విద్యార్థినీ విద్యార్థుల్లోని సృజనాత్మక భావనలను వెలికితీసి, వారి రచనాప్రతిభను ప్రోత్సహించేందుకు, నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘బాలచెలిమి’ మాసపత్రిక జాతీయస్థాయి “కథల పోటీ–2026’ నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన బాలరచయితలను ప్రోత్సహించి, వారి కథలను పాఠకులకు పరిచయం చేయడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశం.
అక్టోబర్ 14వ తేదీలోపు అందిన కథలను మాత్రమే పరిశీలనకు స్వీకరిస్తాం. ఈ-మెయిల్: desk.chelimi@gmail.com; వాట్సాప్: 86866 64949 (మిగతా వివరాలకు)
గరిపెల్లి అశోక్, కన్వీనర్, బాలచెలిమి
