ఆకాశం కింద కూర్చుని
చారన్నం తింటున్నాను
రెండు నక్షత్రాలు రాలి
నా అన్నం గిన్నెలో పడ్దాయి
ఒక నక్షత్రాన్ని
నగరంలోని
ఆమె వద్దకు పంపాను
మరో నక్షత్రాన్ని
నక్షత్రం వాళ్ల అమ్మ వద్దకు పంపాను
నగరానికి వెళ్లిన నక్షత్రం
ఆమెను చూసి
మోహించి
ప్రేమిస్తే
నా గతేం కాను?
అన్నం తినేశాను
ఆకాశం వంకే చూస్తూ కూర్చున్నాను
ఈ చలిరాత్రిలో