సి. ఎస్. రావ్
ఆత్మకూరు, పల్నాడు
హైదరాబాద్
విశ్రాంత ఆంగ్ల విభాగాధిపతి
జీవిత విశేషాలు
సి. ఎస్. రావు ఆంగ్ల, ఆంధ్రభాషలలో విమర్శకులు, అనువాదకులు, కవి. వీరి అనేక ఆంగ్ల ప్రసంగాలు ఆలిండియా రేడియోలో ప్రసారమయాయి. శ్రీ వెలిచాల కొండలరావుగారు స్థాపించిన విశ్వనాథ పీఠం ఆధ్వర్యంలో ప్రచురించబడిన A Thousand Hoods ను వీరు ఇతర అనువాదకులతో కలిసి అనువదించటమే కాక సంపాదకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఇది విశ్వనాధ వేయిపడగలు’కు మొట్టమొదట ప్రచురించబడిన ఆంగ్లానువాదం. తిలక్ అమృతం కురిసిన రాత్రిని A Night Nectar Rained గా ఆంగ్లంలోకి అనువదించారు. Shakespeare’s Sonnets, MK Gandhi -An Indian Patriot in South Africa లను తెలుగులోకి అనువదించారు. ఇంగ్లీష్, తెలుగు భాషలలో అనువాదాలు, స్వీయరచనలు కలిపి ఆరు పుస్తకాలు ప్రచురించారు. వీరికి అనువాదసాహిత్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంనుండి కీర్తి పురస్కారం లభించింది. పది కాలాలు నిలిచే సాహిత్య విమర్శ-సమగ్రమైన, సునిశితమైన విషయ విశ్లేషణతోపాటు రమ్యమైన వ్యక్తీకరణ కూడా కలిగి ఉంటుంది అని వీరి ప్రగాఢ విశ్వాసం.
సి. ఎస్. రావ్ రచనలు
- అనంతమైన సౌందర్య కాంక్ష — నిరంతర వేదన డిసెంబర్ 2025 » వ్యాసాలు
- తిలక్ కవితా మూలాలు – ఆయన సాధించిన సౌందర్యం అక్టోబర్ 2017 » వ్యాసాలు
- యజ్ఞం కథ: మరో పరిశీలన జులై 2012 » వ్యాసాలు
- కవిత్వంలో శ్రీశ్రీ ప్రస్థానం, పరిణామం జనవరి 2012 » వ్యాసాలు
- “అమృతం కురిసిన రాత్రి” పై రారా సమీక్ష – ఒక ప్రతి విమర్శ వ్యాసాలు » సెప్టెంబర్ 2010
- కవితా సుమశరుడు తిలక్ వ్యాసాలు » సెప్టెంబర్ 2010
- కలవరపెడుతుంది మనస్సును కవితలు » జనవరి 2010
- ఆ రోజులు కవితలు » జులై 2007