అఫ్సర్


సొంత ఊరు:
చింతకాని, ఖమ్మం జిల్లా
ప్రస్తుత నివాసం:
పెన్సిల్వేనియా
వృత్తి:
సీనియర్ అధ్యాపకులు, టెక్సాస్ యూనివర్సిటీ
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

కవి, విమర్శకుడు, రచయిత, సీనియర్ ఉపన్యాసకుడు అఫ్సర్ కు బాల్యం నుండి సాహిత్యవాతావరణంలో పెరగటం వల్ల కవిత్వం పట్ల మక్కువ ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి బి.ఏ. గోల్డ్ మెడల్‌తో ఉత్తీర్ణుడయ్యారు. తులనాత్మక సాహిత్యంలో ఎం.ఏ చేశారు. “ఆధునిక కవిత్వము తెలంగాణా నేపథ్యం” అనే విషయంపై పి.హెచ్.డి చేశాడు. అమెరికా లోని విస్కాన్సిన్ యూనివర్శిటీ నుండి 2010లో Following the Saint: Devotion and Public Religious Performances in South India అనే అంశం పై పరిశోధించి డాక్టరేట్ సంపాదించారు. అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్సిటీ, టెక్సాస్ యూనివర్సిటీలలో దక్షిణాసియా సాహిత్య సంస్కృతుల సీనియర్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, భారత ప్రభుత్వంనుండి సరస్వతీ భాషాసమ్మాన్ అవార్డుతో సహా అనేక అవార్డులు అందుకున్నారు. సారంగ సాహిత్య పక్ష పత్రికకు సారథ్యం వహిస్తున్నారు.


 

బైరాగి తలుపులు తెరుచుకుంటున్నది నరకంలోకి కాదు. అవేదనావృత జీవన వాస్తవికతలోంచి ఆశాస్వప్నసౌధానికి అతను ఆడుగులు కదుపుతుంటాడు. తుఫాను హోరులోంచి చావుబతుకు పోరులోంచి వెనుదిరగక మున్ముందుకు సాగే ధీరోదాత్తుల అడుగు జాడలను అన్వేషిస్తాడు.

నలభయ్యేళ్ళ కిందట నా తొలియవ్వన కాలంలో నన్ను నేనూ, నా చుట్టూ ఉన్న వాళ్ళని అడిగిన ప్రశ్నలే, ఇప్పుడు ఈ విద్యార్థిని తనని తానూ, తను చుట్టూ ఉన్న వాళ్ళనీ అడుగుతోంది కదా?! ప్రశ్నలూ, వాటి స్వగతాలూ, విషాద యోగాలూ ఏం మారాయి?!

ఈ మార్పు కోసం పాడే ఆగమగీతి దాకా బైరాగి మనకి తోడుగా వస్తాడు.

వెల్చేరు నారాయణరావుగారు మనకు ప్రసిద్ధ సాహితీ విమర్శకులుగా, విద్యావేత్తగా మాత్రమే తెలుసు. కానీ ఆయన ఒక కవి అని మనలో ఎక్కువమందికి తెలియదు. ఆయన వ్రాసిన మంచి కవితలు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ ఒక సంపుటంగా తీసుకురావాలని మేము సంకల్పించాము.

మనకు పరాయీ అనిపించే పరిస్థితులూ, మనది కాని సంస్కృతి, మనవి కాని భాషల మధ్య – మనకెంత మాత్రమూ తెలియని లోకంలో మన వునికి ఏమిటి? దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
-ఇవి ఇప్పుడు ప్రవాసాంధ్రసాహిత్యం ముందు వున్న ప్రశ్నలు. అసలు ప్రవాసాంధ్ర సాహిత్యం అంటూ వుందా? వుంటే, దానికి కొన్ని సాంస్కృతిక లక్షణాలు వున్నాయా అన్న మౌలికమైన ప్రశ్న నుంచి ఈ అన్వేషణ మొదలు కావాలి.

చాలా సందర్భాల్లో మాటలు రావు. చాలా లోతయిన విషయాలు మాట్లాడబోతే ఒకానొక ఒంటరితనం వేధిస్తుంది. నిజమే, ఎన్ని సంగతులు … ఎన్ని సంఘటనలు … ఎన్ని వ్యవహారాలు సజావుగా నడవాలి, మనం ఇంకొకళ్ళకి సలహాలిచ్చే స్థితిలోకి వెళ్ళాలంటే!

ఒక యువకవి పదే పదే పంపిస్తున్న కవిత్వానికి ఏం జవాబివ్వాలో తెలియక, సతమతమై, చివరకి ఆ కవికి వుత్తరాలు రాయటం మొదలు పెట్టాడు రిల్కే. అలా అతను రాసిన పది వుత్తరాలు “లెటర్స్ టు ఎయంగ్ పోయెట్” అనే శీర్షికన పుస్తకంగా అచ్చయి, ఆ యువకవిని సాహిత్య చరిత్రకి ఎక్కించాయి.

నేను వచ్చిన తరువాత
మీ దిగుళ్ళలో మీరు,
మీ సంతోషాల్లో మీరు,
మీ రోజువారీ ఈతిబాధల్లో మీరు –
ఏమో! నేను నాకే వొక జ్ఞాపకంలా పడి వున్నాను.

లోపలి ధ్యానంలో మెట్లు కనిపించవు మెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకుని శిఖరం కొసకి చేరుకుంటాం అక్కడి నిశ్శబ్దం చివరిమీంచి ఈదురుగాలుల హోరులోనో అందీ […]

వెనక్కి రాదు దూరాల సొరంగంలోకి జారిపోయాక, రైలు. కాసేపే ఇక్కడి యీ వెతుకులాటలూ బతుకుపాటలూ ఎదురుచూపులూ తలపోతలూ చివరి ఎడబాటు దాకా. వస్తున్నప్పుడు ఎంత […]