా వచ్చింది కాబట్టి – ఇప్పుడు వెబ్ 2.0 వచ్చింది కాబట్టి కొత్త సాహిత్యం వస్తుందని నోర్లు తెరుచుకుని కూచోగలమా? అచ్చు యంత్రాలతో పాటు గ్రంధాలయాలూ వచ్చాయి. యువక సమాజాలూ వచ్చాయి. సాహితీ మిత్రుల సంఘాలూ వచ్చాయి. ఇందులో ఏది దేన్నీ determine చేస్తుందని చెప్పటం సబబు? దేన్నీ ఆధారంగా చేసుకుని మరొక దాన్ని predict చేయడం సమంజసం?
వెబ్ 2.0 వల్ల తెలుగులో ప్రచురణకి అవకాశాలు లేకనో సమయం లేకనో మరుగున ఉండిన ఎంతో మంది సాహిత్య పిపాస ఉన్న వారు ఈ రోజున కొత్త ఉత్సాహంతో రాస్తున్నారు. తెలుగులో స్త్రీలు maintain చేస్తున్న బ్లాగులు ఇందుకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమె.
విశ్లేషణకీ prediction కీ మంచీ చెడూ విచక్షణకీ మధ్యన అంతరం ఎల్ల వేళలా నిలబెట్టాలనుకోవడం విజ్ఞత కాదు కానీ అన్నిటినీ కలిపేసుకున్నందు వలన పాకం చెడిపోతుందని కూడా విస్మరించ రాదు.
ఉపేంద్ర
P.S. Viplav – trivia is good. trivialisation is not. 🙂 you are most welcome to bring along your laundry and you can call yourself Sir Washalot. ! 🙂
కొడవళ్ల హనుమంతరావు గారి కామెంట్ సూటిగా, సరళంగా, నిరావేశంగా, బాగుంది. వారు Web 2.0 గురించి అన్న మాటకు చిన్న స్పందన: వారన్నది “పాఠకులకి కవితలు అందే విధానంలో Web అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చిన మాట వాస్తవమే – రాత్రి రాసిన కవిత facebook ద్వారానో బ్లాగు ద్వారానో ప్రపంచంలోని అనుయాయులందరికీ క్షణంలో అందుతుంది. పొగడ్తలూ, విమర్శలూ మర్నాటికల్లా కవికి చేరవచ్చు. కాని ఇది ఉత్తమ కవితకీ, సృజన తీరులో మౌలికమైన మార్పులకీ దారితీస్తుందనుకోను.” అని. ఇందులో చివరివాక్యం నేనన్న దానికి సంబంధం లేనిది. రచనాసందర్భం మారటం వల్ల కొత్తరకమైన కవిత్వం వస్తుందనే prediction సాధ్యం తప్ప అది ఉత్తమకవిత్వానికీ సృజనతీరులో మార్పులకీ దారితీస్తుందన్నది కాదు. ఏ కవితామార్గం లోనైనా ఉత్తమకవిత్వం రావొచ్చు. ఉదాహరణకు పురాణమార్గంలో వచ్చిన ఉత్తమకవిత్వంగా కొందరు “రామాయణ కల్పవృక్షా”న్ని ఎంచవచ్చు, అది వచ్చింది భావకవిత్వం/అభ్యుదయ కవిత్వం ప్రధానకవితామార్గాలుగా వున్న రోజుల్లోనైనా. అలాగే, “కళాపూర్ణోదయం” సృజనతీరులో మార్పుని చూపే కావ్యంగా నేను భావిస్తాను, అది ప్రబంధమార్గం లోని ఉత్తమకావ్యం కాకపోయినా. ఒక కొత్తకవితావిప్లవం రావటానికి, ఉత్తమ కవిత్వము, సృజనతీరులో మార్పులకీ పరస్పర ఆధార సంబంధం లేదనటానికి ఇవి ఉదాహరణలని నా ఉద్దేశ్యం.
రమా భరద్వాజ్ గారి most recent comment గురించి ఒక చిన్న observation తో ముగిస్తాను. వారు ప్రతిస్పందించిన నా కామెంట్ లో నేను ఎక్కడా “తిట్టు” లేదా “తిట్లు” అనే పదాల్ని వాడలేదు. విమర్శకుల్ని వారు విమర్శించారన్నాను. వారన్నదాన్ని బట్టి ఇప్పుడు తెలుగుకవిత్వానికి సంబంధించిన వాడుకలో “విమర్శ”, “తిట్టు” పర్యాయపదాలుగా వాడుతున్నట్టు (కనీసం వారనుకుంటున్నట్టు) అర్థమౌతున్నది. ఇది నేను ఇప్పుడే తొలిసారిగా తెలుసుకుంటున్న విషయం. ఐతే, దీంతో నాకున్న ఒక సందేహం నివారణ అయింది – అది తెలుగుకవులు, విమర్శకులు “విమర్శ” కు దూరంగా ఎందుకు పారిపోతున్నారనేది. విమర్శ, తిట్టు ఒకటైనప్పుడు అలా జరగటం సహజమే కదా ! అలా ఐతే “విమర్శకుడు” అంటే “తిట్టేవాడు” అనే అర్థం రావటం తప్పదు కాబట్టి, వారు నేను విమర్శకుణ్ని కానని స్పష్టం చేసి పుణ్యం కట్టుకున్నారు. ఇందుకు వారికి ఇంకా థేంక్స్.
సమీక్ష నచ్చింది. కాని 48 కవితల్లో నన్నాకట్టుకున్నవి నాలుగయిదు మాత్రమే. ఎక్కువ భాగం నచ్చకపోవడానికి ఓ ముఖ్య కారణం పదేపదే కనిపించే కొన్ని పదాలు. అఫ్సర్ పదాల ప్రాముఖ్యత తెలియని కవి కాదు:
“చిత్రిక పట్టని ఒకేఒక్క గరుకు పదం కోసం చూస్తున్నా శవానికి సైతం కనుముక్కుతీరు చూసే సౌందర్య పిశాచాల మధ్య.”
“మరీ ఇంత సున్నితంగా మాట్లాడకు ఈ పూట … కాసింత ముల్లు గుచ్చుకున్నట్లుగా వుండాలి ఈపూట.”
ఎంత గరుకు మాటలు వాడినా చివరకు కవిత చదివేవానిలో సున్నితత్వాన్ని పెంచాలి కదా. “నెత్తురంటిన మాటలు” కవితల్లో చాలా ఎక్కువై పోయి నాకు వెగటు కలిగించాయి. నిజానికి నెత్తురు మాట చదివినప్పుడల్లా, ఎప్పుడో పాతికేళ్ళ క్రితం చదివిన నెరూడా చెప్పిన మాటల ప్రాముఖ్యత గుర్తొచ్చి, “నెత్తుటి కడవల” దోషం కొట్టొచ్చినట్లయింది:
“I leave them in my poem like stalactites, like slivers of polished wood, like coals, pickings from a shipwreck, gifts from the waves. Everything exists in the word.” [1]
ఇటీవలే తిరిగి ప్రచురితమైన వెల్చేరు పుస్తకానికి [2] KVS రామారావు గారు ఇచ్చిన కితాబు: “నాకెంతగానో నచ్చిన మరొక అంశం, రచయిత రాసిన వచనం. శాస్త్రీయ, విశ్లేషణాత్మక విషయాలను కూడా సూటిగా, స్పష్టంగా, పదునుగా, అందంగా చెప్పవచ్చునని చూపించారు.” నేను కొన్ని భాగాలే చదివాను. ఈ విషయంలో నేనూ మెచ్చుకుంటాను.
వెల్చేరు సిద్ధాతం ప్రకారం, రచనా సందర్భం, సామాజిక సందర్భం మారినప్పుడు కవితా స్వరూపం కూడా మారుతుంది. ఆశు రూపం నుంచి శ్రవ్య రూపానికీ, పిదప పాఠ్య రూపానికీ మారడానికి కారణం – రచన చేసే పరికరాల్లో మార్పు రావడమే. (పదో అధ్యాయం)
KVS రామారావు గారుWeb 2.0 కూడా కొత్త రచనా సందర్భమనీ, దీని మూలంగా కొత్త కవితా రూపాలొచ్చే అవకాశముందనీ అంటున్నారు. దానితో నేను విభేదిస్తాను. పాఠకులకి కవితలు అందే విధానంలో Web అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చిన మాట వాస్తవమే – రాత్రి రాసిన కవిత facebook ద్వారానో బ్లాగు ద్వారానో ప్రపంచంలోని అనుయాయులందరికీ క్షణంలో అందుతుంది. పొగడ్తలూ, విమర్శలూ మర్నాటికల్లా కవికి చేరవచ్చు. కాని ఇది ఉత్తమ కవితకీ, సృజన తీరులో మౌలికమైన మార్పులకీ దారితీస్తుందనుకోను.
Question: The Internet, and in general the information revolution, has already revolutionized our world, and it will continue to do so in even more radical ways, as … suggest. Do you think that philosophy, or let us say, critical thinking, will have a whole new spectrum of questions to deal with, and that we might have to begin a new sub-discipline named something like cyber-philosophy?
Rorty: Maybe, but I see no special reason to think so. The telephone and telegraph didn’t create a tele-philosophy, so I am not sure that the Internet will produce a cyber-philosophy. I think a lot of the stuff about the information revolution is media hype.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Memoirs,” Pablo Neruda.
[2] “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం,” వెల్చేరు నారాయణరావు. తానా ప్రచురణ, 2008.
[3] “Take care of freedom and truth will take care of Itself: interviews with Richard Rorty,” edited with an Introduction by Eduardo Mendieta. Stanford University Press, 2006. Page 111.
నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
02/26/2012 11:56 pm
“Ode to the Medieval Poets”
ఎక్కడో ఇస్మాయిల్ గారనుకుంటా, మన పాత కవిత్వమంతా ఆర్భాటమయం, మామూలు మనుషులు అసలు కనిపించరు అన్నారు . కాని, ఈ పద్యం విని, మీ విశ్లేషణ చదివితే, మన భాష మీద గర్వంతో ఉప్పొంగి పోకుండా ఉండలేము.
నాకీ మధ్యనే Garrison Keillor పుణ్యమా అని తెలుసుకున్న Auden పద్యం గుర్తుకొచ్చింది:
“Chaucer, Langland, Douglas, Dunbar, with all your
brother Anons, how on earth did you ever manage,
without anaesthetics or plumbing,
in daily peril from witches, warlocks,
lepers, The Holy Office, foreign mercenaries
burning as they came, to write so cheerfully,
with no grimaces of self-pathos?”
…
“I would gladly just now be
turning out verses to applaud a thundery
jovial June when the judas-tree is in blossom,
but am forbidden by the knowledge
that you would have wrought them so much better.”
“కవిత్వపు తామరాకు మీద నీటిబొట్టు లాగా నిల్చిన కవి,” అన్నారు మీరు. “తిక్కన ప్రతిభ” అన్న ప్రసంగంలో, కృష్ణశాస్త్రి, “ఇది కవి కెంత కష్టమైన పనో తెలుసునా? తన్ను తాను పూర్తిగా లేకుండా తుడిచేసుకోవడమన్న మాట. లోకంలో వాడై కూడా దానిలో లేనట్లు తటస్థుడుగా, ఒడ్డున సాక్షిగా కూర్చోవడన్న మాట!” [1]. ఆ ప్రసంగాలు పుస్తకరూపంలో వచ్చినట్లే, మీ ఈ వ్యాఖ్యానాలు కూడా ఓ పుస్తకంగా వస్తే మరింక ఎక్కువ మంది తెలుగు వాళ్ళకి మన పాతకవుల గొప్పదనం చాటినట్లవుతుంది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] కృష్ణశాస్త్రి వ్యాసావళి-1, కవి పరంపర. రాజహంస ప్రచురణలు, 1982.
మధ్య వ్యవధిలో నీడలు గురించి Hanuma Kodavalla అభిప్రాయం:
06/04/2011 11:47 pm
బైరాగి కవితా సంపుటి “చీకటి నీడలు” మొదటి పేజీ నుండి,
“ఊహకీ వాస్తవానికీ,
క్రియకీ కదలికకీ
మధ్య వ్యవధిలో
నీడలు పడుతున్నయ్”
కొడవళ్ళ హనుమంతరావు
ఈమాట జనవరి 2008 సంచిక విడుదల గురించి MVR Murty అభిప్రాయం:
03/19/2011 1:01 pm
మొదటిసారిగా ఈ సైట్ చూసి సంభ్రమాశ్చర్యానికి గురయ్యాను. కొడవళ్ళ హనుమంతరావు గారి వ్యాసానికి, ఆయనకి శతకోటి వందనాలు.
ప్రస్తుత్తమో అప్రస్తుతమో తెలీదు కాని, ఒక విన్నపం. వ్యక్తుల పేర్లలో surnames ని తగ్గిద్దాం, వీలయితే వదిలేద్దాం. ఏమంటారు ?
-యమ్.వి. ఆర్. మూర్తి .
బెంగళూరు
కథ నచ్చిన కారణం: కొత్త శీర్షిక. మీకు మా ఆహ్వానం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
11/14/2010 1:30 am
మంచి ప్రయత్నం. కాని పేరు నిరపేక్షంగా (impersonal గా) ఉంది. “నాకు నచ్చిన కథ” అంటే క్లుప్తంగా బాగుంటుంది. పాత కథలయినంత మాత్రాన అందరూ పదే పదే చెప్పే గొప్ప పేరున్న కథకులవే అయి ఉండాలని లేదు. పూసపాటి గారి గురించి ఎంతమందికి తెలుసు?
నచ్చిన కారణంతో కేవలం పరిచయం చేసేదిగా కాక, వ్యాసం కథకి వన్నె తెచ్చేదిగా ఉంటుందని ఆశిద్దాం. నేను కొన్నేళ్ళ క్రితం షాపులో చూసి వెంటనే కొన్న పుస్తకం, Touchstones [1] గుర్తొచ్చింది. ఈ కాలపు కవులు, బాగా పేరున్న వాళ్ళూ, అంతగా లేని వాళ్ళూ, ఒక్కొక్కరు తమకి నచ్చిన ఓ కవిత, వేరే వాళ్ళు రాసినది, పాతదైనా కొత్తదైనా, ఎందుకు నచ్చిందో రాశారు. కవితలే కాక వ్యాసాలు కూడా గుర్తుంచుకోదగ్గవి. పుస్తకం అంతా ఒక్క పట్టున చదవనవసరం లేదు.
ఇవాళ దాంట్లో Maxine Kumin వ్యాసం చదివాను. తన భుజాల్లో, వెన్నుపూసలో బాధ ఎందుకో కనుక్కోడానికి ఆవిడని డాక్టర్లు MRI scan కి పంపించారు. ఆ పరీక్ష చావుకి దరిదాపుల్లో ఉంటుంది. దాన్ని భరించడానికి తను కంఠస్థం చేసిన కవితలని గుర్తు తెచ్చుకున్నాననీ, వాటన్నిటిలోకీ బాగా పనికొచ్చినది AE Housman కవిత “XXVII,” అన్నది. “We are all mortal, but it is the poet who shivers most articulately under the thin blanket of mortality,” అని ముగించిన వ్యాసం, “Trochee, Trimeter, and the MRI,” నన్నాకట్టుకుంది. నేనూ ఒకసారి MRI తతంగం పాలయ్యాను, అప్పటికిది చదివుంటే బాగుండేది.
తెలుగులో Touchstones లాంటి పుస్తకాలేమన్నా ఉన్నాయేమో తెలియదు.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Touchstones: American Poets on a Favorite Poem,” edited by Robert Pack and Jay Parini. Middlebury College Press, 1996.
మన పేర్లు, ఇంటి పేర్లు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
10/24/2010 7:37 pm
సాని కి మూలం రెండు విధాలు: 1) సాహిణి – అంటే సైన్యాధికారి. ఉత్తర భారతంలో సహానీ కూడా దీనికి మారు రూపం. 2) స్వామిని – అంటే స్వామికి స్త్రీ లింగం.
కృష్ణారావుగారు ఏదో అశ్లీలత ఉందని తమ ఇంటి పేరుని ముట్నూరు గా మార్చుకున్నా, ముట్లూరి కి మూలం వేరు – పనిముట్టు లోని ముట్టు, అంటే సాధనం.
అప్పాజోస్యుల, వల్లభజోస్యుల పేర్లలో ఉన్నది వారి ఒకప్పటి వృత్తి – జోస్యం చెప్పడం.
ఈ విషయాలు, మన పేర్ల మీద పరిశోధన చేసిన యార్లగడ్డ బాలగంగాధరరావు గారి పుస్తకాలలో [1] [2] ఉన్నాయి.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “ఇంటిపేర్లు,” ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు, నిర్మలా పబ్లికేషన్స్, 2001.
[2] “నామ విజ్ఞానము,” ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు, నిర్మలా పబ్లికేషన్స్, 2002.
Edward Hirsch, “How to read a poem” గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
09/23/2010 2:15 am
“Mere Air, These Words, but Delicious to Hear”
మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు రామారావు గారికి కృతజ్ఞతలు. పండితులూ (అరవై పేజీల glossary ఉంది) పామరులూ కూడా చదివి ఆనందించవచ్చు. ముందుగా తెలుగు కవులని ప్రస్తావించి, వారి స్థాయి అధోలోకానికి చేరిందని వాపోయారు. ఎలాంటి ఆధారాలూ, ఉదాహరణలూ చూపకుండా చేసే ప్రకటనల వలన ఏమిటి ఉపయోగం? సౌభాగ్య, “ఈ కాలం కవులు,” [1] చూస్తే, మన కవుల స్థితి రామారావు గారన్నంత దౌర్భాగ్యంగా అనిపించలేదు. అయితే, కవితా సంపుటాలకి సంబంధించి నేను అల్ప సంతోషిని – గుర్తుంచుకోదగ్గ కవితలు రెండు మూడున్నా చాలు నాకు.
అసలు విషయానికొస్తే, Hirsch కవితలని వివరించే తీరూ, సందర్భోచితంగా చెప్పే ఇతర విషయాలూ నాకు నచ్చాయి. Elizabeth Bishop, “One Art,” ని విశ్లేషిస్తూ, అదొక villanelle అని దాని లక్షణాలు వివరించాడు: పందొమ్మిది పాదాలతో ఆరు భాగాలుగా, అయిదు భాగాలు మూడు పాదాలతో, మిగిలినది నాలుగు పాదాలతో … అవన్నీ ఆరితేరిన పాఠకులకే గాని, నాకు ఒంటబట్టవు. ఆధునిక vilanelles అంటూ మరికొన్ని చదవదగ్గవి ఇచ్చాడు.
కవితలో Bishop తాళం చెవి మొదలు ఖండాల దాకా వెళ్ళి, చివరకి ప్రేమతో ముగించే తీరు చాలా బాగా విశ్లేషించాడు. ఈ కవితలో ఉన్న ఆశ్చర్యార్థకాన్ని పట్టుకొని, William Maxwell, రచయిత ఆ సూచికని రెండు సార్లు మాత్రమే వాడవచ్చు – తన జీవిత కాలంలో, అని చెప్పాడన్నాడు. ఈ Maxwel ఎవరో మరీ నిరంకుశుడు అనుకున్నాను.
మార్చి “The New Yorker” లో Patricia Marx, “Four Eyes,” అని కళ్ళజోళ్ళ మీద సరదా కాలమ్ రాసింది. అయుదు పేజీల చక్కని రచనలో ఒక్కసారి కూడా ఆశ్చర్యార్థకాన్ని వాడినట్లు గుర్తు లేదు. ఈవిడ ఎవరో Maxwell సూత్రాన్ని ఒంటబట్టించుకున్నదే అనుకొని, అసలీ Maxwell ఎవరా అని వెతికితే తెలిసింది: నలభై ఏళ్ళ పాటు ఆ పత్రికకి సంపాదకుడుగా పనిచేశాడని. ఇప్పుడు నేనా సూచికని వాడాలంటే భయం. Maxwell ని గుర్తుచేసుకుంటూ [2] Updike కవిత, “Stolen”:
“The boat tilts frozen on the storm’s wild wave.
The concert has halted between two notes.
An interregnum, sufficiently extended,
becomes an absence. When wise
and kindly men die, who will restore
disappeared excellence to its throne?”
కొడవళ్ళ హనుమంతరావు
[1] “ఈ కాలం కవులు,” సౌభాగ్య, 2006.
[2] “A William Maxwell Portrait: Memories and Appreciations,” Edited by Baxter, Collier and Hirsch. WW Norton & Company, 2004.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
07/25/2010 4:06 pm
నచ్చిన దాని గురించి కాక నచ్చని వాటి గురించి మాత్రమే మాట్లాడటం భావ్యం కాదని మరో నాలుగు మాటలు. నాకు నచ్చిన కవిత సరిగంగ స్నానం. అసలా మాట విని శతాబ్దాలయింది; పల్లెటూరి జీవితం గుర్తుకి తెప్పించింది:
“తానే మనసారా వొక ఏరయి పోయి
చిన్న చిన్న వూళ్ల
పక్కటెముకల్నించి ప్రవహిస్తున్నాడు ఈ కవి హఫీజ్.”
పర్షియన్ మహాకవి హఫీజ్ కవితకి అనువాదం అని ఉన్నది కాని మూలం లేదు. “ఉప్పొంగి వస్తోంది గంగానమ్మ తల్లిలా,” అన్నది చూసి, మూలంలో ఏముందో తెలుసుకోవలని కుతూహలం కలిగింది.
అదీగాక, నేనింతకు ముందు హఫీజ్ కవిత్వమేమీ చదవకపోయినా, గతనెలలో ఓ సగం ధర పుస్తకాల షాపులో తచ్చట్లాడుతూ, అందంగా ఉన్న అట్ట బొమ్మని చూసి,
“The stuff produced in the factories of space and time
Is not all that great. Bring some wine, because
The sweet things of this world are not all that great.”
అన్నది చదివి, హఫీజ్ కవితల పుస్తకం [1] కారుచవగ్గా వస్తుంటే కొన్నాను. దాంట్లో సరిగంగ స్నానం ప్రస్తావన లేదు కాని డెక్కన్ సుల్తాన్ ఆహ్వానం మీద హఫీజ్ మన దేశం రావాలని బయల్దేరి, దారిలో తుఫాను రావడంతో మానుకున్నాడట:
“Hidden inside the crown of a king there’s always
A fear of assassination; a crown is a stylish hat,
But a head is too much to pay for it.
It seemed quite easy to put up with the ocean
And its torments to receive a proft, but I was wrong;
A hurricane is too much to pay for a hundred pearls.”
— Deciding Not To Go To India.
వేరే అనువాదాలేవైనా ఉన్నాయా అని నిన్న వెతికితే, ఓ షాపులో Daniel Ladinsky అనువాదం “Like the Ganges” [2] కనబడింది. దానికి సరిగంగ స్నానం చాలా దగ్గరగా ఉంది. Ladinsky మన దేశంలో మెహర్ బాబా ఆశ్రమంలో గడిపినప్పుడు హఫీజ్ ప్రభావంలో పడ్డాడట. ఓహో అనుకొని ఈ విషయాన్ని పక్కన పెట్టబోతుంటే ఓ చిక్కు వచ్చి పడింది. Ladinsky చేసినవి అనువాదాలు కాదు, ఆయన సొంత కల్పనలు అన్న వివాదం ఉందట!
కొడవళ్ళ హనుమంతరావు
[1] “The angels knocking on the tavern door : thirty poems of Hafez,” translated by Robert Bly and Leonard Lewisohn. HarperCollins, 2008.
[2] “The Subject Tonight Is Love, 60 Wild and Sweet Poems of Hafiz,” Daniel Ladinsky (Translator). Penguin Group, 2003.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:
07/17/2010 12:58 am
సంస్కృతం దీవించడానికీ; ఇంగ్లీషు తిట్టడానికీ తెలుగు కూరగాయలు బేరం చేయడానికీ పనికొస్తాయని ఐశ్వర్యం నవలలో ఒక పాత్ర నోట విని ఇంతా సినిసిజం ఎక్కడినించి వచ్చిందబ్బా అనుకోవడం జ్ఞాపకం వస్తోంది. ఇన్నాళ్ళకి ఇంగ్లీషు స్థానాన్ని తెలుగు ఆక్రమించుకుంది కాబట్టి సంతొషించ వచ్చునేమో అన్న మాట మనసులో మెదిలి నన్ను చూసి నేనే భయ పడుతున్నాను.
మాటని మళ్ళీ పట్టాలెక్కించినందుకు రామారావు గారికీ హనుమంతరావు గారికీ ధన్యవాదాలు.
నాకు అర్ధమవుతున్న కొన్ని విషయాలు – రచన స్వరూపంలో వస్తున్నా మార్పులని అర్ధం చేసుకోవటానికి సందర్భం గురించి తెలిసి ఉండటం ఉపయోగ పడుతుంది. ఒక్కొక్క సారి అలాంటి అవగాహన సాహిత్యానుభావాన్ని deepen చేస్తుంది కూడాను. (అలాంటి అవగాహన లేకుండా సాహిత్యాన్ని చదివి -వినీ ఆనందించలేమని కాదు )
ఆ సందర్భంలో టెక్నాలజీ ఒక అంశం మాత్రమె. టెక్నాలజీ అనగానే టెక్నలాజికల్ determinismగా అన్వయించుకోవలసిన పని లేదు. “ప్రింటింగు ప్రెస్సు కీలకమైన మార్పులకి నాంది పలికింది” అన్న మాటకీ “వచ్చిన మార్పులన్నిటినీ ప్రింటింగ్ ప్రెస్సుకే ఆపాదించగల” మని అన్న మాటకీ భేదం లేదా?
ప్రింటింగు ప్రెస్సు వచ్చింది కాబట్టి కొత్త సాహిత్యం వచ్చింది. అప్పుడు అట్లా వచ్చింది కాబట్టి – ఇప్పుడు వెబ్ 2.0 వచ్చింది కాబట్టి కొత్త సాహిత్యం వస్తుందని నోర్లు తెరుచుకుని కూచోగలమా? అచ్చు యంత్రాలతో పాటు గ్రంధాలయాలూ వచ్చాయి. యువక సమాజాలూ వచ్చాయి. సాహితీ మిత్రుల సంఘాలూ వచ్చాయి. ఇందులో ఏది దేన్నీ determine చేస్తుందని చెప్పటం సబబు? దేన్నీ ఆధారంగా చేసుకుని మరొక దాన్ని predict చేయడం సమంజసం?
వెబ్ 2.0 వల్ల తెలుగులో ప్రచురణకి అవకాశాలు లేకనో సమయం లేకనో మరుగున ఉండిన ఎంతో మంది సాహిత్య పిపాస ఉన్న వారు ఈ రోజున కొత్త ఉత్సాహంతో రాస్తున్నారు. తెలుగులో స్త్రీలు maintain చేస్తున్న బ్లాగులు ఇందుకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమె.
విశ్లేషణకీ prediction కీ మంచీ చెడూ విచక్షణకీ మధ్యన అంతరం ఎల్ల వేళలా నిలబెట్టాలనుకోవడం విజ్ఞత కాదు కానీ అన్నిటినీ కలిపేసుకున్నందు వలన పాకం చెడిపోతుందని కూడా విస్మరించ రాదు.
ఉపేంద్ర
P.S. Viplav – trivia is good. trivialisation is not. 🙂 you are most welcome to bring along your laundry and you can call yourself Sir Washalot. ! 🙂
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
07/15/2010 2:07 pm
కొడవళ్ల హనుమంతరావు గారి కామెంట్ సూటిగా, సరళంగా, నిరావేశంగా, బాగుంది. వారు Web 2.0 గురించి అన్న మాటకు చిన్న స్పందన: వారన్నది “పాఠకులకి కవితలు అందే విధానంలో Web అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చిన మాట వాస్తవమే – రాత్రి రాసిన కవిత facebook ద్వారానో బ్లాగు ద్వారానో ప్రపంచంలోని అనుయాయులందరికీ క్షణంలో అందుతుంది. పొగడ్తలూ, విమర్శలూ మర్నాటికల్లా కవికి చేరవచ్చు. కాని ఇది ఉత్తమ కవితకీ, సృజన తీరులో మౌలికమైన మార్పులకీ దారితీస్తుందనుకోను.” అని. ఇందులో చివరివాక్యం నేనన్న దానికి సంబంధం లేనిది. రచనాసందర్భం మారటం వల్ల కొత్తరకమైన కవిత్వం వస్తుందనే prediction సాధ్యం తప్ప అది ఉత్తమకవిత్వానికీ సృజనతీరులో మార్పులకీ దారితీస్తుందన్నది కాదు. ఏ కవితామార్గం లోనైనా ఉత్తమకవిత్వం రావొచ్చు. ఉదాహరణకు పురాణమార్గంలో వచ్చిన ఉత్తమకవిత్వంగా కొందరు “రామాయణ కల్పవృక్షా”న్ని ఎంచవచ్చు, అది వచ్చింది భావకవిత్వం/అభ్యుదయ కవిత్వం ప్రధానకవితామార్గాలుగా వున్న రోజుల్లోనైనా. అలాగే, “కళాపూర్ణోదయం” సృజనతీరులో మార్పుని చూపే కావ్యంగా నేను భావిస్తాను, అది ప్రబంధమార్గం లోని ఉత్తమకావ్యం కాకపోయినా. ఒక కొత్తకవితావిప్లవం రావటానికి, ఉత్తమ కవిత్వము, సృజనతీరులో మార్పులకీ పరస్పర ఆధార సంబంధం లేదనటానికి ఇవి ఉదాహరణలని నా ఉద్దేశ్యం.
రమా భరద్వాజ్ గారి most recent comment గురించి ఒక చిన్న observation తో ముగిస్తాను. వారు ప్రతిస్పందించిన నా కామెంట్ లో నేను ఎక్కడా “తిట్టు” లేదా “తిట్లు” అనే పదాల్ని వాడలేదు. విమర్శకుల్ని వారు విమర్శించారన్నాను. వారన్నదాన్ని బట్టి ఇప్పుడు తెలుగుకవిత్వానికి సంబంధించిన వాడుకలో “విమర్శ”, “తిట్టు” పర్యాయపదాలుగా వాడుతున్నట్టు (కనీసం వారనుకుంటున్నట్టు) అర్థమౌతున్నది. ఇది నేను ఇప్పుడే తొలిసారిగా తెలుసుకుంటున్న విషయం. ఐతే, దీంతో నాకున్న ఒక సందేహం నివారణ అయింది – అది తెలుగుకవులు, విమర్శకులు “విమర్శ” కు దూరంగా ఎందుకు పారిపోతున్నారనేది. విమర్శ, తిట్టు ఒకటైనప్పుడు అలా జరగటం సహజమే కదా ! అలా ఐతే “విమర్శకుడు” అంటే “తిట్టేవాడు” అనే అర్థం రావటం తప్పదు కాబట్టి, వారు నేను విమర్శకుణ్ని కానని స్పష్టం చేసి పుణ్యం కట్టుకున్నారు. ఇందుకు వారికి ఇంకా థేంక్స్.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
07/15/2010 2:34 am
సమీక్ష నచ్చింది. కాని 48 కవితల్లో నన్నాకట్టుకున్నవి నాలుగయిదు మాత్రమే. ఎక్కువ భాగం నచ్చకపోవడానికి ఓ ముఖ్య కారణం పదేపదే కనిపించే కొన్ని పదాలు. అఫ్సర్ పదాల ప్రాముఖ్యత తెలియని కవి కాదు:
“చిత్రిక పట్టని ఒకేఒక్క గరుకు పదం కోసం చూస్తున్నా శవానికి సైతం కనుముక్కుతీరు చూసే సౌందర్య పిశాచాల మధ్య.”
“మరీ ఇంత సున్నితంగా మాట్లాడకు ఈ పూట … కాసింత ముల్లు గుచ్చుకున్నట్లుగా వుండాలి ఈపూట.”
ఎంత గరుకు మాటలు వాడినా చివరకు కవిత చదివేవానిలో సున్నితత్వాన్ని పెంచాలి కదా. “నెత్తురంటిన మాటలు” కవితల్లో చాలా ఎక్కువై పోయి నాకు వెగటు కలిగించాయి. నిజానికి నెత్తురు మాట చదివినప్పుడల్లా, ఎప్పుడో పాతికేళ్ళ క్రితం చదివిన నెరూడా చెప్పిన మాటల ప్రాముఖ్యత గుర్తొచ్చి, “నెత్తుటి కడవల” దోషం కొట్టొచ్చినట్లయింది:
“I leave them in my poem like stalactites, like slivers of polished wood, like coals, pickings from a shipwreck, gifts from the waves. Everything exists in the word.” [1]
ఇటీవలే తిరిగి ప్రచురితమైన వెల్చేరు పుస్తకానికి [2] KVS రామారావు గారు ఇచ్చిన కితాబు: “నాకెంతగానో నచ్చిన మరొక అంశం, రచయిత రాసిన వచనం. శాస్త్రీయ, విశ్లేషణాత్మక విషయాలను కూడా సూటిగా, స్పష్టంగా, పదునుగా, అందంగా చెప్పవచ్చునని చూపించారు.” నేను కొన్ని భాగాలే చదివాను. ఈ విషయంలో నేనూ మెచ్చుకుంటాను.
వెల్చేరు సిద్ధాతం ప్రకారం, రచనా సందర్భం, సామాజిక సందర్భం మారినప్పుడు కవితా స్వరూపం కూడా మారుతుంది. ఆశు రూపం నుంచి శ్రవ్య రూపానికీ, పిదప పాఠ్య రూపానికీ మారడానికి కారణం – రచన చేసే పరికరాల్లో మార్పు రావడమే. (పదో అధ్యాయం)
KVS రామారావు గారుWeb 2.0 కూడా కొత్త రచనా సందర్భమనీ, దీని మూలంగా కొత్త కవితా రూపాలొచ్చే అవకాశముందనీ అంటున్నారు. దానితో నేను విభేదిస్తాను. పాఠకులకి కవితలు అందే విధానంలో Web అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చిన మాట వాస్తవమే – రాత్రి రాసిన కవిత facebook ద్వారానో బ్లాగు ద్వారానో ప్రపంచంలోని అనుయాయులందరికీ క్షణంలో అందుతుంది. పొగడ్తలూ, విమర్శలూ మర్నాటికల్లా కవికి చేరవచ్చు. కాని ఇది ఉత్తమ కవితకీ, సృజన తీరులో మౌలికమైన మార్పులకీ దారితీస్తుందనుకోను.
ఈ సందర్భంలో Richard Rorty గుర్తొచ్చాడు: