రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నీతో నువు

రచన: బివివి ప్రసాద్
అక్టోబర్ 2026

నీతో నువు ఉన్నపుడైనా
నీకు స్వేచ్ఛ ఇస్తున్నావా
లేక, బానిసలా చూస్తున్నావా

సమాజాన్ని దాటి,
సమాజం భయాన్నీ, హింసనీ దాటి,
కట్టుబాట్ల గానుగెద్దు బతుకు దాటి,
మర్యాదల బానిసత్వం దాటి,
ఆదర్శాల, నాయకత్వాల భ్రమలు దాటి,
ఎవరేమనుకుంటే ఏమనే చిత్తభ్రమలు దాటి

ఉత్త నేనుగా
ఖాళీ ఆకాశం లాంటి, గాలి లాంటి
ఖాళీ జ్వాల లాంటి, జలం లాంటి
ఉత్త పేరు లేని, వ్యక్తి లేని
గత, భవితల మరకలు లేని
స్వచ్ఛమైన నేనుగా
నిన్ను నువు చూడగలుగుతున్నావా

నీతో నువు ఉన్నప్పుడైనా
ఆకాశం ఆకాశంతో నిండినట్లు
గాలి గాలితో, జ్వాల జ్వాలతో,
నీరు నీటితో నిండినట్లు
నీతో మాత్రమే నువు నిండగలుగుతున్నావా

నిండుగా పొరలి పొంగి
నువు లేకపోవటంలోకి
నీకు స్వేచ్ఛ ఇవ్వగలుగుతున్నావా,
ఏమీ కాకుండా మిగలగలుగుతున్నావా?

 

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఉత్సాహానికి దూరంగా…
  • ఖాళీపాత్ర
  • పసుపుకాంతి
  • పావురాలు
  • వీధి అరుగుపై…

ఇటువంటివే…

  1. నువు
  2. నువు కూడా
  3. లిఖిత: కాలంలో ఒక క్షణం, నీతో –
  4. నీతో ఉన్న ఆ కాసేపు
  5. నీతో నువ్వే

అక్టోబర్ 2026 సంచికలో ...

  • ‘బాలచెలిమి’ జాతీయస్థాయి కథల పోటీ-2026
  • అక్టోబర్ 2026
  • ఇథకా
  • ఇలియాడ్: రణరంగం-III
  • ఊరుభంగం – సమూలానువాదం: 2
  • ఒక సాధారణ ప్రేమ
  • కంప్యూటర్ చిప్ కథ – 18: రూథర్‌ఫర్డ్ కనుగొన్న పరమాణు కేంద్రకం
  • చివరి గిన్నీ వస్త్రపు ముక్క (ఫ్రెంచి యానాం కథలు)
  • తలపోసినకొద్దీ తరిగేది…
  • దారి
  • నాకు పిచ్చెత్తినప్పుడు
  • నింగీ, నీరూ, నికోబార్-3
  • నీతో నువు
  • నేపాలీ కవయిత్రి సరితా తివారీతో ముఖాముఖి
  • మంకుతిమ్మని మరో మిణుకు – 9 (81-90)
  • మహాకవి రావిపాటి త్రిపురాంతకుడు – IV: త్రిపురాంతకోదాహరణము
  • మిమోసా ప్యూడికా
  • రవిగాంచిన రమణీయ సాహిత్య సారాంశం
  • రెండు నక్షత్రాలు
  • వాగర్థావివ
  • శేష ప్రశ్న
  • శ్రీనాథుని కవితావైభవం, ప్రభావాలు
  • సతిదానశూరము – హాస్యం వేషం వేసుకున్న చిక్కుముడి
  • సీతాంజనేయ సంభాషణం – V
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

శేష ప్రశ్న
రెండు నక్షత్రాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.