వెంకటప్పయ్య ఆ బట్టను చేతిలోకి తీసుకున్నాడు. అతని వేళ్లకు అది చాలా కర్కశంగా తగిలింది. మగ్గం మీద ఒక మనిషి చెమట చిందిస్తూ, పడుగు పేకలను కలుపుతూ నేసిన బట్టలా అనిపించలేదు అది.
బొల్లోజు బాబా
యానాం
కాకినాడ
కాకినాడ, పి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడు
జీవిత విశేషాలు
బొల్లోజు బాబా ఆధునిక తెలుగు సాహిత్యంలో కవి, అనువాదకుడు, చరిత్ర రచయితగా తనదైన ముద్ర వేసిన రచయిత. కవిత్వంలో మానవీయ స్పందన, సామాజిక చైతన్యం, ప్రకృతి పట్ల సున్నితమైన దృష్టి ఆయన ప్రత్యేకత. ఆకుపచ్చని తడిగీతం, వెలుతురు తెర, మూడో కన్నీటి చుక్క వంటి కవితా సంపుటులతో పాటు, ప్రపంచ కవిత్వాన్ని తెలుగులోకి అనువదించారు. స్వేచ్ఛా విహంగాలు, థేరీ గాథలు, ప్రాచీన గాథలు ఆయన అనువాద ప్రతిభకు నిదర్శనాలు. కవిత్వ భాష వంటి సాహిత్య వ్యాస రచనలు ఆయన విమర్శనాత్మక దృష్టిని ప్రతిబింబిస్తాయి. చరిత్ర, సంస్కృతి, సామాజిక పరిణామాలపై కూడా విస్తృతంగా రచించిన ఆయన సాహిత్య కృషికి పలు పురస్కారాలు లభించాయి.
బొల్లోజు బాబా రచనలు
కథకునిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా భిన్న ప్రక్రియలలో శతాధిక గ్రంథాలను వెలువరించిన ఆవంత్స సోమసుందర్ అభ్యుదయ కవిగా తెలుగు సాహిత్యరంగంపై చెరగని ముద్ర వేశారు. ఈ వ్యాసం ద్వారా సోమసుందర్ రచించిన గేయసంపుటులు, మినీ కవితలను కొద్దిగా పరిచయం చేస్తాను.
సరైన పదం కోసం
చీకట్లో తడుముకొంటూంటే
చేతికి సూర్యుని ముక్క తగిలింది
ఉదయం పద్యమై
విచ్చుకొంది
ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను.
తనను నేను ప్రేమించాను. ఒక్కోసారి తనుకూడా నన్ను.
ఇది విచ్చలవిడిగా తిరిగిన దూరాల్లోంచి కానీ
అపురూపంగా చూసుకొన్న నడకల్లోంచి కానీ
రసాయినోద్రేకాల ప్రళయ కాలంలో
అయితే కుంభవృష్టి లేతే చండ్రగాడ్పులు
తప్ప మధ్యస్థమెరుగని వాడి మనసుకు
ఉదయ లేకిరణాల్ని వేసవి సాయంకాలాల్ని,