దర్భముళ్ళ చంద్రశేఖర్


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
విశాఖపట్నం
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

దర్భముళ్ళ చంద్రశేఖర్ గారు సుప్రసిద్ధ తెలుగు కవి, కథకులు, సాహితీ విశ్లేషకులు. తెలుగు సాహిత్య రంగంలో, ముఖ్యంగా కవితా సంపుటాలు, పుస్తక సమీక్షల ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఆయన రాసిన నాలుగవ కవితా సంపుటి “క్రొత్త రాగం” హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించబడింది. ‘సూర్యుడు’ వంటి అద్భుతమైన కవితలతో పాటు, ఎన్నో పుస్తకాలకు సునిశితమైన సమీక్షలు రాశారు. ప్రతిష్టాత్మక “సిరికోన సాహితీ అకాడమీ” నిర్వహించే నవలా పోటీలు, అవార్డుల ప్రదానోత్సవాలు, సాహిత్య చర్చల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ వస్తున్నారు.


 

“లల్లేశ్వరి తత్వం శాశ్వతమైనది. దాని అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం, ఇంకా ఎక్కువైనా పట్టొచ్చు,” నాన్న బదులు పలికాడు. “అందుకే నా అనుసృజన ఎప్పటికీ అసంపూర్ణమే!”

బంగారానికి తావి అబ్బినట్టు, ఒక వృక్షశాస్త్రం చదువుకున్న వ్యక్తికి, ఆ శాస్త్రంపట్ల ఇచ్ఛుకత ఉన్న వ్యక్తికి, అదృష్టవశాత్తు వృత్తిపరంగా కూడా తాను చదువుకున్న జ్ఞానాన్ని ఉపయుక్తం చేసుకోగలిగే వెసులుబాటు కలిగి ఉండటం ఒక గొప్ప వరం.

స్త్రీవాద దృక్పథం కలిగిన కవిత్వానికి, స్త్రీల అనుభవాల్ని మాత్రమే చిత్రించే కవిత్వానికి, అలాగే స్త్రీవాదమని కొందరు పురుషపుంగవులు చేస్తున్నటువంటి male voyeuristic attitudes కు తేడా తెలియకుండా ఉన్న ఈ రోజుల్లో, సుధామురళి లాంటి కొందరు స్త్రీలు కంకణం కట్టుకొని, “ఇది మా శరీరం, ఇదీ మా భావన, ఇదీ మా యాతన”ని వారి శారీరక స్పృహను సామాజిక స్పృహకు సకారాత్మకంగా సమాజంలో ఉపయోగించేలా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతో అభిలషనీయం.