నరన్


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

నరన్ అనే కలంపేరుతో రచించే ఆరోగ్య సెల్వరాజ్, సమకాలీన తమిళ సాహిత్యంలో ఒక ప్రముఖమైన, విలక్షణమైన రచయిత, కవి, నవలాకారుడు. \’సాల్ట్\’ (SALT) పబ్లికేషన్స్ వ్యవస్థాపకుడు. ఆయన రచనలలో సర్రియలిజం, మాజికల్ రియలిజం, ఫాంటసీ, జెన్ తత్వంవంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. కవితాత్మకమైన సన్నివేశాలతో ఆయన రచనలు సాగుతాయి. ఆయన రాసిన \’కేశం\’ (కథా సంకలనం), \’వారణాసి\’, \’వేట కుక్కలు (నవల), పరారీ పుస్తకాలు చాలా ప్రసిద్ధి చెందాయి. నరన్ తన సాహిత్య కృషికి పలు అవార్డులు అందుకున్నారు. ఉదాహరణకు, \’సరీరం\’ కథా సంకలనానికి ఉత్తమ సాహిత్య పురస్కారం లభించింది. తన ప్రచురణ సంస్థ ద్వారా అనేకమంది సమకాలీన యువ తమిళ రచయితలను వెలుగులోకి తీసుకువచ్చారు.


 

దట్టమైన పొగమంచు అలముకున్న వేకువజామున వారణాసికి అంబులెన్స్ చేరుకుంది. నటరాజ్ పూరణిని నిద్ర లేపాడు. ఆ వేకువ జాము చలిలోనూ గంగానది రాళ్ళమెట్ల అంచులో ఎంతోమంది స్మారక కర్మలు చేస్తున్నారు. ఎందరో స్త్రీపురుషుల తలలు గంగలో మునకలు వేసి లేస్తున్నాయి. పురోహితులు, సాధువులు, పశువులు, శవాలు, తిరగాడుతున్నారు. నటరాజ్ హరిశ్చంద్ర ఘాట్ ఎటువైపో ఒకరి దగ్గర కనుక్కున్నాడు.

మరియమ్మ వచ్చి స్టేజ్ మీద నిలబడింది. శంకరన్ కుర్చీకి ఎదురుగా. అతడికి పుట్ట నుంచి జెర్రి వేగంగా బయటకొచ్చి శరీరమంతా సరసరమని పాకుతున్న అనుభూతి. పవిత్రన్ మాస్టర్ సైగ చేయగానే ఆమె ఆ లంగాను కుప్పగా జారవిడిచింది. గదంతా చిక్కటి నిశ్శబ్దం అలుముకుంది. ఆ లంగా ఆమె కాళ్ళ కింద వంకరగా గీసిన సున్నాలా వచ్చి పడ్డది. కాలితో రంగు వెలిసిన ఆ లంగాను కాస్త దూరంగా నెట్టింది. స్టేజ్ మీద కూర్చుంది.

చిరాకు తగ్గని గణపతమ్మ ముఖాన్ని చూస్తూ కొన్ని క్షణాలు నిలబడ్డవాడు ఏమనుకున్నాడో, హఠాత్తుగా పరిగెత్తుకెళ్ళి గణపతమ్మ లావుపాటి శరీరాన్ని గట్టిగా హత్తుకున్నాడు. బియ్యం నానబెట్టిన గిన్నెని కోపంగా వంటగట్టు మీద పెట్టి, పెంటను తొక్కిన దానిలా ఛీ! అని పక్కకు జరిగి నిలబడింది గణపతమ్మ.